News In Pics: చిత్రం చెప్పే విశేషాలు

Published : 26 May 2022 10:03 IST
1/22
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసింది. దీంతో రైతుల గోస వర్ణణాతీతంగా మారింది. సరైన సమయంలో లారీలు రాకపోవడం, ఆన్‌లైన్‌లో పేర్లు లేక పోవడంతో పలు సమస్యలు తలెత్తి.. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దగా  మారాయి. ప్రస్తుతం ఆ ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పరిస్థితి దారుణంగా మారనుంది. గొల్లపల్లి, జోగాపూర్, గంగారం తదితర కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల క్వింటాళ్ల ధాన్యం కుప్పులు పోసి కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. గొల్లపల్లి కేంద్రం వద్ద ధాన్యం కుప్ప నుంచి నీరు తీస్తున్న రైతుల చిత్రమిది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసింది. దీంతో రైతుల గోస వర్ణణాతీతంగా మారింది. సరైన సమయంలో లారీలు రాకపోవడం, ఆన్‌లైన్‌లో పేర్లు లేక పోవడంతో పలు సమస్యలు తలెత్తి.. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. ప్రస్తుతం ఆ ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పరిస్థితి దారుణంగా మారనుంది. గొల్లపల్లి, జోగాపూర్, గంగారం తదితర కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల క్వింటాళ్ల ధాన్యం కుప్పులు పోసి కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. గొల్లపల్లి కేంద్రం వద్ద ధాన్యం కుప్ప నుంచి నీరు తీస్తున్న రైతుల చిత్రమిది.
2/22
హైదరాబాద్‌ నగరీకరణ ధాటికి కొండలు, గుట్టలు, పచ్చని పొలాలు కనుమరుగవుతూ.. ఆకాశహర్మ్యాలు దర్శనమిస్తున్నాయి. గండిపేట్‌-శంకర్‌పల్లి మార్గంలో కన్పించిందీ చిత్రం. హైదరాబాద్‌ నగరీకరణ ధాటికి కొండలు, గుట్టలు, పచ్చని పొలాలు కనుమరుగవుతూ.. ఆకాశహర్మ్యాలు దర్శనమిస్తున్నాయి. గండిపేట్‌-శంకర్‌పల్లి మార్గంలో కన్పించిందీ చిత్రం.
3/22
గత ఏడాది వర్షాలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారం చెరువులో మునిగిన గృహాలు ఇవి. వచ్చే వర్షాకాలంలో తిరిగి అలాంటి సమస్యలు తలెత్తకుండా భవన నిర్మాణ వ్యర్థాలను తెచ్చి ఇళ్ల చుట్టూ పోసుకుంటున్నారు. గత ఏడాది వర్షాలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారం చెరువులో మునిగిన గృహాలు ఇవి. వచ్చే వర్షాకాలంలో తిరిగి అలాంటి సమస్యలు తలెత్తకుండా భవన నిర్మాణ వ్యర్థాలను తెచ్చి ఇళ్ల చుట్టూ పోసుకుంటున్నారు.
4/22
భారీ భవంతుల ముందు దిష్టిబొమ్మల్లా ఉన్న ఇవన్నీ ప్రజా మరుగుదొడ్లు. నగరంలో ప్రజల అవసరాల కోసం తెప్పించారు. కోకాపేట వద్ద బాహ్యవలయ రహదారి పక్కన వృథాగా పడేశారు. వీటిపై వెచ్చించిన వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. భారీ భవంతుల ముందు దిష్టిబొమ్మల్లా ఉన్న ఇవన్నీ ప్రజా మరుగుదొడ్లు. నగరంలో ప్రజల అవసరాల కోసం తెప్పించారు. కోకాపేట వద్ద బాహ్యవలయ రహదారి పక్కన వృథాగా పడేశారు. వీటిపై వెచ్చించిన వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
5/22
హుస్నాబాద్‌ మండల పరిధి పందిల్లలోని పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ముళ్లపొదలతో అలుముకున్న ఆ స్థలం నేడు ఉద్యానంతో ఆహ్లాదం కలిగిస్తోంది. పూలు, పండ్ల మొక్కలు కలిపి మొత్తం 2500 నాటారు. సర్పంచి తోడేటి రమేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రోజుకు రెండు పూటలా నీరు పట్టిస్తున్నారు. డంపింగ్‌షెడ్‌లో తయారు చేసిన సేంద్రియ ఎరువును మొక్కలకు వేసి సంరక్షిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. ఈ వనాన్ని చూసిన జనాలు పల్లె ప్రకృతి ఘనం అంటూ కితాబిస్తున్నారు. హుస్నాబాద్‌ మండల పరిధి పందిల్లలోని పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ముళ్లపొదలతో అలుముకున్న ఆ స్థలం నేడు ఉద్యానంతో ఆహ్లాదం కలిగిస్తోంది. పూలు, పండ్ల మొక్కలు కలిపి మొత్తం 2500 నాటారు. సర్పంచి తోడేటి రమేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రోజుకు రెండు పూటలా నీరు పట్టిస్తున్నారు. డంపింగ్‌షెడ్‌లో తయారు చేసిన సేంద్రియ ఎరువును మొక్కలకు వేసి సంరక్షిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. ఈ వనాన్ని చూసిన జనాలు పల్లె ప్రకృతి ఘనం అంటూ కితాబిస్తున్నారు.
6/22
వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని గ్రంథాలయంలో బుధవారం యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు పి.ప్రశాంత్, యువరాజ్‌ పలు ఆసనాలు వేశారు. ఇన్‌ఛార్జి గ్రంథాలయాధికారి సాయిలక్ష్మి జోగేశ్వరి, యోగా శిక్షకుడు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని గ్రంథాలయంలో బుధవారం యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు పి.ప్రశాంత్, యువరాజ్‌ పలు ఆసనాలు వేశారు. ఇన్‌ఛార్జి గ్రంథాలయాధికారి సాయిలక్ష్మి జోగేశ్వరి, యోగా శిక్షకుడు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
7/22
చుట్టూ ఎత్తైన కొండలు.. వాటి నడుమ విస్తరించిన నగరం. కొండ చిలువలా కనిపిస్తున్న బీఆర్టీఎస్‌ రహదారి. నిశిలో విరజిమ్మే విద్యుత్తు దీపాల వెలుగులు ‘సింహాచలం’ కొండ పైనుంచి చూస్తే ఇలా కనువిందు చేస్తుంటాయి. చుట్టూ ఎత్తైన కొండలు.. వాటి నడుమ విస్తరించిన నగరం. కొండ చిలువలా కనిపిస్తున్న బీఆర్టీఎస్‌ రహదారి. నిశిలో విరజిమ్మే విద్యుత్తు దీపాల వెలుగులు ‘సింహాచలం’ కొండ పైనుంచి చూస్తే ఇలా కనువిందు చేస్తుంటాయి.
8/22
ఎండ తీవత్రతో జనం సతమతమైపోతున్నారు. కాస్తంత నీడకు వెంపర్లాట తప్పడం లేదు. తిరుపతి జిల్లాలోని రామసేతు వంతెనపై మధ్యాహ్నం వేళల్లో మహిళా కూలీని వదలి వాళ్ల కుటుంబీకులు సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె బండిని వదలి వెళ్లలేక అలాగని ఎండలో నిలబడలేక ఇలా మూడు చక్రాల బండి కింద ఉపశమనం పొందింది. ఎండ తీవత్రతో జనం సతమతమైపోతున్నారు. కాస్తంత నీడకు వెంపర్లాట తప్పడం లేదు. తిరుపతి జిల్లాలోని రామసేతు వంతెనపై మధ్యాహ్నం వేళల్లో మహిళా కూలీని వదలి వాళ్ల కుటుంబీకులు సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె బండిని వదలి వెళ్లలేక అలాగని ఎండలో నిలబడలేక ఇలా మూడు చక్రాల బండి కింద ఉపశమనం పొందింది.
9/22
అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారితో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం పంచాయతీ కేంద్రం నుంచి కొత్తూరుబయలు, గాలిపాడు మీదుగా వర్తనాపల్లి వరకు గల ప్రధాన రహదారి నిర్మాణం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ద్విచక్రవాహనదారులు, ఆయా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణానికి గుత్తేదారు నల్లరాయి వేసి వదిలేశాడు. రాళ్లు పైకి తేలిన రహదారిపై వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ రోడ్డుపై నడిచేందుకు పాదచారులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.  అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారితో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం పంచాయతీ కేంద్రం నుంచి కొత్తూరుబయలు, గాలిపాడు మీదుగా వర్తనాపల్లి వరకు గల ప్రధాన రహదారి నిర్మాణం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ద్విచక్రవాహనదారులు, ఆయా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణానికి గుత్తేదారు నల్లరాయి వేసి వదిలేశాడు. రాళ్లు పైకి తేలిన రహదారిపై వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ రోడ్డుపై నడిచేందుకు పాదచారులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
10/22
కట్టెలు చెట్టుపైకి ఎక్కాయి. ఇదెలా అనుకుంటున్నారా... మన్యంలో గిరిజనులు తాము సేకరించిన కట్టెలు ఇలా చెట్లపైన భద్రపరుస్తారు. భద్రపరిచిన కట్టెలను వర్షాకాలంలో దించి పొయ్యిలోకి ఉపయోగిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఈదులబయలులో చింత చెట్టుపైకి ఓ గిరిజనుడు ఇలా కట్టెలను ఎక్కించాడు. కట్టెలు చెట్టుపైకి ఎక్కాయి. ఇదెలా అనుకుంటున్నారా... మన్యంలో గిరిజనులు తాము సేకరించిన కట్టెలు ఇలా చెట్లపైన భద్రపరుస్తారు. భద్రపరిచిన కట్టెలను వర్షాకాలంలో దించి పొయ్యిలోకి ఉపయోగిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఈదులబయలులో చింత చెట్టుపైకి ఓ గిరిజనుడు ఇలా కట్టెలను ఎక్కించాడు.
11/22
ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలమని నిరూపిస్తున్నట్లుగా ఉంది కదూ ఈ చిత్రంలోని మొక్క. పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ మీదుగా కొండపర్తికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిపై పిట్టమర్రి (కొండమర్రి) మొక్క చిగురిస్తోంది. నిర్జన ప్రదేశంలో ఉన్న రాయితో ఆ మొక్క స్నేహబంధం పెనవేసుకుని, చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలమని నిరూపిస్తున్నట్లుగా ఉంది కదూ ఈ చిత్రంలోని మొక్క. పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ మీదుగా కొండపర్తికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిపై పిట్టమర్రి (కొండమర్రి) మొక్క చిగురిస్తోంది. నిర్జన ప్రదేశంలో ఉన్న రాయితో ఆ మొక్క స్నేహబంధం పెనవేసుకుని, చూపరులను ఆశ్చర్యపరుస్తోంది.
12/22
అస్సాంలోని గువాహటి గీతానగర్‌లో పోలీస్‌స్టేషన్‌కు వాననీరు పోటెత్తడంత మహిళా పోలీసుల పాట్లు. అస్సాంలోని గువాహటి గీతానగర్‌లో పోలీస్‌స్టేషన్‌కు వాననీరు పోటెత్తడంత మహిళా పోలీసుల పాట్లు.
13/22
ఇండియా యూత్‌ గేమ్స్‌లో తలపడే రాష్ట్ర క్రీడాకారులతో క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ముఖాముఖి నిర్వహించారు. పతకాలు సాధించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పలువురు విద్యార్థులు మాల్కంబ్‌పై చేసిన విన్యాసం ఆకట్టుకుంది. కార్యక్రమంలో శాప్‌ ఛైర్మన్‌ సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియా యూత్‌ గేమ్స్‌లో తలపడే రాష్ట్ర క్రీడాకారులతో క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ముఖాముఖి నిర్వహించారు. పతకాలు సాధించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పలువురు విద్యార్థులు మాల్కంబ్‌పై చేసిన విన్యాసం ఆకట్టుకుంది. కార్యక్రమంలో శాప్‌ ఛైర్మన్‌ సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
14/22
హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో బుధవారం విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో  శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. కాషాయ వస్త్రాలు ధరించిన వేల మంది భక్తులు పాల్గొన్న ఇంతటి భారీ ప్రదర్శన నగరంలో ఇదే తొలిసారి కావడం విశేషం. హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఊరేగిస్తూ బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర 9 కి.మీ. సాగి, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముగిసింది. భాజపా నాయకురాలు సాధినేని యామినితోపాటు పలువురు మహిళలు తలపాగాలు ధరించారు. పలువురు యువతులు భరతమాత వేషధారణలలో బుల్లెట్లు నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో బుధవారం విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. కాషాయ వస్త్రాలు ధరించిన వేల మంది భక్తులు పాల్గొన్న ఇంతటి భారీ ప్రదర్శన నగరంలో ఇదే తొలిసారి కావడం విశేషం. హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఊరేగిస్తూ బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర 9 కి.మీ. సాగి, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముగిసింది. భాజపా నాయకురాలు సాధినేని యామినితోపాటు పలువురు మహిళలు తలపాగాలు ధరించారు. పలువురు యువతులు భరతమాత వేషధారణలలో బుల్లెట్లు నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
15/22
16/22
హైదరాబాద్‌ నగర శివారు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమీపంలోని కుంట పూర్తిగా కాలుష్య కాసారమై పోయింది. యార్డు శుద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మరోవంక పక్కనే ఉన్న చెరువులోకి రసాయన వ్యర్థాలు వచ్చి చేరుతూనే ఉన్నాయి. సమీప ప్రాంతాలకు దుర్గంధం వ్యాపించి భూగర్భ జలాలు పూర్తిగా పాడయ్యాయి. బోర్ల నుంచి వచ్చే నీరు చమురును తలపిస్తోండటాన్ని చూస్తే ఇక్కడ కాలుష్యం ఎంత దుర్భర స్థాయికి చేరిందో ఇట్టే చెప్పవచ్చు. హైదరాబాద్‌ నగర శివారు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమీపంలోని కుంట పూర్తిగా కాలుష్య కాసారమై పోయింది. యార్డు శుద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మరోవంక పక్కనే ఉన్న చెరువులోకి రసాయన వ్యర్థాలు వచ్చి చేరుతూనే ఉన్నాయి. సమీప ప్రాంతాలకు దుర్గంధం వ్యాపించి భూగర్భ జలాలు పూర్తిగా పాడయ్యాయి. బోర్ల నుంచి వచ్చే నీరు చమురును తలపిస్తోండటాన్ని చూస్తే ఇక్కడ కాలుష్యం ఎంత దుర్భర స్థాయికి చేరిందో ఇట్టే చెప్పవచ్చు.
17/22
18/22
మండుటెండల కారణంగా కోడిపిల్లల రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉక్కపోత కారణంగా కొన్ని పిల్లలు మధ్యలోనే మృతి చెందుతుండటంతో ఉత్పత్తి సంస్థలు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇందుకు పరిష్కారంగా ఓ సంస్థ వారు చల్లదనం కోసం వాహనం చుట్టూ ఉండే ఇనుప షీట్లను తొలగించి.. జాలీల సాయంతో గడ్డిని అమర్చారు. దాన్ని నీటితో తడిపి ప్రయాణానికి సిద్ధం చేశారు. అలా కోడిపిల్లలను భద్రంగా సిద్దిపేట నుంచి నిజామాబాద్‌కు బుధవారం వాహనంలో తీసుకొస్తుండగా తీసిన చిత్రమిది. ఇలా చేయడం ద్వారా కోడిపిల్లల మరణాలు తగ్గాయని డ్రైవర్‌ తెలిపారు. మండుటెండల కారణంగా కోడిపిల్లల రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉక్కపోత కారణంగా కొన్ని పిల్లలు మధ్యలోనే మృతి చెందుతుండటంతో ఉత్పత్తి సంస్థలు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇందుకు పరిష్కారంగా ఓ సంస్థ వారు చల్లదనం కోసం వాహనం చుట్టూ ఉండే ఇనుప షీట్లను తొలగించి.. జాలీల సాయంతో గడ్డిని అమర్చారు. దాన్ని నీటితో తడిపి ప్రయాణానికి సిద్ధం చేశారు. అలా కోడిపిల్లలను భద్రంగా సిద్దిపేట నుంచి నిజామాబాద్‌కు బుధవారం వాహనంలో తీసుకొస్తుండగా తీసిన చిత్రమిది. ఇలా చేయడం ద్వారా కోడిపిల్లల మరణాలు తగ్గాయని డ్రైవర్‌ తెలిపారు.
19/22
20/22
వేసవి సెలవుల్లో పిల్లలు ఆటపాటల పట్ల ఆసక్తి చూపటం సహజం. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని కేసారం వద్ద ఆర్గానో ఎట్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు సేద్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పంట చక్రం(క్రాప్‌ సైకిల్‌) నేర్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. విత్తనాలను నాటడం, మొక్కల పెంపకం, కలుపు తీయడం, చీడపీడల నిర్వహణ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా టమాటా, వంకాయ, మిరప వంటి పంటలను పండించడం, వాటిని కోయడాన్నీ నేర్చుకొంటున్నారు. సహజ వ్యవసాయం, సురక్షిత ఆహారంపై చిన్నారులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పాఠశాల ప్రతినిధులు మీనా మురుగప్పన్‌, గ్లరిమాగోయల్‌, వెంకటేష్‌ నల్లమిల్లి వివరించారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఆటపాటల పట్ల ఆసక్తి చూపటం సహజం. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని కేసారం వద్ద ఆర్గానో ఎట్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు సేద్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పంట చక్రం(క్రాప్‌ సైకిల్‌) నేర్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. విత్తనాలను నాటడం, మొక్కల పెంపకం, కలుపు తీయడం, చీడపీడల నిర్వహణ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా టమాటా, వంకాయ, మిరప వంటి పంటలను పండించడం, వాటిని కోయడాన్నీ నేర్చుకొంటున్నారు. సహజ వ్యవసాయం, సురక్షిత ఆహారంపై చిన్నారులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పాఠశాల ప్రతినిధులు మీనా మురుగప్పన్‌, గ్లరిమాగోయల్‌, వెంకటేష్‌ నల్లమిల్లి వివరించారు.
21/22
22/22
ఆకలేస్తే చిన్న జంతువులను వెంటాడి.. వేటాడి చంపి తినే పెద్దపులి కొన్నిసార్లు గడ్డి కూడా తింటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర తాడోబా అభయారణ్యంలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ దీన్ని తీశారు. ‘పులులు తమ జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు అప్పుడప్పుడు గడ్డిని తింటాయి’ అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు బయాలజిస్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆకలేస్తే చిన్న జంతువులను వెంటాడి.. వేటాడి చంపి తినే పెద్దపులి కొన్నిసార్లు గడ్డి కూడా తింటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర తాడోబా అభయారణ్యంలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ దీన్ని తీశారు. ‘పులులు తమ జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు అప్పుడప్పుడు గడ్డిని తింటాయి’ అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు బయాలజిస్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని