News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 11 May 2022 07:55 IST
1/11
మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. కర్నూలులోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా 

చూసేందుకు విశ్వక్‌సేన్ వచ్చారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనతో కరచాలనం చేసి.. సెల్ఫీలు తీసుకున్నారు. 
మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. కర్నూలులోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా చూసేందుకు విశ్వక్‌సేన్ వచ్చారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనతో కరచాలనం చేసి.. సెల్ఫీలు తీసుకున్నారు.
2/11
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. 

 ప్రతి ఇంటికీ తిరుగుతూ వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో పలు చోట్ల 

రహదారులపై నిలిచిన వర్షపు నీరు, బురద దాటుకునేందుకు వారు అవస్థలు పడ్డారిలా.. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో పలు చోట్ల రహదారులపై నిలిచిన వర్షపు నీరు, బురద దాటుకునేందుకు వారు అవస్థలు పడ్డారిలా..
3/11
4/11
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన తాజా చిత్రం జయేశ్‌భాయ్‌ జోర్దార్‌. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ 

సందర్భంగా ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా గుజరాతీ థాలి రుచి 

చూశారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన తాజా చిత్రం జయేశ్‌భాయ్‌ జోర్దార్‌. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా గుజరాతీ థాలి రుచి చూశారు.
5/11
లాంగ్ జంప్‌ విన్నాం.. హై జంప్‌ విన్నాం.. కానీ, ఈ కూల్ జంప్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం 

కొందరు ఇలా కూల్‌ జంప్‌ చేశారు. అదేనండీ నీళ్లలో దూకి ఈత కొట్టారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది వద్ద 

కనిపించింది ఈ దృశ్యం. లాంగ్ జంప్‌ విన్నాం.. హై జంప్‌ విన్నాం.. కానీ, ఈ కూల్ జంప్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం కొందరు ఇలా కూల్‌ జంప్‌ చేశారు. అదేనండీ నీళ్లలో దూకి ఈత కొట్టారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది వద్ద కనిపించింది ఈ దృశ్యం.
6/11
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 28వ రోజుకు చేరింది. షాద్‌నగర్‌ 

నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్ర
లో భాగంగా సంతాపూర్‌ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 

స్థానికులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 28వ రోజుకు చేరింది. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్ర లో భాగంగా సంతాపూర్‌ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు.
7/11
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వీస్తున్న గాలులకు మోపిదేవి మండలంలో నేలకొరిగిన అరటి చెట్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వీస్తున్న గాలులకు మోపిదేవి మండలంలో నేలకొరిగిన అరటి చెట్లు
8/11
వేసవి నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ప్రజలకు సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఓ మహిళ ఇలా ఎండలోనే 

కూర్చొని బోరు నుంచి వచ్చే నీటిని బిందెల్లో నింపుతూ కనిపించింది. వేసవి నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ప్రజలకు సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఓ మహిళ ఇలా ఎండలోనే కూర్చొని బోరు నుంచి వచ్చే నీటిని బిందెల్లో నింపుతూ కనిపించింది.
9/11
తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా ఎమ్మెల్యే భూమన 

కరుణాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ కుటుంబ సమేతంగా సారె తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.  తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ కుటుంబ సమేతంగా సారె తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.
10/11
శ్రీలంకలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకారులను అదుపు చేయడమే లక్ష్యంగా శ్రీలంక రక్షణశాఖ సంచలన 

ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం, విధ్వంసానికి పాల్పడటం, ఇతరులకు హాని చేయడం వంటి చర్యలకు దిగేవారిపై 

కాల్పులు జరిపేందుకు సైన్యం, వాయుసేన, నౌకాదళం సిబ్బందికి అవసరమైన అధికారులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో 

కొలంబోలోని వీధుల్లో సైనికులు యుద్ధ ట్యాంకులపై తిరుగుతూ ఇలా గస్తీ కాస్తున్నారు. శ్రీలంకలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకారులను అదుపు చేయడమే లక్ష్యంగా శ్రీలంక రక్షణశాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం, విధ్వంసానికి పాల్పడటం, ఇతరులకు హాని చేయడం వంటి చర్యలకు దిగేవారిపై కాల్పులు జరిపేందుకు సైన్యం, వాయుసేన, నౌకాదళం సిబ్బందికి అవసరమైన అధికారులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొలంబోలోని వీధుల్లో సైనికులు యుద్ధ ట్యాంకులపై తిరుగుతూ ఇలా గస్తీ కాస్తున్నారు.
11/11
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌ జూలో ఓ సింహం వద్ద మంచు గడ్డను ఉంచారు అక్కడి సిబ్బంది. దీంతో ఆ 

సింహం మంచు గడ్డతో ఆడుకుంటూ, దానిపై తలపెట్టి ఇలా సేదతీరింది. ఈ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌ జూలో ఓ సింహం వద్ద మంచు గడ్డను ఉంచారు అక్కడి సిబ్బంది. దీంతో ఆ సింహం మంచు గడ్డతో ఆడుకుంటూ, దానిపై తలపెట్టి ఇలా సేదతీరింది. ఈ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేశాయి.

మరిన్ని