News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 16 May 2022 01:44 IST
1/40
అమాయక చూపు.. అందమైన రూపుతో ఆ లేగదూడ రోగులను సైతం ముచ్చటపడేలా చేస్తోంది. తనను కన్నబిడ్డలా పెంచుతున్న వైద్యుడి 

వెంటే ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకెళితే.. కాకినాడ గ్రామీణం రమణయ్యపేటకు చెందిన తిరుమల ఆసుపత్రి అధినేత 

డా.గౌరీశేఖర్, రమాదేవి దంపతులు నెలరోజుల క్రితం పుంగనూరు ఆవుదూడను కొనుగోలు చేశారు. ఉదయం, సాయంత్రం దానికోసం 

సమయం కేటాయిస్తున్నారు. దీంతో అది వారింట్లో మనిషిలా కలిసిపోయింది. గౌరీశేఖర్‌ వెంట ఆసుపత్రికి సైతం వెళ్లిపోతోంది. ఎప్పుడూ 

బిజీగా ఉండే తమకు లేగదూడ వేసే చిందులు ఉత్సాహాన్ని నింపుతాయంటున్నారు ఈ దంపతులు. అమాయక చూపు.. అందమైన రూపుతో ఆ లేగదూడ రోగులను సైతం ముచ్చటపడేలా చేస్తోంది. తనను కన్నబిడ్డలా పెంచుతున్న వైద్యుడి వెంటే ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకెళితే.. కాకినాడ గ్రామీణం రమణయ్యపేటకు చెందిన తిరుమల ఆసుపత్రి అధినేత డా.గౌరీశేఖర్, రమాదేవి దంపతులు నెలరోజుల క్రితం పుంగనూరు ఆవుదూడను కొనుగోలు చేశారు. ఉదయం, సాయంత్రం దానికోసం సమయం కేటాయిస్తున్నారు. దీంతో అది వారింట్లో మనిషిలా కలిసిపోయింది. గౌరీశేఖర్‌ వెంట ఆసుపత్రికి సైతం వెళ్లిపోతోంది. ఎప్పుడూ బిజీగా ఉండే తమకు లేగదూడ వేసే చిందులు ఉత్సాహాన్ని నింపుతాయంటున్నారు ఈ దంపతులు.
2/40
3/40
ఏడాదికి ఒక్కసారే.. నిండు వేసవిలో వికసించే మే పుష్పాలు సాధారణంగా మొక్కకు ఒకటి లేదా రెండు పూస్తాయి.. కాలనీలోని బంగ్లోస్‌ 

ఏరియాలోని డీజీఎం ధనుంజయ ఇంట్లో ఒక్క మొక్కకు ఆరు పుష్పాలు పూసి కనువిందు చేస్తున్నాయి. అయిదేళ్లుగా కుండీలో ఈ మొక్కను 

సేంద్రియ విధానంలో పెంచుతున్నారు. ఆరు పుష్పాలను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏడాదికి ఒక్కసారే.. నిండు వేసవిలో వికసించే మే పుష్పాలు సాధారణంగా మొక్కకు ఒకటి లేదా రెండు పూస్తాయి.. కాలనీలోని బంగ్లోస్‌ ఏరియాలోని డీజీఎం ధనుంజయ ఇంట్లో ఒక్క మొక్కకు ఆరు పుష్పాలు పూసి కనువిందు చేస్తున్నాయి. అయిదేళ్లుగా కుండీలో ఈ మొక్కను సేంద్రియ విధానంలో పెంచుతున్నారు. ఆరు పుష్పాలను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
4/40
విశిష్ట గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుత్మంతుడి భారీ విగ్రహానికి డ్రోన్‌ సాయంతో 

జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ మండపంలో ఉత్సవమూర్తులకు, వేదశాల వద్ద వేదపండితులు పూజలు 

నిర్వహించారు. ఆలయ సుదర్శన చక్ర ప్రతిష్ఠతోపాటు ఆధునికీకరణకు సహకారం అందిస్తున్న దొరబాబు దంపతులను గ్రామస్థులు, అర్చకులు 

సన్మానించారు. విశిష్ట గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుత్మంతుడి భారీ విగ్రహానికి డ్రోన్‌ సాయంతో జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ మండపంలో ఉత్సవమూర్తులకు, వేదశాల వద్ద వేదపండితులు పూజలు నిర్వహించారు. ఆలయ సుదర్శన చక్ర ప్రతిష్ఠతోపాటు ఆధునికీకరణకు సహకారం అందిస్తున్న దొరబాబు దంపతులను గ్రామస్థులు, అర్చకులు సన్మానించారు.
5/40
వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఓ కూరగాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన 

కంపసాటి కిషిందర్‌రావు పదేళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లోని గ్రామాల్లో ఉదయం 

నుంచి సాయంత్రం వరకు ద్విచక్ర వాహనంపై కూరగాయలు విక్రయించేవారు. ఇటీవల కాలంలో ఎండలు బాగా ముదరడంతో రూ.3వేల 

ఖర్చుతో తన వాహనానికి పైన ఇలా రెగ్జిన్‌ టాప్‌ ఏర్పాటు చేయించారు. దీంతో ఎండ, వాన నుంచి రక్షణ లభిస్తోందంటున్నారు ఆ 

వ్యాపారి.  వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఓ కూరగాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కంపసాటి కిషిందర్‌రావు పదేళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లోని గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ద్విచక్ర వాహనంపై కూరగాయలు విక్రయించేవారు. ఇటీవల కాలంలో ఎండలు బాగా ముదరడంతో రూ.3వేల ఖర్చుతో తన వాహనానికి పైన ఇలా రెగ్జిన్‌ టాప్‌ ఏర్పాటు చేయించారు. దీంతో ఎండ, వాన నుంచి రక్షణ లభిస్తోందంటున్నారు ఆ వ్యాపారి.
6/40
వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న పోకడలు అనుసరిస్తున్నారు. ఖమ్మం డిపోరోడ్‌లో ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ 

నిర్వాహకుడు చెన్నైలో రూ.లక్ష వ్యయంతో రైలు ఇంజిన్‌ నమూనా చేయించారు. అందులో వంటలు తయారు చేస్తూ జనాన్ని 

ఆకర్షిస్తున్నాడు.   వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న పోకడలు అనుసరిస్తున్నారు. ఖమ్మం డిపోరోడ్‌లో ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు చెన్నైలో రూ.లక్ష వ్యయంతో రైలు ఇంజిన్‌ నమూనా చేయించారు. అందులో వంటలు తయారు చేస్తూ జనాన్ని ఆకర్షిస్తున్నాడు.
7/40
భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత భరించలేని చిన్నారులు ఈత కొట్టేందుకు 

ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన 

కాలువలో విద్యార్థులు ఈత కొడుతున్న దృశ్యం ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో ఈత కొడుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత భరించలేని చిన్నారులు ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో విద్యార్థులు ఈత కొడుతున్న దృశ్యం ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో ఈత కొడుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు.
8/40
సింగరేణి బొగ్గు గనుల విస్తరణ కోసం మంథని మండలం రచ్చపల్లిని సంస్థ స్వాధీనం చేసుకుంది. గ్రామస్థులకు అదే మండలం బిట్టుపల్లి 

శివారులో పునరావాసం కల్పిస్తోంది. నిర్వాసితులకు దాదాపు 700 ఇళ్లు నిర్మిస్తుండగా కాలనీకి స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. ఇందుకోసం 

ఖాళీ డ్రమ్ములను ఉపయోగించారు. రెండు వైపులా స్తంభాల నిర్మాణం పూర్తి కాగా పైన తోరణానికి వినియోగిస్తున్న 15 డ్రమ్ములు 

చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సింగరేణి బొగ్గు గనుల విస్తరణ కోసం మంథని మండలం రచ్చపల్లిని సంస్థ స్వాధీనం చేసుకుంది. గ్రామస్థులకు అదే మండలం బిట్టుపల్లి శివారులో పునరావాసం కల్పిస్తోంది. నిర్వాసితులకు దాదాపు 700 ఇళ్లు నిర్మిస్తుండగా కాలనీకి స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఖాళీ డ్రమ్ములను ఉపయోగించారు. రెండు వైపులా స్తంభాల నిర్మాణం పూర్తి కాగా పైన తోరణానికి వినియోగిస్తున్న 15 డ్రమ్ములు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
9/40
వివిధ రంగుల్లో మెరుస్తూ కనువిందు చేస్తున్న ఎడారి రకం మూన్‌ కాక్టస్‌ మొక్కలివి. కుండీల్లో పెరిగే ఈ మొక్కలు 2 నుంచి 5 

సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండి.. పైన బంతి ఆకారంలో రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. రెండు నుంచి నాలుగేళ్ల దాకా బతుకుతాయి. 

విజయవాడ నగరం పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ నర్సరీలో ఇవి కనిపించాయి. వివిధ రంగుల్లో మెరుస్తూ కనువిందు చేస్తున్న ఎడారి రకం మూన్‌ కాక్టస్‌ మొక్కలివి. కుండీల్లో పెరిగే ఈ మొక్కలు 2 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండి.. పైన బంతి ఆకారంలో రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. రెండు నుంచి నాలుగేళ్ల దాకా బతుకుతాయి. విజయవాడ నగరం పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ నర్సరీలో ఇవి కనిపించాయి.
10/40
అస్సాం దిమా హసావ్‌లో భారీ వర్షాలకు రైలు మార్గంలో మట్టి కొట్టుకుపోవడంతో వేలాడుతున్న రైలు పట్టాలు


అస్సాం దిమా హసావ్‌లో భారీ వర్షాలకు రైలు మార్గంలో మట్టి కొట్టుకుపోవడంతో వేలాడుతున్న రైలు పట్టాలు
11/40
జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతం అప్నా విహార్‌లో జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై గుర్తించిన మోర్టార్‌ షెల్‌ను తీసుకెళుతున్న 

భద్రతా సిబ్బంది జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతం అప్నా విహార్‌లో జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై గుర్తించిన మోర్టార్‌ షెల్‌ను తీసుకెళుతున్న భద్రతా సిబ్బంది
12/40
మండే ఎండలో బాటసారుల చెంతకే వెళ్లి చల్లని నీరు, మజ్జిగ అందించి దాహార్తి తీరుస్తున్నారు ఈ విశ్రాంత ఉద్యోగి చింతపల్లి దుర్గారావు. 

కొత్తగూడెంకు చెందిన ఆయన సింగరేణిలో మేస్త్రీ (టబ్‌ రిపేరింగ్‌)గా పనిచేసి 2015లో పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా పట్టణంలో 

ద్విచక్ర వాహనంపై ‘సంచార చలివేంద్రం’ నిర్వహిస్తున్నారు. ప్రతి వేసవిలో వారంలో నాలుగు రోజులు ఇందుకు కేటాయిస్తున్నారు. మిగతా 

రోజుల్లో కుటుంబ పోషణ కోసం కత్తులు సానబెట్టే పనిచేస్తున్నారు. మజ్జిగ తయారీకి రూ.500 ఖర్చు చేసి పెరుగు, నిమ్మకాయలు, 

కొత్తిమీర వంటివి కొనుగోలు చేస్తారు. దాతలెవరైనా స్పందించి ఒక రోజు ఖర్చు భరిస్తే, వారి పేరు సంచార కేంద్రం బోర్డుపై 

ప్రదర్శిస్తున్నారు.  మండే ఎండలో బాటసారుల చెంతకే వెళ్లి చల్లని నీరు, మజ్జిగ అందించి దాహార్తి తీరుస్తున్నారు ఈ విశ్రాంత ఉద్యోగి చింతపల్లి దుర్గారావు. కొత్తగూడెంకు చెందిన ఆయన సింగరేణిలో మేస్త్రీ (టబ్‌ రిపేరింగ్‌)గా పనిచేసి 2015లో పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా పట్టణంలో ద్విచక్ర వాహనంపై ‘సంచార చలివేంద్రం’ నిర్వహిస్తున్నారు. ప్రతి వేసవిలో వారంలో నాలుగు రోజులు ఇందుకు కేటాయిస్తున్నారు. మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం కత్తులు సానబెట్టే పనిచేస్తున్నారు. మజ్జిగ తయారీకి రూ.500 ఖర్చు చేసి పెరుగు, నిమ్మకాయలు, కొత్తిమీర వంటివి కొనుగోలు చేస్తారు. దాతలెవరైనా స్పందించి ఒక రోజు ఖర్చు భరిస్తే, వారి పేరు సంచార కేంద్రం బోర్డుపై ప్రదర్శిస్తున్నారు.
13/40
అందంగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు కోనోకార్పస్‌ ఎరెక్టస్‌. విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలు అనతికాలంలోనే దేశమంతా 

విస్తరించాయి.  ఈ మొక్క వేళ్లు భూమిలోకి బాగా విస్తరించి పైపులైన్లను, ఇళ్ల పునాదులను దెబ్బతీస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన 

పలువురు ఆర్కిటెక్టులు సైతం అభిప్రాయపడటంతో వీటిని దూరం పెట్టాలని జీహెచ్‌ఎంసీ ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు నాటిన మొక్కల 

సంగతి అటుంచి.. కొత్తగా ఈ మొక్కను జనావాసాల్లో నాటొద్దని అంతర్గతంగా ఓ నిర్ణయానికొచ్చారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం 

అధ్యయనం చేపట్టి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందంగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు కోనోకార్పస్‌ ఎరెక్టస్‌. విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలు అనతికాలంలోనే దేశమంతా విస్తరించాయి. ఈ మొక్క వేళ్లు భూమిలోకి బాగా విస్తరించి పైపులైన్లను, ఇళ్ల పునాదులను దెబ్బతీస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన పలువురు ఆర్కిటెక్టులు సైతం అభిప్రాయపడటంతో వీటిని దూరం పెట్టాలని జీహెచ్‌ఎంసీ ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు నాటిన మొక్కల సంగతి అటుంచి.. కొత్తగా ఈ మొక్కను జనావాసాల్లో నాటొద్దని అంతర్గతంగా ఓ నిర్ణయానికొచ్చారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేపట్టి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
14/40
గోదావరి నదిపై పడవ ప్రయాణాలకు ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో బాటసారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి కావడంతో 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంవద్ద గోదావరిలో నీటి లోతు తగ్గింది. దీంతో స్థానికులు కూనవరం నుంచి రుద్రమ్మకోటవైపు 

వెళ్లేందుకు కాలినడకన నదిని దాటుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా నడుముల్లోతు నీటిలో సామగ్రిని తలపై పెట్టుకుని అడుగులో 

అడుగు వేసుకుంటూ వెళుతున్నారు. అధికారులు రేవు నిర్వహించి పడవ ప్రయాణాలను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. గోదావరి నదిపై పడవ ప్రయాణాలకు ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో బాటసారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి కావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంవద్ద గోదావరిలో నీటి లోతు తగ్గింది. దీంతో స్థానికులు కూనవరం నుంచి రుద్రమ్మకోటవైపు వెళ్లేందుకు కాలినడకన నదిని దాటుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా నడుముల్లోతు నీటిలో సామగ్రిని తలపై పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్నారు. అధికారులు రేవు నిర్వహించి పడవ ప్రయాణాలను ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
15/40
కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని కేసనపల్లి తీరంలో ఆదివారం సముద్రం 200 మీటర్లు ముందుకొచ్చి అలజడి సృష్టించింది. 

ఇటీవల అసని తుపానుకు అంతర్వేది నుంచి కరవాక వరకు ముందుకొచ్చిన సముద్రం తర్వాత వెనక్కి వెళ్లింది. ఆదివారం కేసనపల్లి తీరంలో 

ముందుకురావడంతో నీరు సమీప గ్రామాల్లోకి చేరింది. ప్రభుత్వం తీరప్రాంత రక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని కేసనపల్లి తీరంలో ఆదివారం సముద్రం 200 మీటర్లు ముందుకొచ్చి అలజడి సృష్టించింది. ఇటీవల అసని తుపానుకు అంతర్వేది నుంచి కరవాక వరకు ముందుకొచ్చిన సముద్రం తర్వాత వెనక్కి వెళ్లింది. ఆదివారం కేసనపల్లి తీరంలో ముందుకురావడంతో నీరు సమీప గ్రామాల్లోకి చేరింది. ప్రభుత్వం తీరప్రాంత రక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
16/40
తిరుమల- పాపవినాశనం రోడ్డులోని పార్వేట మండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున 

ఏనుగులు రోడ్డుపక్కన ఉన్న రక్షణగోడను, ఇనుప ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహన చోదకులు 

భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. తిరుమల- పాపవినాశనం రోడ్డులోని పార్వేట మండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున ఏనుగులు రోడ్డుపక్కన ఉన్న రక్షణగోడను, ఇనుప ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహన చోదకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
17/40
పల్నాడు జిల్లా దుర్గిలో క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ శిలామండప స్తంభం బయట పడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ 

ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం దుర్గిలోని దుర్గాదేవి ఆలయ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న 

శిల్పాలను ఆయన పరిశీలించగా ఈ స్తంభం వెలుగు చూసింది. శాతవాహన కాలంనాటి బౌద్ధ చిహ్నమైన అర్ధ పద్మ శిల్పం ఆ స్తంభంపై 

చెక్కి ఉందని, ఇది బౌద్ధారామంలోని సంభాషణ మండపానికి చెందిందని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ స్తంభాన్ని 

సంరక్షించాలని ఆలయ పూజారులు, స్థానికులు శివనాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.


పల్నాడు జిల్లా దుర్గిలో క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ శిలామండప స్తంభం బయట పడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం దుర్గిలోని దుర్గాదేవి ఆలయ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలను ఆయన పరిశీలించగా ఈ స్తంభం వెలుగు చూసింది. శాతవాహన కాలంనాటి బౌద్ధ చిహ్నమైన అర్ధ పద్మ శిల్పం ఆ స్తంభంపై చెక్కి ఉందని, ఇది బౌద్ధారామంలోని సంభాషణ మండపానికి చెందిందని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ స్తంభాన్ని సంరక్షించాలని ఆలయ పూజారులు, స్థానికులు శివనాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
18/40
గతంలో గ్రామ, వార్డు సచివాలయాలకు వైకాపా రంగులు వేయడం వివాదాస్పదమైంది. వెంటనే ఆ రంగులను తొలగించాలని హైకోర్టు 

ఆదేశించింది. ఇదేమీ పట్టించుకోని అధికారులు తిరిగి అవే రంగులను పల్నాడు జిల్లా మాచర్లలోని వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రానికి 

వేయించారు.  గతంలో గ్రామ, వార్డు సచివాలయాలకు వైకాపా రంగులు వేయడం వివాదాస్పదమైంది. వెంటనే ఆ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదేమీ పట్టించుకోని అధికారులు తిరిగి అవే రంగులను పల్నాడు జిల్లా మాచర్లలోని వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వేయించారు.
19/40
చేతిలో డబ్బుంటే చాలామంది రేపటి కోసం దాచుకుంటారు. ఏలూరుకు చెందిన తమ్మినేని నాగరాజు మాత్రం దాంతో ఎంత ఎక్కువ మంది 

ఆకలి తీర్చగలను అని ఆలోచిస్తారు. పశుపక్ష్యాదుల కడుపూ నింపుతారు. నాగరాజుది అసలు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం 

సాగిపాడు గ్రామం. గ్రామంలో వ్యవసాయం చేయిస్తూనే.. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉంటూ అక్కడి ఆసుపత్రులు, కూడళ్లల్లో అవసరమైన 

వారికి పండ్లు, రొట్టెలు పంచిపెడుతున్నారు. కాయగూరలు కొనుగోలు చేసి సమీపంలోని గోశాలలకు వెళ్లి వాటిని మూగజీవాలకు 

వేస్తున్నారు. పంచుకుంటూ పోతే చివరకు ఏమీ మిగలదు కదా అని ఎవరైనా ఆయన్ని పలకరిస్తే.. ‘నాకున్న 30 ఎకరాల భూమిలో 25 

ఎకరాలు కుమారుల పేరిట రాశా. దానధర్మాల కోసం ఐదెకరాల పొలం విక్రయించా. 8ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఇందుకు నెలకు సుమారు 

రూ.లక్ష ఖర్చవుతోంది. డబ్బును దాచడం కంటే దాంతో ఇతరుల ఆకలి తీర్చడంలోనే ఎంతో సంతృప్తి ఉంది’ అని అంటున్నారు. చేతిలో డబ్బుంటే చాలామంది రేపటి కోసం దాచుకుంటారు. ఏలూరుకు చెందిన తమ్మినేని నాగరాజు మాత్రం దాంతో ఎంత ఎక్కువ మంది ఆకలి తీర్చగలను అని ఆలోచిస్తారు. పశుపక్ష్యాదుల కడుపూ నింపుతారు. నాగరాజుది అసలు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామం. గ్రామంలో వ్యవసాయం చేయిస్తూనే.. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉంటూ అక్కడి ఆసుపత్రులు, కూడళ్లల్లో అవసరమైన వారికి పండ్లు, రొట్టెలు పంచిపెడుతున్నారు. కాయగూరలు కొనుగోలు చేసి సమీపంలోని గోశాలలకు వెళ్లి వాటిని మూగజీవాలకు వేస్తున్నారు. పంచుకుంటూ పోతే చివరకు ఏమీ మిగలదు కదా అని ఎవరైనా ఆయన్ని పలకరిస్తే.. ‘నాకున్న 30 ఎకరాల భూమిలో 25 ఎకరాలు కుమారుల పేరిట రాశా. దానధర్మాల కోసం ఐదెకరాల పొలం విక్రయించా. 8ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఇందుకు నెలకు సుమారు రూ.లక్ష ఖర్చవుతోంది. డబ్బును దాచడం కంటే దాంతో ఇతరుల ఆకలి తీర్చడంలోనే ఎంతో సంతృప్తి ఉంది’ అని అంటున్నారు.
20/40
కాకినాడ జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులోకి వచ్చినా రోగులపై ఆర్థిక భారం తప్పని పరిస్థితి. ఈ 

వాహనం మరమ్మతులకు గురై మూలకు చేరడం, ప్రైవేటు అంబులెన్సుల సిబ్బంది రోగుల నుంచి అధికంగా సొమ్ములు వసూలు 

చేస్తుండటంపై గత నెల 27న ‘ఈనాడు’లో ‘కాసుక్కూర్చున్నారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారుల స్పందనతో 

అంబులెన్సుకు మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులో ఉంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అంబులెన్సులో రోగులను 

తీసుకెళ్లాలంటే డీజిల్‌కు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి. నిధుల లేమే ఇందుకు కారణం. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 

వెంకటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా డీజిల్‌కు ప్రత్యేకంగా నిధులు లేవన్నారు. రోగులను ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రికి 

తరలించాలంటే 108 వాహనానికి సమాచారం అందించి వినియోగిస్తున్నట్లు చెప్పారు. 108 వాహనం అందుబాటులో లేనప్పుడు డీజిల్‌ 

ఖర్చును భరిస్తే అంబులెన్సును కేటాయిస్తామని వివరించారు.  కాకినాడ జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులోకి వచ్చినా రోగులపై ఆర్థిక భారం తప్పని పరిస్థితి. ఈ వాహనం మరమ్మతులకు గురై మూలకు చేరడం, ప్రైవేటు అంబులెన్సుల సిబ్బంది రోగుల నుంచి అధికంగా సొమ్ములు వసూలు చేస్తుండటంపై గత నెల 27న ‘ఈనాడు’లో ‘కాసుక్కూర్చున్నారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారుల స్పందనతో అంబులెన్సుకు మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులో ఉంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అంబులెన్సులో రోగులను తీసుకెళ్లాలంటే డీజిల్‌కు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి. నిధుల లేమే ఇందుకు కారణం. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా డీజిల్‌కు ప్రత్యేకంగా నిధులు లేవన్నారు. రోగులను ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రికి తరలించాలంటే 108 వాహనానికి సమాచారం అందించి వినియోగిస్తున్నట్లు చెప్పారు. 108 వాహనం అందుబాటులో లేనప్పుడు డీజిల్‌ ఖర్చును భరిస్తే అంబులెన్సును కేటాయిస్తామని వివరించారు.
21/40
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు దూసుకొచ్చి.. పోలీసుల నుంచి తప్పించుకొని ముందుకు వెళ్లారు. అక్కడున్న మరో కానిస్టేబుల్‌కి చిక్కారు.  లైసెన్సు, ఇతర పత్రాలు లేకపోవడంతో పాటు ముగ్గురు ప్రయాణించినందుకు కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడిపిన యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు దూసుకొచ్చి.. పోలీసుల నుంచి తప్పించుకొని ముందుకు వెళ్లారు. అక్కడున్న మరో కానిస్టేబుల్‌కి చిక్కారు. లైసెన్సు, ఇతర పత్రాలు లేకపోవడంతో పాటు ముగ్గురు ప్రయాణించినందుకు కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడిపిన యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
22/40
23/40
వేశాక్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం బ్యాంకాక్‌ సమీపంలోని పథంథానిలో ప్రఖ్యాత ధమ్మకాయ ఆలయంలో బుద్ధుడి రూపంలో బౌద్ధ సన్యాసులు వెలిగించిన దీపాలు. బుద్ధుడి బోధనలను స్మరించుకుంటూ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తారు. వేశాక్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం బ్యాంకాక్‌ సమీపంలోని పథంథానిలో ప్రఖ్యాత ధమ్మకాయ ఆలయంలో బుద్ధుడి రూపంలో బౌద్ధ సన్యాసులు వెలిగించిన దీపాలు. బుద్ధుడి బోధనలను స్మరించుకుంటూ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తారు.
24/40
25/40
పబ్లిక్‌ గార్డెన్స్‌లోని హెల్త్‌ మ్యూజియం నిర్వహణ లేక కళ తప్పి అధ్వానంగా మారింది. ఏడు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఈ ప్రదర్శనశాల భవనానికి ఐదేళ్లుగా విద్యుత్తు సరఫరా లేదు. ఆసక్తి కొద్దీ ఎవరైనా వచ్చినా ఇక్కడ ఏమీ చూడలేని పరిస్థితి. ఎన్నో అరుదైన సర్పాల కళేబరాలు ఇక్కడ ఉన్నా వాటిని నిల్వ ఉంచే ద్రావణాలు సైతం అయిపోయాయి. మనిషి ముఖంపై వచ్చే మచ్చల గురించి తెలిపే బొమ్మ ఇలా విరిగిపోయింది. పబ్లిక్‌ గార్డెన్స్‌లోని హెల్త్‌ మ్యూజియం నిర్వహణ లేక కళ తప్పి అధ్వానంగా మారింది. ఏడు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఈ ప్రదర్శనశాల భవనానికి ఐదేళ్లుగా విద్యుత్తు సరఫరా లేదు. ఆసక్తి కొద్దీ ఎవరైనా వచ్చినా ఇక్కడ ఏమీ చూడలేని పరిస్థితి. ఎన్నో అరుదైన సర్పాల కళేబరాలు ఇక్కడ ఉన్నా వాటిని నిల్వ ఉంచే ద్రావణాలు సైతం అయిపోయాయి. మనిషి ముఖంపై వచ్చే మచ్చల గురించి తెలిపే బొమ్మ ఇలా విరిగిపోయింది.
26/40
27/40
28/40

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు రోడ్‌ నంబరు 10 నుంచి ఎల్‌వీ ప్రసాద్‌ మార్గ్‌ మలుపు వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకూడదని నో పార్కింగ్‌ ప్రాంతంగా ప్రకటించి సూచిక ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి పదుల సంఖ్యలో వాహనాలు నిలిపివేయించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు రోడ్‌ నంబరు 10 నుంచి ఎల్‌వీ ప్రసాద్‌ మార్గ్‌ మలుపు వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకూడదని నో పార్కింగ్‌ ప్రాంతంగా ప్రకటించి సూచిక ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి పదుల సంఖ్యలో వాహనాలు నిలిపివేయించారు.
29/40
హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేట డివిజన్‌ బండ మైసమ్మనగర్‌లో రూ.27కోట్లతో నిర్మించిన 310 రెండు పడక గదుల ఇళ్లను రాష్ట్ర మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం సభలో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేశారు. అందులో ఒకరైన లబ్ధిదారు నాగలక్ష్మి ఆ పత్రాలు అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేట డివిజన్‌ బండ మైసమ్మనగర్‌లో రూ.27కోట్లతో నిర్మించిన 310 రెండు పడక గదుల ఇళ్లను రాష్ట్ర మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం సభలో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేశారు. అందులో ఒకరైన లబ్ధిదారు నాగలక్ష్మి ఆ పత్రాలు అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
30/40
ఎండలకు ఇళ్లలో ఉండలేక హైదరాబాద్‌ నగరవాసులు సాయంత్రం అవగానే పార్కులు, పర్యాటక క్షేత్రాల బాటపడుతున్నారు. ఆదివారం రాత్రి ట్యాంకుబండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లు రద్దీగా మారాయి. నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ప్రదర్శనకు జనం పోటెత్తారు. ఎండలకు ఇళ్లలో ఉండలేక హైదరాబాద్‌ నగరవాసులు సాయంత్రం అవగానే పార్కులు, పర్యాటక క్షేత్రాల బాటపడుతున్నారు. ఆదివారం రాత్రి ట్యాంకుబండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లు రద్దీగా మారాయి. నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ప్రదర్శనకు జనం పోటెత్తారు.
31/40
32/40
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి పలు జిల్లాలకు సాగు నీరందించే ప్రధాన కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. హనుమకొండ జిల్లా చింతగట్టు క్యాంపు నుంచి ములుగు రోడ్డు వరకు ఎస్సారెస్పీ ఒకటో దశ ప్రధాన కాలువ అనేకచోట్ల లైనింగ్‌ ధ్వంసమై రాళ్లు బయటికొచ్చాయి. పగుళ్లూ దర్శనమిస్తున్నాయి. ప్రధాన కాలువ నుంచి పొలాలకు తరలించే డిస్ట్రిబ్యూటరీలూ దెబ్బతిన్నాయి. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల సాగునీరందడం లేదని చివరి ఆయకట్టు రైతులు వాపోతున్నారు. గతంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టినా పనులు పూర్తి కాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి పలు జిల్లాలకు సాగు నీరందించే ప్రధాన కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. హనుమకొండ జిల్లా చింతగట్టు క్యాంపు నుంచి ములుగు రోడ్డు వరకు ఎస్సారెస్పీ ఒకటో దశ ప్రధాన కాలువ అనేకచోట్ల లైనింగ్‌ ధ్వంసమై రాళ్లు బయటికొచ్చాయి. పగుళ్లూ దర్శనమిస్తున్నాయి. ప్రధాన కాలువ నుంచి పొలాలకు తరలించే డిస్ట్రిబ్యూటరీలూ దెబ్బతిన్నాయి. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల సాగునీరందడం లేదని చివరి ఆయకట్టు రైతులు వాపోతున్నారు. గతంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టినా పనులు పూర్తి కాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
33/40
34/40
మట్టికుండలో నీళ్లు చల్లగా ఉంటాయని, వేసవిలో నేటికీ అనేకమంది వాటిని వినియోగిస్తుంటారు. ఇదే కోవలో మట్టి కూలర్లు సైతం నేడు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో పేదలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అచ్చంపేట టీచర్స్‌ కాలనీకి చెందిన వెంకటయ్య తన పనితనానికి పదును పెట్టి, నైపుణ్యంతో కుండకు చిన్న పంకా, నీటిపైపు అమర్చి గడ్డి, విద్యుత్తు తీగలతో కూలర్‌గా రూపొందించారు. రూ.2000 లోపు ధరకు వాటిని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అమ్రాబాద్‌, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నానని తెలిపారు. మట్టికుండలో నీళ్లు చల్లగా ఉంటాయని, వేసవిలో నేటికీ అనేకమంది వాటిని వినియోగిస్తుంటారు. ఇదే కోవలో మట్టి కూలర్లు సైతం నేడు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో పేదలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అచ్చంపేట టీచర్స్‌ కాలనీకి చెందిన వెంకటయ్య తన పనితనానికి పదును పెట్టి, నైపుణ్యంతో కుండకు చిన్న పంకా, నీటిపైపు అమర్చి గడ్డి, విద్యుత్తు తీగలతో కూలర్‌గా రూపొందించారు. రూ.2000 లోపు ధరకు వాటిని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అమ్రాబాద్‌, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నానని తెలిపారు.
35/40
36/40
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబరు 33లోని ఓ ఇంటి గోడ పక్కన నాటిన మొక్కలు ఇలా నిలువుగా ఏపుగా పెరిగి అటువైపు వెళ్లేవారికి కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబరు 33లోని ఓ ఇంటి గోడ పక్కన నాటిన మొక్కలు ఇలా నిలువుగా ఏపుగా పెరిగి అటువైపు వెళ్లేవారికి కనువిందు చేస్తున్నాయి.
37/40
సూరీడి ప్రతాపం.. ఆదివారం మధ్యాహ్నం ట్యాంకుబండ్‌పై ఎండమావులు. సూరీడి ప్రతాపం.. ఆదివారం మధ్యాహ్నం ట్యాంకుబండ్‌పై ఎండమావులు.
38/40
మూసాపేట వద్ద కదులుతున్న సిటీ బస్సు ఎక్కడానికి ఓ యువకుడు విశ్వప్రయత్నం చేశాడు. పరుగు పెట్టినా బస్సు వేగాన్ని అందుకోలేక ఇలా పడిపోయాడు. ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సు ఆగింది. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మూసాపేట వద్ద కదులుతున్న సిటీ బస్సు ఎక్కడానికి ఓ యువకుడు విశ్వప్రయత్నం చేశాడు. పరుగు పెట్టినా బస్సు వేగాన్ని అందుకోలేక ఇలా పడిపోయాడు. ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సు ఆగింది. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
39/40
40/40
ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పూజల అనంతరం జ్ఞాపిక అందచేస్తున్న ఫౌండర్‌ ట్రస్టీ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మిశ్రుతి, ఆలయ అధికారులు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పూజల అనంతరం జ్ఞాపిక అందచేస్తున్న ఫౌండర్‌ ట్రస్టీ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మిశ్రుతి, ఆలయ అధికారులు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని