News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 15 May 2022 01:35 IST
1/17
నందిపేట్‌ మండల పరిధిలోని ఎస్సారెస్పీ వెనుక జలాలు ఉండే చిన్నయానం, గాదేపల్లి శివారులో నీల్‌గాయ్‌ కనిపించింది. ఇప్పటి వరకు 

ఈ ప్రాంతంలో ఇది ఎప్పుడూ చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు  పేర్కొంటున్నారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలోనే  ఉంటాయని 

అటవీ శాఖ డిప్యూటీ  రేంజ్‌ అధికారి సుధాకర్‌ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో జలాలు పూర్తిగా తగ్గడంతో కనుచూపుమేర 

పచ్చిబయళ్లు పరుచుకున్నాయి. తాగడానికి నీరు, మేత సమృద్ధిగా లభిస్తుండటంతో ఇటు వచ్చి ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి 

హాని చేయదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. నందిపేట్‌ మండల పరిధిలోని ఎస్సారెస్పీ వెనుక జలాలు ఉండే చిన్నయానం, గాదేపల్లి శివారులో నీల్‌గాయ్‌ కనిపించింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇది ఎప్పుడూ చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఉంటాయని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి సుధాకర్‌ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో జలాలు పూర్తిగా తగ్గడంతో కనుచూపుమేర పచ్చిబయళ్లు పరుచుకున్నాయి. తాగడానికి నీరు, మేత సమృద్ధిగా లభిస్తుండటంతో ఇటు వచ్చి ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి హాని చేయదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
2/17
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, పెనుగాలుల ధాటికి మామిడి తోటలు దెబ్బతినడంతో.. రైతులు, వ్యాపారులు తీవ్రంగా 

నష్టపోయారు. కుప్పం ప్రాంతంలో నాలుగు రోజుల కిందట కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. దిగుబడి దశలో 

కాయలు రాలిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, పెనుగాలుల ధాటికి మామిడి తోటలు దెబ్బతినడంతో.. రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కుప్పం ప్రాంతంలో నాలుగు రోజుల కిందట కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. దిగుబడి దశలో కాయలు రాలిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3/17
‘మన లక్ష్యం.. జీరో ప్రమాదాలు’ అని తెలియజేస్తూ తెనాలి ఆర్టీసీ బస్టాండులో సిబ్బంది హాజరు పట్టికలో సంతకాలు చేసే చోట 

ఏర్పాటుచేసిన ప్రత్యేక గోడ గడియారం ఇది. ఇందులో సాధారణ సమయాలు ఉండవు. ఏడాదిలో 12 నెలలు, ఆయా నెలల్లో జరిగిన 

ప్రమాదాల సంఖ్యను అందులో పొందుపరిచే ఏర్పాటు ఉంది. సిబ్బంది బస్సు ఎక్కే ముందు దీన్ని చూసి ప్రమాదాలు లేకుండా ముందుకు 

సాగటమనే లక్ష్యాన్ని మనసులో మననం చేసుకుని అడుగుల వేయాలనే భావనతో ఏర్పాటు చేశామని డిపో మేనేజర్‌ రాజశేఖర్‌  చెప్పారు. 

ఈ డిపో పరిధిలో ఏప్రిల్‌లో ఒక్క ప్రమాదం కూడా లేకపోవడంతో సూచి ‘సున్నాలు’ చూపిస్తుండడాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.   ‘మన లక్ష్యం.. జీరో ప్రమాదాలు’ అని తెలియజేస్తూ తెనాలి ఆర్టీసీ బస్టాండులో సిబ్బంది హాజరు పట్టికలో సంతకాలు చేసే చోట ఏర్పాటుచేసిన ప్రత్యేక గోడ గడియారం ఇది. ఇందులో సాధారణ సమయాలు ఉండవు. ఏడాదిలో 12 నెలలు, ఆయా నెలల్లో జరిగిన ప్రమాదాల సంఖ్యను అందులో పొందుపరిచే ఏర్పాటు ఉంది. సిబ్బంది బస్సు ఎక్కే ముందు దీన్ని చూసి ప్రమాదాలు లేకుండా ముందుకు సాగటమనే లక్ష్యాన్ని మనసులో మననం చేసుకుని అడుగుల వేయాలనే భావనతో ఏర్పాటు చేశామని డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ చెప్పారు. ఈ డిపో పరిధిలో ఏప్రిల్‌లో ఒక్క ప్రమాదం కూడా లేకపోవడంతో సూచి ‘సున్నాలు’ చూపిస్తుండడాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.
4/17
ఆస్పరి మండలం డి.కోటకొండ గ్రామంలో నీటి పథకాల బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ప్రజలు నీటి కోసం నిత్యం అవస్థలు 

పడుతున్నారు. గ్రామంలో మూడువేలకు పైగానే జనాభా ఉంది. గ్రామానికి కొద్దిదూరంలో ఇటీవల జగన్న కాలనీలో వేసిన ట్యాంకు వద్ద 

నీటిని పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నీరు సైతం అరకొరగా వస్తునట్లు స్థానికులు తెలిపారు. మూడు చక్రాల బండ్లు తీసుకెళ్లి 

గంటల తరబడి వేచి ఉండక తప్పటంలేదు. తమ గ్రామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. 


ఆస్పరి మండలం డి.కోటకొండ గ్రామంలో నీటి పథకాల బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ప్రజలు నీటి కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మూడువేలకు పైగానే జనాభా ఉంది. గ్రామానికి కొద్దిదూరంలో ఇటీవల జగన్న కాలనీలో వేసిన ట్యాంకు వద్ద నీటిని పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నీరు సైతం అరకొరగా వస్తునట్లు స్థానికులు తెలిపారు. మూడు చక్రాల బండ్లు తీసుకెళ్లి గంటల తరబడి వేచి ఉండక తప్పటంలేదు. తమ గ్రామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
5/17
పెంచల స్వామి జయంతిని పురస్కరించుకుని శనివారం కోన భక్తజనంతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 

పెంచలో అన్న స్మరణతో పరిసరాలు మార్మోగాయి. సహస్రదీపాలంకరణ సేవ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించగా.. బంగారు గరుడ 

వాహనంపై మాడ వీధుల్లో విహరించిన స్వామి వారిని దర్శించుకుని ప్రతి మది పరవశించింది. పెంచల స్వామి జయంతిని పురస్కరించుకుని శనివారం కోన భక్తజనంతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెంచలో అన్న స్మరణతో పరిసరాలు మార్మోగాయి. సహస్రదీపాలంకరణ సేవ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించగా.. బంగారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన స్వామి వారిని దర్శించుకుని ప్రతి మది పరవశించింది.
6/17
సాధారణంగా పుంగనూరు జాతి ఆవులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందులోనూ అప్పుడే పుట్టిన దూడలైతే మరీనూ.. ఈ చిత్రంలో ఉన్న 

దూడను చూస్తే చిన్నపాటి కుక్క పిల్లలా కన్పిస్తుంది. బొమ్ములూరులో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు చెందిన గోశాలలోని 

పుంగనూరు జాతి ఆవు శనివారం సాయంత్రం తొలి ఈతలో పెయ్య దూడకు జన్మనిచ్చింది. దీనిఎత్తు కేవలం ఒక అడుగు మాత్రమే 

ఉండటం గమనార్హం. సాధారణంగా పుంగనూరు జాతి ఆవులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందులోనూ అప్పుడే పుట్టిన దూడలైతే మరీనూ.. ఈ చిత్రంలో ఉన్న దూడను చూస్తే చిన్నపాటి కుక్క పిల్లలా కన్పిస్తుంది. బొమ్ములూరులో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు చెందిన గోశాలలోని పుంగనూరు జాతి ఆవు శనివారం సాయంత్రం తొలి ఈతలో పెయ్య దూడకు జన్మనిచ్చింది. దీనిఎత్తు కేవలం ఒక అడుగు మాత్రమే ఉండటం గమనార్హం.
7/17
వేసవి తాపం నుంచి ఇటీవల నాటిన టమోట మొక్కలు కాపాడుకునేందుకు ఒక రైతు పాత చీరలతో పందిరి ఏర్పాటు చేసి 

సంరక్షిస్తున్నారు. సీతారామపురంనకు చెందిన బొల్లుపల్లి రంగనాయకులు ఐదెకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరా భూమిలో టమోట సాగు 

మొక్కలకు వేసవి తాపానికి ఎండిపోతాయని పాత చీరలు 600 దాకా కొనుగోలు చేశారు. ప్రస్తుతం మొక్కలను కాపాడుకునేందుకు కర్రల 

సహాయంలో 250కిపైగా చీరలు నాటి వాటి ఆధారంగా పందిరి ఏర్పాటు చేశారు. రంగుల పందిరిగా కనిపిస్తుండటంతో అటుగా వెళ్లేవారు 

ఆసక్తిగా తిలకిస్తున్నారు.  


వేసవి తాపం నుంచి ఇటీవల నాటిన టమోట మొక్కలు కాపాడుకునేందుకు ఒక రైతు పాత చీరలతో పందిరి ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. సీతారామపురంనకు చెందిన బొల్లుపల్లి రంగనాయకులు ఐదెకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరా భూమిలో టమోట సాగు మొక్కలకు వేసవి తాపానికి ఎండిపోతాయని పాత చీరలు 600 దాకా కొనుగోలు చేశారు. ప్రస్తుతం మొక్కలను కాపాడుకునేందుకు కర్రల సహాయంలో 250కిపైగా చీరలు నాటి వాటి ఆధారంగా పందిరి ఏర్పాటు చేశారు. రంగుల పందిరిగా కనిపిస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
8/17
బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పెద్దేరు నదిపై వంతెన కుంగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డాది ప్రభుత్వ 

జూనియర్‌ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరీక్షలు రాస్తున్నారు. గ్రామం 

మధ్యలో ఉన్న వంతెన దెబ్బతినడంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పెద్దేరు నదిపై వంతెన కుంగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరీక్షలు రాస్తున్నారు. గ్రామం మధ్యలో ఉన్న వంతెన దెబ్బతినడంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు.
9/17
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని కరాడ్‌లో శనివారం నిర్వహించిన వాహన ర్యాలీలో పాల్గొన్న మహిళలు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని కరాడ్‌లో శనివారం నిర్వహించిన వాహన ర్యాలీలో పాల్గొన్న మహిళలు
10/17
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని ఊటీలో వేసవి ఉత్సవంలో భాగంగా రోజ్‌ పార్కులో 17వ గులాబీ పూల ప్రదర్శన హార్టీకల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో గులాబీ పూలతో తీర్చిదిద్దిన వివిధ ఆకారాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 31 వేల గులాబీలతో కూడిన 15 అడుగుల ఇంటి నిర్మాణం వంటివి ఇక్కడ కొలువుదీరాయి. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని ఊటీలో వేసవి ఉత్సవంలో భాగంగా రోజ్‌ పార్కులో 17వ గులాబీ పూల ప్రదర్శన హార్టీకల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో గులాబీ పూలతో తీర్చిదిద్దిన వివిధ ఆకారాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 31 వేల గులాబీలతో కూడిన 15 అడుగుల ఇంటి నిర్మాణం వంటివి ఇక్కడ కొలువుదీరాయి.
11/17
12/17
మాసబ్‌ ట్యాంక్‌ నుంచి సరోజిని కంటి ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై విభాగిని మధ్యలో ఎక్కడా రోడ్డు దాటేందుకు పాదచారులకు దారివ్వలేదు. దీంతో చుట్టూ తిరిగే ఓపిక లేక  ప్రమాదమని తెలిసినా ఇలా విభాగిని దాటి వెళ్లాల్సి వస్తోంది. మాసబ్‌ ట్యాంక్‌ నుంచి సరోజిని కంటి ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై విభాగిని మధ్యలో ఎక్కడా రోడ్డు దాటేందుకు పాదచారులకు దారివ్వలేదు. దీంతో చుట్టూ తిరిగే ఓపిక లేక ప్రమాదమని తెలిసినా ఇలా విభాగిని దాటి వెళ్లాల్సి వస్తోంది.
13/17
డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా శనివారం పాల ట్యాంకర్‌ బోల్తా కొట్టింది. మహారాష్ట్ర నుంచి ఉప్పల్‌కు 12 వేల లీటర్ల సామర్థ్యంతో వస్తున్న ట్యాంకరు కీసర వద్ద ఓఆర్‌ఆర్‌పై అకస్మాత్తుగా డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. పాలు రోడ్డు పాలయ్యాయి. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా శనివారం పాల ట్యాంకర్‌ బోల్తా కొట్టింది. మహారాష్ట్ర నుంచి ఉప్పల్‌కు 12 వేల లీటర్ల సామర్థ్యంతో వస్తున్న ట్యాంకరు కీసర వద్ద ఓఆర్‌ఆర్‌పై అకస్మాత్తుగా డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. పాలు రోడ్డు పాలయ్యాయి. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
14/17
వేసవిలో కొమ్మల నిండా ఎర్రెర్రని పూలతో కనువిందు చేస్తుంటాయి గుల్‌ మోహర్‌ చెట్లు. కొన్నయితే ఆకుల్లేకుండా కేవలం పూలతోనే దర్శనమిస్తుంటాయి. మహబూబ్‌నగర్‌ శివారు గ్రామమైన బోయపల్లిలోని ఓ గుల్‌మోహర్‌ చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. సగభాగం పచ్చని ఆకులతో మరో సగభాగం పూలతో చూడగానే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వేసవిలో కొమ్మల నిండా ఎర్రెర్రని పూలతో కనువిందు చేస్తుంటాయి గుల్‌ మోహర్‌ చెట్లు. కొన్నయితే ఆకుల్లేకుండా కేవలం పూలతోనే దర్శనమిస్తుంటాయి. మహబూబ్‌నగర్‌ శివారు గ్రామమైన బోయపల్లిలోని ఓ గుల్‌మోహర్‌ చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. సగభాగం పచ్చని ఆకులతో మరో సగభాగం పూలతో చూడగానే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
15/17
చిత్రంలోని మహిళది ఆదిలాబాద్‌. అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స కోసం శనివారం తెల్లవారుజామునే వచ్చి ఓపీ కార్డు తీసుకుంది. ప్రయాణంలో అలసిపోవడం.. ఎండ తీవ్రత పెరగడంతో  కుమారుడితో కలిసి ఇలా ఆసుపత్రి ఆవరణలో కునుకు తీస్తూ కనిపించింది. చిత్రంలోని మహిళది ఆదిలాబాద్‌. అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స కోసం శనివారం తెల్లవారుజామునే వచ్చి ఓపీ కార్డు తీసుకుంది. ప్రయాణంలో అలసిపోవడం.. ఎండ తీవ్రత పెరగడంతో కుమారుడితో కలిసి ఇలా ఆసుపత్రి ఆవరణలో కునుకు తీస్తూ కనిపించింది.
16/17
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురానికి చెందిన సత్యనారాయణ (అచంటాయన) పెరట్లో పండిస్తున్న ఓ కంద దుంపపై కోన్‌ ఐస్‌క్రీంను తలపించేలా పువ్వు వికసించింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురానికి చెందిన సత్యనారాయణ (అచంటాయన) పెరట్లో పండిస్తున్న ఓ కంద దుంపపై కోన్‌ ఐస్‌క్రీంను తలపించేలా పువ్వు వికసించింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
17/17
చెట్టుపై కనిపిస్తున్న భారీ ఊసరవెల్లిని చూసి అమ్మో.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే జీవకళ ఉట్టిపడుతున్నా నిజానికి అది రంగురంగుల వైర్లతో అల్లిన బొమ్మ. జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు రకరకాల వైర్లతో దానికిలా రూపమివ్వడంతో సందర్శకులను  ఆకట్టుకుంటోంది. చెట్టుపై కనిపిస్తున్న భారీ ఊసరవెల్లిని చూసి అమ్మో.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే జీవకళ ఉట్టిపడుతున్నా నిజానికి అది రంగురంగుల వైర్లతో అల్లిన బొమ్మ. జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు రకరకాల వైర్లతో దానికిలా రూపమివ్వడంతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని