News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 28 May 2022 20:17 IST
1/25
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఓ ఎన్టీఆర్‌ అభిమాని గాంధీ వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఓ ఎన్టీఆర్‌ అభిమాని గాంధీ వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు.
2/25
తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో మెహెందీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు విభిన్న డిజైన్లతో చేతులను అందంగా అలంకరించుకొని సందడి చేశారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో మెహెందీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు విభిన్న డిజైన్లతో చేతులను అందంగా అలంకరించుకొని సందడి చేశారు.
3/25
4/25
5/25
శనివారం వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. క్యూలైనల్లో ఏర్పాట్లను ఈవో ధర్మారెడ్డి, అధికారులు పరిశీలించారు. శనివారం వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. క్యూలైనల్లో ఏర్పాట్లను ఈవో ధర్మారెడ్డి, అధికారులు పరిశీలించారు.
6/25
7/25
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 మానస వారణాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 మానస వారణాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
8/25
9/25
10/25
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని అట్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి అందులోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని అట్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి అందులోని వివిధ విభాగాలను పరిశీలించారు.
11/25
12/25
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ శుక్రవారం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న జరీన్‌.. తన గమ్యాన్ని చేరేందుకు నిత్యం వెన్నంటే ఉన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ శుక్రవారం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న జరీన్‌.. తన గమ్యాన్ని చేరేందుకు నిత్యం వెన్నంటే ఉన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని తెలుపుతూ పోస్టు పెట్టారు.
13/25
14/25
పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో గన్‌ ఫౌండ్రి మహబూబియా పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో విద్యార్థినులు కాగితాలను గాలిలోకి ఎగరేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో గన్‌ ఫౌండ్రి మహబూబియా పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో విద్యార్థినులు కాగితాలను గాలిలోకి ఎగరేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
15/25
16/25
టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన దుండగుడి కాల్పుల్లో 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని ఓ డేకేర్‌ సెంటర్ వెలుపల మృతుల పేర్లతో 21 ఖాళీ కుర్చీలను ఉంచి నివాళి అర్పించారు. టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన దుండగుడి కాల్పుల్లో 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని ఓ డేకేర్‌ సెంటర్ వెలుపల మృతుల పేర్లతో 21 ఖాళీ కుర్చీలను ఉంచి నివాళి అర్పించారు.
17/25
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఒంగోలులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఒంగోలులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
18/25
19/25
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని ద్వారక ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని ద్వారక ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు.
20/25
21/25
గద్వాల్‌లోని గొర్లఖాన్‌ దొడ్డికి చెందిన జైరాజ్‌ అనే అభిమాని సినీ నటుడు రామ్‌చరణ్‌ను కలిసేందుకు 264కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి హైదరాబాద్‌ వచ్చారు. తన వరిపొలంలో పంటతో రామ్‌చరణ్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది దానికి సంబంధించిన ఫొటోను చెర్రీకి కానుకగా ఇచ్చారు. గద్వాల్‌లోని గొర్లఖాన్‌ దొడ్డికి చెందిన జైరాజ్‌ అనే అభిమాని సినీ నటుడు రామ్‌చరణ్‌ను కలిసేందుకు 264కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి హైదరాబాద్‌ వచ్చారు. తన వరిపొలంలో పంటతో రామ్‌చరణ్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది దానికి సంబంధించిన ఫొటోను చెర్రీకి కానుకగా ఇచ్చారు.
22/25
23/25
హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఓ వ్యక్తి ఇలా విభిన్నంగా ఎఫ్‌3 హెయిర్‌ స్టైల్‌తో, మెడలో మనీ ప్లాంట్‌తో నిల్చొని చూపరులను ఆకట్టుకున్నాడు. యూసఫ్‌గూడకు చెందిన ప్రభాకర్‌ ఎలక్ర్టీషన్‌గా పని చేస్తున్నారు. మెగాఫ్యామిలీ అభిమాని కావడంతో ఎఫ్‌3 సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం థియేటర్‌కు ఇలా వచ్చారు. సినిమా కథనం మనీ చుట్టూ ఉండటంతో మనీ ప్లాంటును ధరించి వచ్చి సినిమా చూసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఓ వ్యక్తి ఇలా విభిన్నంగా ఎఫ్‌3 హెయిర్‌ స్టైల్‌తో, మెడలో మనీ ప్లాంట్‌తో నిల్చొని చూపరులను ఆకట్టుకున్నాడు. యూసఫ్‌గూడకు చెందిన ప్రభాకర్‌ ఎలక్ర్టీషన్‌గా పని చేస్తున్నారు. మెగాఫ్యామిలీ అభిమాని కావడంతో ఎఫ్‌3 సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం థియేటర్‌కు ఇలా వచ్చారు. సినిమా కథనం మనీ చుట్టూ ఉండటంతో మనీ ప్లాంటును ధరించి వచ్చి సినిమా చూసినట్లు తెలిపారు.
24/25
25/25
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి అర్పించారు.

మరిన్ని