News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 22 May 2022 10:32 IST
1/16
సోమశిల కొండల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. జలాశయం కుడివైపు విస్తరించి.. కండలేరు వరద కాలువ పక్కనే ఉన్న కొండ 

సానువుల్లోకి.. ఆపై రాజుపాలెం వైపు వ్యాప్తి చెందాయి. తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోమశిల కొండల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. జలాశయం కుడివైపు విస్తరించి.. కండలేరు వరద కాలువ పక్కనే ఉన్న కొండ సానువుల్లోకి.. ఆపై రాజుపాలెం వైపు వ్యాప్తి చెందాయి. తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
2/16
తాడిపత్రి పురపాలికలో టమోటా ధర ఆకాశన్నంటుతోంది. శనివారం కిలో రూ.100 పలికింది. సామాన్యులు కొనలేక ఇబ్బంది పడ్డారు. గత 

వారం రోజుల నుంచి రూ.80, రూ.90 ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో, జిల్లాలో పంట దిగుబడి తగ్గడంతో చిక్కబళ్లాపుర, మహారాష్ట్ర 

వంటి ప్రాంతాల నుంచి టామోటాను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. తాడిపత్రి పురపాలికలో టమోటా ధర ఆకాశన్నంటుతోంది. శనివారం కిలో రూ.100 పలికింది. సామాన్యులు కొనలేక ఇబ్బంది పడ్డారు. గత వారం రోజుల నుంచి రూ.80, రూ.90 ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో, జిల్లాలో పంట దిగుబడి తగ్గడంతో చిక్కబళ్లాపుర, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి టామోటాను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు.
3/16
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు మురుగు దారిలో నడుచుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం 

కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దారులు బురదమయంగా మారాయి. ఆదోని మండలం బైచిగేరిలో బురదనీరు 

దాటేపుడు ఎమ్మెల్యే కిందపడబోతుండగా వెనుకే ఉన్న కానిస్టేబుల్‌ లేపాక్షి వెంటనే స్పందించి పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు మురుగు దారిలో నడుచుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దారులు బురదమయంగా మారాయి. ఆదోని మండలం బైచిగేరిలో బురదనీరు దాటేపుడు ఎమ్మెల్యే కిందపడబోతుండగా వెనుకే ఉన్న కానిస్టేబుల్‌ లేపాక్షి వెంటనే స్పందించి పట్టుకున్నారు.
4/16
పుట్టుకతోనే ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తె సౌకర్యం కోసం తల్లిదండ్రులు సాధారణ కారును మార్పు చేయించారు. దీక్షసంపత్‌ 7వ 

తరగతి చదువుతోంది. ఆమె కోసం బెంగళూరు హోస్‌కోటేలో సాధారణ కారును విద్యార్థిని వీల్‌ఛైర్‌తో సహా కూర్చునేలా తయారు 

చేయించారు. లోపలకు, బయటకు వెళ్లేలా ర్యాంప్‌ అమర్చారు. ఇందుకు రూ.2.30 లక్షలు వెచ్చించారు. బెంగళూరుకు చెందిన ఈ 

కుటుంబం శనివారం తిరుమలకు వచ్చింది. పుట్టుకతోనే ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తె సౌకర్యం కోసం తల్లిదండ్రులు సాధారణ కారును మార్పు చేయించారు. దీక్షసంపత్‌ 7వ తరగతి చదువుతోంది. ఆమె కోసం బెంగళూరు హోస్‌కోటేలో సాధారణ కారును విద్యార్థిని వీల్‌ఛైర్‌తో సహా కూర్చునేలా తయారు చేయించారు. లోపలకు, బయటకు వెళ్లేలా ర్యాంప్‌ అమర్చారు. ఇందుకు రూ.2.30 లక్షలు వెచ్చించారు. బెంగళూరుకు చెందిన ఈ కుటుంబం శనివారం తిరుమలకు వచ్చింది.
5/16
6/16
జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌లో వాస్తవాధీన రేఖ సమీపాన శనివారం యోగా కార్యక్రమంలో పాల్గొన్న సైనికులు జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌లో వాస్తవాధీన రేఖ సమీపాన శనివారం యోగా కార్యక్రమంలో పాల్గొన్న సైనికులు
7/16
కూరగాయల మండీ మొత్తాన్ని వాహనం పైనే తీసుకెళుతున్నట్లుంది కదూ ఈ చిత్రం. కూరగాయల మార్కెట్‌ నుంచి ద్విచక్ర వాహనంపై తన దుకాణానికి అన్ని రకాల కూరగాయలను బండికి వీలున్న చోటల్లా తగిలించుకొని తీసుకెళుతూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది ఈ మహిళ. కూరగాయల మండీ మొత్తాన్ని వాహనం పైనే తీసుకెళుతున్నట్లుంది కదూ ఈ చిత్రం. కూరగాయల మార్కెట్‌ నుంచి ద్విచక్ర వాహనంపై తన దుకాణానికి అన్ని రకాల కూరగాయలను బండికి వీలున్న చోటల్లా తగిలించుకొని తీసుకెళుతూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది ఈ మహిళ.
8/16
ఒకప్పుడు జీవనది అయిన మూసీ నేడు కాలకూట విషానికి నిలయమైంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలను తొలగించేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా ప్రయోజనం అంతంతే. ప్లాస్టిక్‌ వ్యర్థాల మధ్య ఆహారం కోసం ఓ పక్షి తాపత్రయ పడుతున్న ఈ దృశ్యం చాదర్‌ఘాట్‌ వద్ద కెమెరాకు చిక్కింది. ఒకప్పుడు జీవనది అయిన మూసీ నేడు కాలకూట విషానికి నిలయమైంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలను తొలగించేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా ప్రయోజనం అంతంతే. ప్లాస్టిక్‌ వ్యర్థాల మధ్య ఆహారం కోసం ఓ పక్షి తాపత్రయ పడుతున్న ఈ దృశ్యం చాదర్‌ఘాట్‌ వద్ద కెమెరాకు చిక్కింది.
9/16
ఈత కొలన్లలో ప్రమాదాలు చోటు చేసుకుని చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు వెలుగు చూశాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను సత్వరం ఎలా రక్షించాలో తెలిపేలా శనివారం ఎల్‌బీ స్టేడియంలోని ఈత కొలనులో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ ధనలక్ష్మి, తెలంగాణ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఆసోసియేషన్‌ కార్యదర్శి రామకృష్ణ, సుజాత గ్రూపు విద్యా సంస్థల ఛైర్మన్‌ జయప్రకాశ్‌సింగ్, కోచ్‌ సంతోష్‌ పాల్గొన్నారు. ఈత కొలన్లలో ప్రమాదాలు చోటు చేసుకుని చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు వెలుగు చూశాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను సత్వరం ఎలా రక్షించాలో తెలిపేలా శనివారం ఎల్‌బీ స్టేడియంలోని ఈత కొలనులో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ ధనలక్ష్మి, తెలంగాణ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఆసోసియేషన్‌ కార్యదర్శి రామకృష్ణ, సుజాత గ్రూపు విద్యా సంస్థల ఛైర్మన్‌ జయప్రకాశ్‌సింగ్, కోచ్‌ సంతోష్‌ పాల్గొన్నారు.
10/16
తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో జీఎన్‌సీ టోల్‌ గేట్‌ సమీపంలో శనివారం ఆరు అడుగుల నాగుపాము కలకలం సృష్టించింది. నడకదారిలో పాము ప్రవేశించడంతో భక్తులు, దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం అందించగా ఆయన వచ్చి పామును చాక చక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో జీఎన్‌సీ టోల్‌ గేట్‌ సమీపంలో శనివారం ఆరు అడుగుల నాగుపాము కలకలం సృష్టించింది. నడకదారిలో పాము ప్రవేశించడంతో భక్తులు, దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం అందించగా ఆయన వచ్చి పామును చాక చక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.
11/16
హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ముందు రహదారిపై శనివారం ఆయిల్‌ పడింది. వాహనాలు జారిపడగా పలువురికి గాయాలయ్యాయి. సమీపంలో పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని చివరకు తామే బారికేడ్లు అడ్డుపెట్టామని స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ముందు రహదారిపై శనివారం ఆయిల్‌ పడింది. వాహనాలు జారిపడగా పలువురికి గాయాలయ్యాయి. సమీపంలో పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని చివరకు తామే బారికేడ్లు అడ్డుపెట్టామని స్థానికులు తెలిపారు.
12/16
13/16
వివాహాలు, శుభకార్యాలకు అవసరమైన కొబ్బరి ఆకుల పందిళ్లు కావాలంటే.. చలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం అనాల్సిందే. వీటి తయారీని ఇక్కడ పలువురు వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబాలకు చెందిన ఓ చిన్నారి ఎండ వేడికి తట్టుకోలేక ఆకుల పందిరిపై సేద తీరుతూ కనిపించిందిలా. వివాహాలు, శుభకార్యాలకు అవసరమైన కొబ్బరి ఆకుల పందిళ్లు కావాలంటే.. చలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం అనాల్సిందే. వీటి తయారీని ఇక్కడ పలువురు వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబాలకు చెందిన ఓ చిన్నారి ఎండ వేడికి తట్టుకోలేక ఆకుల పందిరిపై సేద తీరుతూ కనిపించిందిలా.
14/16
మూడు షట్టర్‌ గదులతో కూడిన ఈ రేకుల షెడ్డే ఔత్సాహిక యువతను బాక్సింగ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కర్మాగారమంటే నమ్మబుద్ధి కాదు. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖిత్‌ జరీన్‌ సహా మరో అయిదుగురు అంతర్జాతీయ, 25 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు తొలుత ఇక్కడ శిక్షణ పొందిన వారే. నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో 80 ఏళ్ల వయోధిక బాక్సింగ్‌ శిక్షకుడు సంసముద్దీన్‌ దీన్ని నడిపిస్తున్నారు. అరకొర వసతులున్నా.. తనకున్న అనుభవాన్ని జోడించి క్రీడాకారులను సాన పడుతున్నారు. నిఖిత్‌ జరీన్‌ సైతం 2009-2012 మధ్య ఇక్కడే తర్ఫీదు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో బాక్సింగ్‌ అకాడమీని కేటాయించి, తగిన వసతులు కల్పించి, ఆసక్తిగల యువతను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. మూడు షట్టర్‌ గదులతో కూడిన ఈ రేకుల షెడ్డే ఔత్సాహిక యువతను బాక్సింగ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కర్మాగారమంటే నమ్మబుద్ధి కాదు. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖిత్‌ జరీన్‌ సహా మరో అయిదుగురు అంతర్జాతీయ, 25 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు తొలుత ఇక్కడ శిక్షణ పొందిన వారే. నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో 80 ఏళ్ల వయోధిక బాక్సింగ్‌ శిక్షకుడు సంసముద్దీన్‌ దీన్ని నడిపిస్తున్నారు. అరకొర వసతులున్నా.. తనకున్న అనుభవాన్ని జోడించి క్రీడాకారులను సాన పడుతున్నారు. నిఖిత్‌ జరీన్‌ సైతం 2009-2012 మధ్య ఇక్కడే తర్ఫీదు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో బాక్సింగ్‌ అకాడమీని కేటాయించి, తగిన వసతులు కల్పించి, ఆసక్తిగల యువతను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు.
15/16
16/16

మరిన్ని