News In Pics: చిత్రం చెప్పే విశేషాలు

Updated : 25 May 2022 11:41 IST
1/18
ఖమ్మం నగరంలో అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోతుండగా కొన్నింటి తొట్లు పగిలిపోయాయి. మయూరివంతెనపై రెండు వైపులా ఏర్పాటు చేసిన విలువైన మొక్కలు నిర్వహణ లోపంతో కళావిహీనంగా కన్పిస్తున్నాయి. ఖమ్మం నగరంలో అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోతుండగా కొన్నింటి తొట్లు పగిలిపోయాయి. మయూరివంతెనపై రెండు వైపులా ఏర్పాటు చేసిన విలువైన మొక్కలు నిర్వహణ లోపంతో కళావిహీనంగా కన్పిస్తున్నాయి.
2/18
మహబూబ్‌నగర్‌ నుంచి కోయిలకొండకు వెళ్లే మార్గంలో మైసమ్మ గుడి గేట్‌ వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పాడుబడిన వ్యవసాయ బావి ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అందులో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాణాలు గాలిలో కలవకముందే అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి కోయిలకొండకు వెళ్లే మార్గంలో మైసమ్మ గుడి గేట్‌ వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పాడుబడిన వ్యవసాయ బావి ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అందులో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాణాలు గాలిలో కలవకముందే అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
3/18
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వెలేరుపాడు మండలానికి చెందిన కొందరు విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకులబోరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు పడవ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. సుదూర ప్రయాణం చేసేందుకు సమయాభావం వల్ల గోదావరిలోనే నడుములోతు నీళ్లలో కాలినడకన వెళ్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వెలేరుపాడు మండలానికి చెందిన కొందరు విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకులబోరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు పడవ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. సుదూర ప్రయాణం చేసేందుకు సమయాభావం వల్ల గోదావరిలోనే నడుములోతు నీళ్లలో కాలినడకన వెళ్తున్నారు.
4/18
ఉత్తరాంధ్రలో ప్రసవాలకు పేరున్న విశాఖపట్నంలోని విక్టోరియా ఆసుపత్రి(ఘోష)కి పలు ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువస్తుంటారు. వారితో పాటు వచ్చే కుటుంబీకులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లలో ఫ్యాన్లు లేవు. ప్రస్తుత ఎండలకు ఇక్కడ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రసవాలకు పేరున్న విశాఖపట్నంలోని విక్టోరియా ఆసుపత్రి(ఘోష)కి పలు ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువస్తుంటారు. వారితో పాటు వచ్చే కుటుంబీకులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లలో ఫ్యాన్లు లేవు. ప్రస్తుత ఎండలకు ఇక్కడ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
5/18
6/18
సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలోని కురమామిడి పంచాయతీ పాయకట్టుకు సమీపంలోని పెద్దకానిగాలకుంట చెరువు నుంచి సారవంతమైన మట్టి సరిహద్దులు దాటుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కడప జిల్లా వేంపల్లి సరిహద్దులోని కెనాల్‌ పనులకు తరలిస్తున్నారు. పొక్లెయిన్‌తో తోడి టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. తమ భూములకు మట్టి లేకుండా చేస్తున్నారని పాయకట్టు, నల్లగుట్టతండా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ జేఈ రామాంజులనాయక్‌ను వివరణ కోరగా డీఈని అడిగి పూర్తి వివరాలు తెలుపుతానని చెప్పారు. తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ తాము అనుమతి ఇవ్వలేదన్నారు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలోని కురమామిడి పంచాయతీ పాయకట్టుకు సమీపంలోని పెద్దకానిగాలకుంట చెరువు నుంచి సారవంతమైన మట్టి సరిహద్దులు దాటుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కడప జిల్లా వేంపల్లి సరిహద్దులోని కెనాల్‌ పనులకు తరలిస్తున్నారు. పొక్లెయిన్‌తో తోడి టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. తమ భూములకు మట్టి లేకుండా చేస్తున్నారని పాయకట్టు, నల్లగుట్టతండా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ జేఈ రామాంజులనాయక్‌ను వివరణ కోరగా డీఈని అడిగి పూర్తి వివరాలు తెలుపుతానని చెప్పారు. తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ తాము అనుమతి ఇవ్వలేదన్నారు.
7/18
అనంతపురం జిల్లా శింగనమల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బెంచీలను భవనంపై పడేశారు. నాడు- నేడు కింద కొత్త బెంచీలు రావడంతో సుమారు 400 పాత బెంచీలను పైన పడేశారు. వీటిలో ఎక్కువ శాతం పనికి వచ్చేవే ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులు చేస్తే ఇతర పాఠశాలల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఎంఈవో నరసింహరాజును వివరణ కోరగా పాఠశాల గదుల్లో స్థలం లేక పైన వేశారని, భద్రపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లా శింగనమల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బెంచీలను భవనంపై పడేశారు. నాడు- నేడు కింద కొత్త బెంచీలు రావడంతో సుమారు 400 పాత బెంచీలను పైన పడేశారు. వీటిలో ఎక్కువ శాతం పనికి వచ్చేవే ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులు చేస్తే ఇతర పాఠశాలల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఎంఈవో నరసింహరాజును వివరణ కోరగా పాఠశాల గదుల్లో స్థలం లేక పైన వేశారని, భద్రపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
8/18
అసలే ఎండవేడితో ఇబ్బందిపడుతున్న మూగజీవులు ఆకలి తీర్చుకోడానికి రహదారుల వెంబడి ఎంతో ఆబగా వెతుకుతుంటాయి. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రోడ్డులో ఓ చెత్తకుప్పకు ఎవరో నిప్పు పెట్టారు. మండుతున్న చెత్తలో నుంచే ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న ఆహారం తీసుకుని తింటున్న గోవు. అసలే ఎండవేడితో ఇబ్బందిపడుతున్న మూగజీవులు ఆకలి తీర్చుకోడానికి రహదారుల వెంబడి ఎంతో ఆబగా వెతుకుతుంటాయి. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రోడ్డులో ఓ చెత్తకుప్పకు ఎవరో నిప్పు పెట్టారు. మండుతున్న చెత్తలో నుంచే ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న ఆహారం తీసుకుని తింటున్న గోవు.
9/18
10/18
ఇదేంటి.. రైలుపై ఇతడు ఏం చేస్తున్నాడు అనిపిస్తోంది కదూ! నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరే ప్రతి రైలు ఇంజన్, పైన ఉండే ఫ్యాన్ల పనితీరును ఓ రైల్వే టెక్నీషియన్‌ ఎండలో పరిశీలిస్తున్న చిత్రమిది. ఇదేంటి.. రైలుపై ఇతడు ఏం చేస్తున్నాడు అనిపిస్తోంది కదూ! నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరే ప్రతి రైలు ఇంజన్, పైన ఉండే ఫ్యాన్ల పనితీరును ఓ రైల్వే టెక్నీషియన్‌ ఎండలో పరిశీలిస్తున్న చిత్రమిది.
11/18
దేశంలోనే మూడో అతిపెద్దది హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ పురావస్తు పరిశోధన కేంద్రం. నిత్యం వేలమంది సందర్శించే ఈ మ్యూజియం సదా విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతుంటుంది. విద్యుత్తు వినియోగమూ ఎక్కువే. ప్రతినెలా రూ.లక్షల్లో వచ్చే బిల్లును ఆదా చేస్తూ, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకు సర్కారు తీసుకొచ్చిన సౌర విద్యుత్తు విధానం సత్ఫలితాలనిస్తోంది. 660 కిలోవాట్ల సామర్థ్యమున్న సౌరఫలకల నుంచి నెలకు 78వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా నెలవారీ బిల్లులో రూ.8లక్షల దాకా ఆదా అవుతోందన్నారు. సౌర విద్యుత్తు భారీగా వినియోగిస్తున్న మ్యూజియం దేశంలో ఇదే కావడం గమనార్హం. దేశంలోనే మూడో అతిపెద్దది హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ పురావస్తు పరిశోధన కేంద్రం. నిత్యం వేలమంది సందర్శించే ఈ మ్యూజియం సదా విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతుంటుంది. విద్యుత్తు వినియోగమూ ఎక్కువే. ప్రతినెలా రూ.లక్షల్లో వచ్చే బిల్లును ఆదా చేస్తూ, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకు సర్కారు తీసుకొచ్చిన సౌర విద్యుత్తు విధానం సత్ఫలితాలనిస్తోంది. 660 కిలోవాట్ల సామర్థ్యమున్న సౌరఫలకల నుంచి నెలకు 78వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా నెలవారీ బిల్లులో రూ.8లక్షల దాకా ఆదా అవుతోందన్నారు. సౌర విద్యుత్తు భారీగా వినియోగిస్తున్న మ్యూజియం దేశంలో ఇదే కావడం గమనార్హం.
12/18
కార్గో గురించి ప్రజల మదిలో నాటుకుపోయేలా, చదువు ప్రాముఖ్యం విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది వేయించిన చిత్రాలు ఇవి. గౌలిగూడ సీబీఎస్‌ లోకల్‌ బస్టాండ్‌ వద్ద ఒక గదిలో కార్గో సర్వీసు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గోడపై వేసిన బస్సు బొమ్మ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. మరోవైపు సికింద్రాబాద్‌ ఓల్డ్‌ నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలకు ఆకాశమే హద్దుగా చదువుతో సాగిపో అంటూ వేసిన చిత్తరువు చూపరులను ఆకట్టుకుంటోంది. కార్గో గురించి ప్రజల మదిలో నాటుకుపోయేలా, చదువు ప్రాముఖ్యం విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది వేయించిన చిత్రాలు ఇవి. గౌలిగూడ సీబీఎస్‌ లోకల్‌ బస్టాండ్‌ వద్ద ఒక గదిలో కార్గో సర్వీసు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గోడపై వేసిన బస్సు బొమ్మ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. మరోవైపు సికింద్రాబాద్‌ ఓల్డ్‌ నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలకు ఆకాశమే హద్దుగా చదువుతో సాగిపో అంటూ వేసిన చిత్తరువు చూపరులను ఆకట్టుకుంటోంది.
13/18
14/18
మూసీలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతేడాది మూసారాంబాగ్‌ వంతెన మునిగి పైనుంచి వరద పోటెత్తింది. నది ఒడ్డున పేదల గుడిసెలు నీట మునగడంతో రెవెన్యూ అధికారులు స్పందించి నగర శివారు మునగనూరులో సుమారు 262 కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు. కొందరు స్థానిక నాయకులు మూసీకి మరో పక్క వారం రోజుల క్రితం తాత్కాలికంగా రేకుల షెడ్లు వేశారు. ఏమని అడిగితే తమకు రెండు పడకల ఇళ్లు కేటాయించలేదని సమాధానమిస్తున్నారు. మూసారాంబాగ్‌ వంతెన సమీపంలో పలు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో భూముల విలువ పెరుగుతోంది. మూసీపై కన్నేసిన కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతేడాది మూసారాంబాగ్‌ వంతెన మునిగి పైనుంచి వరద పోటెత్తింది. నది ఒడ్డున పేదల గుడిసెలు నీట మునగడంతో రెవెన్యూ అధికారులు స్పందించి నగర శివారు మునగనూరులో సుమారు 262 కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు. కొందరు స్థానిక నాయకులు మూసీకి మరో పక్క వారం రోజుల క్రితం తాత్కాలికంగా రేకుల షెడ్లు వేశారు. ఏమని అడిగితే తమకు రెండు పడకల ఇళ్లు కేటాయించలేదని సమాధానమిస్తున్నారు. మూసారాంబాగ్‌ వంతెన సమీపంలో పలు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో భూముల విలువ పెరుగుతోంది. మూసీపై కన్నేసిన కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
15/18
హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు ప్రధాన రహదారిలో గుల్‌మొహర్‌ చెట్టంతా ఎర్రనిపూలతో ఇలా కనువిందు చేస్తోంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు ప్రధాన రహదారిలో గుల్‌మొహర్‌ చెట్టంతా ఎర్రనిపూలతో ఇలా కనువిందు చేస్తోంది.
16/18
గిన్నిస్‌ ధ్రువీకరణపత్రంతో ఉన్న డోర్‌ బహదూర్‌ ఖపాంగీ వయసు 18 సంవత్సరాలు. ఎత్తు మాత్రం 73.43 సెంటిమీటర్లే (2 అడుగుల 4.9 అంగుళాలు). ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉన్న టీనేజర్‌గా గిన్నిస్‌ సంస్థ ఖపాంగీని గుర్తించింది. మంగళవారం నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో అతనికి ధ్రువీకరణపత్రం అందజేసింది. గిన్నిస్‌ ధ్రువీకరణపత్రంతో ఉన్న డోర్‌ బహదూర్‌ ఖపాంగీ వయసు 18 సంవత్సరాలు. ఎత్తు మాత్రం 73.43 సెంటిమీటర్లే (2 అడుగుల 4.9 అంగుళాలు). ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉన్న టీనేజర్‌గా గిన్నిస్‌ సంస్థ ఖపాంగీని గుర్తించింది. మంగళవారం నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో అతనికి ధ్రువీకరణపత్రం అందజేసింది.
17/18
డ్రైనేజీల్లో వేసే చెత్త కొట్టుకొచ్చి నేరుగా సాగర్‌లో చేరకుండా నాలాలు కలిసేచోట రూ.లక్షలు వెచ్చించి తేలియాడే గోడలు(ఫ్లోటింగ్‌ బారియర్స్‌)ను ఏర్పాటుచేశారు. వీటి వద్ద నిలిచిన చెత్త తొలగించకపోవడం, వరద ప్రవాహంతో ఈ గోడలు తెగిపోయాయి. వర్షాకాలం ముంచుకొస్తున్న వేళ వెంటనే సరిచేయాల్సిన అవసరముంది. డ్రైనేజీల్లో వేసే చెత్త కొట్టుకొచ్చి నేరుగా సాగర్‌లో చేరకుండా నాలాలు కలిసేచోట రూ.లక్షలు వెచ్చించి తేలియాడే గోడలు(ఫ్లోటింగ్‌ బారియర్స్‌)ను ఏర్పాటుచేశారు. వీటి వద్ద నిలిచిన చెత్త తొలగించకపోవడం, వరద ప్రవాహంతో ఈ గోడలు తెగిపోయాయి. వర్షాకాలం ముంచుకొస్తున్న వేళ వెంటనే సరిచేయాల్సిన అవసరముంది.
18/18
హైదరాబాద్‌ నగరంలోని బస్టాప్‌లపై పర్యవేక్షణ కొరవడటంతో కొందరు బస చేయడానికి అనువుగా మార్చుకుంటున్నారు. ఖైరతాబాద్‌ షాదన్‌ కళాశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఓ వ్యక్తి ఇలా పడుకున్నాడు. హైదరాబాద్‌ నగరంలోని బస్టాప్‌లపై పర్యవేక్షణ కొరవడటంతో కొందరు బస చేయడానికి అనువుగా మార్చుకుంటున్నారు. ఖైరతాబాద్‌ షాదన్‌ కళాశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఓ వ్యక్తి ఇలా పడుకున్నాడు.

మరిన్ని