News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 28 May 2022 12:19 IST
1/16
పాత సామగ్రి.. కాగితాలను ఏరుకుని జీవనం సాగించే ఓ వ్యక్తి తలపై మూటను మోస్తూ, మరో మూటను తాడుతో లాక్కుంటూ వెళ్లడం సంగారెడ్డి కొత్త బస్టాండు రోడ్డులో కనిపించింది. రోజంతా ఏరిన వాటిని ఆటోలో తీసుకెళ్లలేక మోసుకెళుతున్నానని తెలిపారు. పాత సామగ్రి.. కాగితాలను ఏరుకుని జీవనం సాగించే ఓ వ్యక్తి తలపై మూటను మోస్తూ, మరో మూటను తాడుతో లాక్కుంటూ వెళ్లడం సంగారెడ్డి కొత్త బస్టాండు రోడ్డులో కనిపించింది. రోజంతా ఏరిన వాటిని ఆటోలో తీసుకెళ్లలేక మోసుకెళుతున్నానని తెలిపారు.
2/16
కరీంనగర్‌లోని చిన్నారులు ఈత నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వేకువజాము నుంచే తల్లిదండ్రులతో కొలనుల వద్ద సిద్ధంగా ఉంటున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఇవి కొనసాగుతుండగా అన్నింటా రద్దీ కనిపిస్తోంది. ఓ ప్రైవేటు కొలనులో చిన్నారుల సందడి ఇది. కరీంనగర్‌లోని చిన్నారులు ఈత నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వేకువజాము నుంచే తల్లిదండ్రులతో కొలనుల వద్ద సిద్ధంగా ఉంటున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఇవి కొనసాగుతుండగా అన్నింటా రద్దీ కనిపిస్తోంది. ఓ ప్రైవేటు కొలనులో చిన్నారుల సందడి ఇది.
3/16
పదో తరగతి విద్యార్థులు ట్రాలీ ఆటోనిండా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. పట్టణంలో పరీక్ష రాసి ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీరు మహబూబాబాద్‌ పట్టణం పత్తిపాక రోడ్డులోని ప్రభుత్వ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు. పదో తరగతి విద్యార్థులు ట్రాలీ ఆటోనిండా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. పట్టణంలో పరీక్ష రాసి ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీరు మహబూబాబాద్‌ పట్టణం పత్తిపాక రోడ్డులోని ప్రభుత్వ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు.
4/16
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 26వ జాతీయ రహదారి పొడవునా గోతులతో ప్రమాదకరంగా మారింది. వాటిలో వర్షపు నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం నుంచి కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, డిగ్రీ కళాశాల, డీలక్స్‌ సెంటర్, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు పరిస్థితి అధ్వానంగా ఉంది. డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న గుంతను చిత్రంలో చూడొచ్చు. ఎన్‌హెచ్‌ అధికారులను సంప్రదించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరతామని పుర కమిషనర్‌ హెచ్‌.శంకరరావు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 26వ జాతీయ రహదారి పొడవునా గోతులతో ప్రమాదకరంగా మారింది. వాటిలో వర్షపు నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం నుంచి కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, డిగ్రీ కళాశాల, డీలక్స్‌ సెంటర్, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు పరిస్థితి అధ్వానంగా ఉంది. డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న గుంతను చిత్రంలో చూడొచ్చు. ఎన్‌హెచ్‌ అధికారులను సంప్రదించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరతామని పుర కమిషనర్‌ హెచ్‌.శంకరరావు తెలిపారు.
5/16
కాకినాడ జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ సబ్బుపై దివంగత ఎన్టీఆర్‌ బొమ్మను రూపొందించారు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని... 150 గ్రాముల సబ్బుపై చిరునవ్వు చిందిస్తూ.. తలపాగా చుట్టి.. నుదుటన బొట్టు పెట్టుకున్నట్టుగా ఎన్టీఆర్‌ బొమ్మను ఆరు గంటల పాటు కృషిచేసి తీర్చిదిద్దారు. కాకినాడ జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ సబ్బుపై దివంగత ఎన్టీఆర్‌ బొమ్మను రూపొందించారు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని... 150 గ్రాముల సబ్బుపై చిరునవ్వు చిందిస్తూ.. తలపాగా చుట్టి.. నుదుటన బొట్టు పెట్టుకున్నట్టుగా ఎన్టీఆర్‌ బొమ్మను ఆరు గంటల పాటు కృషిచేసి తీర్చిదిద్దారు.
6/16
దావోస్‌ పర్యటనను ముగించుకొని శుక్రవారం కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ రాజధాని జ్యురిక్‌ చేరుకున్నారు. అక్కడో వీధిలో భోజనం సందర్భంగా దిగిన ఫొటోను ఆయన ట్విటర్‌లో పెట్టారు. దావోస్‌ పర్యటనను ముగించుకొని శుక్రవారం కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ రాజధాని జ్యురిక్‌ చేరుకున్నారు. అక్కడో వీధిలో భోజనం సందర్భంగా దిగిన ఫొటోను ఆయన ట్విటర్‌లో పెట్టారు.
7/16
సాంకేతికత వాడకంలో ముందుండే తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ ప్రత్యేకతను చాటుకుంది. ప్రొఫెషనల్‌ విభాగం ప్రతినిధి, ఒంగోలుకు చెందిన తేజస్విని నేతృత్వంలో రూపొందించిన డిజిటల్‌ ట్రీ ఆకట్టుకుంది. ఆకులు లేని చెట్టు చిత్రంపై కార్యకర్తలు వేసే అరచేతి ముద్రలు ఆకులుగా కనిపిస్తాయి. ఈ గుర్తులు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపిస్తాయి. ఇది వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతికత వాడకంలో ముందుండే తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ ప్రత్యేకతను చాటుకుంది. ప్రొఫెషనల్‌ విభాగం ప్రతినిధి, ఒంగోలుకు చెందిన తేజస్విని నేతృత్వంలో రూపొందించిన డిజిటల్‌ ట్రీ ఆకట్టుకుంది. ఆకులు లేని చెట్టు చిత్రంపై కార్యకర్తలు వేసే అరచేతి ముద్రలు ఆకులుగా కనిపిస్తాయి. ఈ గుర్తులు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపిస్తాయి. ఇది వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
8/16
9/16
ప్రకృతి అందాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని మత్స్యగెడ్డపై ఉన్న డుడుమ జలాశయం సందర్శకులను ఆకర్షిస్తోంది. పచ్చని కొండల మధ్య నల్లని రహదారులు, ప్రాజెక్టు కెనాల్‌ నుంచి బలిమెల జలాశయానికి పరుగులు తీస్తున్న నీరు చూపరులకు కనువిందు చేస్తోంది. జలాశయానికి ఒక వైపు ఏపీ, మరోవైపు ఒడిశా రహదారులను చిత్రంలో చూడొచ్చు. ప్రకృతి అందాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని మత్స్యగెడ్డపై ఉన్న డుడుమ జలాశయం సందర్శకులను ఆకర్షిస్తోంది. పచ్చని కొండల మధ్య నల్లని రహదారులు, ప్రాజెక్టు కెనాల్‌ నుంచి బలిమెల జలాశయానికి పరుగులు తీస్తున్న నీరు చూపరులకు కనువిందు చేస్తోంది. జలాశయానికి ఒక వైపు ఏపీ, మరోవైపు ఒడిశా రహదారులను చిత్రంలో చూడొచ్చు.
10/16
వీరు విజయవాడకు చెందిన తెదేపా మాజీ కార్పొరేటర్లు సాహెరాబాను, దాసరి మల్లేశ్వరి. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరుగుతున్న మహానాడుకు ఇలా ఒకే వాహనంలో వెళ్లారు. వీరు విజయవాడకు చెందిన తెదేపా మాజీ కార్పొరేటర్లు సాహెరాబాను, దాసరి మల్లేశ్వరి. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరుగుతున్న మహానాడుకు ఇలా ఒకే వాహనంలో వెళ్లారు.
11/16
ఈ విద్యార్థినిది మలక్‌పేట. బషీర్‌బాగ్‌లోని మహబూబియా పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసి శుక్రవారం 12.45 గంటలకు బయటకు వచ్చింది. ‘మనబస్తీ.. మనబడి’ బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసుల ఫోన్‌తో తల్లిదండ్రులకు కాల్‌ చేసింది. ఎత్తకపోవడంతో 2.15 వరకు వేచి చూసింది. బాలిక ఆందోళనను గుర్తించిన పోలీసులు తమ వాహనంలో ఇంటికి చేర్చారు. ఈ విద్యార్థినిది మలక్‌పేట. బషీర్‌బాగ్‌లోని మహబూబియా పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసి శుక్రవారం 12.45 గంటలకు బయటకు వచ్చింది. ‘మనబస్తీ.. మనబడి’ బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసుల ఫోన్‌తో తల్లిదండ్రులకు కాల్‌ చేసింది. ఎత్తకపోవడంతో 2.15 వరకు వేచి చూసింది. బాలిక ఆందోళనను గుర్తించిన పోలీసులు తమ వాహనంలో ఇంటికి చేర్చారు.
12/16
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కర్ణాటకలో నిర్వహించిన ప్రపంచయోగా దినోత్సవ ముందస్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కన్నడ జిల్లా కార్వారలోని నౌకా స్థావరమైన కదంబలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కర్ణాటకలో నిర్వహించిన ప్రపంచయోగా దినోత్సవ ముందస్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కన్నడ జిల్లా కార్వారలోని నౌకా స్థావరమైన కదంబలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వేడుకల్లో పాల్గొన్నారు.
13/16
క్వీన్‌ విక్టోరియా 1845లో ధరించిన వజ్రాలు పొదిగిన కిరీటం ఇది. రాణి ఎలిజబెత్‌-2 సింహాసనం అధిష్ఠించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్‌లో శుక్రవారం ఇలా ప్రదర్శనకు ఉంచారు. క్వీన్‌ విక్టోరియా 1845లో ధరించిన వజ్రాలు పొదిగిన కిరీటం ఇది. రాణి ఎలిజబెత్‌-2 సింహాసనం అధిష్ఠించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్‌లో శుక్రవారం ఇలా ప్రదర్శనకు ఉంచారు.
14/16
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో  యోగా ఉత్సవ్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. కేంద్ర మంత్రులు, భాజపా నేతలు యోగాసనాలు వేశారు. క్రికెటర్‌ మిథాలీరాజ్, టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారిణి నైనాజైశ్వాల్, సినీ నటి లావణ్య త్రిపాఠి ఆకట్టుకొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. కేంద్ర మంత్రులు, భాజపా నేతలు యోగాసనాలు వేశారు. క్రికెటర్‌ మిథాలీరాజ్, టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారిణి నైనాజైశ్వాల్, సినీ నటి లావణ్య త్రిపాఠి ఆకట్టుకొన్నారు.
15/16
16/16
కొండాపూర్‌లో శుక్రవారం సినీ నటి కేథరిన్‌ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్‌లో శుక్రవారం సినీ నటి కేథరిన్‌ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని