News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 24 Jun 2022 20:32 IST
1/26
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో అభీజ్న వేమూరు కాస తన పెయింటింగ్స్‌తో ‘ది ఫెమినైన్‌’ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. మనుషుల శరీరంపై వేసిన ఈ పెయింటింగ్స్‌ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో అభీజ్న వేమూరు కాస తన పెయింటింగ్స్‌తో ‘ది ఫెమినైన్‌’ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. మనుషుల శరీరంపై వేసిన ఈ పెయింటింగ్స్‌ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
2/26
3/26
4/26
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 13వేల మద్యం సీసాలను విశాఖ జిల్లా భీమిలిలోని కుమ్మరి పాలెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. 12 కేసుల్లో స్వాధీనం చేసుకున్న వీటి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని వారు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 13వేల మద్యం సీసాలను విశాఖ జిల్లా భీమిలిలోని కుమ్మరి పాలెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. 12 కేసుల్లో స్వాధీనం చేసుకున్న వీటి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని వారు తెలిపారు.
5/26
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు రెండు గంటల పాటు బండ్ల గణేశ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు రెండు గంటల పాటు బండ్ల గణేశ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
6/26
అదేంటి ఓ పెద్ద విమానం.. మిగిలిన యుద్ధ విమానాలను తాళ్లతో లాక్కెళ్తోంది అనుకుంటున్నారా. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలు ఈజిప్టులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈక్రమంలో దారి మధ్యలో యూఏఈకి చెందిన విమానం ఆకాశంలోనే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇంధనం నింపింది. అదేంటి ఓ పెద్ద విమానం.. మిగిలిన యుద్ధ విమానాలను తాళ్లతో లాక్కెళ్తోంది అనుకుంటున్నారా. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలు ఈజిప్టులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈక్రమంలో దారి మధ్యలో యూఏఈకి చెందిన విమానం ఆకాశంలోనే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇంధనం నింపింది.
7/26
8/26
ఒంగోలు పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌ వద్ద ఉదయం ఓ తల్లి శునకం అటు వైపు వెళ్తుండగా తన పిల్ల శునకం పాలు తాగడానికి ఆత్రుతగా రావడాన్ని గమనించింది. వెంటనే తన పిల్ల శునకానికి పాలిస్తుండగా ఓ పిల్ల వరాహం అటుగా వచ్చి తాను కూడా పాలు తాగింది. ఓ 10నిమిషాల పాటు కుక్క, పంది పిల్ల కలిసి పాలు తాగాయి. జాతి వైరాన్ని మరిచి తల్లి శునకం వరాహానికి పాలివ్వడాన్ని చుట్టుపక్కలవారు ఆసక్తిగా తిలకించారు. ఒంగోలు పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌ వద్ద ఉదయం ఓ తల్లి శునకం అటు వైపు వెళ్తుండగా తన పిల్ల శునకం పాలు తాగడానికి ఆత్రుతగా రావడాన్ని గమనించింది. వెంటనే తన పిల్ల శునకానికి పాలిస్తుండగా ఓ పిల్ల వరాహం అటుగా వచ్చి తాను కూడా పాలు తాగింది. ఓ 10నిమిషాల పాటు కుక్క, పంది పిల్ల కలిసి పాలు తాగాయి. జాతి వైరాన్ని మరిచి తల్లి శునకం వరాహానికి పాలివ్వడాన్ని చుట్టుపక్కలవారు ఆసక్తిగా తిలకించారు.
9/26
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణాలను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బటర్‌ఫ్లై సెల్ఫీ పాయింట్‌ వద్ద మంత్రులు సరదాగా ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణాలను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బటర్‌ఫ్లై సెల్ఫీ పాయింట్‌ వద్ద మంత్రులు సరదాగా ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
10/26
11/26
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ నూతన మేకప్‌ స్టూడియో అండ్‌ బోటిక్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. సౌందర్య ఉత్పత్తుల రంగం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ నూతన మేకప్‌ స్టూడియో అండ్‌ బోటిక్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. సౌందర్య ఉత్పత్తుల రంగం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆమె తెలిపారు.
12/26
మెథడిస్ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల స్నాతకోత్సవాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థినులు సంబరంగా గాలిలోకి ఎగురుతూ ఫొటోలు తీసుకున్నారు. మెథడిస్ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల స్నాతకోత్సవాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థినులు సంబరంగా గాలిలోకి ఎగురుతూ ఫొటోలు తీసుకున్నారు.
13/26
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ లాంచ్‌లో సినీ నటులు సురభి, శాన్వీ మేఘన పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ లాంచ్‌లో సినీ నటులు సురభి, శాన్వీ మేఘన పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
14/26
15/26
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డోలు వాయించి శ్రేణుల్లో జోష్‌ నింపారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డోలు వాయించి శ్రేణుల్లో జోష్‌ నింపారు.
16/26
17/26
అమెరికా దేశం హొనోలులులోని ఓ దుకాణంలో వివిధ రకాల తుపాకులను విక్రయానికి ఉంచారు. ఇటీవల వరుస తుపాకీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ పౌరులు ఆత్మరక్షణ కోసం తుపాకులను తమ వద్ద ఉంచుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అమెరికా దేశం హొనోలులులోని ఓ దుకాణంలో వివిధ రకాల తుపాకులను విక్రయానికి ఉంచారు. ఇటీవల వరుస తుపాకీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ పౌరులు ఆత్మరక్షణ కోసం తుపాకులను తమ వద్ద ఉంచుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.
18/26
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహారం, ఇంధన నిల్వలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబోలోని ఓ ఆటో డ్రైవర్‌ ఇంధనం కోసం ఆటోను పెద్ద వరుసలో నిలిపి తన వంతు కోసం వేచి చూస్తున్నాడు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహారం, ఇంధన నిల్వలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబోలోని ఓ ఆటో డ్రైవర్‌ ఇంధనం కోసం ఆటోను పెద్ద వరుసలో నిలిపి తన వంతు కోసం వేచి చూస్తున్నాడు.
19/26
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. శుక్రవారం ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. శుక్రవారం ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.
20/26
తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. ఇవాళ సర్వ దర్శనానికి 20గంటల వరకు సమయం పట్టొచ్చని సమాచారం. తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. ఇవాళ సర్వ దర్శనానికి 20గంటల వరకు సమయం పట్టొచ్చని సమాచారం.
21/26
22/26

భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫ్లింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను సీఎం జగన్‌ అభినందించారు. ఇటీవల జరిగిన 

థామస్‌ కప్‌ విజయంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారు. బధిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (డెఫ్లింపిక్స్‌–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ 

ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్యం సాధించి సత్తా చాటారు. మంత్రి రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో 

పాల్గొన్నారు. భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫ్లింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను సీఎం జగన్‌ అభినందించారు. ఇటీవల జరిగిన థామస్‌ కప్‌ విజయంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారు. బధిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (డెఫ్లింపిక్స్‌–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్యం సాధించి సత్తా చాటారు. మంత్రి రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
23/26
24/26
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు వైకాపా మద్దతు తెలిపింది. ఇవాళ ఉదయం ఆమె నామినేషన్‌ పత్రాలపై ఆ పార్టీకి చెందిన 

ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సంతకాలు చేసి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు వైకాపా మద్దతు తెలిపింది. ఇవాళ ఉదయం ఆమె నామినేషన్‌ పత్రాలపై ఆ పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సంతకాలు చేసి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
25/26
భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన అఫ్గాన్‌కు భారత్‌ బాసటగా నిలిచింది. బాధితుల కోసం పలు రకాల సహాయ సామగ్రితో కూడిన 

విమానాన్ని కాబుల్‌కు పంపింది. భారతీయ సిబ్బంది ఈ సరకును అఫ్గాన్‌ ప్రభుత్వానికి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార 

ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. 
భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన అఫ్గాన్‌కు భారత్‌ బాసటగా నిలిచింది. బాధితుల కోసం పలు రకాల సహాయ సామగ్రితో కూడిన విమానాన్ని కాబుల్‌కు పంపింది. భారతీయ సిబ్బంది ఈ సరకును అఫ్గాన్‌ ప్రభుత్వానికి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
26/26

మరిన్ని