News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 17 May 2022 07:53 IST
1/18
తనను వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ను సత్కరిస్తున్న బీసీ సంక్షేమ 

సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య. తనను వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ను సత్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య.
2/18
శ్రీలంక రాజధాని కొలంబోలో వంట గ్యాస్‌ నిల్వలు లేకపోవడంతో అక్కడి పౌరులు కిరోసిన్‌ కొనేందుకు ఇలా బారులు తీరారు. శ్రీలంక రాజధాని కొలంబోలో వంట గ్యాస్‌ నిల్వలు లేకపోవడంతో అక్కడి పౌరులు కిరోసిన్‌ కొనేందుకు ఇలా బారులు తీరారు.
3/18
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దిమా హసావూ జిల్లాలోని న్యూ హాఫ్లాంగ్‌ రైల్వేస్టేషన్‌ ఇలా 

బురదలో కూరుకుపోయింది. వరద నీటి తాకిడికి ఏకంగా రైళ్లు పట్టాల మీద నుంచి పక్కకు ఒరిగిపోయాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దిమా హసావూ జిల్లాలోని న్యూ హాఫ్లాంగ్‌ రైల్వేస్టేషన్‌ ఇలా బురదలో కూరుకుపోయింది. వరద నీటి తాకిడికి ఏకంగా రైళ్లు పట్టాల మీద నుంచి పక్కకు ఒరిగిపోయాయి.
4/18
పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడటంతో నల్గొండలోని పోలీసు శిక్షణా కేంద్రంలో పలువురు యువతీ యువకులు ఉచిత శిక్షణ 

తీసుకుంటున్నారు. యువతులు దేహదారుఢ్య పోటీల్లో అర్హత సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకొంటూ 

వ్యాయామాలు చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడటంతో నల్గొండలోని పోలీసు శిక్షణా కేంద్రంలో పలువురు యువతీ యువకులు ఉచిత శిక్షణ తీసుకుంటున్నారు. యువతులు దేహదారుఢ్య పోటీల్లో అర్హత సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకొంటూ వ్యాయామాలు చేస్తున్నారు.
5/18
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జూరీ సభ్యురాలి హోదాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హాజరయ్యారు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జూరీ సభ్యురాలి హోదాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హాజరయ్యారు
6/18
తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి 

అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే నేవేద్యం తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించారు. భక్తుల రద్దీతో 

క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే నేవేద్యం తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు.
7/18
8/18
విజయవాడలో ఏర్పాటు చేసిన ‘హైలైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌ను ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి ప్రారంభించారు. ఈ 

సందర్భంగా ఆమె ఇతర మోడళ్లతో కలిసి వైవిధ్యమైన దుస్తులు, విభిన్న ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ‘హైలైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌ను ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇతర మోడళ్లతో కలిసి వైవిధ్యమైన దుస్తులు, విభిన్న ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
9/18
జింబాబ్వేలోని హరారేలో దాచిన ఏనుగు దంతాలివి. ఆ దేశంలో ఏనుగుల సంతతి పరిరక్షణకు సరిపడా నిధులు లేకపోవడంతో ఈ 

దంతాలను విక్రయించాలని భావిస్తున్నారు. వీటి అమ్మకం ద్వారా దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా 

వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ చట్టాలు అందుకు అంగీకరించవు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ఆ దేశం ఐరోపా 

దేశాల అంబాసిడర్లను తమ దేశానికి ఆహ్వానిస్తోంది. జింబాబ్వేలోని హరారేలో దాచిన ఏనుగు దంతాలివి. ఆ దేశంలో ఏనుగుల సంతతి పరిరక్షణకు సరిపడా నిధులు లేకపోవడంతో ఈ దంతాలను విక్రయించాలని భావిస్తున్నారు. వీటి అమ్మకం ద్వారా దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ చట్టాలు అందుకు అంగీకరించవు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ఆ దేశం ఐరోపా దేశాల అంబాసిడర్లను తమ దేశానికి ఆహ్వానిస్తోంది.
10/18
11/18
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మితం తండా వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ 

రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ వద్ద పైలాన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం కాంక్రీటు వేసి ప్రాజెక్ట్ పనులను ఆయన 

ప్రారంభించారు. గ్రీన్ కో గ్రూప్ 

ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మితం తండా వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ వద్ద పైలాన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం కాంక్రీటు వేసి ప్రాజెక్ట్ పనులను ఆయన ప్రారంభించారు. గ్రీన్ కో గ్రూప్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
12/18
13/18
భారత్‌ అమ్ములపొదిలోకి మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ముంబయిలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సూరత్‌, ఉదయ్‌గిరి 

యుద్ధ నౌకలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ప్రారంభించారు. భారత్‌ అమ్ములపొదిలోకి మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ముంబయిలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సూరత్‌, ఉదయ్‌గిరి యుద్ధ నౌకలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ప్రారంభించారు.
14/18
15/18
హంగేరీలోని నాగైకనిజ్‌సా నగరంలో మెరుపులు మెరుస్తున్న దృశ్యాలు కెమెరాలో ఇలా బందీ అయ్యాయి. హంగేరీలోని నాగైకనిజ్‌సా నగరంలో మెరుపులు మెరుస్తున్న దృశ్యాలు కెమెరాలో ఇలా బందీ అయ్యాయి.
16/18
విమానం చంద్రుడిపైకి చేరినట్లుగా కనువిందు చేస్తున్న ఈ దృశ్యం మెక్సికోలోని బెనిటో జ్వారెజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 

కనిపించింది. విమానం చంద్రుడిపైకి చేరినట్లుగా కనువిందు చేస్తున్న ఈ దృశ్యం మెక్సికోలోని బెనిటో జ్వారెజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కనిపించింది.
17/18
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ రీజియన్‌లో నేలకూలిన రష్యా హెలికాప్టర్‌ శకలాలను ఉక్రెయిన్‌ పౌరులు ఇలా పరిశీలిస్తూ కనిపించారు. ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ రీజియన్‌లో నేలకూలిన రష్యా హెలికాప్టర్‌ శకలాలను ఉక్రెయిన్‌ పౌరులు ఇలా పరిశీలిస్తూ కనిపించారు.
18/18
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు జారి 

పడ్డాయి. దీంతో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. దిమా హసావూ జిల్లాలో భారీ వర్షం ధాటికి రోడ్డు ఇలా కోతకు గురయింది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు జారి పడ్డాయి. దీంతో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. దిమా హసావూ జిల్లాలో భారీ వర్షం ధాటికి రోడ్డు ఇలా కోతకు గురయింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని