News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 20 May 2022 06:52 IST
1/22
శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కనులపండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వరస్వామి వారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కనులపండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వరస్వామి వారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
2/22
3/22
హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిర్వహించిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కీర్తీ సురేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కీర్తిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిర్వహించిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కీర్తీ సురేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కీర్తిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
4/22
5/22
6/22
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాప్తాడులో ఆయన నిర్వహించిన రోడ్‌షోకు తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాప్తాడులో ఆయన నిర్వహించిన రోడ్‌షోకు తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున తరలివచ్చారు.
7/22
పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు నిరసన చేపట్టారు. వినూత్న వస్ర్తధారణతో తాళాలు, డోలు వాయిస్తూ.. వంట పాత్రలను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు నిరసన చేపట్టారు. వినూత్న వస్ర్తధారణతో తాళాలు, డోలు వాయిస్తూ.. వంట పాత్రలను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు.
8/22
9/22
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి జోయా మీర్జా పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి జోయా మీర్జా పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/22
11/22
రాజస్థాన్‌లో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌లో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
12/22
13/22
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
14/22
లండన్‌లో జరుగుతున్న ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. లండన్‌లో జరుగుతున్న ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు.
15/22
వేసవి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక దిల్లీలోని నిరాశ్రయులు ఓ వంతెన నీడలో సేదతీరుతూ కనిపించారు. వేసవి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక దిల్లీలోని నిరాశ్రయులు ఓ వంతెన నీడలో సేదతీరుతూ కనిపించారు.
16/22
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోతున్న దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్‌ ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోతున్న దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్‌
17/22
18/22
19/22
ఉమ్మడి నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొంగరి సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదులు భార్య సుమతిని ఓదార్చి రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొంగరి సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదులు భార్య సుమతిని ఓదార్చి రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
20/22
సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మట్టి పాత్రలను పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో పక్షుల దాహార్తి 

తీర్చేందుకు వీలుగా అందరూ నీటితో కూడిన పాత్రలు అందుబాటులో ఉంచాలని ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’లో సూచించిన మేరకు 

ఈ పాత్రల్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మట్టి పాత్రలను పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో పక్షుల దాహార్తి తీర్చేందుకు వీలుగా అందరూ నీటితో కూడిన పాత్రలు అందుబాటులో ఉంచాలని ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’లో సూచించిన మేరకు ఈ పాత్రల్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
21/22
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ 

సందర్భంగా మెట్టుగూడ అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు జన సైనికులు భారీగా చేరుకొని ఆయన్ను గజమాలతో సత్కరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా మెట్టుగూడ అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు జన సైనికులు భారీగా చేరుకొని ఆయన్ను గజమాలతో సత్కరించారు.
22/22
మెడ, తల చుట్టూ ఈకల మఫ్లర్‌తో ఆకర్షణీయంగా కన్పిస్తున్న ఇది జాకోబిన్‌ పావురం. ఫ్రాన్స్ దేశంలో జాకోబిన్‌ సన్యాసుల వస్త్రధారణ 

ఇంచుమించు ఇలాగే ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇవి బేల చూపులు చూస్తూ ఉంటాయని, అప్పుడప్పుడు విచిత్రంగా 

ప్రవర్తిస్తాయని జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాలకు చెందిన జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని 

రెజిమెంటల్ బజార్‌లో పెంపుడు జంతువులను విక్రయించే దుకాణంలో కనిపించింది ఈ అరుదైన పక్షి. మెడ, తల చుట్టూ ఈకల మఫ్లర్‌తో ఆకర్షణీయంగా కన్పిస్తున్న ఇది జాకోబిన్‌ పావురం. ఫ్రాన్స్ దేశంలో జాకోబిన్‌ సన్యాసుల వస్త్రధారణ ఇంచుమించు ఇలాగే ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇవి బేల చూపులు చూస్తూ ఉంటాయని, అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాయని జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాలకు చెందిన జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో పెంపుడు జంతువులను విక్రయించే దుకాణంలో కనిపించింది ఈ అరుదైన పక్షి.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని