News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 24 May 2022 12:17 IST
1/14
వేడాం-శ్రీకాళహస్తి రహదారిపై పలు చోట్ల పచ్చని చెట్లు పొదరిల్లులా రోడ్డును కప్పేశాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వృక్షాలు ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ఇటువైపుగా వెళ్లే వాహన చోదకులు ఎంతో మధురానుభూతిని పొందుతున్నారు. లఘు చిత్రదర్శకులు షూటింగులకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. వేడాం-శ్రీకాళహస్తి రహదారిపై పలు చోట్ల పచ్చని చెట్లు పొదరిల్లులా రోడ్డును కప్పేశాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వృక్షాలు ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ఇటువైపుగా వెళ్లే వాహన చోదకులు ఎంతో మధురానుభూతిని పొందుతున్నారు. లఘు చిత్రదర్శకులు షూటింగులకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
2/14
అనకాపల్లి జిల్లావ్యాప్తంగా సోమవారం ఎండ మండింది. ఉదయం 8 గంటలకే భానుడు భగభగలాడాడు. పది గంటల తర్వాత వేడికితోడు గాల్పులు మొదలయ్యాయి. వివిధ పనులపై రోడ్లపైకి వచ్చిన వారంతా ఎండవేడిమి తాళలేక అల్లాడిపోయారు. వ్యాపారులు దుకాణాలను మూసేశారు. జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. పేటలో 39 డిగ్రీలు, నక్కపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పేట పట్టణంలో వైఎస్‌ విగ్రహం సమీపంలోని దుకాణ సముదాయం ఎదుట ఏర్పాటు చేసిన టెంటు ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు సమీపాన ఇలా వరుస కట్టి ఉపాధి కూలీలు రోడ్డుపై నడుచుకుని వెళుతున్నారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా సోమవారం ఎండ మండింది. ఉదయం 8 గంటలకే భానుడు భగభగలాడాడు. పది గంటల తర్వాత వేడికితోడు గాల్పులు మొదలయ్యాయి. వివిధ పనులపై రోడ్లపైకి వచ్చిన వారంతా ఎండవేడిమి తాళలేక అల్లాడిపోయారు. వ్యాపారులు దుకాణాలను మూసేశారు. జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. పేటలో 39 డిగ్రీలు, నక్కపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పేట పట్టణంలో వైఎస్‌ విగ్రహం సమీపంలోని దుకాణ సముదాయం ఎదుట ఏర్పాటు చేసిన టెంటు ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు సమీపాన ఇలా వరుస కట్టి ఉపాధి కూలీలు రోడ్డుపై నడుచుకుని వెళుతున్నారు.
3/14
తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. సోమవారం ఈ సంఖ్య 1,200 నుంచి 1,600 వరకు చేరింది. ఓపీ చీటీల కోసం అవస్థలు పడాల్సి వచ్చింది. ఇక్కడ నాలుగు ఓపీ కౌంటర్లు ఉండగా.. వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన కౌంటర్‌ను సాంకేతిక కారణాలతో మూసివేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు రద్దీ నెలకొంది. ఎక్స్‌రే యంత్రం పనిచేయక ఆ విభాగం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. సోమవారం ఈ సంఖ్య 1,200 నుంచి 1,600 వరకు చేరింది. ఓపీ చీటీల కోసం అవస్థలు పడాల్సి వచ్చింది. ఇక్కడ నాలుగు ఓపీ కౌంటర్లు ఉండగా.. వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన కౌంటర్‌ను సాంకేతిక కారణాలతో మూసివేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు రద్దీ నెలకొంది. ఎక్స్‌రే యంత్రం పనిచేయక ఆ విభాగం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.
4/14
వేసవి సెలవుల సందర్భంగా ఇళ్ల వద్దే ఉంటున్న బాలికలు సరదాగా పనస ఆకులతో టోపీలు, జడలు తయారుచేసి వాటిని ధరించి ఆటలాడుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోనిదీ చిత్రం. వేసవి సెలవుల సందర్భంగా ఇళ్ల వద్దే ఉంటున్న బాలికలు సరదాగా పనస ఆకులతో టోపీలు, జడలు తయారుచేసి వాటిని ధరించి ఆటలాడుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోనిదీ చిత్రం.
5/14
గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వెళ్లేదారిలో భవన నిర్మాణ పనులు చేస్తుండడంతో ప్రమాదకరంగా ఉంది. సోమవారం ఓపీకి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నా.. పక్కనే స్లాబు ఇనుప రాడ్లను కార్మికులు తొలగిస్తున్నారు. చేయి జారి.. పొరపాటున అవి రోగులపై పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంది. ఓపీ సమయంలో ఈ పనులు చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వెళ్లేదారిలో భవన నిర్మాణ పనులు చేస్తుండడంతో ప్రమాదకరంగా ఉంది. సోమవారం ఓపీకి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నా.. పక్కనే స్లాబు ఇనుప రాడ్లను కార్మికులు తొలగిస్తున్నారు. చేయి జారి.. పొరపాటున అవి రోగులపై పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంది. ఓపీ సమయంలో ఈ పనులు చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
6/14
బాపట్ల జిల్లా నిజాంపట్నం పంచాయతీలో గోకర్ణమఠం గ్రామ సమీప మీదుళ్లపర్రులో మురుగు కాల్వ ఇది. సముద్రానికి చేరువలో ఉండడంతో ఏడాది పొడవునా ఇక్కడ నీటి ప్రవాహం సర్వసాధారణం. ఆటుపోట్ల సమయంలో కనీసం 10అడుగుల పైనే నీరుంటుంది. ఈ కాల్వకు అవతలి వైపు ఆక్వా సాగు చేసే రైతులు తాటిబొత్తలు, చెక్కలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నారు. దీని మీదుగానే మేత, ఇతర ముడిసరుకులు ద్విచక్ర వాహనాల సాయంతో ప్రమాదకరంగా తరలిస్తుంటారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం పంచాయతీలో గోకర్ణమఠం గ్రామ సమీప మీదుళ్లపర్రులో మురుగు కాల్వ ఇది. సముద్రానికి చేరువలో ఉండడంతో ఏడాది పొడవునా ఇక్కడ నీటి ప్రవాహం సర్వసాధారణం. ఆటుపోట్ల సమయంలో కనీసం 10అడుగుల పైనే నీరుంటుంది. ఈ కాల్వకు అవతలి వైపు ఆక్వా సాగు చేసే రైతులు తాటిబొత్తలు, చెక్కలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నారు. దీని మీదుగానే మేత, ఇతర ముడిసరుకులు ద్విచక్ర వాహనాల సాయంతో ప్రమాదకరంగా తరలిస్తుంటారు.
7/14
నగరంలోని మెట్రో స్టేషన్లలో సాధారణ మెట్లతో పాటు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.  ఒక్కో మెట్టు ఎక్కితే ఆరోగ్యమని, బరువూ తగ్గుతారని కొన్ని స్టేషన్లలో రాయించినా ప్రయాణికులంతా ఎస్కలేటర్లపైనే కిక్కిరిసి వెళుతున్నారు. సోమవారం అమీర్‌పేట స్టేషన్లో ఖాళీ మెట్లు, కిక్కిరిసిన ఎస్కలేటర్‌ కనిపించాయిలా. నగరంలోని మెట్రో స్టేషన్లలో సాధారణ మెట్లతో పాటు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మెట్టు ఎక్కితే ఆరోగ్యమని, బరువూ తగ్గుతారని కొన్ని స్టేషన్లలో రాయించినా ప్రయాణికులంతా ఎస్కలేటర్లపైనే కిక్కిరిసి వెళుతున్నారు. సోమవారం అమీర్‌పేట స్టేషన్లో ఖాళీ మెట్లు, కిక్కిరిసిన ఎస్కలేటర్‌ కనిపించాయిలా.
8/14
ఇదేంటి మనిషి ఒడిలోంచి ఏకంగా మాను పెరిగిందని ఆశ్చర్యపోకండి.. ఇది కేవలం బొమ్మే... మనిషి ఆకృతిని పోలిన కుండీ... దూరం నుంచి చూస్తే మనిషి మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లన్నట్లు.. వాటి సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్తున్నట్లు అనిపిస్తుంది. దానిపైన ఆంగ్ల అక్షరమాలను ముద్రించడంతో చిన్నారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ కూడలి వద్ద తీర్చిదిద్దిన థీమ్‌ పార్క్‌లో ఈ బొమ్మ ఆకట్టుకుంటోంది.. ఇదేంటి మనిషి ఒడిలోంచి ఏకంగా మాను పెరిగిందని ఆశ్చర్యపోకండి.. ఇది కేవలం బొమ్మే... మనిషి ఆకృతిని పోలిన కుండీ... దూరం నుంచి చూస్తే మనిషి మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లన్నట్లు.. వాటి సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్తున్నట్లు అనిపిస్తుంది. దానిపైన ఆంగ్ల అక్షరమాలను ముద్రించడంతో చిన్నారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ కూడలి వద్ద తీర్చిదిద్దిన థీమ్‌ పార్క్‌లో ఈ బొమ్మ ఆకట్టుకుంటోంది..
9/14
ఉస్మానియా ఆసుపత్రికి వివిధ జిల్లాల నుంచి వచ్చే జనాల వెతలు వర్ణణాతీతం. చక్రాల కుర్చీలో తీసుకెళ్లాలంటే రూ.50, స్ట్రెచర్‌కు రూ.100 ఇవ్వాలని సిబ్బంది కోరడంతో రోగుల కుటుంబ సభ్యులే ఇలా ఒకే  స్ట్రెచర్‌పై ఇద్దరిని తీసుకెళుతున్నారు.  ఉస్మానియా ఆసుపత్రికి వివిధ జిల్లాల నుంచి వచ్చే జనాల వెతలు వర్ణణాతీతం. చక్రాల కుర్చీలో తీసుకెళ్లాలంటే రూ.50, స్ట్రెచర్‌కు రూ.100 ఇవ్వాలని సిబ్బంది కోరడంతో రోగుల కుటుంబ సభ్యులే ఇలా ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరిని తీసుకెళుతున్నారు.
10/14
ప్రధాని మోదీ గత నెల దిల్లీలో ప్రారంభించిన ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం సందర్శించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా. ప్రధాని మోదీ గత నెల దిల్లీలో ప్రారంభించిన ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం సందర్శించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా.
11/14
అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండల కోమటిగుంట గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మీ ప్రసన్న పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. వయస్సు 17 ఏళ్లు వచ్చినా నేటికీ ఎదుగుదల లేక, శరీరం ఎముకల   గూడులా తయారై మంచానికే పరిమితమైంది. కూలిపని చేసుకుంటేనే  రోజు గడవని కుటుంబం.. కన్నతల్లే పనికి కూడా వెళ్లకుండా అన్నీ పక్కనే ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేల పింఛను ఆమె పోషణకు, వైద్యానికి, మందులకు సరిపోవడం లేదని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని సోమవారం కలెక్టర్‌కి విన్నవించడానికి స్పందన కార్యక్రమానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండల కోమటిగుంట గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మీ ప్రసన్న పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. వయస్సు 17 ఏళ్లు వచ్చినా నేటికీ ఎదుగుదల లేక, శరీరం ఎముకల గూడులా తయారై మంచానికే పరిమితమైంది. కూలిపని చేసుకుంటేనే రోజు గడవని కుటుంబం.. కన్నతల్లే పనికి కూడా వెళ్లకుండా అన్నీ పక్కనే ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేల పింఛను ఆమె పోషణకు, వైద్యానికి, మందులకు సరిపోవడం లేదని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని సోమవారం కలెక్టర్‌కి విన్నవించడానికి స్పందన కార్యక్రమానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు.
12/14
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించిన నేపథ్యంలో నగరంలోని కొన్ని బంకుల్లో పెట్రోల్‌ లేదని నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి.  కొన్ని బంకులు సోమవారం మూసి కనిపించాయి. ఖైరతాబాద్‌లోని పెట్రోల్‌ బంకు మూసిఉన్న చిత్రమిది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించిన నేపథ్యంలో నగరంలోని కొన్ని బంకుల్లో పెట్రోల్‌ లేదని నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి. కొన్ని బంకులు సోమవారం మూసి కనిపించాయి. ఖైరతాబాద్‌లోని పెట్రోల్‌ బంకు మూసిఉన్న చిత్రమిది.
13/14
ఎల్బీనగర్‌ కూడలిలో కనిపించిన సుందర చిత్రమిది. ఒకవైపు ఒకే సమయంలో రెండు మెట్రో రైళ్లు, మరోవైపు ఆటో, కార్లు, ఇతర వాహనాలు పరుగులు తీస్తూ కనిపించాయి. రెండు మార్గాలు వేరైనా ఇలా వరుస కట్టినట్టుగా వెళుతూ కనువిందు చేసాయి. ఎల్బీనగర్‌ కూడలిలో కనిపించిన సుందర చిత్రమిది. ఒకవైపు ఒకే సమయంలో రెండు మెట్రో రైళ్లు, మరోవైపు ఆటో, కార్లు, ఇతర వాహనాలు పరుగులు తీస్తూ కనిపించాయి. రెండు మార్గాలు వేరైనా ఇలా వరుస కట్టినట్టుగా వెళుతూ కనువిందు చేసాయి.
14/14
ఈ నెల 13న.. బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు హిమాయత్‌నగర్‌ నారాయణగూడ ప్రాంతాల్లో రోడ్లపై ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇది తెలిసి అక్రమణదారులు వెంటనే సామగ్రి సర్దుకుని దుకాణాలు మూసివేశారు.  అధికారులలా వెళ్లగానే మళ్లీ పాదబాటలు, రోడ్లను ఆక్రమించేశారు. వైఎంసీఏ కూడలిలో ఓ టిఫిన్‌ సెంటర్‌ తీరు అందుకు నిదర్శనం. ఈ నెల 13న.. బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు హిమాయత్‌నగర్‌ నారాయణగూడ ప్రాంతాల్లో రోడ్లపై ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇది తెలిసి అక్రమణదారులు వెంటనే సామగ్రి సర్దుకుని దుకాణాలు మూసివేశారు. అధికారులలా వెళ్లగానే మళ్లీ పాదబాటలు, రోడ్లను ఆక్రమించేశారు. వైఎంసీఏ కూడలిలో ఓ టిఫిన్‌ సెంటర్‌ తీరు అందుకు నిదర్శనం.

మరిన్ని