News in Pics: చిత్రం చెప్పే సంగతులు -01(19-03-2023)

Updated : 19 Mar 2023 04:24 IST
1/12
  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి ఇది.  అమరావతిలోని తాళ్లాయపాలెం నుంచి మందడం వరకు ఉన్న అర కిలోమీటరు పొడవునా  రహదారి గుంతలమయంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు ఇదే దారి గుండా ప్రజాప్రతినిధులు వెళ్తున్నా పట్టించుకునేవారు లేరు.  

2/12
 మన్యం ఏ కాలంలోనైనా ప్రకృతి అందాలు పంచేందుకు సిద్ధంగా ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా హిమ సోయగాలు అమితంగా ఆకట్టుకుంటుంటాయి. ఆకురాలే కాలం వచ్చి చెట్లు మోడుబారినా అవీ కూడా ప్రకృతి గీసిన చిత్రంలా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.విశాఖలోని జీకేవీధి మండలం లంకపాకలు సమీపంలో కనిపించిన ఈ కనువిందైన చిత్రం న్యూస్‌టుడేకి చిక్కింది.

3/12
  ఈ చిత్రాల్లో మీరు చూస్తున్నవి పచ్చని ఆకులతో నిండిన వేర్వేరు చెట్లు అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఇవి పువ్వులు, ఆకులు కాదు. విశాఖలోని చింతూరు మార్గంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ నెమలికాయల చెట్టు ఆకులు మొత్తం రాలిపోయి నిండుగా కాయలు కాసింది. ఈ కాయలే మనకు పచ్చని ఆకుల్లా కనిపిస్తున్నాయి. మరొకటి పెదార్కూరు సమీపంలోని అడవిలో రహదారి పక్కనే ఎర్రని పూల మాదిరిగా కనిపిస్తున్న చెట్టు.

4/12
 నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ ఆళ్లగడ్డ చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది. 150 ఎకరాల విస్తీర్ణం గల చెరువుపై పెత్తనం కోసం సంఘాలు, అధికారుల మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో చెరువులో గుర్రపుడెక్క మేట వేసింది. చెరువులోని చేపలు పట్టుకోవడానికి వీల్లేకుండా తయారైంది.

5/12
   హైదరాబాద్‌లోని   ప్రగతినగర్‌లో ఓ భవనం బాల్కనీలో పడిన వడగళ్లు

6/12
 ఎక్కడ పని దొరికితే అక్కడికి వలసవెళ్లే కూలీల కుటుంబాలు ఇవి. దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంతకారులోనే వెళతారు. ఆహారం వంట సామగ్రి ఉండటానికి    అవసరమైన గుడారాలు వెంట తీసుకువెళ్తారు. హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు వద్ద కనిపించిన దృశ్యమిది. 

7/12
   కొల్లేరులో నీటిమట్టం తగ్గడంతో వందల కొంగలు చిన్న చేపలను పట్టి ఆరగిస్తున్నాయి. అంతలోనే ఎగురుతూ అక్కడి ప్రకృతి  అందాలకు మరింత వన్నెలు దిద్దుతున్నాయి. ఏలూరు జిల్లా పైడిచింతపాడు సమీపంలో కనిపించే ఈ దృశ్యాల్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

8/12
 ఆకులను తలపిస్తున్న ఈ మొక్కల పేరు హోయా. సర్క్యులెంట్స్‌ జాతికి చెందిన ఈ మొక్కలను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది. వీటిని ఇంటిలోపలా పెంచుకోవచ్చు. ఎక్కువగా ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ మొక్కలను బహుమతిగా ఇస్తుంటారు. తిరుపతి జిల్లా చెర్లోపల్లి నుంచి శ్రీనివాసమంగాపురానికి వెళ్లే మార్గంలోని నర్సరీలో ఇవి కన్పించాయి.

9/12
 ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లాలో బావికి, తోటకి పెళ్లి చేశారు. ఈ వివాహ వేడక కోసం పత్రికలు  సైతం ముద్రించి చుట్టుపక్కల గ్రామస్థులను ఆహ్వానించారు. ఈ వేడుకలో మొత్తం 1,500 మంది ప్రజలు అతిథులుగా పాల్గొన్నారు. బావికి, తోటకి పెళ్లి చేసే ఈ వింత ఆచారం.. కైసర్‌గంజ్‌ ప్రాంతంలోని కద్‌సర్‌ బితౌరా గ్రామంలో ఉంది.

10/12
 దేశంలోని విశిష్ఠ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు సికింద్రాబాద్‌ నుంచి తొలిసారిగా బయలుదేరిన ‘భారత్‌ గౌరవ్‌’ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ప్రయాణించే వారికి కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

11/12
  లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే. ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్‌ నదిలో ఈ పరిస్థితి నెలకొంది.

12/12
  ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ రీజియన్‌లో ధ్వంసమైన ఇంటి వద్ద కొనసాగుతున్న సహాయకచర్యలు

మరిన్ని