News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 23 May 2022 22:26 IST
1/26
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
2/26
3/26
సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ తన కుమారుడు అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ సెరమనిలో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌, కూతురు ఆద్య పాల్గొన్నారు. సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ తన కుమారుడు అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ సెరమనిలో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌, కూతురు ఆద్య పాల్గొన్నారు.
4/26
హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో జరిగిన నీరజ్ పన్వార్ హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో జరిగిన నీరజ్ పన్వార్ హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
5/26
6/26
టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుమార్తె సికింద్రాబాద్‌లోని కీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చి ఆమెకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుమార్తె సికింద్రాబాద్‌లోని కీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చి ఆమెకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు.
7/26
కాంగ్రెస్‌  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కార్యక్రమంలో ఓ కార్యకర్త తన శరీరంపై ఆయన చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానాన్ని చాటుకున్నాడు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కార్యక్రమంలో ఓ కార్యకర్త తన శరీరంపై ఆయన చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానాన్ని చాటుకున్నాడు.
8/26
తెలంగాణలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఓ విద్యార్థిని చివరి నిమిషంలో ద్విచక్రవాహనంపై పుస్తకంతో కుస్తీపడుతూ కనిపించింది. తెలంగాణలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఓ విద్యార్థిని చివరి నిమిషంలో ద్విచక్రవాహనంపై పుస్తకంతో కుస్తీపడుతూ కనిపించింది.
9/26
బంగ్లాదేశ్‌లో భారీవర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో సుమారు 24 మంది మృతి చెందారు. 90వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా దారులు మునగడంతో ఓ బాలుడు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై ప్రయాణిస్తూ కనిపించాడు. ఆటోలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని సైతం చిత్రంలో చూడొచ్చు. బంగ్లాదేశ్‌లో భారీవర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో సుమారు 24 మంది మృతి చెందారు. 90వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా దారులు మునగడంతో ఓ బాలుడు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై ప్రయాణిస్తూ కనిపించాడు. ఆటోలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని సైతం చిత్రంలో చూడొచ్చు.
10/26
11/26
ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఎస్‌పీజీ అధికారులతో కలిసి హైదరాబాద్ సీపీ ఆనంద్‌ పరిశీలించారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఎస్‌పీజీ అధికారులతో కలిసి హైదరాబాద్ సీపీ ఆనంద్‌ పరిశీలించారు.
12/26
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదాధికారుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు ప్రసంగించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదాధికారుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు ప్రసంగించారు.
13/26
14/26
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు టెక్‌ మహీంద్రా ఛైర్మన్‌, సీఈవో సీపీ గుర్నాని వచ్చారు. అక్కడి ఏపీ పెవిలియన్‌ను సందర్శించిన ఆయనతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు టెక్‌ మహీంద్రా ఛైర్మన్‌, సీఈవో సీపీ గుర్నాని వచ్చారు. అక్కడి ఏపీ పెవిలియన్‌ను సందర్శించిన ఆయనతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
15/26
క్వాడ్‌ దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడి ప్రధాని ఫుమియో కిషిదాను కలిసి మాట్లాడారు. వీరంతా టోక్యోలో సోమవారం ఇండో‌-పసిఫిక్‌ ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వాడ్‌ దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడి ప్రధాని ఫుమియో కిషిదాను కలిసి మాట్లాడారు. వీరంతా టోక్యోలో సోమవారం ఇండో‌-పసిఫిక్‌ ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
16/26
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఇసుక తుపాను రావడంతో ఆ ప్రాంతమంతా ఇలా ఇసుకతో నిండిపోయింది. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఇసుక తుపాను రావడంతో ఆ ప్రాంతమంతా ఇలా ఇసుకతో నిండిపోయింది.
17/26
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి జమీల్‌  సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. జరీన్‌ను క్రీడల్లో ప్రోత్సహించినందుకు రేవంత్‌ ఆయన్ను అభినందించారు. దేశం ఖ్యాతిని పెంచిన నిఖత్‌ జరీన్‌కు ఇటీవల రేవంత్‌రెడ్డి రూ.5లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి జమీల్‌ సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. జరీన్‌ను క్రీడల్లో ప్రోత్సహించినందుకు రేవంత్‌ ఆయన్ను అభినందించారు. దేశం ఖ్యాతిని పెంచిన నిఖత్‌ జరీన్‌కు ఇటీవల రేవంత్‌రెడ్డి రూ.5లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
18/26
19/26
ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్‌ ప్రావిన్స్‌లో ఓ ప్యాసింజర్‌ నౌకలో మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న ఓ ద్వీపానికి ప్రయాణిస్తుండగా సంభవించిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్‌ ప్రావిన్స్‌లో ఓ ప్యాసింజర్‌ నౌకలో మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న ఓ ద్వీపానికి ప్రయాణిస్తుండగా సంభవించిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు.
20/26
ఉద్యోగ ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ చేయాలనే డిమాండ్‌తో పీడీఎస్‌యూ, ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్‌) ఆధ్వర్యంలో నిరుద్యోగులు ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, నిబంధనలు పాటించని ప్రైవేటు కోచింగ్ సెంటర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగ ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ చేయాలనే డిమాండ్‌తో పీడీఎస్‌యూ, ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్‌) ఆధ్వర్యంలో నిరుద్యోగులు ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, నిబంధనలు పాటించని ప్రైవేటు కోచింగ్ సెంటర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
21/26
22/26
ఇంగ్లాండ్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సింహాసనాన్ని అధిరోహించి 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 

అందులో భాగంగా ఈ ‘ద క్వీన్స్‌ ప్లాటినం జూబ్లీ గార్డెన్‌’ను మొక్కలతో అందంగా ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సింహాసనాన్ని అధిరోహించి 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ‘ద క్వీన్స్‌ ప్లాటినం జూబ్లీ గార్డెన్‌’ను మొక్కలతో అందంగా ఏర్పాటు చేశారు.
23/26
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసు విచారణ నిమిత్తం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజయవాడ మొదటి అదనపు 

మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎన్నో అవినీతి 

ఆరోపణలు చేసిన వైకాపా ప్రభుత్వం.. ఏవీ నిరూపించలేక చివరికి కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసిందని విమర్శించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసు విచారణ నిమిత్తం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసిన వైకాపా ప్రభుత్వం.. ఏవీ నిరూపించలేక చివరికి కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసిందని విమర్శించారు.
24/26
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడలోని అంబేడ్కర్‌ 

విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న దళిత సంఘం నాయకులు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న దళిత సంఘం నాయకులు
25/26
జపాన్‌లో జరిగే క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే నిమిత్తం 

భారత ప్రధాని నరేంద్రమోదీ టోక్యో చేరుకున్నారు. ఈ సందర్భంగా 

అక్కడ నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు ఆయనకు ఘన 

స్వాగతం పలికారు. జాతీయ జెండాలు చేతబూని తన వద్దకు 

వచ్చిన చిన్నారులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. జపాన్‌లో జరిగే క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ టోక్యో చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలు చేతబూని తన వద్దకు వచ్చిన చిన్నారులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు.
26/26
హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో సందర్శకులు వేసిన గింజలు తినడం 

కోసం రెండు పక్షులు ఇలా తీవ్రంగా కొట్టుకుంటూ పోటీపడ్డాయి. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో సందర్శకులు వేసిన గింజలు తినడం కోసం రెండు పక్షులు ఇలా తీవ్రంగా కొట్టుకుంటూ పోటీపడ్డాయి.

మరిన్ని