News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 16 May 2022 06:52 IST
1/24
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అందంగా అలంకరించారు. బుద్ధుని 2,566వ జయంతికి సూచికగా 2,566 విద్యుద్దీపాలతో చేపట్టిన ఈ అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అందంగా అలంకరించారు. బుద్ధుని 2,566వ జయంతికి సూచికగా 2,566 విద్యుద్దీపాలతో చేపట్టిన ఈ అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
2/24
3/24
4/24
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది.
5/24
6/24
అంతర్జాతీయ మ్యూజియం డే పురస్కరించుకొని తిరుపతి రీజినల్ సైన్స్‌ సెంటర్‌లో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా  ప్రదర్శనకు ఉంచిన టి.సురేష్‌రెడ్డి నాణేల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తిరుపతి అలిపిరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. 40ఏళ్లుగా నాణేలు సేకరిస్తున్నారు. వీటితో  తయారు చేసిన ఇండియా గేట్‌, చార్మినార్‌, శ్రీవారి ఆనంద నిలయం తదితర నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ మ్యూజియం డే పురస్కరించుకొని తిరుపతి రీజినల్ సైన్స్‌ సెంటర్‌లో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రదర్శనకు ఉంచిన టి.సురేష్‌రెడ్డి నాణేల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తిరుపతి అలిపిరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. 40ఏళ్లుగా నాణేలు సేకరిస్తున్నారు. వీటితో తయారు చేసిన ఇండియా గేట్‌, చార్మినార్‌, శ్రీవారి ఆనంద నిలయం తదితర నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.
7/24
8/24
9/24
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి బుద్ధ విగ్రహం, స్తూపం వద్ద ప్రార్థనలు చేశారు. యాత్రికులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కుషీనగర్‌లో వసతుల్ని కల్పిస్తోందని ప్రధాని తెలిపారు. అంతకు ముందు మోదీ నేపాల్‌లోని లుంబినీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి బుద్ధ విగ్రహం, స్తూపం వద్ద ప్రార్థనలు చేశారు. యాత్రికులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కుషీనగర్‌లో వసతుల్ని కల్పిస్తోందని ప్రధాని తెలిపారు. అంతకు ముందు మోదీ నేపాల్‌లోని లుంబినీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
10/24
11/24
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
12/24
మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ పిజ్జా వంటకాన్ని స్వయంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘పిజ్జా ఎలా ముక్కలుగా చేస్తామనేది ముఖ్యం కాదు.. ఎంత మంది మిత్రులతో పంచుకున్నామనేది ముఖ్యం’ అని పోస్టు పెట్టారు. మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ పిజ్జా వంటకాన్ని స్వయంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘పిజ్జా ఎలా ముక్కలుగా చేస్తామనేది ముఖ్యం కాదు.. ఎంత మంది మిత్రులతో పంచుకున్నామనేది ముఖ్యం’ అని పోస్టు పెట్టారు.
13/24
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, నేతలు హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తరుగు పేరిట మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, నేతలు హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తరుగు పేరిట మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
14/24
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ కళాకారుడు మానస్‌ సాహూ ఒడిశాలోని పూరీ తీరంలో బుద్ధుని సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ కళాకారుడు మానస్‌ సాహూ ఒడిశాలోని పూరీ తీరంలో బుద్ధుని సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
15/24
తిరుప‌తి క‌పిలేశ్వరాల‌యంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సంద‌ర్భంగా ప‌త్ర పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం పుష్ప పత్రయాగ మహోత్సవం చేశారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరం పూలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులను ఇందులో వినియోగించారు. తిరుప‌తి క‌పిలేశ్వరాల‌యంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సంద‌ర్భంగా ప‌త్ర పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం పుష్ప పత్రయాగ మహోత్సవం చేశారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరం పూలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులను ఇందులో వినియోగించారు.
16/24
17/24
ఏలూరు జిల్లాలోని గణపవరంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఖరీఫ్‌ పెట్టుబడి కింద నగదు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మహిళలు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్‌ను జగన్‌ సందర్శించి మిఠాయి రుచి చూశారు. ఏలూరు జిల్లాలోని గణపవరంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఖరీఫ్‌ పెట్టుబడి కింద నగదు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మహిళలు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్‌ను జగన్‌ సందర్శించి మిఠాయి రుచి చూశారు.
18/24
నేపాల్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడి మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని 

ప్రత్యేక పూజలు చేశారు.  బుద్ధుడి ఆశీస్సులతో విశ్వంలో ఎల్లప్పుడూ శాంతి నెలకొని, శ్రేయస్కరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 
నేపాల్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడి మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధుడి ఆశీస్సులతో విశ్వంలో ఎల్లప్పుడూ శాంతి నెలకొని, శ్రేయస్కరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
19/24
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
20/24
తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. 

చిత్రంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. చిత్రంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి
21/24
గౌతమ బుద్ధుడి జయంతిని పురస్కరించుకొని హుస్సేన్‌సాగర్‌ జలాశయంలోని బుద్ధవిగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర 

పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. బుద్ధుడి విగ్రహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ 

మనోహర్‌, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడి జయంతిని పురస్కరించుకొని హుస్సేన్‌సాగర్‌ జలాశయంలోని బుద్ధవిగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. బుద్ధుడి విగ్రహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్‌, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.
22/24
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో టౌనస్‌ కొండల మధ్య చంద్రగ్రహణ దృశ్యం ఇలా కనువిందు చేసింది
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో టౌనస్‌ కొండల మధ్య చంద్రగ్రహణ దృశ్యం ఇలా కనువిందు చేసింది
23/24
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా జరిగింది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా ఈ వేడుక 

నిర్వహించారు. భక్తులు స్వర్ణ రథాన్ని లాగుతూ అమ్మవారి కటాక్షం పొందారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా జరిగింది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించారు. భక్తులు స్వర్ణ రథాన్ని లాగుతూ అమ్మవారి కటాక్షం పొందారు.
24/24

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని