News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 23 May 2022 08:21 IST
1/25
శవాలు కాల్చేచోట ధాన్యపు రాశులు ఎలా.. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ చిత్రం కోటపల్లి మండలంలోని 63వ జాతీయ రహదారి పక్కన 

ఉంది. దేవులవాడ, బబ్బెరుచెల్క గ్రామాలకు చెందిన వైకుంఠ ధామాలు వినియోగంలో లేక పోవడంతో సంబంధిత ప్రదేశాల్లో రైతులు ధాన్యం 

ఆరబోసుకుంటున్నారు. గత రెండేళ్లుగా అధికారులు కొనుగోలు కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేస్తుండటంతో వైకుంఠ ధామాలు కాస్తా ధాన్యం 

కొనుగోలు కేంద్రాలుగా మారడం విశేషం. గత పది రోజులుగా లారీలు రాకపోవడంతో నిద్రాహారాలు ఇక్కడే జరుగుతున్న అధికారులు 

పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. శవాలు కాల్చేచోట ధాన్యపు రాశులు ఎలా.. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ చిత్రం కోటపల్లి మండలంలోని 63వ జాతీయ రహదారి పక్కన ఉంది. దేవులవాడ, బబ్బెరుచెల్క గ్రామాలకు చెందిన వైకుంఠ ధామాలు వినియోగంలో లేక పోవడంతో సంబంధిత ప్రదేశాల్లో రైతులు ధాన్యం ఆరబోసుకుంటున్నారు. గత రెండేళ్లుగా అధికారులు కొనుగోలు కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేస్తుండటంతో వైకుంఠ ధామాలు కాస్తా ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారడం విశేషం. గత పది రోజులుగా లారీలు రాకపోవడంతో నిద్రాహారాలు ఇక్కడే జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
2/25
తోపుడు బండిని ఓ క్రీడాకారుడు సైకిల్‌ తొక్కుతూ లాక్కెళ్తున్నట్టున్న ఈ చిత్రం నిజంగా వి‘చిత్రమే’. ఖమ్మం నగరంలోని క్రీడామైదానం 

చుట్టూ ప్రహరీపై జాతీయ క్రీడాకారుల రూపాలను చిత్రీకరించారు. అందులో ఓ చిత్రమే సైకిల్‌ తొక్కుతున్న క్రీడాకారుడు. రహదారిపై నిలిపిన 

తోపుడు బండి ఆ చిత్రం వెనకభాగాన్ని కమ్మేయడంతో ఈ చిత్రం ఆవిష్కృతమైంది. దీన్ని వచ్చీపోయే వారంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తోపుడు బండిని ఓ క్రీడాకారుడు సైకిల్‌ తొక్కుతూ లాక్కెళ్తున్నట్టున్న ఈ చిత్రం నిజంగా వి‘చిత్రమే’. ఖమ్మం నగరంలోని క్రీడామైదానం చుట్టూ ప్రహరీపై జాతీయ క్రీడాకారుల రూపాలను చిత్రీకరించారు. అందులో ఓ చిత్రమే సైకిల్‌ తొక్కుతున్న క్రీడాకారుడు. రహదారిపై నిలిపిన తోపుడు బండి ఆ చిత్రం వెనకభాగాన్ని కమ్మేయడంతో ఈ చిత్రం ఆవిష్కృతమైంది. దీన్ని వచ్చీపోయే వారంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
3/25
ఈ చిత్రం రిమ్స్‌ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలోనిది. ఈ విభాగంలో రోగుల కోసం ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. దానికి లోపలి 

నుంచి గడియ లేదు. దీంతో ఒంటికి, రెంటికి వెళ్లాలన్నా.. మహిళలు ఒకరు లోనికి వెళితే మరొకరు ఇలా తలుపును పట్టుకోవాల్సిందే. ఇలా 

పట్టుకుంటే గానీ వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింగ్‌ను విచారించగా.. పరిశీలించి త్వరలో లోపలి 

నుంచి గడియ ఏర్పాటు చేయిస్తానన్నారు. ఈ చిత్రం రిమ్స్‌ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలోనిది. ఈ విభాగంలో రోగుల కోసం ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. దానికి లోపలి నుంచి గడియ లేదు. దీంతో ఒంటికి, రెంటికి వెళ్లాలన్నా.. మహిళలు ఒకరు లోనికి వెళితే మరొకరు ఇలా తలుపును పట్టుకోవాల్సిందే. ఇలా పట్టుకుంటే గానీ వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింగ్‌ను విచారించగా.. పరిశీలించి త్వరలో లోపలి నుంచి గడియ ఏర్పాటు చేయిస్తానన్నారు.
4/25
పలమనేరు మండలం ముసలిమడుగు, కృష్ణాపురం గ్రామాలను ఏనుగులు వదలడం లేదు. రైతులు నిత్యం గజరాజుల దాడులతో 

కుదేలవుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇవి గ్రామాల పరిసరాల్లోని పొలాల్లో తిరుగుతూ ధ్వంసం 

చేశాయి. రైతులు, అటవీశాఖ సిబ్బంది వాటిని తరమడానికి చేసిన యత్నాలు విఫలమయ్యాయి. అవి అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చేయడంతో 

విసిగిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం అడవిలోకి వెళ్లిపోవడతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పలమనేరు మండలం ముసలిమడుగు, కృష్ణాపురం గ్రామాలను ఏనుగులు వదలడం లేదు. రైతులు నిత్యం గజరాజుల దాడులతో కుదేలవుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇవి గ్రామాల పరిసరాల్లోని పొలాల్లో తిరుగుతూ ధ్వంసం చేశాయి. రైతులు, అటవీశాఖ సిబ్బంది వాటిని తరమడానికి చేసిన యత్నాలు విఫలమయ్యాయి. అవి అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చేయడంతో విసిగిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం అడవిలోకి వెళ్లిపోవడతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
5/25
గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామ రైతు లింగన్న ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. 

ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెట్టి బొప్పాయి మొక్కలు నాటారు. వైరస్‌ ప్రభావంతో పంట అరకొరగా వచ్చింది. కోతలు వస్తున్న 

సమయంలో అసని తుపానుతో ఈదురు గాలులు వీయడంతో పండ్లు రాలిపోయాయి. రూ.3 లక్షలకుపైగా నష్టం వచ్చినట్లు రైతు ఆవేదన 

వ్యక్తం చేశారు. చివరికి పంటను గొర్రెలకు వదిలేశారు. కైరవాడి, పెద్దమర్రివీడు, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, నెరుడుప్పల తదితర గ్రామాల్లోనూ 

ఇదే పరిస్థితి. గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామ రైతు లింగన్న ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెట్టి బొప్పాయి మొక్కలు నాటారు. వైరస్‌ ప్రభావంతో పంట అరకొరగా వచ్చింది. కోతలు వస్తున్న సమయంలో అసని తుపానుతో ఈదురు గాలులు వీయడంతో పండ్లు రాలిపోయాయి. రూ.3 లక్షలకుపైగా నష్టం వచ్చినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పంటను గొర్రెలకు వదిలేశారు. కైరవాడి, పెద్దమర్రివీడు, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, నెరుడుప్పల తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.
6/25
విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ‘శ్రీమతి వైజాగ్‌’ కార్యక్రమంలో ర్యాంప్‌వాక్‌ చేస్తున్న మహిళ విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ‘శ్రీమతి వైజాగ్‌’ కార్యక్రమంలో ర్యాంప్‌వాక్‌ చేస్తున్న మహిళ
7/25
ఇంటింటికీ శుద్ధజలం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ 

భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా వేసిన 

పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నాయి. తాజాగా ఇందల్‌వాయి మండలం 

చంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన పైపులైన్‌ 

వాల్వు ఊడిపోవడంతో అరగంటపాటు నీరు ఎగిసిపడింది. 

రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లీకేజీని 

గమనించిన సిబ్బంది సరఫరా నిలిపివేశారు. ఇంటింటికీ శుద్ధజలం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా వేసిన పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నాయి. తాజాగా ఇందల్‌వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన పైపులైన్‌ వాల్వు ఊడిపోవడంతో అరగంటపాటు నీరు ఎగిసిపడింది. రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లీకేజీని గమనించిన సిబ్బంది సరఫరా నిలిపివేశారు.
8/25
హైదరాబాద్‌ నగరంలో భానుడు ఠారెత్తిస్తున్నాడు. దీంతో అత్యవసర పనులపై తిరిగే వారు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు అల్లాడిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అలసిపోయిన ఓ వృద్ధుడు తన ద్విచక్రవాహనాన్ని సంజీవయ్య పార్కు వద్ద ఓ చెట్ట నీడలో నిలిపి ఇలా సేద తీరారు. హైదరాబాద్‌ నగరంలో భానుడు ఠారెత్తిస్తున్నాడు. దీంతో అత్యవసర పనులపై తిరిగే వారు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు అల్లాడిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అలసిపోయిన ఓ వృద్ధుడు తన ద్విచక్రవాహనాన్ని సంజీవయ్య పార్కు వద్ద ఓ చెట్ట నీడలో నిలిపి ఇలా సేద తీరారు.
9/25
రహదారుల పక్కనే వేగాన్ని నిర్దేశించే సూచికలు ఉంటాయి. వాటిని వాహనదారులు పాటిస్తున్నారా? లేదా? ట్రాఫిక్‌ నిఘా కళ్లు పరిశీలిస్తూనే ఉంటాయి. ట్యాంక్‌బండ్‌పై కనిపించిన దృశ్యం. రహదారుల పక్కనే వేగాన్ని నిర్దేశించే సూచికలు ఉంటాయి. వాటిని వాహనదారులు పాటిస్తున్నారా? లేదా? ట్రాఫిక్‌ నిఘా కళ్లు పరిశీలిస్తూనే ఉంటాయి. ట్యాంక్‌బండ్‌పై కనిపించిన దృశ్యం.
10/25
కరోనా భయం దాదాపుగా వీడిపోవడంతో వారాంతాలు పర్యాటక ప్రాంతాలు పాతరోజులను తలపిస్తున్నాయి. లుంబినీ పార్కు సహా పరిసర ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. లుంబినీ పార్కులోని ఫౌంటెయిన్‌ వద్ద నీళ్లలో చిన్నారులు సందడి చేశారు. కరోనా భయం దాదాపుగా వీడిపోవడంతో వారాంతాలు పర్యాటక ప్రాంతాలు పాతరోజులను తలపిస్తున్నాయి. లుంబినీ పార్కు సహా పరిసర ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. లుంబినీ పార్కులోని ఫౌంటెయిన్‌ వద్ద నీళ్లలో చిన్నారులు సందడి చేశారు.
11/25
12/25
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో అభ్యర్థులు సాధనపై మరింత దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ కేంద్ర గంథ్రాలయం వద్ద రాత్రుళ్లు సాధన చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీ సాయంత్రం 4.30కే మూసేయగా చెట్ల కింద చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో అభ్యర్థులు సాధనపై మరింత దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ కేంద్ర గంథ్రాలయం వద్ద రాత్రుళ్లు సాధన చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీ సాయంత్రం 4.30కే మూసేయగా చెట్ల కింద చదువుకున్నారు.
13/25
14/25
ఎండాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో మట్టి కుండలకు డిమాండ్‌ పెరుగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా మట్టి కుండలు, వివిధ లోహాలతో తయారు చేసిన వీటి పాత్రలు ఎక్కువగా వాడే గ్రామాల్లో కొన్నేళ్లుగా వాటి డిమాండ్‌ తగ్గుతోంది. నీటిని మోసేందుకు, వివిధ అవసరాలకు తేలికగా ఉండడంతో పాటు చౌకగా లభించే ప్లాస్టిక్‌ బిందెల వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో విక్రయానికి తెచ్చిన కుండలను.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌లో అమ్మకానికి తీసుకెళుతున్న ప్లాస్టిక్‌ బిందెలను పై చిత్రాల్లో చూడవచ్చు. ఎండాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో మట్టి కుండలకు డిమాండ్‌ పెరుగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా మట్టి కుండలు, వివిధ లోహాలతో తయారు చేసిన వీటి పాత్రలు ఎక్కువగా వాడే గ్రామాల్లో కొన్నేళ్లుగా వాటి డిమాండ్‌ తగ్గుతోంది. నీటిని మోసేందుకు, వివిధ అవసరాలకు తేలికగా ఉండడంతో పాటు చౌకగా లభించే ప్లాస్టిక్‌ బిందెల వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో విక్రయానికి తెచ్చిన కుండలను.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌లో అమ్మకానికి తీసుకెళుతున్న ప్లాస్టిక్‌ బిందెలను పై చిత్రాల్లో చూడవచ్చు.
15/25
16/25
హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి అధునాతన సౌకర్యాలు సమకూర్చుకొంటున్నా.. వాహనాల పార్కింగ్‌ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఓపీ, అత్యవసర విభాగాల వద్ద ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి అధునాతన సౌకర్యాలు సమకూర్చుకొంటున్నా.. వాహనాల పార్కింగ్‌ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఓపీ, అత్యవసర విభాగాల వద్ద ఇష్టానుసారంగా నిలుపుతున్నారు.
17/25
హైదరాబాద్‌ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పదిలమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆదివారం విద్యాశాఖాధికారులు పరిశీలించారు. విజయ్‌నగర్‌కాలనీ స్కూలులో హాల్‌టిక్కెట్ల నంబర్లతో కూడిన బోర్డును అమరుస్తున్న సిబ్బంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పదిలమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆదివారం విద్యాశాఖాధికారులు పరిశీలించారు. విజయ్‌నగర్‌కాలనీ స్కూలులో హాల్‌టిక్కెట్ల నంబర్లతో కూడిన బోర్డును అమరుస్తున్న సిబ్బంది.
18/25
హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక నిర్మాణాలు నిరాదరణకు గురవుతున్నాయి. అలాంటిదే సుమారు 400 సంవత్సరాల కిందట మహేశ్వరంలో నిర్మించిన దిగుడు బావి. రెండు వైపులా మెట్లు, దుస్తులు మార్చుకొనేందుకు ప్రత్యేక గదులు.. ఈ బావి సొంతం. పట్టించుకొనే వారు లేక శిథిలావస్థకు చేరుతోంది. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక నిర్మాణాలు నిరాదరణకు గురవుతున్నాయి. అలాంటిదే సుమారు 400 సంవత్సరాల కిందట మహేశ్వరంలో నిర్మించిన దిగుడు బావి. రెండు వైపులా మెట్లు, దుస్తులు మార్చుకొనేందుకు ప్రత్యేక గదులు.. ఈ బావి సొంతం. పట్టించుకొనే వారు లేక శిథిలావస్థకు చేరుతోంది.
19/25
20/25
మండుటెండల్లో ఉక్కపోతతో అందరూ అవస్థలు పడుతుంటే.. దిల్‌సుఖ్‌నగర్‌ గౌతమ్‌నగర్‌ కాలనీకి చెందిన సత్యవతి కుటుంబం మాత్రం ఆహ్లాదంగా కాలం గడుపుతోంది. కారణం.. 15 ఏళ్లుగా పెంచుతున్న తూర్పు ఆసియాకు చెందిన ఓ తీగజాతి మొక్క. ఫైకస్‌ పుమీల అనే శాస్త్రీయ నామం గల ఈ మొక్క రెండంతస్తుల భవనమంతా విస్తరించింది. ఫలితంగా బయటి కంటే ఇంట్లో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటోందని, ఉక్కపోత బాధ లేనేలేదని సత్యవతి చెప్పారు. ఈ తీగ జాతి మొక్క గోడలకు ఎలాంటి హానీ చేయదని, ఇంటిని చల్లబరిచి, అందాన్నిస్తుందని జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్‌ బి.సదాశివయ్య తెలిపారు. మండుటెండల్లో ఉక్కపోతతో అందరూ అవస్థలు పడుతుంటే.. దిల్‌సుఖ్‌నగర్‌ గౌతమ్‌నగర్‌ కాలనీకి చెందిన సత్యవతి కుటుంబం మాత్రం ఆహ్లాదంగా కాలం గడుపుతోంది. కారణం.. 15 ఏళ్లుగా పెంచుతున్న తూర్పు ఆసియాకు చెందిన ఓ తీగజాతి మొక్క. ఫైకస్‌ పుమీల అనే శాస్త్రీయ నామం గల ఈ మొక్క రెండంతస్తుల భవనమంతా విస్తరించింది. ఫలితంగా బయటి కంటే ఇంట్లో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటోందని, ఉక్కపోత బాధ లేనేలేదని సత్యవతి చెప్పారు. ఈ తీగ జాతి మొక్క గోడలకు ఎలాంటి హానీ చేయదని, ఇంటిని చల్లబరిచి, అందాన్నిస్తుందని జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్‌ బి.సదాశివయ్య తెలిపారు.
21/25
పచ్చదనం పెంపునకు శ్రీకారం చుడితే చాలదు. సంరక్షణకూ అంతే ప్రాధాన్యమివ్వాలి. లేదంటే చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు చందమే అవుతుంది. శంషాబాద్‌ కాముని చెరువు కట్టపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కిలోమీటర్‌ పొడవునా మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై పచ్చదనాన్ని సంతరించుకునే సమయంలో ఎవరో వ్యక్తులు చెరువు కట్ట పక్కన చెత్తకు నిప్పు పెట్టారు. ఆ వేడికి అయిదు వందల వరకు పచ్చని చెట్ల ఆకులు ఇలా నిలువునా మాడిపోయాయి. పచ్చదనం పెంపునకు శ్రీకారం చుడితే చాలదు. సంరక్షణకూ అంతే ప్రాధాన్యమివ్వాలి. లేదంటే చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు చందమే అవుతుంది. శంషాబాద్‌ కాముని చెరువు కట్టపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కిలోమీటర్‌ పొడవునా మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై పచ్చదనాన్ని సంతరించుకునే సమయంలో ఎవరో వ్యక్తులు చెరువు కట్ట పక్కన చెత్తకు నిప్పు పెట్టారు. ఆ వేడికి అయిదు వందల వరకు పచ్చని చెట్ల ఆకులు ఇలా నిలువునా మాడిపోయాయి.
22/25
23/25
వేపచెట్టుకు వందేళ్ల వేడుకలు నిర్వహించి వృక్షాల పట్ల తమ ప్రేమను చాటుకున్నారు బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామస్థులు. దివంగత నూతి సత్యనారాయణ 1923 మే 21న గ్రామంలోని శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం ఎదుట చిన్న వేప మొక్కను నాటారు. అప్పట్లో మొక్క చుట్టూ రచ్చబండ ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట వేపచెట్టును లక్ష్మీ ప్రదాతగా భావించిన స్థానికులు నాటి నుంచి పూజలు చేస్తున్నారు. ఈ నెల 21న ఈ వృక్షం వందో సంవత్సరంలోకి అడుగిడింది. దీంతో సత్యనారాయణ వారసులు ఈ చెట్టుకు వందేళ్ల వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వేపచెట్టుకు వందేళ్ల వేడుకలు నిర్వహించి వృక్షాల పట్ల తమ ప్రేమను చాటుకున్నారు బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామస్థులు. దివంగత నూతి సత్యనారాయణ 1923 మే 21న గ్రామంలోని శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం ఎదుట చిన్న వేప మొక్కను నాటారు. అప్పట్లో మొక్క చుట్టూ రచ్చబండ ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట వేపచెట్టును లక్ష్మీ ప్రదాతగా భావించిన స్థానికులు నాటి నుంచి పూజలు చేస్తున్నారు. ఈ నెల 21న ఈ వృక్షం వందో సంవత్సరంలోకి అడుగిడింది. దీంతో సత్యనారాయణ వారసులు ఈ చెట్టుకు వందేళ్ల వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
24/25
హుస్సేన్‌సాగర్‌ వద్ద నెక్లెస్‌ రోడ్డులో వినాయక, బతుకమ్మ నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన కోనేరు ఇది. నిర్వహణ లేకపోవడంతో ఇలా అధ్వానంగా మారింది. పక్కనే ఉన్న సంజీవయ్య పార్కుకు వచ్చేవారు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద నెక్లెస్‌ రోడ్డులో వినాయక, బతుకమ్మ నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన కోనేరు ఇది. నిర్వహణ లేకపోవడంతో ఇలా అధ్వానంగా మారింది. పక్కనే ఉన్న సంజీవయ్య పార్కుకు వచ్చేవారు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు.
25/25
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి వర్ధమాన సినీతార ఐశ్వర్య హాజరై సందడి చేశారు. ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి వర్ధమాన సినీతార ఐశ్వర్య హాజరై సందడి చేశారు. ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని