News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(01-04-2023)

Updated : 01 Apr 2023 12:32 IST
1/16
  ఏప్రిల్‌ రెండో తేదీన సింహగిరిపై అప్పన్న స్వామి రథోత్సవం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహాచల క్షేత్రాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆ దేదీప్య కాంతులు భక్తులను ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. 

2/16
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం బంద్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా పుస్తకాలకు టాటా చెప్పి ద్విచక్రవాహనంపై ఇలా పొలానికి బయలుదేరి వెళ్తున్నారు. అనంతగిరి మండలం శివలింగాపురం సమీపంలో కనిపించిన దృశ్యమిది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం బంద్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా పుస్తకాలకు టాటా చెప్పి ద్విచక్రవాహనంపై ఇలా పొలానికి బయలుదేరి వెళ్తున్నారు. అనంతగిరి మండలం శివలింగాపురం సమీపంలో కనిపించిన దృశ్యమిది.
3/16
 అనకాపల్లి జిల్లాలోని నర్సయ్యపేటకు చెందిన జగనన్న లేఅవుట్‌లో రహదారిని ఆనుకొని ఓ లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టారు. విద్యుత్తు స్తంభం కలిపేసి కట్టడంతో ఇంటి మెట్లపైకి వచ్చింది. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.

4/16
  ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించడమే కొంత కష్టం. అలాంటిది వాహనం చుట్టూ మిరప బస్తాలు... దానిపైనా మరో వ్యక్తి కూర్చుని ఇలా ప్రయాణం చేస్తున్నారు. వెనక వైపు నుంచి చూస్తే చోదకుడు కనిపించటం లేదు. వెనక కూర్చున్న వ్యక్తే నడుపుతున్నారా? అన్నట్టుగా ఉంది. ఈ దృశ్యం ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల సమీపంలో సాగర్‌ కాలువ వద్ద కెమెరాకు చిక్కింది. ఈ తరహా ప్రయాణం సురక్షితం కాకపోయినా రహదారిపై ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.

5/16
 ఆదిలాబాద్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న డైట్‌ మైదానం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఉదయం, సాయంత్రం పట్టణవాసులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు నడక సాధన చేస్తారు. ప్రస్తుతం ఈ మైదానం పశువుల పేడ, మందుబాబుల ఆగడాలతో కంపుకొడుతోంది. మందుబాబులు తాగిన సీసాలను పగులగొడుతున్నారు. దీంతో అడుగువేయలేని పరిస్థితి నెలకొంది..

6/16
   హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ మీదుగా వెళ్లే వరంగల్‌ జాతీయ రహదారి హరిత శోభతో ఆకట్టుకుంటోంది. రోడ్డు మధ్యలోని విభాగినిలో నాటిన పూలమొక్కలు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులకు అవి ఆహ్లాదం కలిగిస్తున్నాయి.

7/16
 సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ శుక్రవారం  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆమె సరికొత్త డిజైన్ల ఆభరణాలు ధరించి హొయలు పోయారు. 

8/16
  ప్రముఖ నృత్య కళాకారుడు, కళా నిపుణుడు ఆనంద శంకర్‌ జయంత్‌ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లోని  మాదాపూర్‌ సీసీఆర్‌టీలో రామాయణ కల్పవృక్షం సాంస్కృతికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. 

9/16
సూరీడు ఠారెత్తిస్తున్నాడు. శుక్రవారం నగరంలో భానుడి భగభగలతో వీధుల్లో జనసంచారం తగ్గింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో  హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, సాగర్‌ రోడ్డు అండర్‌పాస్‌ మార్గం  వాహనాలరద్దీ లేక వెలవెలబోయింది. మరోవైపు పెద్ద అంబర్‌పేట పసుమాముల ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో ఎండమావులు కనిపించాయి. 

10/16
   హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఫిబ్రవరిలో ఫార్ములా రేస్‌ సందర్భంగా ఆగమేఘాల మీద ట్రాక్‌ నిర్మించారు. రెండు నెలలు గడిచిందో లేదో  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కేబుళ్లు, వరద పైపులైను నిర్మాణానికి రహదారి తవ్వకాలు మొదలుపెట్టారు. యంత్రాంగ అనాలోచిత నిర్ణయంతో నిధుల వృధా ఒక ఎత్తయితే.. రోజూ రాత్రి అక్కడ జరిగే మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ చూసేందుకు వచ్చే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. 

11/16
   హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట నో పార్కింగ్‌ బోర్డు పెట్టారు. కొందరు వాహనదారులు దాన్ని లెక్కచేయకుండా వాహనాల్ని నిలిపి ఉంచుతున్నారు. ఠాణా ఎదుటే పరిస్థితి ఇలా ఉంటే రహదారుల పక్కన ఇక చెప్పక్కర్లేదని పలువురు వాపోతున్నారు. 

12/16
  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఒలింపిక్‌ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈత కొలనును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కజకిస్థాన్‌ నుంచి వచ్చిన ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ ఈత బృందం ప్రదర్శించిన అద్భుత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నీటిపై తేలుతూ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్, ఆక్వాటిక్‌ ఏరోబిక్స్‌తో అదరగొట్టారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఒలింపిక్‌ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈత కొలనును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కజకిస్థాన్‌ నుంచి వచ్చిన ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ ఈత బృందం ప్రదర్శించిన అద్భుత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నీటిపై తేలుతూ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్, ఆక్వాటిక్‌ ఏరోబిక్స్‌తో అదరగొట్టారు.
13/16
  హైదరాబాద్‌ నగరంలోని జూపార్కు సమీపంలో ఉన్న మ్యూజియంలో.. హెల్మెట్, క్రికెట్‌ బ్యాట్, డైనింగ్‌ టేబుల్, డబుల్‌ డెక్కర్‌.. తదితర ఆకృతుల్లో తయారుచేసిన వాహనాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పలు పాఠశాలల చిన్నారులు ఇక్కడికి విచ్చేసి సందడి చేస్తున్నారు. 

14/16
15/16
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ట్రక్కును ఢీకొన్న అనంతరం వంతెనపై ప్రమాదకరంగా నిలిచిపోయిన మరో ట్రక్కు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

16/16
  ఉత్తరాఖండ్‌ నైనితాల్‌ జిల్లాలోని రాంనగర్‌ పట్టణంలో శుక్రవారం వర్షాల కారణంగా పొంగిన ఓ కాలువలో చిక్కుకున్న బస్సు. ఇందులోని 27 మంది ప్రయాణికులను స్థానికులు రక్షించారు.

మరిన్ని