News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(30-03-2023)

Updated : 30 Mar 2023 22:20 IST
1/25
శ్రీరామనవమిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండరామచంద్రస్వామి దేవస్థానంలో కల్యాణం జరిపించారు. ఈ కల్యాణోత్సవానికి జిల్లా ఉన్నతాధికారులు, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండరామచంద్రస్వామి దేవస్థానంలో కల్యాణం జరిపించారు. ఈ కల్యాణోత్సవానికి జిల్లా ఉన్నతాధికారులు, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.
2/25
ప్రధాని నరేంద్ర మోదీ నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్‌ భవనాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఆరా తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్‌ భవనాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఆరా తీశారు.
3/25
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాముల‌వారు హ‌నుమంత వాహ‌నంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాముల‌వారు హ‌నుమంత వాహ‌నంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
4/25
సినీనటి త్రిష తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. ఆమె నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. సినీనటి త్రిష తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. ఆమె నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
5/25
తెలంగాణ సచివాలయం సమీపంలో తుదిమెరుగులు దిద్దుకుంటున్న 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఫొటోను ఎమ్మెల్సీ కవిత తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దేశ పౌరులకు తమ విధుల్ని, బాధ్యతలను గుర్తు చేయడానికి అంబేడ్కర్‌ అంత ఎత్తున ఉన్నారని తెలుపుతూ ఆమె పోస్టు పెట్టారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం సమీపంలో తుదిమెరుగులు దిద్దుకుంటున్న 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఫొటోను ఎమ్మెల్సీ కవిత తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దేశ పౌరులకు తమ విధుల్ని, బాధ్యతలను గుర్తు చేయడానికి అంబేడ్కర్‌ అంత ఎత్తున ఉన్నారని తెలుపుతూ ఆమె పోస్టు పెట్టారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
6/25
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కోఠి వరకు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలిచవచ్చి స్వామివారిని దర్శించకున్నారు. దారిపొడవునా స్వామివారి నామస్మరణ చేశారు. మరోవైపు అంబర్‌పేటలో శోభాయాత్ర ఘనంగా సాగింది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కోఠి వరకు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలిచవచ్చి స్వామివారిని దర్శించకున్నారు. దారిపొడవునా స్వామివారి నామస్మరణ చేశారు. మరోవైపు అంబర్‌పేటలో శోభాయాత్ర ఘనంగా సాగింది.
7/25
బేగం బజార్‌లో.. బేగం బజార్‌లో..
8/25
రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. చిత్రబృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోను పంచుకుంది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. చిత్రబృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోను పంచుకుంది.
9/25
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అక్కడి సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అక్కడి సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
10/25
అయోధ్యలో భక్తజన సందోహం అయోధ్యలో భక్తజన సందోహం
11/25
సినీనటుడు నిఖిల్.. హిందుస్థాన్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఓటీటీ ప్లే ఛేంజ్‌మేకర్‌ అవార్డ్స్‌ 2023’ ప్రదానోత్సవంలో ‘ట్రయల్‌ బ్లేజర్ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ‘కార్తికేయ2’ సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.. సినీనటుడు నిఖిల్.. హిందుస్థాన్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఓటీటీ ప్లే ఛేంజ్‌మేకర్‌ అవార్డ్స్‌ 2023’ ప్రదానోత్సవంలో ‘ట్రయల్‌ బ్లేజర్ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ‘కార్తికేయ2’ సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది..
12/25
ఐపీఎల్‌ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోషూట్‌లో పాల్గొని సందడి చేశారు. ఐపీఎల్‌ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోషూట్‌లో పాల్గొని సందడి చేశారు.
13/25
హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌లో వృద్ధ దంపతులు 50 ఏళ్లుగా ఏటా తమ ఇంట్లో శ్రీరామనవమి రోజున సీతారామ కల్యాణం చేస్తూ భక్తిని చాటుతున్నారు. హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌లో వృద్ధ దంపతులు 50 ఏళ్లుగా ఏటా తమ ఇంట్లో శ్రీరామనవమి రోజున సీతారామ కల్యాణం చేస్తూ భక్తిని చాటుతున్నారు.
14/25
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అందుకున్న గేయ రచయిత చంద్రబోస్.. ‘భోళా శంకర్‌’ సినిమా సెట్స్‌లో ప్రముఖ సినీనటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని కొనియాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అందుకున్న గేయ రచయిత చంద్రబోస్.. ‘భోళా శంకర్‌’ సినిమా సెట్స్‌లో ప్రముఖ సినీనటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని కొనియాడారు.
15/25
భారతీయ లఘు చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ సినిమా బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన వారికి అభినందనలు తెలిపారు. భారతీయ లఘు చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ సినిమా బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన వారికి అభినందనలు తెలిపారు.
16/25
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు. సమావేశం అనంతరం సీఎం దిల్లీ పర్యటనను ముగించుకొని విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు. సమావేశం అనంతరం సీఎం దిల్లీ పర్యటనను ముగించుకొని విజయవాడ బయల్దేరి వెళ్లారు.
17/25
రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
18/25
సినీనటి ఐశ్వర్యలక్ష్మి తాజా ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఆమె నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. సినీనటి ఐశ్వర్యలక్ష్మి తాజా ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఆమె నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
19/25
శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో రాముడి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో రాముడి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
20/25
పుత్తూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా దంపతులు రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పుత్తూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా దంపతులు రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
21/25
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ శ్రీరామ నవమి సందర్భంగా పూజలో పాల్గొన్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’
ధర్మం మూర్తీభవించిన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు. తాను రక్షిస్తానని అభయమిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరగకుండా రక్షించగల కరుణారసమూర్తికి శ్రీరామనవమి వేడుకల వేళ భక్తిపూర్వకంగా ప్రణతులర్పిస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ శ్రీరామ నవమి సందర్భంగా పూజలో పాల్గొన్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ ధర్మం మూర్తీభవించిన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు. తాను రక్షిస్తానని అభయమిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరగకుండా రక్షించగల కరుణారసమూర్తికి శ్రీరామనవమి వేడుకల వేళ భక్తిపూర్వకంగా ప్రణతులర్పిస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
22/25
గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’. సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘రామ నామమే జయం.. రామబాణమే విజయం!’ అని పోస్టు పెట్టింది. గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’. సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘రామ నామమే జయం.. రామబాణమే విజయం!’ అని పోస్టు పెట్టింది.
23/25
ప్రభాస్‌, కృతి సనన్‌ జంటగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, కృతి సనన్‌ జంటగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
24/25
నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’ నేడు విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా నటీనటులు, చిత్రబృందం కేకు కోసి వేడుకలు చేసుకున్నారు. నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’ నేడు విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా నటీనటులు, చిత్రబృందం కేకు కోసి వేడుకలు చేసుకున్నారు.
25/25
యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారి పల్లిలో తెదేపా హయాంలో ప్రారంభించిన కియా కార్‌ కంపెనీ వద్ద సెల్ఫీ దిగుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.
యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారి పల్లిలో తెదేపా హయాంలో ప్రారంభించిన కియా కార్‌ కంపెనీ వద్ద సెల్ఫీ దిగుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు