News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 12 May 2022 07:32 IST
1/14
 తిరుమల నారాయణగిరి ఉద్యానంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం ముగిసింది. తొలుత గరుడ 

వాహనంపై మలయప్పస్వామిని అధిరోహింపజేసి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేర్వేరుగా పల్లకీల్లో మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. 

ఎదుర్కోలు ఉత్సవం, పూల బంతాట సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పరిణయోత్సవం కనులపండువగా చేశారు. తిరుమల నారాయణగిరి ఉద్యానంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం ముగిసింది. తొలుత గరుడ వాహనంపై మలయప్పస్వామిని అధిరోహింపజేసి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేర్వేరుగా పల్లకీల్లో మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎదుర్కోలు ఉత్సవం, పూల బంతాట సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పరిణయోత్సవం కనులపండువగా చేశారు.
2/14
ఉత్తర మెసిడోనియాలోని క్రివోలక్‌ ఆర్మీ ట్రైనింగ్‌ పాలిగాన్‌లో ‘స్విఫ్ట్‌ రెస్పాన్స్‌ 22’ పేరిట నాటో బలగాలు సైనిక విన్యాసాలు ప్రదర్శించాయి. 

అందులో భాగంగా ఇలా చినూక్‌ హెలికాప్టర్‌తో ఓ హోవిట్జర్‌, ట్రక్‌ను మోసుకెళ్లారు. అల్బేనియా, ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇటలీ, ఉత్తర మెసిడోనియా, 

మోంటెనెగ్రో, యూకే, యూఎస్‌ తదితర దేశాల నుంచి 4600 మంది సైనికులు పాల్గొన్నారు.  ఉత్తర మెసిడోనియాలోని క్రివోలక్‌ ఆర్మీ ట్రైనింగ్‌ పాలిగాన్‌లో ‘స్విఫ్ట్‌ రెస్పాన్స్‌ 22’ పేరిట నాటో బలగాలు సైనిక విన్యాసాలు ప్రదర్శించాయి. అందులో భాగంగా ఇలా చినూక్‌ హెలికాప్టర్‌తో ఓ హోవిట్జర్‌, ట్రక్‌ను మోసుకెళ్లారు. అల్బేనియా, ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇటలీ, ఉత్తర మెసిడోనియా, మోంటెనెగ్రో, యూకే, యూఎస్‌ తదితర దేశాల నుంచి 4600 మంది సైనికులు పాల్గొన్నారు.
3/14
ఆదిలాబాద్ పట్టణం 42వ వార్డులోని ప్రధాన రహదారిపై విద్యుత్తు స్తంభం ఒరిగిపోయింది. దీంతో తీగలు చేతికి అందేంత ఎత్తులో 

ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ సమస్యపై కౌన్సిలర్‌ సతీశ్‌ విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. 

ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ పట్టణం 42వ వార్డులోని ప్రధాన రహదారిపై విద్యుత్తు స్తంభం ఒరిగిపోయింది. దీంతో తీగలు చేతికి అందేంత ఎత్తులో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ సమస్యపై కౌన్సిలర్‌ సతీశ్‌ విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
4/14
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చెన్నైలోని ఒమందురర్‌ మెడికల్‌ ఆస్పత్రిలో ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చిత్రపటం వద్ద 

కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న నర్సులు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చెన్నైలోని ఒమందురర్‌ మెడికల్‌ ఆస్పత్రిలో ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చిత్రపటం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న నర్సులు
5/14
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు సమీపంలోని ఓ పామాయిల్ తోటలో భారీ గిరి నాగు హల్ చల్ చేసింది. పామాయిల్ 

తోటలో కూలీలు గెలలను కోస్తుండగా అత్యంత పొడవైన గిరి నాగు కనిపించింది. దాన్ని చూసి అదిరిపోయిన కూలీలు వెంటనే తోట రైతుకు 

చెప్పారు. ఆయన వన్యప్రాణి సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ సభ్యులు వెంకటేశ్‌, మరి 

కొంత మంది సిబ్బంది వచ్చి కొన్ని గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గిరినాగును పట్టుకున్నారు. గిరినాగు దాదాపుగా 13 అడుగుల పొడవు, 

ఆరు కేజీలకు పైగా బరువు ఉందని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు తెలిపారు. అనంతరం దాన్ని వంట్లమామిడి శివారు అటవీ ప్రాంతంలో 

విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు సమీపంలోని ఓ పామాయిల్ తోటలో భారీ గిరి నాగు హల్ చల్ చేసింది. పామాయిల్ తోటలో కూలీలు గెలలను కోస్తుండగా అత్యంత పొడవైన గిరి నాగు కనిపించింది. దాన్ని చూసి అదిరిపోయిన కూలీలు వెంటనే తోట రైతుకు చెప్పారు. ఆయన వన్యప్రాణి సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ సభ్యులు వెంకటేశ్‌, మరి కొంత మంది సిబ్బంది వచ్చి కొన్ని గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గిరినాగును పట్టుకున్నారు. గిరినాగు దాదాపుగా 13 అడుగుల పొడవు, ఆరు కేజీలకు పైగా బరువు ఉందని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు తెలిపారు. అనంతరం దాన్ని వంట్లమామిడి శివారు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
6/14
7/14
ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన పథకాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన భోజనం చేశారు. రోగుల బంధువులతో 

మాట్లాడి భోజనం నాణ్యతపై ఆరా తీశారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన పథకాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన భోజనం చేశారు. రోగుల బంధువులతో మాట్లాడి భోజనం నాణ్యతపై ఆరా తీశారు.
8/14
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

పరిశీలించారు. గీత కార్మికులు సేకరించిన నీరా స్వచ్ఛతను పరిశీలించి రుచి చూశారు. అనంతరం మంత్రి స్వయంగా తాటి ముంజలు కొట్టి 

ఎక్సైజ్‌ కమిషనర్ సర్పరాజ్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే జైపాల్‌రెడ్డి, గీత కార్మికులకు పంచారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. గీత కార్మికులు సేకరించిన నీరా స్వచ్ఛతను పరిశీలించి రుచి చూశారు. అనంతరం మంత్రి స్వయంగా తాటి ముంజలు కొట్టి ఎక్సైజ్‌ కమిషనర్ సర్పరాజ్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే జైపాల్‌రెడ్డి, గీత కార్మికులకు పంచారు.
9/14
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 29వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా 

ఆయన మహేశ్వరం నియోజకవర్గం చిప్పలపల్లి గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 

మహిళా కార్యకర్తల కోరిక మేరకు వారితో ఇలా సెల్ఫీ దిగారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 29వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ఆయన మహేశ్వరం నియోజకవర్గం చిప్పలపల్లి గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మహిళా కార్యకర్తల కోరిక మేరకు వారితో ఇలా సెల్ఫీ దిగారు.
10/14
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంపై ఎగురుతున్న ఓ విమానం.. మబ్బుల చాటున దాక్కున్న చందమామకు టాటా చెబుతున్నట్లుగా కనువిందు 

చేసిందిలా.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంపై ఎగురుతున్న ఓ విమానం.. మబ్బుల చాటున దాక్కున్న చందమామకు టాటా చెబుతున్నట్లుగా కనువిందు చేసిందిలా..
11/14
కరీంనగర్‌లో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. కమిషనరేట్‌ కేంద్రం నుంచి వన్‌ టౌన్‌ వరకు 

కవాతు చేశారు. కరీంనగర్‌లో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. కమిషనరేట్‌ కేంద్రం నుంచి వన్‌ టౌన్‌ వరకు కవాతు చేశారు.
12/14
అసని తుపాను ప్రభావంతో కడపలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసని తుపాను ప్రభావంతో కడపలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
13/14
హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘కాల్‌అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల 

శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోల్ఫ్‌ ఆడారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘కాల్‌అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోల్ఫ్‌ ఆడారు.
14/14
చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. 

అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

దీంతో ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఆ సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఆ సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని