News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 14 May 2022 01:34 IST
1/12
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఓ లేయర్‌ కోళ్ల రైతు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు గంగాధర ప్రధాన కూడలిలో ఆటోలో కోడిగుడ్లు తీసుకువచ్చి విక్రయించారు.  రూ. 2కే కోడిగుడ్డు అమ్మడంతో స్థానికులు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. ఒక్కో కుటుంబం కనీసం ఒక ట్రే (30 కోడిగుడ్లు) రూ.60 ఇచ్చి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో గుడ్డు రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డు పరిమాణం చిన్నగా ఉండి దుకాణాదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతు నేరుగా ఆటోలో తీసుకువచ్చి వినియోగదారులకు విక్రయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఓ లేయర్‌ కోళ్ల రైతు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు గంగాధర ప్రధాన కూడలిలో ఆటోలో కోడిగుడ్లు తీసుకువచ్చి విక్రయించారు. రూ. 2కే కోడిగుడ్డు అమ్మడంతో స్థానికులు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. ఒక్కో కుటుంబం కనీసం ఒక ట్రే (30 కోడిగుడ్లు) రూ.60 ఇచ్చి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో గుడ్డు రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డు పరిమాణం చిన్నగా ఉండి దుకాణాదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతు నేరుగా ఆటోలో తీసుకువచ్చి వినియోగదారులకు విక్రయించారు.
2/12
ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరానికి చెందిన వనిపెంట గంగిరెడ్డి అనే రైతు తన  అవసరాలకు ఎలక్ట్రికల్‌ ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నాడు. యూనిట్‌ విద్యుత్తు ఖర్చుతో వంద కి.మీ. తిరుగుతుందని, 25కి.మీ వేగంతో పాటు 150 కిలోల వరకు బరువు లాగే ఈ వాహనంపై పశువులకు గ్రాసంతో పాటు, పంటలకు వేసే ఎరువులు తరలిస్తుంటానని చెబుతున్నాడు ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరానికి చెందిన వనిపెంట గంగిరెడ్డి అనే రైతు తన అవసరాలకు ఎలక్ట్రికల్‌ ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నాడు. యూనిట్‌ విద్యుత్తు ఖర్చుతో వంద కి.మీ. తిరుగుతుందని, 25కి.మీ వేగంతో పాటు 150 కిలోల వరకు బరువు లాగే ఈ వాహనంపై పశువులకు గ్రాసంతో పాటు, పంటలకు వేసే ఎరువులు తరలిస్తుంటానని చెబుతున్నాడు
3/12
సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. ఆమెను తిలకించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరాగా- తాను నెల్లూరుకు రావడం ఇది రెండోసారని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదంటూ.. వారితో ఆమె మాట కలిపారు. సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. ఆమెను తిలకించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరాగా- తాను నెల్లూరుకు రావడం ఇది రెండోసారని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదంటూ.. వారితో ఆమె మాట కలిపారు.
4/12
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలో శుక్రవారం రాత్రి లక్ష్మీనరసింహస్వామికి హనుమత్‌ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోగా- విశేషాలంకరణలో మాడవీధుల్లో విహరిస్తూ స్వామి అభయ ప్రదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం పెంచలస్వామి(బంగారు గరుడ సేవ), జయంతితో పాటు సింహ వాహన సేవ, సహస్రదీపాలంకరణ సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలో శుక్రవారం రాత్రి లక్ష్మీనరసింహస్వామికి హనుమత్‌ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోగా- విశేషాలంకరణలో మాడవీధుల్లో విహరిస్తూ స్వామి అభయ ప్రదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం పెంచలస్వామి(బంగారు గరుడ సేవ), జయంతితో పాటు సింహ వాహన సేవ, సహస్రదీపాలంకరణ సేవలు జరగనున్నాయి.
5/12
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలో జలవనరుల శాఖ క్వార్టర్స్‌లోని ఓ ప్రాంగణంలో పనస చెట్టు విరగకాసింది. చెట్టు కింది నుంచి పై వరకూ పెరిగిన కాయలను చూసి పలువురు వావ్‌ అంటున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలో జలవనరుల శాఖ క్వార్టర్స్‌లోని ఓ ప్రాంగణంలో పనస చెట్టు విరగకాసింది. చెట్టు కింది నుంచి పై వరకూ పెరిగిన కాయలను చూసి పలువురు వావ్‌ అంటున్నారు.
6/12
వేర్లతో సహా పీకి పక్కన పడేసిన వృక్షాలు మళ్లీ చిగురించాయి. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ పెదగరువు గ్రామానికి రహదారి పనుల నిమిత్తం గత ఏడాది సూరిమెట్ట కూడలిలో తుర్రాయి చెట్లను తొలగించారు. ప్రస్తుతం అందులో కొన్ని వృక్షాలు మళ్లీ చిగురించాయి. వేర్లతో సహా పీకి పక్కన పడేసిన వృక్షాలు మళ్లీ చిగురించాయి. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ పెదగరువు గ్రామానికి రహదారి పనుల నిమిత్తం గత ఏడాది సూరిమెట్ట కూడలిలో తుర్రాయి చెట్లను తొలగించారు. ప్రస్తుతం అందులో కొన్ని వృక్షాలు మళ్లీ చిగురించాయి.
7/12
విశాఖలో శుక్రవారం ఓ ప్రచార కార్యక్రమంలో మిస్‌ ఇండియా -2020 విన్నర్‌ మానస వారణాసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నటి యోన్సన్, సహస్ర రెడ్డి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో శుక్రవారం ఓ ప్రచార కార్యక్రమంలో మిస్‌ ఇండియా -2020 విన్నర్‌ మానస వారణాసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నటి యోన్సన్, సహస్ర రెడ్డి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
8/12
నెక్లెస్‌ రోడ్డులోని సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా సందర్శకులతో కిటకిటలాడుతోంది.  శుక్రవారం సాయంత్రం పూరీ తినడంలో పోటీలు నిర్వహించారు. ప్లేట్‌ కంటే విస్తీర్ణంగా ఉన్న నాలుగు పూరీలను చోలేతో ముందుగా తిన్నవారికి రూ.5వేలు నగదు బహుమతి ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది. నెక్లెస్‌ రోడ్డులోని సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా సందర్శకులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం సాయంత్రం పూరీ తినడంలో పోటీలు నిర్వహించారు. ప్లేట్‌ కంటే విస్తీర్ణంగా ఉన్న నాలుగు పూరీలను చోలేతో ముందుగా తిన్నవారికి రూ.5వేలు నగదు బహుమతి ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది.
9/12
నీరు నిలిచిన చోట తారు నిలవదంటారు. తెలిసి కూడా మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో నీరు నిలిచిన చోటే తారు పరిచారు. నీరు నిలిచిన చోట తారు నిలవదంటారు. తెలిసి కూడా మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో నీరు నిలిచిన చోటే తారు పరిచారు.
10/12
చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన ఊయల వంతెన ఇది. 2365 అడుగుల పొడవైన ఈ వంతెనను సముద్రమట్టానికి 1100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించడం విశేషం. లోయలో నుంచి 95 మీట్లర ఎత్తున రెండు పర్వత శిఖరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను శుక్రవారం అధికారికంగా ప్రారంభించడంతో పర్యాటకులు దానిపై నడుస్తూ మురిసిపోయారు. పాదచారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లో కెల్లా ఇదే పొడవైనదని చెబుతున్నారు. చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన ఊయల వంతెన ఇది. 2365 అడుగుల పొడవైన ఈ వంతెనను సముద్రమట్టానికి 1100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించడం విశేషం. లోయలో నుంచి 95 మీట్లర ఎత్తున రెండు పర్వత శిఖరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను శుక్రవారం అధికారికంగా ప్రారంభించడంతో పర్యాటకులు దానిపై నడుస్తూ మురిసిపోయారు. పాదచారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లో కెల్లా ఇదే పొడవైనదని చెబుతున్నారు.
11/12
మీరాలం చెరువు ఉనికి కోల్పోతోంది. 1806లో నిజాం మీర్‌ ఆలం బహదూర్‌ సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన తటాకం నేడు ఆక్రమణలు, వ్యర్థాలతో కుంచించుకుపోతోంది. కాసారం అంతా గుర్రపుడెక్క పరచుకుంది. కొన్ని నివాసాలు చెరువు మధ్యలో ఉండడంతో వరదలు వస్తే అధిక నష్టంవాటిల్లే ప్రమాదం ఉంది. మీరాలం చెరువు ఉనికి కోల్పోతోంది. 1806లో నిజాం మీర్‌ ఆలం బహదూర్‌ సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన తటాకం నేడు ఆక్రమణలు, వ్యర్థాలతో కుంచించుకుపోతోంది. కాసారం అంతా గుర్రపుడెక్క పరచుకుంది. కొన్ని నివాసాలు చెరువు మధ్యలో ఉండడంతో వరదలు వస్తే అధిక నష్టంవాటిల్లే ప్రమాదం ఉంది.
12/12
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మహేశ్వరంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. చిత్రంలో బొక్క నర్సింహారెడ్డి, ఎంపీ మునుస్వామి,  శ్రీరాములు యాదవ్, బాషా, సుదర్శన్‌రెడ్డి  తదితరులు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మహేశ్వరంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. చిత్రంలో బొక్క నర్సింహారెడ్డి, ఎంపీ మునుస్వామి, శ్రీరాములు యాదవ్, బాషా, సుదర్శన్‌రెడ్డి తదితరులు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని