News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (23-03-2023)

Updated : 23 Mar 2023 12:35 IST
1/24
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఇంకిపోతున్నాయి కుళాయిలు, బోర్ల నుంచి వచ్చే నీటిని పట్టుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున బిందెలు విక్రయించేందుకు ప్రత్యేక బండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా రంగురంగుల బిందెలు పల్లెలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఇంకిపోతున్నాయి కుళాయిలు, బోర్ల నుంచి వచ్చే నీటిని పట్టుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున బిందెలు విక్రయించేందుకు ప్రత్యేక బండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా రంగురంగుల బిందెలు పల్లెలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
2/24
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద బుధవారం సాయంత్రం కనిపించిన సుందర దృశ్యమిది. ఒకవైపు అరుణవర్ణ శోభిత భానుడి వీడ్కోలు.. మరోవైపు వంతెనపై మిరుమిట్లు గొలిపే కాంతులు.. దిగువ ప్రశాంతంగా సాగే గోదారమ్మ ప్రవాహం కళ్లనిండా చూస్తూ సందర్శకులు మనసునిండుగా మురిసిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద బుధవారం సాయంత్రం కనిపించిన సుందర దృశ్యమిది. ఒకవైపు అరుణవర్ణ శోభిత భానుడి వీడ్కోలు.. మరోవైపు వంతెనపై మిరుమిట్లు గొలిపే కాంతులు.. దిగువ ప్రశాంతంగా సాగే గోదారమ్మ ప్రవాహం కళ్లనిండా చూస్తూ సందర్శకులు మనసునిండుగా మురిసిపోయారు.
3/24
పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. బాపట్ల జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఎక్కిన ప్రయాణికులను గమనిస్తే ‘ఇంత మంది ఎలా సాధ్యం’ అనే అనుమానం కలగకమానదు. పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. బాపట్ల జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఎక్కిన ప్రయాణికులను గమనిస్తే ‘ఇంత మంది ఎలా సాధ్యం’ అనే అనుమానం కలగకమానదు.
4/24
ఆవరణలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్న ఆ దవాఖానా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం మల్‌చెల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీహెచ్‌సీ ఆవరణలోని చెట్లు, ఇతర మొక్కలు నీడనివ్వడంతో పాటు వైద్యం కోసం వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నాయి. ఆవరణలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్న ఆ దవాఖానా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం మల్‌చెల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీహెచ్‌సీ ఆవరణలోని చెట్లు, ఇతర మొక్కలు నీడనివ్వడంతో పాటు వైద్యం కోసం వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నాయి.
5/24
   ప్రకాశం  జిల్లాలో మారుతున్న వాతావరణం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. మధ్యాహ్నం ఎండ నిప్పుల కుంపటిని తలపిస్తుండగా . రాత్రి వేళ భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. ఉదయం వేళ రివ్వుమని చలిగాలులు వీస్తుండగా, మధ్యాహ్నం సమయంలో ఎండ ఠారెత్తిస్తోంది. తెల్లవారు జామున పుల్లల చెరువు ప్రాంతంలో పొగమంచు కురవగా, మధ్యాహ్నం వేళ ఒంగోలులో భానుడి ధాటికి ఇలా విలవిల్లాడారు. 

6/24
  జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో  విశాఖపట్నంలోని ఆర్‌కేబీచ్‌లో పలు చోట్ల చిహ్నాలను ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు తీరంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

7/24
 విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండల కేంద్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఆ తరువాత ఆకాశంలో ఏర్పడిన రంగుల హరివిల్లు చూపరులను ఇలా ఆకట్టుకుంది.

8/24
  శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో సైబీరియా పక్షుల సందడి నెలకొంది. సైబీరియానుంచి ఎన్నో ఏళ్లుగా ఏటా కొంగలు సీజన్‌లో ఇక్కడకు వలస వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో గ్రామంలోని చెట్లపై గూళ్లు అల్లుతాయి. మార్చి, ఏప్రిల్‌లో ఒక్కొక్కపక్షి మూడు, నాలుగు గుడ్లు పెడుతుంది. మేలో పొదిగి జూన్‌ నాటికి పిల్లలు బయటకు వస్తాయి. అవి తమంతట తాముగా ఎగిరే శక్తి వచ్చేవరకు ఇక్కడే ఉంటాయి

9/24
  రాత్రి వేళల్లో చెట్లపై తెల్లని పూలను తలపిస్తున్నవన్నీ విహంగాలే. పగలంతా మామూలు చెట్లలా ఉన్నా రాత్రి వేళల్లో మాత్రం తెల్లని కొంగలతో కళకళలాడుతున్నాయి., ఏలూరు.  జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరంలోని జాతీయ రహదారి పక్కనున్న చెట్లపై కనిపించిన చిత్రమిది..

10/24
చిన్నారులకు బొమ్మలు, మహిళలకు గృహోకరణాలు, పెద్దలకు కావాల్సిన వివిధ రకాల వ్యవసాయ వస్తువులను ఇదిగో ఇలా ఆటోలో ఏకంగా ఓ దుకాణాన్నే రూపొందించారు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నందమూరినగర్‌కు చెందిన భూక్యా శంకర్‌. తన ఆటోలో ఈ సమాన్ల దుకాణంతో ఊరురా తిరుగుతూ.. ఆయా వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారులకు బొమ్మలు, మహిళలకు గృహోకరణాలు, పెద్దలకు కావాల్సిన వివిధ రకాల వ్యవసాయ వస్తువులను ఇదిగో ఇలా ఆటోలో ఏకంగా ఓ దుకాణాన్నే రూపొందించారు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నందమూరినగర్‌కు చెందిన భూక్యా శంకర్‌. తన ఆటోలో ఈ సమాన్ల దుకాణంతో ఊరురా తిరుగుతూ.. ఆయా వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
11/24
  వర్షాకాలంలో ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి నీరు చేరుకుంది. నీరు ఎటూ పోయే పరిస్థితి లేకపోవటంతో అక్కడ జమ్మిగడ్డి మొలిచింది. మోరంపల్లి బంజరలోని మూడో ప్యాకేజీ మొదలు పాల్వంచలోని నాగారం వద్ద కిన్నెరసాని నదిపై అక్విడెక్టు ఉన్న నాలుగో ప్యాకేజీ వరకు ప్రధాన కాల్వలో జమ్మిగడ్డి ఏపుగా పెరిగింది. ఏకంగా మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు ప్రధాన కాల్వలో పచ్చటి తివాచీ పరిచినట్లు చూపరులను ఆకట్టుకుంటోంది.

12/24
 వరంగల్‌లోని పాకాల అభయారణ్యం ప్రస్తుతం 250 రకాల పక్షులకు నిలయం. చెట్లపై విహరించే, నీటిపై తేలియాడే పక్షులు ఇక్కడ ఉన్నాయి. భారత ఉపఖండం, మాల్దీవులు, అండమాన్‌ దీవుల నుంచి వేసవిలో పాకాలకు తక్కువ ఈలకం బాతులు(లెస్‌ విజిల్‌ డక్స్‌)తొలిసారి వలస వచ్చాయి.

13/24
 నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మాధవ యడవల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఎనిమిదిన్నర సమయంలో కనిపించిన చిత్రమిది. అసలే ఎండాకాలం ఒక వైపు వడగళ్ల వాన, మరో వైపు తెల్లవారు జామున మంచు కురుస్తుండగా తీసిన ప్రకృతి చిత్రమిది.

14/24
  గుడిపడ్వా సందర్భంగా నగరంలోని మహారాష్ట్ర వాసులు   హైదరాబాద్‌లోని చార్మినార్‌ నుంచి సైబర్‌టవర్స్‌ మీదుగా సీసీఆర్‌టీ వరకు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

15/24
    హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ అంబేడ్కర్‌ విగ్రహం దాదాపు పూర్తికావొచ్చింది. తలభాగం, కళ్లజోడు ఏర్పాటు చేస్తే విగ్రహం పూర్తయినట్లే..

16/24
  బండపై బండ పేర్చినట్టుగా అందంగా కనిపిస్తున్న ఈ చిత్రం శంషాబాద్‌ హమీదుల్లానగర్‌లోది. చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తుండటంతో చాలా మంది సందర్శించి వెళతారని స్థానికులు చెబుతున్నారు.

17/24
   హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ సమయంలో నెక్లెస్‌రోడ్‌లోని ఐమ్యాక్స్‌ దారిలో డివైడర్లను తొలగించారు. పోటీలు ముగిసి నెలలు గడుస్తున్నా తిరిగి నిర్మించలేదు. దీంతో చెట్లు ఒరిగిపోయే అవకాశం ఉంది. వర్షం పడితే ఇబ్బందులు తప్పవని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

18/24
 హైదరాబాద్‌లోని మణికొండ పురపాలక పరిధిలో ఇటీవల ప్రారంభించిన ఎం.ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ ప్రహరీపై ఇలా ఆకట్టుకునేలా బొమ్మలు కనిపించాయి

19/24
   నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం శోభాయమానంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి మంగళవాయిద్యాల మధ్య తీసుకొచ్చి రథంపై అధిష్ఠింపజేశారు. లక్షల మంది కన్నడ భక్తుల శివనామ స్మరణల మధ్య ప్రధాన పురవీధిలో రథోత్సవం రమణీయంగా జరిగింది. 

20/24
 ఉగాది వేళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 180 జంటల షష్టిపూర్తి మహోత్సవం బుధవారం సందడిగా సాగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన రొటేరియన్‌ మండవిల్లి వెంకన్నబాబు ఆర్థిక సహకారంతో స్థానిక మాధవి కల్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి 180 జంటలు ఇందులో పాల్గొన్నాయి. వేదికపై శివలింగం ఏర్పాటు చేసి రుద్రాభిషేకం చేశారు. దంపతులు ఒకే ఆకులో భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు.

21/24
   లండన్‌లో 205 ఏళ్ల ఓ పురాతన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా వార్తల్లో నిలిచింది. ఇది చూడటానికి కొంచెం అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌ను పోలి ఉంటుంది. అందుకే ఈ రెండంతస్తుల భవనాన్ని ‘వైట్‌ హౌస్‌ ఆఫ్‌ రీజెంట్స్‌ పార్క్‌’ అని పిలుస్తుంటారు. భవనం లోపల 40 పడక గదులున్నాయి. 8 గ్యారేజీలు, టెన్నిస్‌ కోర్టు, ఆవిరి స్నానం చేసుకునేందుకు ఓ ప్రత్యేక గది, గ్రంథాలయం, అతిపెద్ద డైనింగ్‌ రూమ్‌ వంటి సౌకర్యాలున్నాయి.

22/24
  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కోర్కోరాన్‌లో వరదల కారణంగా నీట మునిగిన కార్లు

23/24
 ముంబయిలో నిర్వహించిన మరాఠీ నూతన సంవత్సర సంబరాలైన ‘గుడి పడ్వా’లో పాల్గొన్న ప్రజలు

24/24
  ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం (పిడియాట్రిక్‌ వార్డు)లోని ముస్కాన్‌ కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పడకల మధ్యలో, నడిచే దారిలో రంగులతో ఏబీసీడీలు, తెలుగు అక్షరమాల రాయించారు. వైకుంఠపాళి, ఇతర చిత్రాలు చిన్న పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని