News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (26-03-2023)

Updated : 26 Mar 2023 05:00 IST
1/12
 శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పాలవలస ఉన్నత పాఠశాలలో కుళాయిల ద్వారా నీరందకపోవడంతో విద్యార్థులు శనివారం ఇబ్బందులు పడ్డారు. బడిలో సుమారు 335 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మధ్యాహ్నం భోజనం సమయంలో కంచాలను శుభ్రం చేసుకునేందుకు గ్రామంలో ఉన్న తాగునీటి బోర్ల వద్దకు క్యూ కట్టారు. 

2/12
హుషారైన పాటలు...ఉర్రూతలూగించే నృత్యాలు.. కుర్రకారు కేరింతలతో  విజయనగరంలోని  డెంకాడలోని లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం సందడి నెలకొంది. కళాశాల 15వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యువతీ యువకుల సోలో, బృంద నృత్యాలు సభికులను అలరించాయి. 

3/12
 క్రికెట్‌ అభిమానుల కోలాహలం మధ్య సాగిన సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) పోటీలు ఉత్కంఠగా సాగాయి. శనివారం రాత్రి విశాఖలోని  పీఎం పాలెం స్టేడియంలో నిర్వహించిన తుది పోటీలో ‘తెలుగు వారియర్స్‌ ’ సారథి అఖిల్‌ విజృంభించి జట్టుకు విజయం దక్కడంలో కీలకంగా నిలిచారు. భోజ్‌పురి దబాంగ్స్‌పై తెలుగు సినీ తారల జట్టు గెలవడంతో స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది.

4/12
జగిత్యాల జిల్లా పురాణిపేటలోని ఓ వీధిలో బహిరంగ మూత్ర విసర్జనతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో కొందరు సామాజిక కార్యకర్తలు ఓ చక్కని ఉపాయం ఆలోచించారు. వీధిలో రెండు వైపులా గోడలకు అందమైన చిత్రాలు వేసి సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. దీంతో కాలనీలో బహిరంగ మూత్ర విసర్జనను నియంత్రించగలిగారు. 

5/12
 ఎర్త్‌డే (పుడమి దినోత్సవం)ను పురస్కరించుకుని   హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీ హబ్‌ వద్ద నిర్వహించిన సైక్లోథాన్‌ ఉత్సాహంగా సాగింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం, టీ హబ్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహిక సైకిలిస్టులు హాజరయ్యారు.

6/12
 హైదరాబాద్‌లోని  ఇందిరాపార్కు వద్ద భాజపా ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ కాషాయ జెండాలు, ప్లకార్డులతో ఆందోళనలో పాల్గొన్నారు.

7/12
 హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ కుమ్మరికుంట చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైంది. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలోని జలాశయంలో పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. ప్రస్తుతం అక్కడో చెరువుండేదని చెబితే తప్ప.. గుర్తించలేని దుస్థితి. 

8/12
అత్యవసర చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్, నిలోఫర్‌ ఆసుపత్రులకు వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు. రోగుల సహాయకులు అందుబాటులో ఉండటం లేదు. చక్రాల కుర్చీలు, స్ట్రెచర్లు లేకపోవడంతో చేతులపైనే ఎత్తుకెళ్లాల్సి వస్తోంది.  గంటల తరబడి వేచి చూస్తేనే స్ట్రెచర్లు దొరుకుతున్నాయి. మరోపక్క సిబ్బంది చక్రాల కుర్చీలను దుస్తులు, సామగ్రి తరలించేందుకు వినియోగిస్తున్నారు.

9/12
దిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఆలయం ఇది. ఎర్త్‌ అవర్‌ సందర్భంగా శనివారం రాత్రి విద్యుద్దీపాలు ఆర్పివేయడంతో ఇలా చీకట్లు అలముకున్నాయి

10/12
 భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులై శ్వేతసౌధంలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుమార్తె మాయాతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఎరిక్‌ గార్సెట్టి.. చిత్రంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌

11/12
  ప్రధాని మోదీ శనివారం కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌-కేఆర్‌పుర మధ్య మెట్రో రైలును ప్రారంభించారు. అందులో ప్రయాణిస్తూ విద్యార్థులతో మాట్లాడారు

12/12
 జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారత తొలి కేబుల్‌ ఆధారిత రైల్వే వంతెన ఇది. కట్రా - బనిహాల్‌ రైల్వే మార్గంలో చుట్టూ కొండలు, లోయల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీని పొడవు 473.25 మీటర్లు. దీన్ని అంజీ ఖాద్‌ బ్రిడ్జిగా పిలుస్తున్నారు.

మరిన్ని