News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 23 Jun 2022 11:48 IST
1/29
గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతానికి చెందిన వీరు తేనెటీగలను పెంచుతూ(ఎపికల్చర్‌) ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం వద్ద పిల్లి పెసర పంటలో తేనెటీగల పెట్టెలను ఉంచారు. ఆ పొలంలోని పూలలో తేనెటీగలకు కావాల్సిన తేనె లభిస్తుంది. ఎండకు తేనెటీగలు చనిపోకుండా పెంపకందారులు పెట్టెలపై గోనె సంచులు కప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతానికి చెందిన వీరు తేనెటీగలను పెంచుతూ(ఎపికల్చర్‌) ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం వద్ద పిల్లి పెసర పంటలో తేనెటీగల పెట్టెలను ఉంచారు. ఆ పొలంలోని పూలలో తేనెటీగలకు కావాల్సిన తేనె లభిస్తుంది. ఎండకు తేనెటీగలు చనిపోకుండా పెంపకందారులు పెట్టెలపై గోనె సంచులు కప్పారు.
2/29
అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన భూకంపంలో సుమారు 1000 మందికి పైగా మృతి చెందారు. చాలామంది గాయాల పాలవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరుతూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన భూకంపంలో సుమారు 1000 మందికి పైగా మృతి చెందారు. చాలామంది గాయాల పాలవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరుతూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు.
3/29
హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన ‘బాదం పే చర్చ’ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ పాల్గొని సందడి చేశారు. ‘ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం’ అనే అంశంపై పోషకాహార నిపుణులు, ఇతర ప్రముఖులతో ఆమె చర్చించారు. పీచు ఎక్కువగా ఉండే బాదంను అల్పాహారంగా తీసుకుంటే మంచిదని సోహా అలీఖాన్‌ సూచించారు. హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన ‘బాదం పే చర్చ’ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ పాల్గొని సందడి చేశారు. ‘ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం’ అనే అంశంపై పోషకాహార నిపుణులు, ఇతర ప్రముఖులతో ఆమె చర్చించారు. పీచు ఎక్కువగా ఉండే బాదంను అల్పాహారంగా తీసుకుంటే మంచిదని సోహా అలీఖాన్‌ సూచించారు.
4/29
5/29
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గురువారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరిని కలిశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నాలాలు తదితర నిర్మాణాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని ఆయన్ను కోరారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గురువారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరిని కలిశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నాలాలు తదితర నిర్మాణాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని ఆయన్ను కోరారు.
6/29
అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు గురువారం ఉదయం న్యూయార్క్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణా ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులేట్‌ జనరల్‌ రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు గురువారం ఉదయం న్యూయార్క్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణా ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులేట్‌ జనరల్‌ రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
7/29
8/29
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని దిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని దిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
9/29
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ‘విక్రమ్‌’ సినిమా చూసి ఫిదా అయ్యారు. అనంతరం నటుడు కమల్‌హాసన్‌ను కలిసి సినిమా ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. కమల్‌హాసన్‌కు నటనపై ఉన్న ఇష్టం వెలకట్టలేనిదని డీఎస్పీ అన్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ‘విక్రమ్‌’ సినిమా చూసి ఫిదా అయ్యారు. అనంతరం నటుడు కమల్‌హాసన్‌ను కలిసి సినిమా ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. కమల్‌హాసన్‌కు నటనపై ఉన్న ఇష్టం వెలకట్టలేనిదని డీఎస్పీ అన్నారు.
10/29
సోమాలియాలో వర్షాలు సరిగ్గా లేక కరవు సంభవించింది. ప్రజలు ఆకలి, పోషకాహార లేమితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురిని అక్కడి బైడోవాలోని ‘ది కామ్ జిరోన్‌’ పునరావాస కేంద్రానికి తరలించారు. సోమాలియాలో వర్షాలు సరిగ్గా లేక కరవు సంభవించింది. ప్రజలు ఆకలి, పోషకాహార లేమితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురిని అక్కడి బైడోవాలోని ‘ది కామ్ జిరోన్‌’ పునరావాస కేంద్రానికి తరలించారు.
11/29
12/29
13/29
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ నూతన కలెక్షన్‌ దుస్తులను ధరించి విన్యాసాలు చేస్తూ ప్రదర్శన ఇచ్చారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ నూతన కలెక్షన్‌ దుస్తులను ధరించి విన్యాసాలు చేస్తూ ప్రదర్శన ఇచ్చారు.
14/29
15/29
హంగేరిలోని బుడాపెస్ట్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో ఇటలీకి చెందిన యువతులు అదరగొట్టే విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో ఇటలీకి చెందిన యువతులు అదరగొట్టే విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు.
16/29
చిత్రంలోని వజ్ర వాహనాన్ని చూసి ఇందులో పోలీసులు వచ్చారేమో అని లేదా శాంతి భద్రతలు కాపాడేందుకు సాయుధ బలగాలు వచ్చాయనుకుంటున్నారా. కానీ ఇక్కడ అదేం జరగలేదు. ఏలూరులోని శాంతినగర్‌లో నీటిశుద్ధి కేంద్రం నుంచి నీటి డబ్బాలను తీసుకువచ్చేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. శాంతినగర్‌లోని పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోలు బంకులో తాగేందుకు ఈ నీటిని తీసుకువెళ్తున్నారు. ఈ మార్గంలో వెళ్తున్న వారంతా వజ్ర వాహనంలో నీటి డబ్బాలు తరలించడం చూసి అవాక్కవుతున్నారు. చిత్రంలోని వజ్ర వాహనాన్ని చూసి ఇందులో పోలీసులు వచ్చారేమో అని లేదా శాంతి భద్రతలు కాపాడేందుకు సాయుధ బలగాలు వచ్చాయనుకుంటున్నారా. కానీ ఇక్కడ అదేం జరగలేదు. ఏలూరులోని శాంతినగర్‌లో నీటిశుద్ధి కేంద్రం నుంచి నీటి డబ్బాలను తీసుకువచ్చేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. శాంతినగర్‌లోని పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోలు బంకులో తాగేందుకు ఈ నీటిని తీసుకువెళ్తున్నారు. ఈ మార్గంలో వెళ్తున్న వారంతా వజ్ర వాహనంలో నీటి డబ్బాలు తరలించడం చూసి అవాక్కవుతున్నారు.
17/29
18/29
అచ్చం చేపల్ని పోలిన డ్రెస్‌లో కన్పిస్తున్న వీరు ‘మెర్మైడింగ్‌’ శిక్షణార్థులు. ఫిలిప్పీన్స్‌లోని బటాంగాస్‌ ప్రావిన్స్‌ మాబినిలో ఇలా ఈత కొడుతూ కనువిందు చేశారు. 

అచ్చం చేపల్ని పోలిన డ్రెస్‌లో కన్పిస్తున్న వీరు ‘మెర్మైడింగ్‌’ శిక్షణార్థులు. ఫిలిప్పీన్స్‌లోని బటాంగాస్‌ ప్రావిన్స్‌ మాబినిలో ఇలా ఈత కొడుతూ కనువిందు చేశారు.
19/29
20/29
పేరూరులో నిర్మించిన వకుళామాత ఆలయం ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులున్నారు. పేరూరులో నిర్మించిన వకుళామాత ఆలయం ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులున్నారు.
21/29
22/29
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పీజేఆర్‌ కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డిని గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పీజేఆర్‌ కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డిని గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
23/29
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గురువారం ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ప్రధాని అభినందించారు. ద్రౌపదీ ముర్ము మార్గదర్శనం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గురువారం ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ప్రధాని అభినందించారు. ద్రౌపదీ ముర్ము మార్గదర్శనం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
24/29
25/29
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్‌, ప్రయాణికులతో మాట్లాడారు. 

పనిగంటలు పెంచడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని డ్రైవర్‌, ఛార్జీల భారంతో అల్లాడిపోతున్నామని ప్రయాణికులు తమ ఆవేదన 

పంచుకున్నట్లు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్‌, ప్రయాణికులతో మాట్లాడారు. పనిగంటలు పెంచడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని డ్రైవర్‌, ఛార్జీల భారంతో అల్లాడిపోతున్నామని ప్రయాణికులు తమ ఆవేదన పంచుకున్నట్లు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు.
26/29
తిరుపతి జిల్లాలోని పేరూరు వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట 

విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, జిల్లా అధికారులు 

ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. తిరుపతి జిల్లాలోని పేరూరు వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
27/29
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమైన బ్రిటన్‌ వాసులు ఇప్పుడు వేసవి విహారాలకు వెళుతున్నారు. అయితే విమానాశ్రయాల్లో 

సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ మూలంగా ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే చాలా మందిని 

విధుల నుంచి తొలగించారు. దీంతో లగేజీ కౌంటర్ల వద్ద రద్దీ, విమానాల రద్దు వంటివి నిత్యకృత్యంగా మారాయి. లండన్‌లోని హీట్‌త్రో 

విమానాశ్రయం ఇలా ప్రయాణికులతో బిజీబిజీగా కనిపించింది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమైన బ్రిటన్‌ వాసులు ఇప్పుడు వేసవి విహారాలకు వెళుతున్నారు. అయితే విమానాశ్రయాల్లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ మూలంగా ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే చాలా మందిని విధుల నుంచి తొలగించారు. దీంతో లగేజీ కౌంటర్ల వద్ద రద్దీ, విమానాల రద్దు వంటివి నిత్యకృత్యంగా మారాయి. లండన్‌లోని హీట్‌త్రో విమానాశ్రయం ఇలా ప్రయాణికులతో బిజీబిజీగా కనిపించింది.
28/29
బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 మార్గం ఇది. సరైన అవగాహన, పర్యవేక్షణ లేకుండా రోడ్డుకు మధ్యలో గీసిన గీతలు ఎన్ని వంకర్లు 

పోయాయో చూశారా? వీటిని అనుసరిస్తూ వాహనాలు నడపడం రేసు కార్లు నడిపే డ్రైవర్లకు కూడా సాధ్యం కాదేమోనంటూ వాహన 

చోదకులు మాట్లాడుకుంటున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 మార్గం ఇది. సరైన అవగాహన, పర్యవేక్షణ లేకుండా రోడ్డుకు మధ్యలో గీసిన గీతలు ఎన్ని వంకర్లు పోయాయో చూశారా? వీటిని అనుసరిస్తూ వాహనాలు నడపడం రేసు కార్లు నడిపే డ్రైవర్లకు కూడా సాధ్యం కాదేమోనంటూ వాహన చోదకులు మాట్లాడుకుంటున్నారు.
29/29

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని