News In Pics: చిత్రం చెప్పే విశేషాలు

Updated : 25 May 2022 20:08 IST
1/26
హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
2/26
3/26
4/26
వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌కు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. అక్కడి కొలనులో జలకాలాడటంతో పాటు బయట రెయిన్ డ్యాన్స్‌లు చేస్తూ ఎండ నుంచి ఉపశమనం పొందారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌కు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. అక్కడి కొలనులో జలకాలాడటంతో పాటు బయట రెయిన్ డ్యాన్స్‌లు చేస్తూ ఎండ నుంచి ఉపశమనం పొందారు.
5/26
6/26
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు చౌహాన్‌, డీసీపీ చందనా దీప్తీ, ఎస్పీజీ సిబ్బంది పరిశీలించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు చౌహాన్‌, డీసీపీ చందనా దీప్తీ, ఎస్పీజీ సిబ్బంది పరిశీలించారు.
7/26
8/26
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రవాసాంధ్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బాగున్నాయని వారు కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రవాసాంధ్రులు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రవాసాంధ్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బాగున్నాయని వారు కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రవాసాంధ్రులు అన్నారు.
9/26
తిరుమ‌ల‌లో హ‌నుమాన్‌ జయంతి వేడుక‌లను బుధ‌వారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆకాశ‌గంగ‌లో అంజ‌నాదేవి, బాలాంజ‌నేయ‌స్వామివారికి జ‌రిగిన అభిషేకంలో ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంత‌రం జ‌పాలి తీర్థంలోని ఆంజ‌నేయ‌స్వామికి ఈవో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. తిరుమ‌ల‌లో హ‌నుమాన్‌ జయంతి వేడుక‌లను బుధ‌వారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆకాశ‌గంగ‌లో అంజ‌నాదేవి, బాలాంజ‌నేయ‌స్వామివారికి జ‌రిగిన అభిషేకంలో ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంత‌రం జ‌పాలి తీర్థంలోని ఆంజ‌నేయ‌స్వామికి ఈవో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.
10/26
11/26
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
12/26
13/26
ఇంగ్లాండ్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సింహాసనాన్ని అధిరోహించి 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న ఆమె విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇంగ్లాండ్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 సింహాసనాన్ని అధిరోహించి 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న ఆమె విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.
14/26
హైదరాబాద్‌ చందానగర్‌లోని ఓ వస్ర్తదుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి సురభి పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు. సురభిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్‌ చందానగర్‌లోని ఓ వస్ర్తదుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి సురభి పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు. సురభిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
15/26
16/26
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కాషాయ రంగు దుస్తుల్లో మెరిశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కాషాయ రంగు దుస్తుల్లో మెరిశారు.
17/26
వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
18/26
గువహటిలో ఆకాశమంతా మేఘావృతమై ఉండగా ఓ శ్రమజీవి ఇలా బండి లాగుతూ కనిపించాడు. జీవితంలో అవరోధాలనే కారుమబ్బులు ఎన్ని కమ్మినా రెక్కల కష్టాన్ని వీడేదిలేదు అన్నట్లుగా ఈ చిత్రం కనిపిస్తోంది. గువహటిలో ఆకాశమంతా మేఘావృతమై ఉండగా ఓ శ్రమజీవి ఇలా బండి లాగుతూ కనిపించాడు. జీవితంలో అవరోధాలనే కారుమబ్బులు ఎన్ని కమ్మినా రెక్కల కష్టాన్ని వీడేదిలేదు అన్నట్లుగా ఈ చిత్రం కనిపిస్తోంది.
19/26
20/26
హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దంపతులు, ఎమ్మెల్సీ కవిత హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దంపతులు, ఎమ్మెల్సీ కవిత హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
21/26
ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌ సాహా తన సతీమణి స్వప్న సాహాతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌ సాహా తన సతీమణి స్వప్న సాహాతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
22/26
హనుమాన్‌ జయంతి పురస్కరించుకొని కొండగట్టు అంజన్న దేవాలయానికి హనుమాన్‌ దీక్షా మాలధారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు దూరప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి భక్తిని చాటుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీప కాంతుల అలంకరణ ఆకట్టుకుంది. హనుమాన్‌ జయంతి పురస్కరించుకొని కొండగట్టు అంజన్న దేవాలయానికి హనుమాన్‌ దీక్షా మాలధారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు దూరప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి భక్తిని చాటుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీప కాంతుల అలంకరణ ఆకట్టుకుంది.
23/26
24/26
25/26
హైదరాబాద్‌లోని సీసీఎల్‌లో పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పెట్రోలు బంకును మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనంలో ఆయన స్వయంగా పెట్రోలు నింపడం విశేషం. హైదరాబాద్‌లోని సీసీఎల్‌లో పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పెట్రోలు బంకును మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనంలో ఆయన స్వయంగా పెట్రోలు నింపడం విశేషం.
26/26
కొలువు కొట్టాలంటే కష్టపడి చదవాలి.. చదివింది బుర్రకు ఎక్కాలంటే ఏకాగ్రత కావాలి.. అందుకే యోగా చేయాలంటున్నారు నేటి నిరుద్యోగులు. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీ పార్కులో చదవుకోవడానికి వచ్చిన యువకులు విరామ సమయంలో ఇలా ప్రాణాయామం, ధ్యానం చేస్తూ కనిపించారు. కొలువు కొట్టాలంటే కష్టపడి చదవాలి.. చదివింది బుర్రకు ఎక్కాలంటే ఏకాగ్రత కావాలి.. అందుకే యోగా చేయాలంటున్నారు నేటి నిరుద్యోగులు. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీ పార్కులో చదవుకోవడానికి వచ్చిన యువకులు విరామ సమయంలో ఇలా ప్రాణాయామం, ధ్యానం చేస్తూ కనిపించారు.

మరిన్ని