News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (27-03-2023)

Updated : 27 Mar 2023 12:44 IST
1/23
వేసవిలో కూడా కాలువ నిండా నీరుపారుతోంది. కాలువకు అక్కడక్కడ లీకైన నీటిమడుగుల్లో చేరిన చిన్న చేపలు, పురుగులు తినేందుకు కొంగలు సమూహాంగా చేరి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు పట్టణంలోని కండలేరు  ఎడమ కాలువ వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. వేసవిలో కూడా కాలువ నిండా నీరుపారుతోంది. కాలువకు అక్కడక్కడ లీకైన నీటిమడుగుల్లో చేరిన చిన్న చేపలు, పురుగులు తినేందుకు కొంగలు సమూహాంగా చేరి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు పట్టణంలోని కండలేరు ఎడమ కాలువ వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది.
2/23
రుతువుల గమనాన్ని తెలియజేసేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆలమూరు మండలం చిత్తలూరులోని పెద్ద చెరువు కట్టపై ఉన్న బూరుగ వృక్షాలు శిశిర ఋతువులో ఆకులన్నీ రాలి మోడుగా మారాయి. వసంతంలోకి ప్రవేశించే సమయాన అందమైన పూలతో కనువిందు చేస్తున్నాయి.ఈ చెట్లపై చేరిన పక్షులతో సందడిగా మారింది. రుతువుల గమనాన్ని తెలియజేసేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆలమూరు మండలం చిత్తలూరులోని పెద్ద చెరువు కట్టపై ఉన్న బూరుగ వృక్షాలు శిశిర ఋతువులో ఆకులన్నీ రాలి మోడుగా మారాయి. వసంతంలోకి ప్రవేశించే సమయాన అందమైన పూలతో కనువిందు చేస్తున్నాయి.ఈ చెట్లపై చేరిన పక్షులతో సందడిగా మారింది.
3/23
సాధారణంగా ఏదైనా చెట్టుకు పైభాగంలోని కొమ్మలకు కాయలు కాయడం మనం చూస్తుంటాం.. అయితే ఏలూరు జిల్లాలోని విలీన మండలం వేలేరుపాడు మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలోని పనస చెట్టు మొదలు నుంచి భూమికి ఆనుకునే విధంగా కాయలు కాసింది. చెట్టు మొదట్లో గుత్తులుగా 45 కాయలు కాయడంతో కార్యాలయానికి వచ్చే సందర్శకులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఏదైనా చెట్టుకు పైభాగంలోని కొమ్మలకు కాయలు కాయడం మనం చూస్తుంటాం.. అయితే ఏలూరు జిల్లాలోని విలీన మండలం వేలేరుపాడు మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలోని పనస చెట్టు మొదలు నుంచి భూమికి ఆనుకునే విధంగా కాయలు కాసింది. చెట్టు మొదట్లో గుత్తులుగా 45 కాయలు కాయడంతో కార్యాలయానికి వచ్చే సందర్శకులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
4/23
జీ20 సన్నాహక సదస్సుల సందర్భంగా విశాఖ సాగర తీరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వైజాగ్‌ కార్నివాల్‌’లో ఆకట్టుకున్న గిరిజన నృత్యం. జీ20 సన్నాహక సదస్సుల సందర్భంగా విశాఖ సాగర తీరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వైజాగ్‌ కార్నివాల్‌’లో ఆకట్టుకున్న గిరిజన నృత్యం.
5/23
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో గొర్ల కాపరులు వందలాది గొర్లను మేత కోసం తీసుకెళ్లారు. సాయంకాలం తిరిగి వచ్చే దారిలో గ్రామం చివరన వాగు నీటితో నిండుగా ఉంది. కాపరి ఒక గొర్రెకు శబ్దాలతో సూచన చేయగానే ఒకదాని వెంట మరొకటి క్రమశిక్షణతో వాగు  దాటాయి. అవి కట్టు తప్పకుండా వరుస కట్టి నీటి మధ్యలో వెళ్లడం చూపరులను ఆకట్టుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో గొర్ల కాపరులు వందలాది గొర్లను మేత కోసం తీసుకెళ్లారు. సాయంకాలం తిరిగి వచ్చే దారిలో గ్రామం చివరన వాగు నీటితో నిండుగా ఉంది. కాపరి ఒక గొర్రెకు శబ్దాలతో సూచన చేయగానే ఒకదాని వెంట మరొకటి క్రమశిక్షణతో వాగు దాటాయి. అవి కట్టు తప్పకుండా వరుస కట్టి నీటి మధ్యలో వెళ్లడం చూపరులను ఆకట్టుకుంది.
6/23
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెనుక జలాల సమీపంలో ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలం చిన్నయానం సమీపంలో తీసిన చిత్రమిది. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం తగ్గినా.. ఇక్కడి పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెనుక జలాల సమీపంలో ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలం చిన్నయానం సమీపంలో తీసిన చిత్రమిది. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం తగ్గినా.. ఇక్కడి పరిసరాలు కనువిందు చేస్తున్నాయి.
7/23
సాధారణంగా ప్రతి చెట్టుకు మొదలు భాగం ఉంటుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మర్కోడు గ్రామ పరిధిలో ఒకే మొదలుతో రెండు వృక్షాలు దర్శనమిస్తున్నాయి. మొదలు ఉన్న మర్రిచెట్టుకు పైభాగాన తాటి చెట్టు కనిపిస్తుంది. మర్రి వేర్లు కప్పివేయడంతో తాటిచెట్టు మొదలు కనిపించడం లేదు.  ఈ దృశ్యాన్ని చూసే వారంతా ఒక మొదలు.. రెండు చెట్లు అంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ప్రతి చెట్టుకు మొదలు భాగం ఉంటుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మర్కోడు గ్రామ పరిధిలో ఒకే మొదలుతో రెండు వృక్షాలు దర్శనమిస్తున్నాయి. మొదలు ఉన్న మర్రిచెట్టుకు పైభాగాన తాటి చెట్టు కనిపిస్తుంది. మర్రి వేర్లు కప్పివేయడంతో తాటిచెట్టు మొదలు కనిపించడం లేదు. ఈ దృశ్యాన్ని చూసే వారంతా ఒక మొదలు.. రెండు చెట్లు అంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
8/23
 ‘జీ-20’ సందర్భంగా  విశాఖలోని ఆర్‌కేబీచ్‌ కాళీమాత ఆలయం వద్ద ఆదివారం ఉదయం జీవీఎంసీ ఆధ్వర్యంలో 10కె, 5కె, 3కె పరుగు(మారథాన్‌) పోటీలు నిర్వహించారు. మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ పోటీలను ప్రారంభించారు.  నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

9/23
అమరావతి రాజధాని ప్రాంతంలో తుళ్లూరు- రాయపూడి మధ్యలో వంతెన నిర్మాణం నిమిత్తం తెచ్చిన సామగ్రి అనేక ఏళ్లుగా నీటిలోనే ఉండడంతో తుప్పుపట్టిపోతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా పెద్దగుంతలు తీసి వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా పనులు నిలిపివేయడంతో  గుంతల్లో నీరు చేరి రూ.లక్షల విలువ చేసే సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోతోంది. 

10/23
  గుంటూరు వైద్యకళాశాలలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవంలో 2017 బ్యాచ్‌ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందడి చేశారు.

11/23
  జీ20 సన్నాహక సమావేశాలకు విశాఖ ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి జరిగే ఈ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దీంతో ఆర్కేబీచ్‌- రుషికొండ తీర మార్గంలో సుందరీకరణ చేపట్టారు. రోడ్ల నిర్మాణంతో పాటు ఆయా ప్రాంతాలకు తగినట్లు రంగులు వేశారు. అలాగే కైలాసగిరిపైనా శివపార్వతుల విగ్రహాలకు రంగులు వేస్తూ తీర్చిదిద్దుతున్నారు. కైలాసగిరి కొండపై నుంచి చూస్తే తెన్నేటిపార్కు- సతీకొండ వెళ్లే మార్గం చూడముచ్చటగా కనువిందు చేస్తోందని సందర్శకులు పేర్కొంటున్నారు.

12/23
   రెండు మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాహార్తిని తీర్చుకోవడం కోసం పక్షులు నీటి వనరులను ఆశ్రయిస్తున్నాయి. గ్రామాల్లో నీటి తొట్టెల వద్దకు వచ్చివాలుతున్నాయి. కొణిజర్ల మండలం పల్లిపాడులోని తాటిపల్లి హరినాథ్‌బాబు అనే వ్యక్తి ఇంట్లో నీటితొట్టెలో ఆదివారం ఓ పక్షి ఇలా వచ్చి దాహం తీర్చుకుంది. అనంతరం అందులో కొంతసేపు అటూఇటూ తిరుగుతూ సేదతీరి అక్కడ నుంచి తుర్రుమని ఎగిరింది.

13/23
  ఇది వరంగల్‌ --హైదరాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి. రోడ్డు మధ్యలో సుందరీకరణ కోసం మొక్కలు పెంచారు. కొన్ని చోట్ల బాగున్నా మరికొన్ని చోట్ల అధ్వానంగా మారింది హనుమకొండ జిల్లాలోని . కాజీపేట డీజిల్‌ కాలనీ నుంచి మడికొండకు వెళ్లే రహదారి మధ్యలో  రాళ్లు రప్పలతో ఇలా కనిపిస్తోంది.

14/23
  చెరువు మధ్యలో ద్వీపం లాగా ఉన్న ప్రాంతం.. అక్కడ ఉన్న చెట్టు కొమ్మలపై కొంగలు వందల సంఖ్యలో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా రెడ్డిపురం చెరువు వద్ద నిత్యం సాయంత్రం వేళ కొంగలు సందడి చేస్తూ కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా ఉన్నాయని, రాత్రి వేళలో అవి అక్కడే ఉంటున్నాయని స్థానికులు తెలిపారు.

15/23
 యువత చరవాణికి ఎంతగా ప్రభావితులవుతున్నారనే దానికి ఉదాహరణ ఈ చిత్రం. కొన్ని సెకన్లు విరామం దొరికితే చాలు చరవాణి చూస్తూ తమదైన లోకంలో విహరిస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు ఫోన్‌ చూస్తూ.. వెనుక ఉన్న వారు హారన్‌ మోగిస్తే తప్ప కదలని తీరు నగరంలో తరచూ కనిపిస్తోంది.

16/23
 ద్విచక్రవాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలనేది నిబంధన.    నగరంలో కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌ వద్ద ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. ముందు కూర్చున్న బాలుడు నిద్రలోకి జారుకున్నాడు. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదమే.

17/23
 ఫొటోకు పోజు ఇచ్చి సామాజిక మాధ్యమంలో పోస్టు పెడితే లైకుల వర్షం కురవాలి.. కామెంట్లు హోరెత్తాలి. ఇదే లక్ష్యంగా కొందరు కుర్రకారు ప్రమాదాలను సైతం లెక్కచేయడం లేదనేందుకు నిదర్శనమీ చిత్రం.  హైదరాబాద్‌లో నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు తిరిగే సంజీవయ్య రైల్వేస్టేషన్‌ సమీపంలో అమ్మాయిలు ఇలా పట్టాలపై కూర్చొని ఫొటోలు దిగుతూ కనిపించారు. 

18/23
 చిన్న పిల్లలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో లిటిల్‌ మిలీనియం విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కిడ్స్‌ మారథాన్‌ చేపట్టారు. హైదరాబాద్‌లోని  గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ చిన్నారుల పరుగును భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నారులు ఉత్సాహంగా పరుగులో పాలుపంచుకున్నారు. మూడు నుంచి పదేళ్ల వయసు పిల్లలు 100 మీటర్ల నుంచి 600 మీటర్ల మారథాన్‌లో పాల్గొని సందడి చేశారు.

19/23
  వారాంతంలో  హైదరాబాద్‌  నగరవాసులు ట్యాంక్‌బండ్‌ చుట్టూ చేరి సందడిగా గడిపారు. హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను తిలకిస్తూ కేరింతలు కొట్టారు. ఆదివారం రాత్రి భారీగా తరలివచ్చిన జనసందోహంతో నెక్లెస్‌రోడ్డు నుంచి తెలుగుతల్లి పైవంతెన వైపు వెళ్లే మార్గం కిక్కిరిసిపోయింది. సంగీతానికి అనుగుణంగా నీటితో చేయించిన విన్యాసాలను తమ చరవాణుల్లో బంధించారు. 

20/23
   హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తా వద్ద స్కైవాక్‌ పనులు చురుగ్గా సాగుతూ చివరి దశకు చేరాయి. వంతెనపై లిఫ్ట్‌ల సమీపంలో అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభానికి సిద్ధంకానుందీ నిర్మాణం.

21/23
  ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఇది. వంతెనను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

22/23
  ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ‘చాకూ చౌక్‌’ పేరుతో నిర్మించిన కూడలిలో ఏర్పాటుచేసిన 20 అడుగుల రాంపురీ కత్తి

23/23
   హైదరాబాద్‌లో పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా.. తొలగించాల్సి వచ్చిన వృక్షాలను ట్రాన్స్‌లొకేట్‌ పద్ధతిలో తీసుకువచ్చి చెంగిచెర్ల పారిశ్రామికవాడలో నాటారు. తర్వాత వాటి ఆలనాపాలనా పట్టించుకోకపోవడంతో.. అవి ఎండిపోతున్నాయి. కొన్ని మాత్రమే చిగురు వేయగా.. ఎక్కువ శాతం మోడుగా మారాయి. 

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు