News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 23 Jun 2022 10:57 IST
1/14
వరంగల్‌ తపాలా కార్యాలయం కూడలిలో ఆరు నెలల క్రితం శిథిలావస్థలోని భవన సముదాయాలను మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. 

ప్రస్తుతం ఆ ప్రదేశం మురికి కూపంగా మారి చుట్టుపక్కల ప్రాంతాలకు దుర్గంధం వెదజల్లుతోంది. ఆ ప్రాంతంలో ఉండే పూలు, పండ్లు, 

కుండలు తదితరం విక్రయించే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తొలుత మున్సిపల్‌ అధికారులు.. అక్కడ మిగిలిన 

భవన సముదాయాలను కూల్చేసి కూడలి అభివృద్ధి, పార్కింగ్‌ ఏర్పాటు తలపెట్టారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడకపోవడంతో 

చిన్నపాటి వర్షానికే ఆ ప్రాంతం బురదమయంగా మారి చుట్టుపక్కల వ్యాపారులతోపాటు అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు 

దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు.   వరంగల్‌ తపాలా కార్యాలయం కూడలిలో ఆరు నెలల క్రితం శిథిలావస్థలోని భవన సముదాయాలను మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. ప్రస్తుతం ఆ ప్రదేశం మురికి కూపంగా మారి చుట్టుపక్కల ప్రాంతాలకు దుర్గంధం వెదజల్లుతోంది. ఆ ప్రాంతంలో ఉండే పూలు, పండ్లు, కుండలు తదితరం విక్రయించే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తొలుత మున్సిపల్‌ అధికారులు.. అక్కడ మిగిలిన భవన సముదాయాలను కూల్చేసి కూడలి అభివృద్ధి, పార్కింగ్‌ ఏర్పాటు తలపెట్టారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఆ ప్రాంతం బురదమయంగా మారి చుట్టుపక్కల వ్యాపారులతోపాటు అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు.
2/14
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీరందించి జీవం పోస్తున్న గోదావరి నదీమతల్లి కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. 

ప్లాస్టిక్‌ భూతం నదిని కమ్మేస్తుండడంతో తాగేనీరే గరళమవుతోంది. నల్లాఛానల్‌ ద్వారా మురుగునీటితోపాటు ప్లాస్టిక్‌ సంచులు, డబ్బాలు 

నేరుగా గోదావరిలోకి వస్తుండడం ఆందోళన రేపుతోంది. నదీమతల్లిని కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, నగరపాలక 

సంస్థతోపాటు ఎవరికి వారు నడుం బిగించకపోతే భవిష్యత్తులో విషపూరిత నీటినే తాగాల్సిన పరిస్థితి రావొచ్చు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీరందించి జీవం పోస్తున్న గోదావరి నదీమతల్లి కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ప్లాస్టిక్‌ భూతం నదిని కమ్మేస్తుండడంతో తాగేనీరే గరళమవుతోంది. నల్లాఛానల్‌ ద్వారా మురుగునీటితోపాటు ప్లాస్టిక్‌ సంచులు, డబ్బాలు నేరుగా గోదావరిలోకి వస్తుండడం ఆందోళన రేపుతోంది. నదీమతల్లిని కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, నగరపాలక సంస్థతోపాటు ఎవరికి వారు నడుం బిగించకపోతే భవిష్యత్తులో విషపూరిత నీటినే తాగాల్సిన పరిస్థితి రావొచ్చు.
3/14
తొలకరి వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం బుధవారం పరవళ్లు 

తొక్కుతూ కనువిందు చేసింది. అటవీ ప్రాంతంలో రెండు రాళ్ల మధ్య చీలికగా ఏర్పడి సహజసిద్ధంగా ఏర్పడింది కుంటాల జలపాతం. 

ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు, మడుగులు నిండుతూ కడెం మార్గాన జలపాతం నీటి ధారలు ఉద్ధృతంగా 

ప్రవహిస్తూ.. కిందికి దూకుతూ ఆకట్టుకున్నాయి.   తొలకరి వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం బుధవారం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేసింది. అటవీ ప్రాంతంలో రెండు రాళ్ల మధ్య చీలికగా ఏర్పడి సహజసిద్ధంగా ఏర్పడింది కుంటాల జలపాతం. ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు, మడుగులు నిండుతూ కడెం మార్గాన జలపాతం నీటి ధారలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. కిందికి దూకుతూ ఆకట్టుకున్నాయి.
4/14
ఒకప్పుడు ప్రతి ఇల్లూ చుట్టూ పచ్చటి చెట్లతో ఆహ్లాదభరితంగా కనిపించేది. పిచ్చుకలు వాలి సందడి చేసేవి. కాలక్రమంలో అపార్ట్‌మెంట్లు 

వెలిసి కొంచెం జాగా కూడా ఖాళీగా కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడక్కడా ఇళ్లముందు మొక్కలను పెంచుతూ పిచ్చులకు 

గుర్తుగా కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది...సిద్దిపేట మండలం, పొన్నాల వద్ద ఉన్న ఓ 

ఇల్లు. ఇక్కడ ఆవరణ అంతా వివిధ రకాల మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తోంది. అలాగే పిచ్చుక గూళ్లను ఏర్పాటుచేసి బొమ్మలను 

అతికించారు. దూరం నుంచి చూసే వారికి నిజంగానే పిచ్చుకలు వాలినట్లు అనుభూతి కలుగుతోంది. బొమ్మలు చూపరులను కనువిందు 

చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి ఇల్లూ చుట్టూ పచ్చటి చెట్లతో ఆహ్లాదభరితంగా కనిపించేది. పిచ్చుకలు వాలి సందడి చేసేవి. కాలక్రమంలో అపార్ట్‌మెంట్లు వెలిసి కొంచెం జాగా కూడా ఖాళీగా కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడక్కడా ఇళ్లముందు మొక్కలను పెంచుతూ పిచ్చులకు గుర్తుగా కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది...సిద్దిపేట మండలం, పొన్నాల వద్ద ఉన్న ఓ ఇల్లు. ఇక్కడ ఆవరణ అంతా వివిధ రకాల మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తోంది. అలాగే పిచ్చుక గూళ్లను ఏర్పాటుచేసి బొమ్మలను అతికించారు. దూరం నుంచి చూసే వారికి నిజంగానే పిచ్చుకలు వాలినట్లు అనుభూతి కలుగుతోంది. బొమ్మలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.
5/14
ఆరుద్ర కార్తె బుధవారం నుంచి ప్రారంభంకావడంతో ఎల్లారెడ్డి పురపాలిక పరిధిలోని పొలాల్లో ఆరుద్ర పురుగులు కనువిందు చేస్తున్నాయి. 

వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి బొరియల నుంచి బయటకు వస్తున్నాయి. ఇవి కనిపిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు 

బాగా పండుతాయని అన్నదాతల విశ్వాసం. ఆరుద్ర కార్తె బుధవారం నుంచి ప్రారంభంకావడంతో ఎల్లారెడ్డి పురపాలిక పరిధిలోని పొలాల్లో ఆరుద్ర పురుగులు కనువిందు చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి బొరియల నుంచి బయటకు వస్తున్నాయి. ఇవి కనిపిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని అన్నదాతల విశ్వాసం.
6/14
నెక్కొండ మండలంలోని ముదిగొండ శివారులో ఉన్న మాటు వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోస్తోంది. మత్తడి ఎత్తుగా 

ఉండటంతో జారిపడుతున్న నీటి ప్రవాహం ఆకట్టుకుంటోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మత్తడి వద్ద సందడి చేస్తున్నారు. నెక్కొండ మండలంలోని ముదిగొండ శివారులో ఉన్న మాటు వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోస్తోంది. మత్తడి ఎత్తుగా ఉండటంతో జారిపడుతున్న నీటి ప్రవాహం ఆకట్టుకుంటోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మత్తడి వద్ద సందడి చేస్తున్నారు.
7/14
గుంటూరు నగరాలు ప్రాంతంలోని అన్న క్యాంటీన్‌ భవనం ఇది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన కేంద్రం 

ఇప్పుడు వ్యాధుల పరీక్ష కేంద్రంగా మారింది. జ్వరాల ఆసుపత్రి సమీపంలో అన్న క్యాంటీన్‌ ఉంటే అక్కడికి వచ్చే చాలా మంది పేదలకు 

ఉపయోగపడుతుందని భావించి అప్పట్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు చాలా మంది వినియోగించుకున్నారు. కానీ, ప్రభుత్వం మారాక 

అన్ని అన్న క్యాంటీన్లలాగే దీన్నీ మూసేశారు. చాలా రోజులు పడావుగా ఉన్న భవనాన్ని చివరికి కరోనా సమయంలో తెరిచి ఎయిడ్స్, క్షయ 

వ్యాధుల పరీక్ష కేంద్రంగా మార్చేశారు.   గుంటూరు నగరాలు ప్రాంతంలోని అన్న క్యాంటీన్‌ భవనం ఇది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన కేంద్రం ఇప్పుడు వ్యాధుల పరీక్ష కేంద్రంగా మారింది. జ్వరాల ఆసుపత్రి సమీపంలో అన్న క్యాంటీన్‌ ఉంటే అక్కడికి వచ్చే చాలా మంది పేదలకు ఉపయోగపడుతుందని భావించి అప్పట్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు చాలా మంది వినియోగించుకున్నారు. కానీ, ప్రభుత్వం మారాక అన్ని అన్న క్యాంటీన్లలాగే దీన్నీ మూసేశారు. చాలా రోజులు పడావుగా ఉన్న భవనాన్ని చివరికి కరోనా సమయంలో తెరిచి ఎయిడ్స్, క్షయ వ్యాధుల పరీక్ష కేంద్రంగా మార్చేశారు.
8/14
అమరావతి రాజధాని మందడం క్రాసులో మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరం ఇన్నాళ్లూ బోసిపోయి కనిపించింది. 

ఇప్పుడు ఏకంగా టెంటు కూడా కూలిపోయింది. ‘పేరుకు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారే తప్ప.. కొన్నాళ్లుగా అందులో ఎవరూ కనిపించడం 

లేదు. ఎవరూ రాక, నిర్వహణ లేక ఖాళీగా ఉన్న టెంటు కర్రలు గాలివానకు ఊడిపోయాయి. అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటి 

నుంచి ఈ శిబిరం వైపు ఎవరూ రావడం లేదు’ అని స్థానికులు తెలిపారు.  అమరావతి రాజధాని మందడం క్రాసులో మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరం ఇన్నాళ్లూ బోసిపోయి కనిపించింది. ఇప్పుడు ఏకంగా టెంటు కూడా కూలిపోయింది. ‘పేరుకు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారే తప్ప.. కొన్నాళ్లుగా అందులో ఎవరూ కనిపించడం లేదు. ఎవరూ రాక, నిర్వహణ లేక ఖాళీగా ఉన్న టెంటు కర్రలు గాలివానకు ఊడిపోయాయి. అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటి నుంచి ఈ శిబిరం వైపు ఎవరూ రావడం లేదు’ అని స్థానికులు తెలిపారు.
9/14
తెనాలి పట్టణానికే మణిహారంలాంటి మున్సిపల్‌ భవనం శిథిలావస్థకు చేరింది. పట్టణం నడిబొడ్డున దర్జాగా కనిపించే ఈ భవనాన్ని 

1966లో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇప్పటికీ అందులో మున్సిపాలిటికి చెందిన పలు విభాగాల 

కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఒక వైపు పెచ్చులూడి పడుతున్నా.. ఆయా ఉద్యోగులు భయం భయంగా అందులోనే పని 

చేస్తున్నారు. ఇంజినీర్లు నెల కిందట భవన దృఢత్వాన్ని పరీక్షించి ‘ప్రమాదకరస్థితి’లో ఉన్నట్లు నివేదికలు ఇచ్చారు. ఖాళీ చేయాలనీ 

సూచించారు. దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆ నివేదికలు బుట్టదాఖలైనట్లేనని ఉద్యోగులు భావిస్తున్నారు.    తెనాలి పట్టణానికే మణిహారంలాంటి మున్సిపల్‌ భవనం శిథిలావస్థకు చేరింది. పట్టణం నడిబొడ్డున దర్జాగా కనిపించే ఈ భవనాన్ని 1966లో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇప్పటికీ అందులో మున్సిపాలిటికి చెందిన పలు విభాగాల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఒక వైపు పెచ్చులూడి పడుతున్నా.. ఆయా ఉద్యోగులు భయం భయంగా అందులోనే పని చేస్తున్నారు. ఇంజినీర్లు నెల కిందట భవన దృఢత్వాన్ని పరీక్షించి ‘ప్రమాదకరస్థితి’లో ఉన్నట్లు నివేదికలు ఇచ్చారు. ఖాళీ చేయాలనీ సూచించారు. దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆ నివేదికలు బుట్టదాఖలైనట్లేనని ఉద్యోగులు భావిస్తున్నారు.
10/14
అఫ్గానిస్థాన్‌లో బుధవారం చోటుచేసుకున్న తీవ్ర భూకంపం ధాటికి ఖోస్త్‌ ప్రావిన్స్‌లోని స్పెరా జిల్లాలో నేలమట్టమైన నివాసం అఫ్గానిస్థాన్‌లో బుధవారం చోటుచేసుకున్న తీవ్ర భూకంపం ధాటికి ఖోస్త్‌ ప్రావిన్స్‌లోని స్పెరా జిల్లాలో నేలమట్టమైన నివాసం
11/14
పచ్చదనం మధ్య ప్రయాణం ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో కూడళ్లను, విభాగినులను సుందరీకరిస్తోంది జీహెచ్‌ఎంసీ. షేక్‌పేట, సెవెన్‌ టూంబ్స్‌ మధ్య డివైడర్‌పై పెంచిన పచ్చదనం ఆ ప్రాంతానికి శోభ తెచ్చింది. పచ్చదనం మధ్య ప్రయాణం ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో కూడళ్లను, విభాగినులను సుందరీకరిస్తోంది జీహెచ్‌ఎంసీ. షేక్‌పేట, సెవెన్‌ టూంబ్స్‌ మధ్య డివైడర్‌పై పెంచిన పచ్చదనం ఆ ప్రాంతానికి శోభ తెచ్చింది.
12/14
కోఠి సుల్తాన్‌బజార్‌ ప్రాంతమంటే ట్రాఫిక్‌ ఇబ్బందులు అధికమే. ట్రాఫిక్‌ నియంత్రించేందుకు ఉండే సిబ్బందికి సైతం అవస్థలు తప్పడం లేదు. కూర్చునేందుకు సరైన సదుపాయం లేక పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంటు ఇటుకలు తెచ్చి ఐలండ్‌లో పేర్చి వాటిపై కూర్చొని విధులు నిర్వహించాల్సి వస్తోంది. కోఠి సుల్తాన్‌బజార్‌ ప్రాంతమంటే ట్రాఫిక్‌ ఇబ్బందులు అధికమే. ట్రాఫిక్‌ నియంత్రించేందుకు ఉండే సిబ్బందికి సైతం అవస్థలు తప్పడం లేదు. కూర్చునేందుకు సరైన సదుపాయం లేక పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంటు ఇటుకలు తెచ్చి ఐలండ్‌లో పేర్చి వాటిపై కూర్చొని విధులు నిర్వహించాల్సి వస్తోంది.
13/14
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉన్న మహబూబియా బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో విద్యార్థినులందరూ మాస్కులతో కనిపించారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉన్న మహబూబియా బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో విద్యార్థినులందరూ మాస్కులతో కనిపించారు.
14/14
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలో రామోజీ ఫౌండేషన్‌ నిర్మించిన అధునాతన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కనాటి నీరు పోస్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ. చిత్రంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌.విజయేశ్వరి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలో రామోజీ ఫౌండేషన్‌ నిర్మించిన అధునాతన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కనాటి నీరు పోస్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ. చిత్రంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌.విజయేశ్వరి.

మరిన్ని