News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 22 Jun 2022 10:54 IST
1/26
హెల్మెట్‌ లేకుండా.. సీసీ కెమెరాలకు నంబర్‌ ప్లేట్‌ దొరక్కుండా.. మంగళవారం మాదాపూర్‌లోని పర్వతనగర్‌ మార్గంలో వెళుతున్న 

పోలీసులు వీరు. తమ సిబ్బంది తీరు ఉన్నతాధికారుల దృష్టికి వస్తోందో.. లేదో..?.. జనాలనే కాదు.. కాస్త మీ వాళ్లనూ చూసుకోండి 

సార్లూ.. హెల్మెట్‌ లేకుండా.. సీసీ కెమెరాలకు నంబర్‌ ప్లేట్‌ దొరక్కుండా.. మంగళవారం మాదాపూర్‌లోని పర్వతనగర్‌ మార్గంలో వెళుతున్న పోలీసులు వీరు. తమ సిబ్బంది తీరు ఉన్నతాధికారుల దృష్టికి వస్తోందో.. లేదో..?.. జనాలనే కాదు.. కాస్త మీ వాళ్లనూ చూసుకోండి సార్లూ..
2/26
ఎన్నికల నిబంధనలను అధికారులు అమలు చేయడం లేదని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టిక్కర్లతో సంచార పశువైద్య వాహనం తిరగడాన్ని మంగళవారం బీజేవైఎం నాయకులు గుర్తించారు. దీనిపై ఉన్న స్టిక్కర్‌ 

తొలగించాలని సిబ్బందిని కోరారు. సిబ్బంది, పోలీసులు ససేమిరా అన్నారు. నిబంధనల ప్రకారం ఈ చిత్రాలు ఉండరాదంటూ వంశీ 

స్వయంగా వాహనంపై ఉన్న సీఎం, రాజశేఖర్‌రెడ్డి స్టిక్కర్లు తొలగించారు.  


ఎన్నికల నిబంధనలను అధికారులు అమలు చేయడం లేదని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టిక్కర్లతో సంచార పశువైద్య వాహనం తిరగడాన్ని మంగళవారం బీజేవైఎం నాయకులు గుర్తించారు. దీనిపై ఉన్న స్టిక్కర్‌ తొలగించాలని సిబ్బందిని కోరారు. సిబ్బంది, పోలీసులు ససేమిరా అన్నారు. నిబంధనల ప్రకారం ఈ చిత్రాలు ఉండరాదంటూ వంశీ స్వయంగా వాహనంపై ఉన్న సీఎం, రాజశేఖర్‌రెడ్డి స్టిక్కర్లు తొలగించారు.
3/26
ఈపూరు మండలం అగ్నిగుండాల రెవెన్యూ గ్రామ పరిధిలో భూములు రీసర్వే చేస్తున్న అత్యాధునిక డ్రోన్‌ మంగళవారం కొండపైన 

కూలింది. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా ఈనెల 15న మండలంలో కార్యక్రమం ప్రారంభించారు. అగ్నిగుండాలలో 

మొదటి రోజు సర్వే పూర్తి చేశారు. రెండో రోజు మంగళవారం డ్రోన్‌ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ రెండు ఫ్లైలు బాగానే 

తిరిగింది. మూడోసారి ఎగరడంలో సాంకేతిక సమస్య తలెత్తి సమీపంలోని తిరుమలదేవుని కొండపైన కూలింది.పొదల్లో కూలిపోయిన 

డ్రోన్‌ను గుర్తించి కిందకు తెచ్చారు. ఈపూరు మండలం అగ్నిగుండాల రెవెన్యూ గ్రామ పరిధిలో భూములు రీసర్వే చేస్తున్న అత్యాధునిక డ్రోన్‌ మంగళవారం కొండపైన కూలింది. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా ఈనెల 15న మండలంలో కార్యక్రమం ప్రారంభించారు. అగ్నిగుండాలలో మొదటి రోజు సర్వే పూర్తి చేశారు. రెండో రోజు మంగళవారం డ్రోన్‌ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ రెండు ఫ్లైలు బాగానే తిరిగింది. మూడోసారి ఎగరడంలో సాంకేతిక సమస్య తలెత్తి సమీపంలోని తిరుమలదేవుని కొండపైన కూలింది.పొదల్లో కూలిపోయిన డ్రోన్‌ను గుర్తించి కిందకు తెచ్చారు.
4/26
అనంతపురం జిల్లా పాలనాధికారి కార్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య పరిష్కారం కాకపోయినా.. ప్రజలు 

కలెక్టరేట్‌లో విన్నవించేందుకు వస్తుంటారు.. కీలక కార్యాలయ ప్రాంగణంలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి ఇబ్బందిగా మారుతోంది. 

కలెక్టర్‌ భవనం పక్కనే ఖాళీ ప్రదేశంలో నీరు నిలిచి కుంటలా మారింది. ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది. అధికారులు స్పందించి 

చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.    అనంతపురం జిల్లా పాలనాధికారి కార్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య పరిష్కారం కాకపోయినా.. ప్రజలు కలెక్టరేట్‌లో విన్నవించేందుకు వస్తుంటారు.. కీలక కార్యాలయ ప్రాంగణంలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి ఇబ్బందిగా మారుతోంది. కలెక్టర్‌ భవనం పక్కనే ఖాళీ ప్రదేశంలో నీరు నిలిచి కుంటలా మారింది. ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది. అధికారులు స్పందించి చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.
5/26
అభిరుచి ఉండాలేగానీ దేన్నైనా కళాత్మకంగా తీర్చిదిద్దవచ్చని పలువురు నిరూపిస్తున్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, మోర్త, పెరవలి 

మండలాల్లో కొంతమంది ఇంటి యజమానులు నీటిట్యాంకులను ఆకట్టుకునే ఆకృతుల్లో నిర్మించుకున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో 

వారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వేలివెన్నులోని సూర్యాలయం ప్రాంగణంలో గుమ్మడికాయ ఆకృతిలో నీటి ట్యాంకు నిర్మించారు. 

తాడిపర్రులో మిరియాల మూర్తి విమానం ఆకారంలో ఏర్పాటు చేసుకున్నారు. అదే గ్రామంలో మరొకరు హంస ఆకృతిలో నిర్మించగా, ఆ 

ప్రాంతాన్ని హంసమేడ సెంటర్‌గా పిలుస్తున్నారు. యజమానుల అభిరుచిని స్థానికులు, అటుగా వెళ్లేవారు అభినందిస్తున్నారు. అభిరుచి ఉండాలేగానీ దేన్నైనా కళాత్మకంగా తీర్చిదిద్దవచ్చని పలువురు నిరూపిస్తున్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, మోర్త, పెరవలి మండలాల్లో కొంతమంది ఇంటి యజమానులు నీటిట్యాంకులను ఆకట్టుకునే ఆకృతుల్లో నిర్మించుకున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వేలివెన్నులోని సూర్యాలయం ప్రాంగణంలో గుమ్మడికాయ ఆకృతిలో నీటి ట్యాంకు నిర్మించారు. తాడిపర్రులో మిరియాల మూర్తి విమానం ఆకారంలో ఏర్పాటు చేసుకున్నారు. అదే గ్రామంలో మరొకరు హంస ఆకృతిలో నిర్మించగా, ఆ ప్రాంతాన్ని హంసమేడ సెంటర్‌గా పిలుస్తున్నారు. యజమానుల అభిరుచిని స్థానికులు, అటుగా వెళ్లేవారు అభినందిస్తున్నారు.
6/26
7/26
8/26
9/26
విశాఖ రైల్వే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు రైళ్లను పోర్టు రైల్వే ట్రాక్‌పైకి పంపిస్తుంటారు. ఆ క్రమంలో రామకృష్ణా జంక్షన్‌ వైపు 

ఇవి వస్తుంటాయి. ఇక్కడ రైల్వేగేటు ఉండదు. దీంతో కూత పెడుతూ రైలు వెళుతున్నా...ఇంజిన్‌ వద్ద ఉద్యోగులు నిలబడి...చేతులు 

ఊపుతూ ఎవరూ పట్టాల వైపు రావొద్దని సూచిస్తుంటారు. రైళ్ల రాకపోకలు ఇటువైపు తక్కువగా ఉండటం వల్లే రైల్వే గేటు ఏర్పాటు 

చేయలేదని..ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.   విశాఖ రైల్వే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు రైళ్లను పోర్టు రైల్వే ట్రాక్‌పైకి పంపిస్తుంటారు. ఆ క్రమంలో రామకృష్ణా జంక్షన్‌ వైపు ఇవి వస్తుంటాయి. ఇక్కడ రైల్వేగేటు ఉండదు. దీంతో కూత పెడుతూ రైలు వెళుతున్నా...ఇంజిన్‌ వద్ద ఉద్యోగులు నిలబడి...చేతులు ఊపుతూ ఎవరూ పట్టాల వైపు రావొద్దని సూచిస్తుంటారు. రైళ్ల రాకపోకలు ఇటువైపు తక్కువగా ఉండటం వల్లే రైల్వే గేటు ఏర్పాటు చేయలేదని..ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
10/26
ఎండలు తగ్గి వాతావరణం ఆహ్లాదంగా మారడంతో భాగ్య నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. భాగ్యనగర వైభవాన్ని 

చూసేందుకు ఉత్తరాది రాష్ట్రాల వారు అధికంగా ఇక్కడికి వస్తున్నారు. తన బిడ్డతో కలిసి మంగళవారం చార్మినార్‌ను చూసేందుకు వచ్చిన 

దంపతులు వీరు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా కావడంతో చార్మినార్, గోల్కొండ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో 

పలువురు పర్యాటకులు పాల్గొన్నారు. ఎండలు తగ్గి వాతావరణం ఆహ్లాదంగా మారడంతో భాగ్య నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. భాగ్యనగర వైభవాన్ని చూసేందుకు ఉత్తరాది రాష్ట్రాల వారు అధికంగా ఇక్కడికి వస్తున్నారు. తన బిడ్డతో కలిసి మంగళవారం చార్మినార్‌ను చూసేందుకు వచ్చిన దంపతులు వీరు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా కావడంతో చార్మినార్, గోల్కొండ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో పలువురు పర్యాటకులు పాల్గొన్నారు.
11/26
సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించుకోవడానికి ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. నిత్యం సుమారు 40 

మందికే పరీక్షలు చేస్తారు. దీంతో మంగళవారం ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్దకు చేరుకుని సిబ్బంది కోసం పడిగాపులు 

కాస్తున్న రోగులు, వారి బంధువులు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించుకోవడానికి ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. నిత్యం సుమారు 40 మందికే పరీక్షలు చేస్తారు. దీంతో మంగళవారం ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్దకు చేరుకుని సిబ్బంది కోసం పడిగాపులు కాస్తున్న రోగులు, వారి బంధువులు.
12/26
13/26
ప్రకృతిలోని అందాలు చూపరులను కట్టిపడేస్తుంటాయి. మంగళవారం తెల్లవారుజామున వర్షం కురవడంతో తల్లాడ, కల్లూరు, ఏన్కూరు 

మండలాలకు సమీపంలోని కనకగిరి గుట్టలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తెల్లని మేఘాలు గుట్టలను తాకుతూ వెళుతున్న దృశ్యాలు 

విశేషంగా ఆకర్షించాయి. ఆ దృశ్యాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. ప్రకృతిలోని అందాలు చూపరులను కట్టిపడేస్తుంటాయి. మంగళవారం తెల్లవారుజామున వర్షం కురవడంతో తల్లాడ, కల్లూరు, ఏన్కూరు మండలాలకు సమీపంలోని కనకగిరి గుట్టలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తెల్లని మేఘాలు గుట్టలను తాకుతూ వెళుతున్న దృశ్యాలు విశేషంగా ఆకర్షించాయి. ఆ దృశ్యాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.
14/26
బొగ్గు గనుల్లో దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు సింగరేణి సంస్థ బాహుబలి వాటర్‌ స్ప్రింక్లర్‌ను కొనుగోలు చేసింది. మణుగూరు 

ఏరియాలో ఓసీ-2 గని పెద్దది. ఈ గనిలో దుమ్ము విపరీతంగా వ్యాపిస్తుంది. దీన్ని నియంత్రించేందుకు గనుల్లోని రహదారులపై 28 వేల 

లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లతో నీటిని చల్లిస్తున్నారు. 4 కి.మీ. మేర నీటిని చల్లించేందుకు 3-4 ట్యాంకర్లు నిత్యం పనిచేస్తున్నాయి. 

ఇది ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడినది. ఈ సమస్యను అధిగమించేందుకు సింగరేణి సంస్థ 82 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన బాహుబలి 

వాటర్‌ స్ప్రింక్లర్‌ని ఇటీవలే కొనుగోలు చేసింది. గనిలో అన్ని రహదారులపై ఒకేసారి నీటిని చల్లటం దీని ప్రత్యేకత. వాహనం ఖరీదు 

సుమారు రూ.1.59 కోట్లు. సింగరేణివ్యాప్తంగా మూడింటిని కొనుగోలు చేయగా, మణుగూరు ఓసీ 2కి ఒకదాన్ని కేటాయించారు. బొగ్గు గనుల్లో దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు సింగరేణి సంస్థ బాహుబలి వాటర్‌ స్ప్రింక్లర్‌ను కొనుగోలు చేసింది. మణుగూరు ఏరియాలో ఓసీ-2 గని పెద్దది. ఈ గనిలో దుమ్ము విపరీతంగా వ్యాపిస్తుంది. దీన్ని నియంత్రించేందుకు గనుల్లోని రహదారులపై 28 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లతో నీటిని చల్లిస్తున్నారు. 4 కి.మీ. మేర నీటిని చల్లించేందుకు 3-4 ట్యాంకర్లు నిత్యం పనిచేస్తున్నాయి. ఇది ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడినది. ఈ సమస్యను అధిగమించేందుకు సింగరేణి సంస్థ 82 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన బాహుబలి వాటర్‌ స్ప్రింక్లర్‌ని ఇటీవలే కొనుగోలు చేసింది. గనిలో అన్ని రహదారులపై ఒకేసారి నీటిని చల్లటం దీని ప్రత్యేకత. వాహనం ఖరీదు సుమారు రూ.1.59 కోట్లు. సింగరేణివ్యాప్తంగా మూడింటిని కొనుగోలు చేయగా, మణుగూరు ఓసీ 2కి ఒకదాన్ని కేటాయించారు.
15/26
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆకుపై పలు యోగాసనాలు చిత్రీకరించి భళా అనిపించారు.. చిత్ర కళాకారుడు చోళేశ్వర్‌.. 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన చోళేశ్వర్‌ పండగ సందర్భాల్లో వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ చిత్రాలు 

వేస్తుంటారు. మానవుడికి ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని తెలపడానికి ఇలా ఆకుపై యోగాసనాలు చెక్కినట్లు ఆయన తెలిపారు. పలువురు 

ఆయన్ను అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆకుపై పలు యోగాసనాలు చిత్రీకరించి భళా అనిపించారు.. చిత్ర కళాకారుడు చోళేశ్వర్‌.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన చోళేశ్వర్‌ పండగ సందర్భాల్లో వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ చిత్రాలు వేస్తుంటారు. మానవుడికి ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని తెలపడానికి ఇలా ఆకుపై యోగాసనాలు చెక్కినట్లు ఆయన తెలిపారు. పలువురు ఆయన్ను అభినందించారు.
16/26
పై చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది. కుంటలో రసాయనాలను కలిపారా? లేదంటే ఏదైనా ప్రాణిని చంపి అందులో పడేశారా? అన్న 

అనుమానం కలుగుతుంది కదూ. కానీ, చాలా రోజులుగా నిలువ ఉన్న నీటిలో ఇలాంటి వర్ణాలు సహజసిద్ధంగా ఏర్పడుతుంటాయని 

నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు డా.బి.లక్ష్మప్ప ‘ఈనాడు’కు తెలిపారు. చిత్రంలో కనిపిస్తున్నది ఎరుపు రంగు 

శైవలాల (నాచు) తెట్టు అని అన్నారు. చెరువులు, కుంటలలో నీరు అడుగంటినప్పుడు నిలువ నీటిపైన సూక్ష్మక్రిములు చేరి వివిధ రంగుల్లో 

ఇలా నాచుతెట్టు ఏర్పడుతుంటాయని తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని ఓ కుంటలో కనిపించిన 

ఎరుపురంగు శైవలాల తెట్టును ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది. పై చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది. కుంటలో రసాయనాలను కలిపారా? లేదంటే ఏదైనా ప్రాణిని చంపి అందులో పడేశారా? అన్న అనుమానం కలుగుతుంది కదూ. కానీ, చాలా రోజులుగా నిలువ ఉన్న నీటిలో ఇలాంటి వర్ణాలు సహజసిద్ధంగా ఏర్పడుతుంటాయని నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు డా.బి.లక్ష్మప్ప ‘ఈనాడు’కు తెలిపారు. చిత్రంలో కనిపిస్తున్నది ఎరుపు రంగు శైవలాల (నాచు) తెట్టు అని అన్నారు. చెరువులు, కుంటలలో నీరు అడుగంటినప్పుడు నిలువ నీటిపైన సూక్ష్మక్రిములు చేరి వివిధ రంగుల్లో ఇలా నాచుతెట్టు ఏర్పడుతుంటాయని తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని ఓ కుంటలో కనిపించిన ఎరుపురంగు శైవలాల తెట్టును ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.
17/26
పక్షవాతంతో బాధపడుతున్న 78 ఏళ్ల భర్త సత్యనారాయణరాజును మామూలు మనిషిని చేసుకోడానికి దాచుకున్న డబ్బులన్నీ 

ఖర్చయిపోయాయి. ఆయన తిరిగి కాలుజారి పడడంతో తలలో నెత్తురు గడ్డకట్టగా షుగరు, బీపీ తోడవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. 

అదే సమయంలో భార్య విశాలాక్షి కూడా బాతురూంలో కాలుజారి పడడంతో పక్కటెముక విరిగి ఎక్కువసేపు నిలబడలేక తాను ఇంటికే 

పరిమితమైంది. కొడుకు, కూతురు ఉన్నా ఆదరించకపోవడంతో విజయవాడ కేదారేశ్వరపేట ఎర్రకట్ట దగ్గర రేకుల షెడ్డులోనే కాలం 

గడుపుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తోంది.      పక్షవాతంతో బాధపడుతున్న 78 ఏళ్ల భర్త సత్యనారాయణరాజును మామూలు మనిషిని చేసుకోడానికి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఆయన తిరిగి కాలుజారి పడడంతో తలలో నెత్తురు గడ్డకట్టగా షుగరు, బీపీ తోడవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. అదే సమయంలో భార్య విశాలాక్షి కూడా బాతురూంలో కాలుజారి పడడంతో పక్కటెముక విరిగి ఎక్కువసేపు నిలబడలేక తాను ఇంటికే పరిమితమైంది. కొడుకు, కూతురు ఉన్నా ఆదరించకపోవడంతో విజయవాడ కేదారేశ్వరపేట ఎర్రకట్ట దగ్గర రేకుల షెడ్డులోనే కాలం గడుపుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తోంది.
18/26
విజయవాడ నుంచి ప్రవహించే ఏలూరు, బందరు, రైవస్‌ కాల్వలు లక్షల మంది దాహం తీర్చి, లక్షల ఎకరాల ఆయకట్టును 

తడుపుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కాల్వలు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కాయి. నగర వ్యర్థజలాలు నేరుగా ఈ కాల్వల్లోకి 

చేరేలా అధికారులే డ్రైనేజీ నిర్మాణాలు చేయించడం గమనార్హం. నెల్లూరు నగరం నుంచి వెళ్లే పెన్నా నదిదీ ఇదే పరిస్థితి. ఇటీవల ఓ 

సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘నదీ జలాల్లోకి శుద్ధి చేసిన నీరే వదలాలి’ అని సూచించడంతో ప్రస్తుత పరిస్థితిలో మార్పు వస్తుందని 

పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు. విజయవాడ నుంచి ప్రవహించే ఏలూరు, బందరు, రైవస్‌ కాల్వలు లక్షల మంది దాహం తీర్చి, లక్షల ఎకరాల ఆయకట్టును తడుపుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కాల్వలు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కాయి. నగర వ్యర్థజలాలు నేరుగా ఈ కాల్వల్లోకి చేరేలా అధికారులే డ్రైనేజీ నిర్మాణాలు చేయించడం గమనార్హం. నెల్లూరు నగరం నుంచి వెళ్లే పెన్నా నదిదీ ఇదే పరిస్థితి. ఇటీవల ఓ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘నదీ జలాల్లోకి శుద్ధి చేసిన నీరే వదలాలి’ అని సూచించడంతో ప్రస్తుత పరిస్థితిలో మార్పు వస్తుందని పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.
19/26
20/26
దిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో విద్యార్థుల యోగా విన్యాసం దిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో విద్యార్థుల యోగా విన్యాసం
21/26
అమెరికాలోని ఫ్లోరిడా లేక్‌ బ్యూనా విస్టాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్థానికులు అమెరికాలోని ఫ్లోరిడా లేక్‌ బ్యూనా విస్టాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్థానికులు
22/26
ఉత్తరాఖండ్‌ రాజధాని దేహ్రాదూన్‌లో హిమాలయాల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా ఉత్తరాఖండ్‌ రాజధాని దేహ్రాదూన్‌లో హిమాలయాల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా
23/26
న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌స్క్వేర్‌  వద్ద  ‘మైండ్‌ ఓవర్‌ మ్యాడ్‌నెస్‌ యోగా’ న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌స్క్వేర్‌ వద్ద ‘మైండ్‌ ఓవర్‌ మ్యాడ్‌నెస్‌ యోగా’
24/26
కాఠ్‌మాండూ ధరహర టవర్‌పై యోగా సందేశం కాఠ్‌మాండూ ధరహర టవర్‌పై యోగా సందేశం
25/26
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో 11 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చర్లగూడెం జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు 

గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మెరుగైన పరిహారం, పునరావాసం, ప్యాకేజీ కోరుతూ జలాశయం కార్యాలయం వద్ద భూ 

నిర్వాసితులు చేపట్టిన నిరసన మంగళవారం 41వ రోజుకు చేరింది. బాధితులు రాత్రి వేళలోనూ అక్కడే పడుకొని నిరసన తెలుపుతున్నారు. 

పరిహారం, పునరావాసం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో 11 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చర్లగూడెం జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మెరుగైన పరిహారం, పునరావాసం, ప్యాకేజీ కోరుతూ జలాశయం కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపట్టిన నిరసన మంగళవారం 41వ రోజుకు చేరింది. బాధితులు రాత్రి వేళలోనూ అక్కడే పడుకొని నిరసన తెలుపుతున్నారు. పరిహారం, పునరావాసం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
26/26
చైనాలోని జియాంగ్‌జీ ఫ్రావిన్సులో వుయువాన్‌ కౌంటీ నగరాన్ని ముంచెత్తిన వరద చైనాలోని జియాంగ్‌జీ ఫ్రావిన్సులో వుయువాన్‌ కౌంటీ నగరాన్ని ముంచెత్తిన వరద

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు