News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(28-03-2023)

Updated : 28 Mar 2023 22:25 IST
1/20
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
2/20
3/20
హైదరాబాద్‌ నాంపల్లిలో బుధవారం నిర్వహించనున్న తెదేపా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నాయకులు, అధికారులు సభాస్థలికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌ నాంపల్లిలో బుధవారం నిర్వహించనున్న తెదేపా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నాయకులు, అధికారులు సభాస్థలికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.
4/20
5/20
సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌ తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. కర్లీ హెయిర్‌, అందమైన పోజులతో ఉన్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.. సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌ తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. కర్లీ హెయిర్‌, అందమైన పోజులతో ఉన్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు..
6/20
7/20
కాక్టస్‌ జాతికి చెందిన మొక్కలు పండ్ల రంగుల్లో కనిపించి సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూసేందుకు బొమ్మలాగా కనిపిస్తాయి. ముట్టుకుంటే పట్టుకుంటాయి. చుట్టు ముళ్లతో ఉంటుంది. వాటి ఆకృతులను, అందాన్ని ఈ ముళ్లు కాపాడుతుంటాయి. విశాఖపట్నంలోని పెదవాల్తేరులో ఉన్న జీవవైవిధ్య ఉద్యానవనంలో ఉన్న కాక్టస్‌ ఇది.. కాక్టస్‌ జాతికి చెందిన మొక్కలు పండ్ల రంగుల్లో కనిపించి సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూసేందుకు బొమ్మలాగా కనిపిస్తాయి. ముట్టుకుంటే పట్టుకుంటాయి. చుట్టు ముళ్లతో ఉంటుంది. వాటి ఆకృతులను, అందాన్ని ఈ ముళ్లు కాపాడుతుంటాయి. విశాఖపట్నంలోని పెదవాల్తేరులో ఉన్న జీవవైవిధ్య ఉద్యానవనంలో ఉన్న కాక్టస్‌ ఇది..
8/20
సినీ నటి ఈషా రెబ్బా తన తాజా ఫొటోలను ట్విట్‌లో పంచుకున్నారు. ‘ఈ డ్రెస్సులో వికసించిన పువ్వులా ఉన్నాను’ అని ఆమె ట్వీట్‌ చేశారు. సినీ నటి ఈషా రెబ్బా తన తాజా ఫొటోలను ట్విట్‌లో పంచుకున్నారు. ‘ఈ డ్రెస్సులో వికసించిన పువ్వులా ఉన్నాను’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
9/20
శ్రీరామ నవమి కల్యాణోత్సవం సందర్భంగా కూకట్‌పల్లిలోని రామాలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దీంతో ఆలయం ప్రాంగణం విద్యుత్తు కాంతులతో వెలిగిపోతోంది. శ్రీరామ నవమి కల్యాణోత్సవం సందర్భంగా కూకట్‌పల్లిలోని రామాలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దీంతో ఆలయం ప్రాంగణం విద్యుత్తు కాంతులతో వెలిగిపోతోంది.
10/20
ఈరోజుతో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. పరీక్ష అనంతరం కరీంనగర్‌లో విద్యార్థినులు ఇలా ఉత్సాహంగా కనిపించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈరోజుతో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. పరీక్ష అనంతరం కరీంనగర్‌లో విద్యార్థినులు ఇలా ఉత్సాహంగా కనిపించి ఫొటోలకు పోజులిచ్చారు.
11/20
ఆదిలాబాద్‌ పట్టణంలోని ముఖ్యమైన చౌరస్తాలో ఒకటిగా పేరొందిన ఎన్‌టీఆర్‌ కూడలి.  అక్కడ సుందరీకరణ పనుల్లో భాగంగా  దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నిలువెత్తు విగ్రహాన్ని తొలగించారు. అనంతరం ఈ విగ్రహానికి ఎలాంటి రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. 
విగ్రహం ఏర్పాటు చేసేందుకు వీలు లేకుండా నిర్మాణం చేపడుతున్న సమయంలో ‘పేరుకే చౌరస్తా!’ అనే శీర్షికతో జనవరి 19వ తేదిన ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురించగా.. స్పందించిన పుర అధికారులు ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో మూలన పడేసిన విగ్రహాన్నే ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ముఖ్యమైన చౌరస్తాలో ఒకటిగా పేరొందిన ఎన్‌టీఆర్‌ కూడలి. అక్కడ సుందరీకరణ పనుల్లో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నిలువెత్తు విగ్రహాన్ని తొలగించారు. అనంతరం ఈ విగ్రహానికి ఎలాంటి రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు వీలు లేకుండా నిర్మాణం చేపడుతున్న సమయంలో ‘పేరుకే చౌరస్తా!’ అనే శీర్షికతో జనవరి 19వ తేదిన ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురించగా.. స్పందించిన పుర అధికారులు ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో మూలన పడేసిన విగ్రహాన్నే ఇప్పుడు ఏర్పాటు చేశారు.
12/20
కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని ఓ పార్కులో  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సీతాకోక చిలుక ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సీతాకోక చిలుక బెంచీలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని ఓ పార్కులో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సీతాకోక చిలుక ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సీతాకోక చిలుక బెంచీలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
13/20
ప్రముఖ దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌ కుమార్‌ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఆదిపురుష్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సెల్ఫీ తీసుకున్న ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌ కుమార్‌ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఆదిపురుష్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సెల్ఫీ తీసుకున్న ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.
14/20
వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలనుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలనుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు.
15/20
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆయనకు ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా లోకేశ్‌ పాఠశాల చిన్నారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆయనకు ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా లోకేశ్‌ పాఠశాల చిన్నారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
16/20
అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మార్చి 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మార్చి 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
17/20
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
18/20
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 20ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన ఓ ఫొటోను పంచుకున్నారు. గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు బన్నీ విభిన్న పాత్రలతో అలరించారు. తరువాతి చిత్రం పుష్ప2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 20ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన ఓ ఫొటోను పంచుకున్నారు. గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు బన్నీ విభిన్న పాత్రలతో అలరించారు. తరువాతి చిత్రం పుష్ప2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
19/20
హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కాలనీలో 200 పడకలతో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను నాయకులు పరిశీలించారు.  ఎమ్మెల్యే దానం నాగేందర్, హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కాలనీలో 200 పడకలతో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను నాయకులు పరిశీలించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.
20/20
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని