News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 13 May 2022 06:33 IST
1/23
టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ సుదర్శన్‌ శుక్రవారం తిరుమలలోని వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మంటపంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ సుదర్శన్‌ శుక్రవారం తిరుమలలోని వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మంటపంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
2/23
హైదరాబాద్‌ హెచ్ఐ‌సీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్‌ల త్రీడీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆర్థోపెడిక్‌, డెంటల్‌ సహా వివిధ రకాల వైద్య విభాగాల్లో త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా చేసిన పరికరాలు, ఇంప్లాంట్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఓ అస్థిపంజరం నమూనాకు పలువురు ఇలా సరదాగా కరచాలనం ఇస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ హెచ్ఐ‌సీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్‌ల త్రీడీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆర్థోపెడిక్‌, డెంటల్‌ సహా వివిధ రకాల వైద్య విభాగాల్లో త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా చేసిన పరికరాలు, ఇంప్లాంట్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఓ అస్థిపంజరం నమూనాకు పలువురు ఇలా సరదాగా కరచాలనం ఇస్తూ సందడి చేశారు.
3/23
హైదరాబాద్‌ హబ్సిగూడలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రంలో పాఠశాల విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సీసీఎంబీ డైరెక్టర్‌ డా.వినయ్‌ నందికూరి హాజరై చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్‌ హబ్సిగూడలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రంలో పాఠశాల విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సీసీఎంబీ డైరెక్టర్‌ డా.వినయ్‌ నందికూరి హాజరై చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.
4/23
5/23
హైదరాబాద్‌లో శుక్రవారం ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మనోకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘంటసాల మెమోరియల్‌ అవార్డు అందజేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మనోకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘంటసాల మెమోరియల్‌ అవార్డు అందజేశారు.
6/23
రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ బాలుడిని ఇలా ఉత్సాహంగా పలకరిస్తూ కనిపించారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ బాలుడిని ఇలా ఉత్సాహంగా పలకరిస్తూ కనిపించారు.
7/23
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం రామ్‌పూర్‌ సమీపంలోని పట్వాయిలో దేశంలోనే మొదటి ‘అమృత సరోవరాన్ని’ నిర్మించారు. దీన్ని శుక్రవారం కేంద్ర మంత్రి మక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ఉత్తర్‌ప్రదేశ్‌ జలవనరుల శాఖా మంత్రి స్వతంత్రదేవ్‌ సింగ్‌ ప్రారంభించారు. అమృత్‌ సరోవర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని సరస్సులను శుద్ధి చేసి వాటిలో పౌంటేన్లు, విద్యుద్దీపాల కాంతులు, బోటింగ్‌ తదితర హంగుల్ని కల్పిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం రామ్‌పూర్‌ సమీపంలోని పట్వాయిలో దేశంలోనే మొదటి ‘అమృత సరోవరాన్ని’ నిర్మించారు. దీన్ని శుక్రవారం కేంద్ర మంత్రి మక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ఉత్తర్‌ప్రదేశ్‌ జలవనరుల శాఖా మంత్రి స్వతంత్రదేవ్‌ సింగ్‌ ప్రారంభించారు. అమృత్‌ సరోవర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని సరస్సులను శుద్ధి చేసి వాటిలో పౌంటేన్లు, విద్యుద్దీపాల కాంతులు, బోటింగ్‌ తదితర హంగుల్ని కల్పిస్తున్నారు.
8/23
9/23
తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఛత్తీస్‌గఢ్‌ స్పీకర్‌ చరణ్‌దాస్‌ మహంత సందర్శించారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ విచ్చేసిన ఆయనకు తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఛత్తీస్‌గఢ్‌ స్పీకర్‌ చరణ్‌దాస్‌ మహంత సందర్శించారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ విచ్చేసిన ఆయనకు తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
10/23
చెక్‌ రిపబ్లిక్‌లోని దోల్ని మొరవాలో శుక్రవారం ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్‌ బ్రిడ్జి(ఊయల వంతెన)ని ప్రారంభించారు. మొదటి రోజున దీనిపై నడిచేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. వంతెనను సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తులో 721 మీటర్ల(2,365 అడుగుల) పొడవుతో నిర్వహించారు. రెండు పర్వతాల శిఖరాల్ని కలుపుతూ దీన్ని నిర్మించారు. చెక్‌ రిపబ్లిక్‌లోని దోల్ని మొరవాలో శుక్రవారం ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్‌ బ్రిడ్జి(ఊయల వంతెన)ని ప్రారంభించారు. మొదటి రోజున దీనిపై నడిచేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. వంతెనను సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తులో 721 మీటర్ల(2,365 అడుగుల) పొడవుతో నిర్వహించారు. రెండు పర్వతాల శిఖరాల్ని కలుపుతూ దీన్ని నిర్మించారు.
11/23
12/23
దిల్లీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు. దిల్లీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు.
13/23
14/23
హిమాయత్‌నగర్‌ వాసవి శ్రీముఖ కాంప్లెక్స్‌లోని ఐఎన్‌ఐఎఫ్‌డీ(ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌)ను ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌  శైలిఖిత యలమంచిలి, ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ ప్రజ్ఞ అయ్యగారి సందర్శించారు. ఈ సందర్భంగా వారు అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ఫ్యాషన్‌ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలని వారికి సూచించారు. హిమాయత్‌నగర్‌ వాసవి శ్రీముఖ కాంప్లెక్స్‌లోని ఐఎన్‌ఐఎఫ్‌డీ(ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌)ను ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ శైలిఖిత యలమంచిలి, ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ ప్రజ్ఞ అయ్యగారి సందర్శించారు. ఈ సందర్భంగా వారు అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ఫ్యాషన్‌ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలని వారికి సూచించారు.
15/23
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తున్న నవ సంకల్ప చింతన శిబిరానికి హాజరవుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నమస్కరిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు అశోక్‌ గెహ్లోత్‌‌, భూపేశ్‌ బగేల్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తున్న నవ సంకల్ప చింతన శిబిరానికి హాజరవుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నమస్కరిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు అశోక్‌ గెహ్లోత్‌‌, భూపేశ్‌ బగేల్‌
16/23
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మెగిలయ్య సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి, అదనపు డీజీపీ స్వాతి లక్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న కళను మొగిలయ్య కాపాడుతున్న తీరును స్వాతి లక్రా అభినందించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మెగిలయ్య సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి, అదనపు డీజీపీ స్వాతి లక్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న కళను మొగిలయ్య కాపాడుతున్న తీరును స్వాతి లక్రా అభినందించారు.
17/23
విశాఖలో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల వస్ర్తాలు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. విశాఖలో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల వస్ర్తాలు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు.
18/23
కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధులను 

విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఆయనకు వల, సంచి, టోపి బహూకరించారు. కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఆయనకు వల, సంచి, టోపి బహూకరించారు.
19/23
నెల్లూరులో ఓ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి సినీతార పాయల్ రాజ్‌పుత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా దుకాణంలోని విభిన్న 

రకాల చీరలను ఆమె పరిశీలించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. పాయల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.  
నెల్లూరులో ఓ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి సినీతార పాయల్ రాజ్‌పుత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా దుకాణంలోని విభిన్న రకాల చీరలను ఆమె పరిశీలించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. పాయల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
20/23
శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘెను భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘెను భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
21/23
భారత మాజీ రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారత మాజీ రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూలమాల వేసి నివాళులర్పించారు.
22/23
‘తెల్లారింది లెగండోయ్‌..!’ అంటూ భానుడు కొంగను నిద్ర లేపినట్లుగా ఉంది కదూ ఈ చిత్రం. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో కనిపించింది ఈ సూర్యోదయ దృశ్యం. ‘తెల్లారింది లెగండోయ్‌..!’ అంటూ భానుడు కొంగను నిద్ర లేపినట్లుగా ఉంది కదూ ఈ చిత్రం. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో కనిపించింది ఈ సూర్యోదయ దృశ్యం.
23/23
పంట పొలాల్లో కరెంటు తీగలు రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఇటీవల కరీంనగర్లో గాలిదుమారానికి కరెంటు తీగల నుంచి నిప్పురవ్వలు పడటంతో ఓ రైతు పంట పూర్తిగా కాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మమత అనే మహిళా రైతు పొలంలోనూ అదే తరహాలో తీగలు దర్శనమిస్తున్నాయి. అధికారుల దృష్టికి ఈ సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో కరెంటు తీగలు రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఇటీవల కరీంనగర్లో గాలిదుమారానికి కరెంటు తీగల నుంచి నిప్పురవ్వలు పడటంతో ఓ రైతు పంట పూర్తిగా కాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో మమత అనే మహిళా రైతు పొలంలోనూ అదే తరహాలో తీగలు దర్శనమిస్తున్నాయి. అధికారుల దృష్టికి ఈ సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని