News In Pics: చిత్రం చెప్పే సంగతులు(21-11-2023)

Updated : 21 Nov 2023 03:35 IST
1/10
విశాఖపట్నం: పుల్లంగి పంచాయతీ పరిధిలోని అందాలకు నెలవైన ‘గుడిస కొండ’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని తిలకించేందుకు గుడిస కొండపైకి సందర్శకులు ‘క్యూ’ కడుతున్నారు. కొండపై సూర్యోదయం అందాలను చరవాణిల్లో బంధించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. విశాఖపట్నం: పుల్లంగి పంచాయతీ పరిధిలోని అందాలకు నెలవైన ‘గుడిస కొండ’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని తిలకించేందుకు గుడిస కొండపైకి సందర్శకులు ‘క్యూ’ కడుతున్నారు. కొండపై సూర్యోదయం అందాలను చరవాణిల్లో బంధించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
2/10
ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం డొల్లార సమీపంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నదిలో భక్తులు సోమవారం సూర్య షష్ఠిపూజ నిర్వహించారు. మార్వాడి సమాజ్‌ మహిళలు పెన్‌గంగ నదికి వచ్చారు. నదిలో స్నానమాచరించి నదీమ తల్లికి దీపారాధన చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం డొల్లార సమీపంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నదిలో భక్తులు సోమవారం సూర్య షష్ఠిపూజ నిర్వహించారు. మార్వాడి సమాజ్‌ మహిళలు పెన్‌గంగ నదికి వచ్చారు. నదిలో స్నానమాచరించి నదీమ తల్లికి దీపారాధన చేశారు.
3/10
అనంతపురం: ప్రశాంతి నిలయం విద్యుత్తు కాంతులతో దివ్యతేజోమయంగా విరాజిల్లుతోంది. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు, విగ్రహాలు, పుష్పాలు భక్తులు, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అనంతపురం: ప్రశాంతి నిలయం విద్యుత్తు కాంతులతో దివ్యతేజోమయంగా విరాజిల్లుతోంది. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు, విగ్రహాలు, పుష్పాలు భక్తులు, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
4/10
ప్రకాశం: కార్తిక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వేకువజామునే ఆయా ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రకాశం: కార్తిక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వేకువజామునే ఆయా ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
5/10
అనంతపురం: తాడిపత్రి పట్టణంలో సోమవారం కార్తిక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెన్నానది ఒడ్డున ఉన్న బుగ్గరామలింగేశ్వర ఆలయంలో స్వామితోపాటు రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతపురం: తాడిపత్రి పట్టణంలో సోమవారం కార్తిక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెన్నానది ఒడ్డున ఉన్న బుగ్గరామలింగేశ్వర ఆలయంలో స్వామితోపాటు రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు చేశారు.
6/10
7/10
అమరావతి: శివ శివ శంకర.. భక్తవ శంకర స్మరణ మిన్నంటింది. భక్తజనులు సోమవారం... వేకువనే కృష్ణమ్మ చెంతన పుణ్యస్నానాలు చేసి.. కార్తిక దీపాలు వెలిగించి... భక్తితో శివయ్యకు ప్రణమిల్లారు. యనమలకుదురులోని రామలింగేశ్వరుడి సన్నిధిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమరావతి: శివ శివ శంకర.. భక్తవ శంకర స్మరణ మిన్నంటింది. భక్తజనులు సోమవారం... వేకువనే కృష్ణమ్మ చెంతన పుణ్యస్నానాలు చేసి.. కార్తిక దీపాలు వెలిగించి... భక్తితో శివయ్యకు ప్రణమిల్లారు. యనమలకుదురులోని రామలింగేశ్వరుడి సన్నిధిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
8/10
కర్నూలు: శ్రీశైల మహాక్షేత్రం కార్తిక దీప కాంతులతో అలరారింది. కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం కార్తికదీపాలతో కాంతులీనింది. కర్నూలు: శ్రీశైల మహాక్షేత్రం కార్తిక దీప కాంతులతో అలరారింది. కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం కార్తికదీపాలతో కాంతులీనింది.
9/10
హైదరాబాద్‌: చంపాపేటలో ప్రచారం నిర్వహించిన ఎల్‌బీ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్‌ యువ ఓటర్లకు కరపత్రాలు అందిస్తున్న దృశ్యం. హైదరాబాద్‌: చంపాపేటలో ప్రచారం నిర్వహించిన ఎల్‌బీ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్‌ యువ ఓటర్లకు కరపత్రాలు అందిస్తున్న దృశ్యం.
10/10
హైదరాబాద్‌: ఎన్నికల వేళ వారం రోజులుగా వీరంతా కూడళ్లలో ఓటర్లను చైతన్యపరిచే గోడ పత్రికలు అతికిస్తూ, కరపత్రాలు పంచుతున్నారు. ‘జై భారత్‌’ సంస్థ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్నికల సందర్భాల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌: ఎన్నికల వేళ వారం రోజులుగా వీరంతా కూడళ్లలో ఓటర్లను చైతన్యపరిచే గోడ పత్రికలు అతికిస్తూ, కరపత్రాలు పంచుతున్నారు. ‘జై భారత్‌’ సంస్థ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్నికల సందర్భాల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

మరిన్ని