News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(02-04-2023)

Updated : 02 Apr 2023 12:29 IST
1/11
 రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా.. ఇటు వాహనదారులు, అటు ప్రజలు తమ తీరును మార్చుకోవడం లేదు. రహదారి నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వాడ్యాల శివారులో జాతీయ రహదారి-167పై ట్రాక్టరు ఇంజిన్‌ వెనుక భాగంలో మహిళలు ప్రమాదకరంగా కూర్చుని వెళ్తున్న దృశ్యమిది. రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా.. ఇటు వాహనదారులు, అటు ప్రజలు తమ తీరును మార్చుకోవడం లేదు. రహదారి నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వాడ్యాల శివారులో జాతీయ రహదారి-167పై ట్రాక్టరు ఇంజిన్‌ వెనుక భాగంలో మహిళలు ప్రమాదకరంగా కూర్చుని వెళ్తున్న దృశ్యమిది.
2/11
 నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ పట్టణంలో కోతులను పట్టిస్తున్నామంటూ బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తొలగడం లేదు. ప్రత్యేక బృందాలు రప్పించి బోన్లు ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోతులతో ఇబ్బందులు పడుతున్నామని, వెంట పడటంతో పలువురు గాయాలపాలవుతున్నారని వాపోతున్నారు.

3/11
 నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం నుంచి టోకెన్‌ పద్ధతి అమలు చేస్తున్నారు. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు రావడంతో అభ్యర్థులు గ్రంథాలయాల బాట పట్టారు. రోజు ఇక్కడికి 500 మంది వరకు వస్తున్నారు. ఆచూకీ విభాగంలో కేవలం 50 మంది మాత్రమే చదువుకునేందుకు వీలుంది.  దీన్ని దృష్టిలో ఉంచుకొని   నిర్వాహకులు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వాటిని దక్కించుకోవడానికి అభ్యర్థులు ఉదయం ఐదు గంటలకే వచ్చి వరుసలో నిలబడుతున్నారు.

4/11
  మన్యం ప్రాంతమంతా పచ్చని చెట్లతోనూ. రంగురంగుల పుష్పాలతో పులకింపజేస్తోంది. చెట్టుచెట్టుకూ ఓ అందం కన్పిస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా  అనంతగిరి మండలం చిలకలగెడ్డ నుంచి కొండపై నున్న అనంతగిరి వరకు మార్గమధ్యంలో రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రకృతి సంపద సందర్శకుల్ని రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంది.

5/11
 చిలుక జాతి గువ్వల సవ్వడి ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తోంది. మైసూరుకు సమీపంలోని కావేరి తీరంలో ఇపుడిలాంటి పక్షుల సవ్వడి అంతా ఇంతా కాదు. కేవలం చెదపురుగులు, ఆకులపై కనిపించే వ్యర్థాలను ఆరగించే ఈ గువ్వలను చూడటానికి జనం ఆసక్తి చూపుతున్నారు.

6/11
 సరకు రవాణా వాహనాల్లో ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని పోలీసులు తరచూ చోదకులకు అవగాహన కల్పిస్తున్నా.. ఏ మాత్రం మార్పు రావడం లేదు.అనంతపురం జిల్లాలోని  బుక్కరాయసముద్రం పరిధిలోని వెంకటాపురం గ్రామ శివారులో అరటికాయల లోడుతో వెళ్తున్న వాహనం కూలీలను  పైభాగంలో ప్రమాదకరంగా ఎక్కించుకుని ఇలా ప్రయాణిస్తున్నారు. పైన కూర్చున్న కూలీలకు విద్యుత్తు తీగలు తగిలే ప్రమాదం ఉంది.

7/11
  నల్గొండ జిల్లాకేంద్రం మిర్యాలగూడ రోడ్‌లో గొల్లగూడ వద్ద గల నీలగిరి నందనవనం పార్కులో గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత కళారూపాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి కళ తప్పాయి. ఈ పార్కుకు వేసవి సెలవుల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో సందర్శనకు వస్తుంటారు. కళారూపాలను అందంగా ముస్తాబు చేసి.. సందర్శకులకు ఆకట్టుకునేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. 

8/11
 తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న చేతికందొచ్చింది. పొత్తులు ఆరబెట్టేందుకు అవసరమైన స్థలం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. సీతానగరం మండలం వంగలపూడి శ్మశానవాటికలోని సమాధుల మధ్యలోనే మొక్కజొన్న ఆరబెట్టుకుని అక్కడే రైతులు పడుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు వచ్చి సరకు కొనుగోలు చేసేవరకు శ్మశానంలోనే సరకు భద్రపరుచుకుంటున్నారు. రైతుల ఫలసాయం కోసం అవసరమైన గోదాములు నిర్మాణాలు లేక అవస్థలు పడుతున్నారు.  

9/11
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం కనులపండువ చేసింది. శ్రీరామ నామాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రథం లాగేందుకు భక్తులు అమితాసక్తి చూపారు.

10/11
 రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం (ఎన్‌ఎంఏసీసీ) ప్రారంభోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఈ సాంస్కృతిక కేంద్రంలో 2,000 మంది పట్టే థియేటర్, 250 సీట్ల సామర్థ్యమున్న అత్యాధునిక స్టూడియో, 125 సీట్ల సామర్థ్యమున్న క్యూబ్‌లు ఉన్నాయి.

11/11
 ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ‘ఆంటోనోవ్‌ ఏఎన్‌-225’. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ధ్వంసమై ప్రస్తుతం ఇలా తయారైంది.

మరిన్ని