News in Pics: చిత్రం చెప్పే సంగతులు -01(20-03-2023)

Updated : 20 Mar 2023 12:26 IST
1/16
సినీ హీరో నాని ఆదివారం విశాఖ నగరంలో సందడి చేశారు. త్వరలో విడుదల కాబోతున్న ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు వివరించారు. సినీ హీరో నాని ఆదివారం విశాఖ నగరంలో సందడి చేశారు. త్వరలో విడుదల కాబోతున్న ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు వివరించారు.
2/16
ఇసుక ధరలు బంగారంలా మారాయి. దీంతో కొంతమంది సమూహంగా మారి కృష్ణా నదిలో ఇలా ఇసుక మూటలుగా కట్టి తీసుకెళ్తున్నారు. వీరిలో కొంతమంది సొంత అవసరాలకు వినియోగిస్తుండగా మరికొందరు అమ్ముకుంటున్నారు. అమరావతిలోని  కృష్ణలంక రాణిగారితోట వద్ద ఆదివారం కనిపించిన చిత్రాలివి. 

3/16
 పెద్ద సైజు పచ్చిమిర్చిలా ఉన్నది బీరకాయో, సొరకాయో అనుకుంటే పొరపాటే. విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన పక్కుర్తి నూకరాజు ఇంటి పెరట్లో బొప్పాయి చెట్టుకు కాసిన కాయ చిన్నసైజులో ఉంది. దీన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

4/16
ఆదివారం రాత్రి భూపాలపల్లిలో వర్షం కురిసిన సమయంలో ఇలా మెరుపులు దర్శనమిచ్చాయి. జయశంకర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ డాక్టర్‌ నలిమెల అరుణ్‌కుమార్‌ అత్యంత వేగంగా వచ్చి  వెళ్లే మెరుపులను క్షణకాలంలో ఇలా బంధించారు.  కనువిందుచేస్తున్న ఈ మెరుపు తీగలను పట్టణంలోని మంజూర్‌నగర్‌ ప్రాంతం నుంచి తన కెమెరాలో బంధించారు. ఆదివారం రాత్రి భూపాలపల్లిలో వర్షం కురిసిన సమయంలో ఇలా మెరుపులు దర్శనమిచ్చాయి. జయశంకర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ డాక్టర్‌ నలిమెల అరుణ్‌కుమార్‌ అత్యంత వేగంగా వచ్చి వెళ్లే మెరుపులను క్షణకాలంలో ఇలా బంధించారు. కనువిందుచేస్తున్న ఈ మెరుపు తీగలను పట్టణంలోని మంజూర్‌నగర్‌ ప్రాంతం నుంచి తన కెమెరాలో బంధించారు.
5/16
ఆదిలాబాద్‌లోని  బోథ్‌ అడవిని కొత్త అతిథి పలకరించింది. శరీరం పసుపు రంగులో ఉండి, మెడభాగం, రెక్కలు నల్లగా ఉండి రెక్కలపై పసుపు చారలతో ఆకర్షిస్తున్న ఈ పక్షి బ్లాక్‌ హూడెడ్‌ ఒరియోల్‌. ఇండోనేసియా, శ్రీలంక దేశాలలో నివసించే ఈ పక్షి బోథ్‌ రేంజీ పరిధి నేరడిగొండ మండలం కుప్టి, కుమారి అడవుల్లో శనివారం కనిపించటంతో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించారు. 

6/16
 వనపర్తి జిల్లాలోని రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం వద్ద పిట్టల వరుస చూపరులను కనువిందు చేసింది. కరకట్ట పొడవునా ఉన్న విద్యుత్తు తీగలపై పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటల తరబడి ఇలాగే ఉన్నాయి. సంధ్యవేళ సూర్యుడు అస్తమిస్తున్నంత వరకు తీగలపై ఉండి ఆకట్టుకున్నాయి.

7/16
   హైదరాబాద్‌లోని   మల్లాపూర్‌ మైఫ్లవర్‌ అపార్టుమెంట్‌ సముదాయంలోని ఓ భారీవృక్షం శనివారం రాత్రి ఈదురుగాలులకు పార్కు చేసిన కారుపై పడింది. కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది.

8/16
 హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లు మురికిగా మారడంతో నాలుగు రోజులుగా సిబ్బంది ప్రత్యేక యంత్రంతో శుభ్రం చేస్తున్నారు.

9/16
 నీటి మధ్యలో చిన్నపాటి ద్వీపంలా  కనిపిస్తున్న ఈ చిత్రం హుస్సేన్‌సాగర్‌లోనిదే.. సాగర్‌లో నెక్లెస్‌ రోడ్డువైపు మట్టితో కృత్రిమ ద్వీపంలా ఏర్పాటు చేసి.. దానిపై పచ్చదనం పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.  ఇందులో భాగంగా అక్కడికి రాకపోకలు సాగించేలా కర్రలతో తాత్కాలికంగా ఇలా వంతెన నిర్మించారు. 

10/16
   హైదరాబాద్‌లోని సాగర తీరం సరికొత్త అందాలతో అలరారుతోంది. నూతన సచివాలయం, అమరుల స్మృతి చిహ్నం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వాటిని చూసి సందర్శకులు కొత్త అనుభూతి పొందనున్నారు. దూరం నుంచి ఈ రెండు కట్టడాలను చూస్తే.. సచివాలయానికి ఎదురుగా దీపం వెలుగుతున్నట్లు కనిపిస్తోంది ఇలా..

11/16
సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముందు ఆగి ఉన్న బస్సులు ట్రాఫిక్‌ జాంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో బయట ప్రాంతాల నుంచి వచ్చే బస్సులూ రోడ్డుపై వరుసగా ఆగిపోవటంతో రైలును తలపించిన చిత్రం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది

12/16
 హైదరాబాద్‌లోని రాయదుర్గం టీవర్క్స్‌ సమీపంలో నిర్మిస్తున్న భారీ భవనానికి అద్దాలు బిగించారు. వాటిని సరి చూసేందుకు కార్మికులు యంత్రం సాయంతో వెళ్తున్నారు. 

13/16
కోటి రుద్రాక్షలు సేకరించి వాటిని మాలలుగా కట్టి ధారణ చేయడమంటే అది ఒక మహాయజ్ఞమే. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా విజయవాడలో కోటి రుద్రాక్షలతో పూజ చేయనున్నారు   దాదాపు 6 నెలలుగా 70మంది మహిళలతో కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసి 94 వేల మాలలు సిద్ధం చేస్తున్నారు. వీటిని ఈనెల 28న శిర్డీ సాయిబాబాకు ధారణ చేస్తారు. దాదాపు రూ.2 కోట్ల విరాళాలతో విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా ఆలయంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ గౌరవాధ్యక్షులు గౌతంరెడ్డి తెలిపారు.

14/16
 శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు ఆదివారం భ్రమరాంబాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

15/16
  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశాన వింత కాంతి చారలు దర్శనమిచ్చాయి. అవేంటన్నది అర్థంకాని ప్రజలు వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కొద్దిసేపట్లోనే అవి అదృశ్యమయ్యాయని జేమీ హెర్నాండెజ్‌ అనే వ్యక్తి పేర్కొన్నారు. గతంలో తాను ఇలాంటి పరిమాణాన్ని చూడలేదని పేర్కొన్నారు. అయితే అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ శకలాలు భూవాతావరణంలో మండిపోవడం వల్లే ఆ కాంతి చారలు ఏర్పడి ఉంటాయని జోనాథన్‌ మెక్‌డోవెల్‌ అనే ఖగోళశాస్త్రవేత్త పేర్కొన్నారు.

16/16
   దిల్లీ సమీపంలో ఆదివారం పెద్దఎత్తున వాన కురిసింది. దీంతో దిల్లీ-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ఫుట్‌పాత్‌పై పడిన వడగళ్లను పరిశీలిస్తున్న స్థానికులు

మరిన్ని