News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 29 May 2022 07:23 IST
1/12
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటూ ధనాన్ని వృథా చేసేవారిని అనడం వింటుంటాం. వాస్తవానికి ఇది నిజమే. కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థం చెట్ల నుంచి సేకరిస్తారు. పైనస్‌ రాక్స్‌బర్గయ్‌ అనే శాస్త్రీయ నామం కల్గిన ఈ వృక్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని పలుచోట్ల విస్తారంగా పెరుగుతున్నాయి. సిల్వర్‌ ఓక్‌ చెట్ల తరహాలో నిటారుగా ఈ వృక్షాలు పెరుగుతాయి. వీటి కలపను సినీ పరిశ్రమలో భారీ సెట్టింగ్‌లకూ వినియోగిస్తుంటారు. దీంతో తయారయ్యే కాగితం అత్యంత నాణ్యతతో ఉండటం వల్ల దీన్ని కరెన్సీ తయారీలోనూ వాడతారు. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటూ ధనాన్ని వృథా చేసేవారిని అనడం వింటుంటాం. వాస్తవానికి ఇది నిజమే. కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థం చెట్ల నుంచి సేకరిస్తారు. పైనస్‌ రాక్స్‌బర్గయ్‌ అనే శాస్త్రీయ నామం కల్గిన ఈ వృక్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని పలుచోట్ల విస్తారంగా పెరుగుతున్నాయి. సిల్వర్‌ ఓక్‌ చెట్ల తరహాలో నిటారుగా ఈ వృక్షాలు పెరుగుతాయి. వీటి కలపను సినీ పరిశ్రమలో భారీ సెట్టింగ్‌లకూ వినియోగిస్తుంటారు. దీంతో తయారయ్యే కాగితం అత్యంత నాణ్యతతో ఉండటం వల్ల దీన్ని కరెన్సీ తయారీలోనూ వాడతారు.
2/12
చూడగానే బుల్లెట్‌ రైలును తలపించేలా ఉన్న ఈ భారీ ఆకృతి ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ది. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా సమీపంలో రహదారి పక్కన నిలిపిఉన్నాయి. చెన్నై నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నామని, ప్రయాణానికి 50 రోజుల సమయం పడ్తుందని వాహన సిబ్బంది తెలిపారు. ఇప్పటికే సగ దూరం ప్రయాణం పూర్తయ్యిందన్నారు. 108 టైర్లతో ఉన్న వాహనంలో ఒకటి చొప్పున, రెండు భారీ వాహనాల్లో వీటిని జాగ్రత్తగా, కష్టంగా తరలిస్తున్నారు. చూడగానే బుల్లెట్‌ రైలును తలపించేలా ఉన్న ఈ భారీ ఆకృతి ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ది. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా సమీపంలో రహదారి పక్కన నిలిపిఉన్నాయి. చెన్నై నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నామని, ప్రయాణానికి 50 రోజుల సమయం పడ్తుందని వాహన సిబ్బంది తెలిపారు. ఇప్పటికే సగ దూరం ప్రయాణం పూర్తయ్యిందన్నారు. 108 టైర్లతో ఉన్న వాహనంలో ఒకటి చొప్పున, రెండు భారీ వాహనాల్లో వీటిని జాగ్రత్తగా, కష్టంగా తరలిస్తున్నారు.
3/12

చిత్రంలో మీరు చూస్తున్నది మూడేళ్ల వయసున్న చిన్న మామిడి మొక్క.. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి ఓ కొమ్మ వందకు పైగా కాయలతో ఆకట్టుకుంటోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గాంలో పోశెట్టి అనే రైతు ఇంటి ఆవరణలో ఉందిది. ఈ ఏడాది వెయ్యికి పైగా కాయలు కాసిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. కాండం నుంచి కాపు రావడంతో ఈ మొక్క ఇలా గుత్తులుగా కాసిందని, ఇది అరుదేనని, దీన్ని కాల్‌ఫ్లోరస్‌ అని పిలుస్తారని ఉద్యానవనశాఖ అధికారి వాజిదుజ్జామా వివరించారు. చిత్రంలో మీరు చూస్తున్నది మూడేళ్ల వయసున్న చిన్న మామిడి మొక్క.. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి ఓ కొమ్మ వందకు పైగా కాయలతో ఆకట్టుకుంటోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గాంలో పోశెట్టి అనే రైతు ఇంటి ఆవరణలో ఉందిది. ఈ ఏడాది వెయ్యికి పైగా కాయలు కాసిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. కాండం నుంచి కాపు రావడంతో ఈ మొక్క ఇలా గుత్తులుగా కాసిందని, ఇది అరుదేనని, దీన్ని కాల్‌ఫ్లోరస్‌ అని పిలుస్తారని ఉద్యానవనశాఖ అధికారి వాజిదుజ్జామా వివరించారు.
4/12
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమర్‌ కుమారుడు ఇంద్రనీల్‌ వివాహ రిసెప్షన్‌ శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులతో హాజరైన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమర్‌ కుమారుడు ఇంద్రనీల్‌ వివాహ రిసెప్షన్‌ శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులతో హాజరైన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
5/12
అమెరికాలో యువాల్డీ పట్టణానికి చెందిన రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పులకు 18 మంది చిన్నారులు సహా 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని ఓ డేకేర్‌ సెంటర్‌ వెలుపల మృతుల పేర్లతో 21 ఖాళీ కుర్చీలను ఉంచి ఇలా నివాళులర్పించారు. అమెరికాలో యువాల్డీ పట్టణానికి చెందిన రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పులకు 18 మంది చిన్నారులు సహా 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని ఓ డేకేర్‌ సెంటర్‌ వెలుపల మృతుల పేర్లతో 21 ఖాళీ కుర్చీలను ఉంచి ఇలా నివాళులర్పించారు.
6/12
జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి పబ్లిక్‌ గార్డెన్‌ ముస్తాబవుతోంది. హాజరయ్యే ప్రముఖులు, అతిథులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి పబ్లిక్‌ గార్డెన్‌ ముస్తాబవుతోంది. హాజరయ్యే ప్రముఖులు, అతిథులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
7/12
శంషాబాద్‌ విమానాశ్రయంలో దేశ, విదేశీ అతిథులతో కళకళలాడే నొవాటెల్‌ హోటల్‌లో శనివారం రాత్రి పెంపుడు జంతువుల ప్రదర్శన ఆకట్టుకుంది. విభిన్న జాతులకు చెందిన పెంపుడు శునకాలతో పెట్‌నిక్‌ వేడుకలు నిర్వహించారు. జంతు సంరక్షణలో భాగంగా ఎకార్‌ హోటల్స్‌ ఈ వేడుకలు నిర్వహించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో దేశ, విదేశీ అతిథులతో కళకళలాడే నొవాటెల్‌ హోటల్‌లో శనివారం రాత్రి పెంపుడు జంతువుల ప్రదర్శన ఆకట్టుకుంది. విభిన్న జాతులకు చెందిన పెంపుడు శునకాలతో పెట్‌నిక్‌ వేడుకలు నిర్వహించారు. జంతు సంరక్షణలో భాగంగా ఎకార్‌ హోటల్స్‌ ఈ వేడుకలు నిర్వహించింది.
8/12
నాంపల్లి-అఫ్జల్‌గంజ్‌ సర్కిల్, ఎంజీబీఎస్, మదీనా పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. పూర్తిస్థాయిలో ట్రాఫిక్‌ పోలీసులున్నా క్రమబద్ధీకరణ కష్టతరంగా ఉంటుంది. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరే ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. వారు నియంత్రించలేకపోవడంతో వాహనదారులు కట్టుతప్పారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.రెండు గంటలపాటు నడిరోడ్డుపై నరకం కన్పించింది. కొందరు భోజనాలు బస్సుల్లోనే చేశారు. మరికొందరు బస్సులు దిగి నడిచి వెళ్లిపోయారు. నాంపల్లి-అఫ్జల్‌గంజ్‌ సర్కిల్, ఎంజీబీఎస్, మదీనా పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. పూర్తిస్థాయిలో ట్రాఫిక్‌ పోలీసులున్నా క్రమబద్ధీకరణ కష్టతరంగా ఉంటుంది. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరే ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. వారు నియంత్రించలేకపోవడంతో వాహనదారులు కట్టుతప్పారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.రెండు గంటలపాటు నడిరోడ్డుపై నరకం కన్పించింది. కొందరు భోజనాలు బస్సుల్లోనే చేశారు. మరికొందరు బస్సులు దిగి నడిచి వెళ్లిపోయారు.
9/12
10/12
11/12
12/12
గుజరాత్‌లోని ద్వారకాధీశ్‌ ఆలయం వద్ద శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా. గుజరాత్‌లోని ద్వారకాధీశ్‌ ఆలయం వద్ద శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని