News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 19 May 2022 07:33 IST
1/29
భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు టీవీలో లైవ్‌ మ్యాచ్‌ చూసిన జరీన్‌ తండ్రి జమీల్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే మ్యాచ్‌ చూస్తున్న కుటుంబ సభ్యులు, కోచ్‌లు తదితరులతో ఆనందాన్ని పంచుకున్నారు. భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు టీవీలో లైవ్‌ మ్యాచ్‌ చూసిన జరీన్‌ తండ్రి జమీల్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే మ్యాచ్‌ చూస్తున్న కుటుంబ సభ్యులు, కోచ్‌లు తదితరులతో ఆనందాన్ని పంచుకున్నారు.
2/29
3/29
మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు పుణెలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధవిమానం సిమ్యులేటర్‌లో ప్రయాణించారు. సుఖోయ్‌లో ప్రయాణించినట్లు పొందిన ఆ అనుభూతి అద్భుతమని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌ వారియర్స్‌ సేవలను కంభంపాటి ప్రశంసించారు. మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు పుణెలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధవిమానం సిమ్యులేటర్‌లో ప్రయాణించారు. సుఖోయ్‌లో ప్రయాణించినట్లు పొందిన ఆ అనుభూతి అద్భుతమని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌ వారియర్స్‌ సేవలను కంభంపాటి ప్రశంసించారు.
4/29
5/29
హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
6/29
కొత్త మోటారు వాహనాల చట్టం అమలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటోలు, క్యాబ్‌లు, లారీ డ్రైవర్ల సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా క్యాబ్‌ సేవలను బుక్‌ చేసుకుందామని పలువురు ఫోన్లలో వెతుకుతూ కనిపించారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటోలు, క్యాబ్‌లు, లారీ డ్రైవర్ల సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా క్యాబ్‌ సేవలను బుక్‌ చేసుకుందామని పలువురు ఫోన్లలో వెతుకుతూ కనిపించారు.
7/29
8/29
రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల కోసం తెరాస అభ్యర్థి రవిచంద్ర గురువారం అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల కోసం తెరాస అభ్యర్థి రవిచంద్ర గురువారం అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
9/29
10/29
ఎండలు తీవ్రంగా ఉండటంతో జమ్ములోని ఓ వ్యాపారి పుచ్చకాయలను చల్లదనం కోసం ఓ కాలువలోని నీటిలో ఉంచి విక్రయిస్తున్నాడు. వాటర్‌ మిలన్‌ను వాటర్‌లో ఉంచి అమ్మడం చిత్రంగా ఉంది కదూ. ఎండలు తీవ్రంగా ఉండటంతో జమ్ములోని ఓ వ్యాపారి పుచ్చకాయలను చల్లదనం కోసం ఓ కాలువలోని నీటిలో ఉంచి విక్రయిస్తున్నాడు. వాటర్‌ మిలన్‌ను వాటర్‌లో ఉంచి అమ్మడం చిత్రంగా ఉంది కదూ.
11/29
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం దిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో దంపతులిద్దరూ ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం దిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో దంపతులిద్దరూ ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12/29
13/29
ఆదిలాబాద్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లోని వివిధ వన్యప్రాణులను అటవీ శాఖ అమర్చిన కెమెరాలు చిత్రీకరించాయి. ఇందులో చిరుత పులులు, జింకలు తదితర జంతువులు ఉన్నాయి. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరుగుతుండటంతో కవ్వాల్‌ టైగర్ రిజర్వ్‌లో కూడా జీవ వైవిధ్యం కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లోని వివిధ వన్యప్రాణులను అటవీ శాఖ అమర్చిన కెమెరాలు చిత్రీకరించాయి. ఇందులో చిరుత పులులు, జింకలు తదితర జంతువులు ఉన్నాయి. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరుగుతుండటంతో కవ్వాల్‌ టైగర్ రిజర్వ్‌లో కూడా జీవ వైవిధ్యం కనిపిస్తోంది.
14/29
15/29
వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బీద మస్తాన్‌రావు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ను కలిశారు. తనను రాజ్యసభ 

అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బీద మస్తాన్‌రావు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ను కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
16/29
శ్రీలంకలోని కొలంబోలో ఇంధనం కోసం ఓ ఫ్యూయల్‌ స్టేషన్‌ వద్ద వాహనదారులు బారులు తీరారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిత్యావసరాలు, ఇంధనానికి శ్రీలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఇంధనం కోసం ఓ ఫ్యూయల్‌ స్టేషన్‌ వద్ద వాహనదారులు బారులు తీరారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిత్యావసరాలు, ఇంధనానికి శ్రీలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
17/29
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బంతి పూలు, పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్ల బండిని నడిపి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బంతి పూలు, పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్ల బండిని నడిపి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.
18/29
రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు నోటికి తెల్లని వస్ర్తాలు కట్టుకొని నిరసన తెలిపారు. పేరరివాళన్‌ను విడుదల చేయడం సరికాదంటూ నినాదాలు చేశారు. రాజీవ్‌ హత్య కేసులో పేరరివాళన్‌ 30ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు నోటికి తెల్లని వస్ర్తాలు కట్టుకొని నిరసన తెలిపారు. పేరరివాళన్‌ను విడుదల చేయడం సరికాదంటూ నినాదాలు చేశారు. రాజీవ్‌ హత్య కేసులో పేరరివాళన్‌ 30ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.
19/29
20/29
‘గుండెల్లో గోదారి’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు ఆది పినిశెట్టి వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. కోలీవుడ్‌ నటి నిక్కీ గల్రానీని ఆయన పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలు వీరి పెళ్లికి వేదికైంది. ‘గుండెల్లో గోదారి’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు ఆది పినిశెట్టి వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. కోలీవుడ్‌ నటి నిక్కీ గల్రానీని ఆయన పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలు వీరి పెళ్లికి వేదికైంది.
21/29
22/29
‘డా.వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకంలో భాగంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ జెండా ఊపి 

ప్రారంభించారు. మొదటి దశలో రూ.143 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ వాహనాలను కొనుగోలు చేసింది. పాడి రైతులు, గొర్రెలు, మేకల 

పెంపకందారులు 1962 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఈ అంబులెన్స్‌లు ఆయా ప్రాంతాలకు చేరుకొని వైద్య సేవలందిస్తాయి. ‘డా.వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకంలో భాగంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి దశలో రూ.143 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ వాహనాలను కొనుగోలు చేసింది. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు 1962 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఈ అంబులెన్స్‌లు ఆయా ప్రాంతాలకు చేరుకొని వైద్య సేవలందిస్తాయి.
23/29
24/29
సినీ, ఫ్యాషన్‌ ప్రియులందరూ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. ‘క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌’గా పిలుచుకొనే ఐశ్వర్య రాయ్‌ కేన్స్‌లోని ఎర్రతివాచీపై హంసనడకతో అదరహో అనిపించింది. నలుపు, పూలగౌనులో చాలా సింపుల్‌గా ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పైకి అడుగుపెట్టగానే అందరి చూపు ఆమె పైనే పడింది. సినీ, ఫ్యాషన్‌ ప్రియులందరూ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. ‘క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌’గా పిలుచుకొనే ఐశ్వర్య రాయ్‌ కేన్స్‌లోని ఎర్రతివాచీపై హంసనడకతో అదరహో అనిపించింది. నలుపు, పూలగౌనులో చాలా సింపుల్‌గా ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పైకి అడుగుపెట్టగానే అందరి చూపు ఆమె పైనే పడింది.
25/29
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ వద్ద పుస్తకాల కోసం పలువురు అభ్యర్థులు బారులు తీరుతున్నారు. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర అవతరణ, భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పుస్తకాలు కొనేందుకు రోజూ దాదాపు 700మంది ఉద్యోగార్థులు వస్తున్నారని అకాడమీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ వద్ద పుస్తకాల కోసం పలువురు అభ్యర్థులు బారులు తీరుతున్నారు. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర అవతరణ, భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పుస్తకాలు కొనేందుకు రోజూ దాదాపు 700మంది ఉద్యోగార్థులు వస్తున్నారని అకాడమీ అధికారులు తెలిపారు.
26/29
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో సందర్శకులు వేసిన బిస్కెట్లను ఓ కపోతం ఆరగిస్తుండగా.. భయంభయంగా ఓ ఉడత అందులో భాగానికి వచ్చింది. పావురం అడ్డు చెప్పకపోవడంతో స్వేచ్ఛగా దానితో కలిసి బిస్కెట్లను ఆరగించిందిలా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో సందర్శకులు వేసిన బిస్కెట్లను ఓ కపోతం ఆరగిస్తుండగా.. భయంభయంగా ఓ ఉడత అందులో భాగానికి వచ్చింది. పావురం అడ్డు చెప్పకపోవడంతో స్వేచ్ఛగా దానితో కలిసి బిస్కెట్లను ఆరగించిందిలా..
27/29
28/29
మట్టి గణపతి విగ్రహాలకు హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పండగకు నాలుగు నెలల ముందు నుంచే ఆ విగ్రహాల తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు. వనస్థలిపురంలో బంకమన్ను, వరిగడ్డి కట్టెలతో విగ్రహాలు రూపొందిస్తున్నారిలా.. మట్టి గణపతి విగ్రహాలకు హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పండగకు నాలుగు నెలల ముందు నుంచే ఆ విగ్రహాల తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు. వనస్థలిపురంలో బంకమన్ను, వరిగడ్డి కట్టెలతో విగ్రహాలు రూపొందిస్తున్నారిలా..
29/29
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటారు వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్స్‌ ఐకాస నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. నూతన చట్టాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు డ్రైవర్లు బంద్‌ పాటిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఇలా నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటారు వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్స్‌ ఐకాస నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. నూతన చట్టాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు డ్రైవర్లు బంద్‌ పాటిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఇలా నిరసన చేపట్టారు.

మరిన్ని