News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(29-03-2023)

Updated : 29 Mar 2023 12:31 IST
1/10
విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలను సమర్థంగా తిప్పికొట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌(స్వాట్‌) పేరుతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి 1న ఎస్పీ జి.ఆర్‌.రాధిక ప్రారంభించారు. జిల్లా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌(ఎస్టీఎఫ్‌)విభాగం నుంచి 31 మందిని స్వాట్‌ బృందంగా ఏర్పాటు చేసి వివిధ అంశాలపై కమాండో, గ్రేహౌండ్స్‌ దళాల తరహాలో ఆక్టోపస్‌ విభాగం శిక్షకులతో తర్ఫీదునిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక సాధన చేయిస్తున్నదే ఈ చిత్రం. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలను సమర్థంగా తిప్పికొట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌(స్వాట్‌) పేరుతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి 1న ఎస్పీ జి.ఆర్‌.రాధిక ప్రారంభించారు. జిల్లా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌(ఎస్టీఎఫ్‌)విభాగం నుంచి 31 మందిని స్వాట్‌ బృందంగా ఏర్పాటు చేసి వివిధ అంశాలపై కమాండో, గ్రేహౌండ్స్‌ దళాల తరహాలో ఆక్టోపస్‌ విభాగం శిక్షకులతో తర్ఫీదునిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక సాధన చేయిస్తున్నదే ఈ చిత్రం.
2/10
చిన్నపాటి వర్షం కురిసినా జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి క్రీడామైదానం చిత్తడిగా మారుతోంది. కనీసం వాకింగ్‌ చేసేందుకు సైతం వీలుపడని విధంగా తయారవుతోంది. మైదానం చదును చేయకుండా విడిచిపెట్టడంతో లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఇంకేవరకు సాధన చేసేందుకు వీలుపడటం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈవో ప్రసాదరావు మాట్లాడుతూ మైదానాన్ని చదును చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. చిన్నపాటి వర్షం కురిసినా జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి క్రీడామైదానం చిత్తడిగా మారుతోంది. కనీసం వాకింగ్‌ చేసేందుకు సైతం వీలుపడని విధంగా తయారవుతోంది. మైదానం చదును చేయకుండా విడిచిపెట్టడంతో లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఇంకేవరకు సాధన చేసేందుకు వీలుపడటం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈవో ప్రసాదరావు మాట్లాడుతూ మైదానాన్ని చదును చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
3/10
మన్యంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలులతో అరటి, మొక్కజొన్న పంటలు పాడవడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలంలోని బాసంగి గ్రామంలో ఎం.రామినాయుడుకు చెందిన పూరిపాకపై పెద్ద చెట్టు కూలింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. రాత్రిపూట పడి ఉంటే ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పాక కూలిపోయిందని, ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మన్యంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలులతో అరటి, మొక్కజొన్న పంటలు పాడవడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలంలోని బాసంగి గ్రామంలో ఎం.రామినాయుడుకు చెందిన పూరిపాకపై పెద్ద చెట్టు కూలింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. రాత్రిపూట పడి ఉంటే ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పాక కూలిపోయిందని, ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
4/10
గరుగుబిల్లి మండలం రావివలసలో వైఆర్వీ గణపతిరావు(శర్మ పంతులు) ఇంట్లో ఉన్న పూలమొక్క ఇది. రెండేళ్ల క్రితం నాటిన తీగజాతి మొక్క నేడు పసుపు వర్ణంలో పూల తోరణంతో ఇల్లంతా అల్లుకొని చూపరులను ఇలా కనువిందు చేస్తోంది. అలమండ తీగ జాతికి చెందిన ఈ మొక్కను పార్వతీపురం నుంచి తీసుకువచ్చానని, గతేడాది ఎలాంటి పూలు పూయలేదని, ఈ సారి వేల సంఖ్యలో పూసి ఆకట్టుకుంటోందని గణపతిరావు తెలిపారు. గరుగుబిల్లి మండలం రావివలసలో వైఆర్వీ గణపతిరావు(శర్మ పంతులు) ఇంట్లో ఉన్న పూలమొక్క ఇది. రెండేళ్ల క్రితం నాటిన తీగజాతి మొక్క నేడు పసుపు వర్ణంలో పూల తోరణంతో ఇల్లంతా అల్లుకొని చూపరులను ఇలా కనువిందు చేస్తోంది. అలమండ తీగ జాతికి చెందిన ఈ మొక్కను పార్వతీపురం నుంచి తీసుకువచ్చానని, గతేడాది ఎలాంటి పూలు పూయలేదని, ఈ సారి వేల సంఖ్యలో పూసి ఆకట్టుకుంటోందని గణపతిరావు తెలిపారు.
5/10
నగరంలోని సీఏఎం హైస్కూలు ప్రాంతంలోని మలుపులో పంట కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఓ వైపు కుంగిపోయింది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  నగరంలోని సీఏఎం హైస్కూలు ప్రాంతంలోని మలుపులో పంట కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఓ వైపు కుంగిపోయింది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
6/10
సరదాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షల బడలిక తీరగానే ఇలా చిందేశారు. మంగళవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ కేంద్రం వద్ద విద్యార్థినులు సందడిగా గడిపారు. సరదాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షల బడలిక తీరగానే ఇలా చిందేశారు. మంగళవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ కేంద్రం వద్ద విద్యార్థినులు సందడిగా గడిపారు.
7/10
నగరంలో 50 చెరువుల సుందరీకరణకు తొలి అడుగు పడింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బిల్డర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించి ఖాజాగూడ చెరువు వద్ద మంగళవారం వారికి ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు ఖాజాగూడ తటాకంలో డ్రోన్‌ ద్వారా దోమలు, లార్వా నివారణ మందు చల్లించారు. నగరంలో 50 చెరువుల సుందరీకరణకు తొలి అడుగు పడింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బిల్డర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించి ఖాజాగూడ చెరువు వద్ద మంగళవారం వారికి ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు ఖాజాగూడ తటాకంలో డ్రోన్‌ ద్వారా దోమలు, లార్వా నివారణ మందు చల్లించారు.
8/10
పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా.. ఫ్రాన్స్‌లో మిన్నంటిన ఆందోళనలు పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా.. ఫ్రాన్స్‌లో మిన్నంటిన ఆందోళనలు
9/10
 అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో భిన్నమైన వాతావరణం పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. వేసవిలోనూ మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం వరకూ ఎండ కాస్తోంది. ఆ తర్వాత వర్షం పడుతోంది. చెరువులవెనం, లంబసింగిలో పొగమంచును ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో భిన్నమైన వాతావరణం పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. వేసవిలోనూ మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం వరకూ ఎండ కాస్తోంది. ఆ తర్వాత వర్షం పడుతోంది. చెరువులవెనం, లంబసింగిలో పొగమంచును ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా వస్తున్నారు.
10/10
నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో తెలుగుతల్లి   ఫ్లైఓవర్‌ కింద ఇన్నాళ్లు ఉన్న డివైడర్‌ను తొలగించి ఇలా రోడ్డు వేస్తున్నారు. నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ కింద ఇన్నాళ్లు ఉన్న డివైడర్‌ను తొలగించి ఇలా రోడ్డు వేస్తున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు