News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 26 Jun 2022 08:17 IST
1/26
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి మండలం సబ్బితంలోని గౌరీగుండాల జలపాతం పరిసర ప్రాంతాలు కనువిందు 

చేస్తున్నాయి. పొంగి ప్రవహిస్తున్న నీరు కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు వస్తున్నారు. కాగా 

గ్రామం నుంచి జలపాతం వద్దకు వెళ్లేందుకు దారి లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. గతంలో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. 

అధికారులు స్పందించి వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి మండలం సబ్బితంలోని గౌరీగుండాల జలపాతం పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. పొంగి ప్రవహిస్తున్న నీరు కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు వస్తున్నారు. కాగా గ్రామం నుంచి జలపాతం వద్దకు వెళ్లేందుకు దారి లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. గతంలో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
2/26
ఆదిలాబాద్‌ పట్టణంలోని నేతాజీ చౌక్‌ రోడ్డులో ఉదయం 8 గంటల సమయంలో ఓ మూడు ఎద్దులు సుమారు అరగంటకుపైగా 

పోట్లాడుకున్నాయి. చుట్టుపక్కల నిలిపిన ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రిపై పడి ధ్వంసం చేశాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న 

పాదచారులు, వాహనదారులు భయపడి దూరంగా ఉండిపోయారు. స్థానిక యువకులు ఆపడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. చివరకు 

ఒకదాని వెనున ఒకటి రోడ్డుపై పరుగులు తీశాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని నేతాజీ చౌక్‌ రోడ్డులో ఉదయం 8 గంటల సమయంలో ఓ మూడు ఎద్దులు సుమారు అరగంటకుపైగా పోట్లాడుకున్నాయి. చుట్టుపక్కల నిలిపిన ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రిపై పడి ధ్వంసం చేశాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు భయపడి దూరంగా ఉండిపోయారు. స్థానిక యువకులు ఆపడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. చివరకు ఒకదాని వెనున ఒకటి రోడ్డుపై పరుగులు తీశాయి.
3/26
విజయవాడలో పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకుచర్యలు 

చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీలో సైకిల్‌ తొక్కుతూ వెళుతున్న మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు విజయవాడలో పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకుచర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీలో సైకిల్‌ తొక్కుతూ వెళుతున్న మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు
4/26
ఎక్కడైనా తీగ జాతి మొక్కలు.. చెట్లు, భవనాలను అల్లుకుంటూ పైకి వెళ్లడం చూస్తుంటాం. కానీ, విశాఖపట్నం కైలాసపురంలో ఓ మందార 

చెట్టు మూడంతస్తుల అంత ఎత్తు పెరిగింది. అంత పెద్ద మందార చెట్టును చూసిన వారంతా ఎలా పెరిగిందబ్బా.. అని 

ఆశ్చర్యపోతున్నారు. విశాఖపట్నం కైలాసపురం రోడ్డులోని క్రాంతినగర్‌కు చెందిన జోత్స్న, వెంకటప్పారావులు తమ ఇంటి ముంగిట ఏడేళ్ల 

కిందట మందార మొక్క నాటారు. వీధి చిన్నగా ఉండటంతో కొమ్మలు విస్తరించకుండా జాగ్రత్తగా కత్తిరిస్తూ భవనాన్ని ఆసరా చేసుకుని 

పెరిగేలా చూశారు. ఇలా నెమ్మదిగా పైకి ఎగబాకి చెట్టులా కొమ్మలు విస్తరించింది. ఇప్పుడు ప్రతి అంతస్తులో పూలు పూస్తోందని ఆనందం 

వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా తీగ జాతి మొక్కలు.. చెట్లు, భవనాలను అల్లుకుంటూ పైకి వెళ్లడం చూస్తుంటాం. కానీ, విశాఖపట్నం కైలాసపురంలో ఓ మందార చెట్టు మూడంతస్తుల అంత ఎత్తు పెరిగింది. అంత పెద్ద మందార చెట్టును చూసిన వారంతా ఎలా పెరిగిందబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారు. విశాఖపట్నం కైలాసపురం రోడ్డులోని క్రాంతినగర్‌కు చెందిన జోత్స్న, వెంకటప్పారావులు తమ ఇంటి ముంగిట ఏడేళ్ల కిందట మందార మొక్క నాటారు. వీధి చిన్నగా ఉండటంతో కొమ్మలు విస్తరించకుండా జాగ్రత్తగా కత్తిరిస్తూ భవనాన్ని ఆసరా చేసుకుని పెరిగేలా చూశారు. ఇలా నెమ్మదిగా పైకి ఎగబాకి చెట్టులా కొమ్మలు విస్తరించింది. ఇప్పుడు ప్రతి అంతస్తులో పూలు పూస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
5/26
అంబులెన్సులు వెళ్లలేని ఇరుకు సందుల్లోకి వెళ్లి రోగిని తీసుకొచ్చేలా మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌ను రూపొందించారు ముగ్గురు 

యువకులు. పట్టణాలు, నగరాలకే కాదు.. అంబులెన్సులు అందుబాటులో లేనప్పుడు గ్రామీణులకూ ఉపయోగపడేలా ఇంకా 

మెరుగుపరుస్తున్నారు. కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ట్రిపుల్‌ఈ పూర్తిచేసిన చరణ్, కిరీటి, లోకేశ్‌ ఈ బ్యాటరీ వీల్‌ఛైర్‌ను రూపొందించారు. 

బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ప్రయాణిస్తుందని, ఇంకా చేయాల్సిన మార్పుల కోసం పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల విజయవాడ 

కేదారేశ్వరపేట రహదారిపై ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. అంబులెన్సులు వెళ్లలేని ఇరుకు సందుల్లోకి వెళ్లి రోగిని తీసుకొచ్చేలా మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌ను రూపొందించారు ముగ్గురు యువకులు. పట్టణాలు, నగరాలకే కాదు.. అంబులెన్సులు అందుబాటులో లేనప్పుడు గ్రామీణులకూ ఉపయోగపడేలా ఇంకా మెరుగుపరుస్తున్నారు. కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ట్రిపుల్‌ఈ పూర్తిచేసిన చరణ్, కిరీటి, లోకేశ్‌ ఈ బ్యాటరీ వీల్‌ఛైర్‌ను రూపొందించారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ప్రయాణిస్తుందని, ఇంకా చేయాల్సిన మార్పుల కోసం పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల విజయవాడ కేదారేశ్వరపేట రహదారిపై ప్రయోగాత్మకంగా నడిపి చూశారు.
6/26
వందల పొక్లెయిన్ల(జేసీబీ)తో వెళ్తున్న రైలు బండి శనివారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో అరగంట పాటు 

ఆగడంతో ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. వీటిని మధ్యప్రదేశ్‌ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. ఇంత భారీ సంఖ్యలో 

పొక్లెయిన్లను చూడడం ఇదే ప్రథమమని ప్రయాణికులు చర్చించుకోగా మరికొందరు ఆసక్తిగా సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. వందల పొక్లెయిన్ల(జేసీబీ)తో వెళ్తున్న రైలు బండి శనివారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. వీటిని మధ్యప్రదేశ్‌ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. ఇంత భారీ సంఖ్యలో పొక్లెయిన్లను చూడడం ఇదే ప్రథమమని ప్రయాణికులు చర్చించుకోగా మరికొందరు ఆసక్తిగా సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకున్నారు.
7/26
అమెరికాలోని డాలస్‌ నగరంలో శనివారం వేంకటేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం 

ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇందులో పాల్గొన్నారు. అమెరికాలోని డాలస్‌ నగరంలో శనివారం వేంకటేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇందులో పాల్గొన్నారు.
8/26
9/26
అబార్షన్‌ హక్కు రద్దును నిరసిస్తూ అమెరికాలోని వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు వద్ద శనివారం భారీ నిరసన అబార్షన్‌ హక్కు రద్దును నిరసిస్తూ అమెరికాలోని వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు వద్ద శనివారం భారీ నిరసన
10/26
గుంటూరులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయిదు అన్న క్యాంటీన్లను ప్రస్తుత ప్రభుత్వం మూసేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా నగర 

కార్పొరేషన్‌ తరఫున 5 చోట్ల ‘వైఎస్‌ఆర్‌ ఫుడ్‌బ్యాంక్‌’లను ప్రారంభించారు. ఫుడ్‌ బ్యాంకుల పేరుతో ఓ చిన్న షెడ్డు వేసి అందులో ఫ్రిజ్‌ను 

ఏర్పాటు చేశారు. నగరవాసులు తమ ఇంట్లో మిగిలిన ఆహారాన్ని ఆ ఫ్రిజ్‌లో పెడితే అవసరమైన వారు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడే దాతలతో 

రోజు అన్నదానం చేయించాలనేది కార్పొరేషన్‌ ఆలోచన. ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మొదట్లో రెండు నెలలు బాగానే 

నడిచాయి. ఆ తర్వాత అన్నీ మూతపడ్డాయి. గుంటూరులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయిదు అన్న క్యాంటీన్లను ప్రస్తుత ప్రభుత్వం మూసేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా నగర కార్పొరేషన్‌ తరఫున 5 చోట్ల ‘వైఎస్‌ఆర్‌ ఫుడ్‌బ్యాంక్‌’లను ప్రారంభించారు. ఫుడ్‌ బ్యాంకుల పేరుతో ఓ చిన్న షెడ్డు వేసి అందులో ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు. నగరవాసులు తమ ఇంట్లో మిగిలిన ఆహారాన్ని ఆ ఫ్రిజ్‌లో పెడితే అవసరమైన వారు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడే దాతలతో రోజు అన్నదానం చేయించాలనేది కార్పొరేషన్‌ ఆలోచన. ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మొదట్లో రెండు నెలలు బాగానే నడిచాయి. ఆ తర్వాత అన్నీ మూతపడ్డాయి.
11/26
12/26
తిరుపతి-మదనపల్లె మార్గం భాకరాపేట ఘాట్‌లో గంగమ్మ ఆలయం వద్ద ఉన్న మలుపులో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. ఈ 

ఏడాది మార్చి 26న రాత్రి బస్సు లోయలో పడిపోయి 10 మంది మృతి చెందారు. ఇంత పెద్ద ఘటన జరిగినా ఇక్కడ శాశ్వత పనులు 

చేపట్టలేదంటూ విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. ప్రమాదకర మలుపులో నేషనల్‌ హైవే అథారిటీ ఆధ్వర్యంలో పునాది వేసి 

రహదారి కంటే సుమారు 5 అడుగుల ఎత్తున శాశ్వతంగా రిటైనింగ్‌ గోడ నిర్మిస్తున్నారు. దీన్ని 165 మీటర్ల పొడవునా నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె మార్గం భాకరాపేట ఘాట్‌లో గంగమ్మ ఆలయం వద్ద ఉన్న మలుపులో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి 26న రాత్రి బస్సు లోయలో పడిపోయి 10 మంది మృతి చెందారు. ఇంత పెద్ద ఘటన జరిగినా ఇక్కడ శాశ్వత పనులు చేపట్టలేదంటూ విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. ప్రమాదకర మలుపులో నేషనల్‌ హైవే అథారిటీ ఆధ్వర్యంలో పునాది వేసి రహదారి కంటే సుమారు 5 అడుగుల ఎత్తున శాశ్వతంగా రిటైనింగ్‌ గోడ నిర్మిస్తున్నారు. దీన్ని 165 మీటర్ల పొడవునా నిర్మించనున్నారు.
13/26
చిన్నపాటి వర్షాలకే నగరంలో రహదారుల అందం బయటపడుతోంది. ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ భగాయత్‌ లేఅవుట్‌లో ఇటీవలే వేసిన రహదారి పరిస్థితి ఇది. ప్రస్తుతం వరంగల్‌ రహదారిలో పనులు జరుగుతుండడంతో ఎల్బీనగర్, నాగోలు వైపు వెళ్లే వాహనాలను భగాయత్‌ లేఅవుట్‌ గుండా దారి మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులు గుంతలుగా మారిన రహదారిలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు చిన్నపాటి వర్షాలకే నగరంలో రహదారుల అందం బయటపడుతోంది. ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ భగాయత్‌ లేఅవుట్‌లో ఇటీవలే వేసిన రహదారి పరిస్థితి ఇది. ప్రస్తుతం వరంగల్‌ రహదారిలో పనులు జరుగుతుండడంతో ఎల్బీనగర్, నాగోలు వైపు వెళ్లే వాహనాలను భగాయత్‌ లేఅవుట్‌ గుండా దారి మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులు గుంతలుగా మారిన రహదారిలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు
14/26
నల్గొండ చౌరాస్తా నుంచి చాదర్‌ఘాట్‌ సిగ్నల్‌ వరకు ట్రాఫిక్‌ ఆగిపోయింది. దీంతో అందులో అంబులెన్స్‌ వాహనం చిక్కుకుంది. ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. దీనిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. నల్గొండ చౌరాస్తా నుంచి చాదర్‌ఘాట్‌ సిగ్నల్‌ వరకు ట్రాఫిక్‌ ఆగిపోయింది. దీంతో అందులో అంబులెన్స్‌ వాహనం చిక్కుకుంది. ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. దీనిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
15/26
మచ్చబొల్లారం సంజీవ్‌రెడ్డి హాల్‌ సమీపంలోని అమ్మవారి గుడిలోకి మురుగు, వరద నీరు చేరుతోంది. రోజుల తరబడి నిల్వ కారణంగా దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. గుడికి వచ్చే భక్తులు మురుగు సమస్యతో సతమతం అవుతున్నారు. మచ్చబొల్లారం సంజీవ్‌రెడ్డి హాల్‌ సమీపంలోని అమ్మవారి గుడిలోకి మురుగు, వరద నీరు చేరుతోంది. రోజుల తరబడి నిల్వ కారణంగా దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. గుడికి వచ్చే భక్తులు మురుగు సమస్యతో సతమతం అవుతున్నారు.
16/26
నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురం వంతెన నుంచి బ్యాంక్‌ కాలనీ వెళ్లే దారిలో రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ దారిలో వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మొక్కలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురం వంతెన నుంచి బ్యాంక్‌ కాలనీ వెళ్లే దారిలో రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ దారిలో వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మొక్కలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
17/26
ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు కన్పిస్తున్నాయి. కాసేపటికి దట్టంగా ముబ్బులు కమ్ముకోవడం, నిమిషాల వ్యవధిలో ఆకాశం నిర్మలంగా మారుతూ కన్పిస్తోంది. మధ్యాహ్నం గాలుల ఉద్ధృతి ఉంటోంది. ఇదే సమయంలో దట్టంగా మారిన వెండి మబ్బులు దూది పింజల్లా తేలుతూ కనువిందు చేస్తున్నాయి. ఐడీఏ బొల్లారంలోని జగన్నాథస్వామి ఆలయం వద్ద కనిపించిన దృశ్యమిది. ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు కన్పిస్తున్నాయి. కాసేపటికి దట్టంగా ముబ్బులు కమ్ముకోవడం, నిమిషాల వ్యవధిలో ఆకాశం నిర్మలంగా మారుతూ కన్పిస్తోంది. మధ్యాహ్నం గాలుల ఉద్ధృతి ఉంటోంది. ఇదే సమయంలో దట్టంగా మారిన వెండి మబ్బులు దూది పింజల్లా తేలుతూ కనువిందు చేస్తున్నాయి. ఐడీఏ బొల్లారంలోని జగన్నాథస్వామి ఆలయం వద్ద కనిపించిన దృశ్యమిది.
18/26
నాగోలు తట్టిఅన్నారం కూడలిలో కల్వర్టు నిర్మాణం ఒకవైపు పూర్తయి ఏడాది దాటింది. మరోవైపు ఉన్న ఇనుప చువ్వలు తుప్పుపడుతున్నా కల్వర్టు గోడ నిర్మాణం మాత్రం జరగడం లేదు. ప్రమాదం పొంచి ఉండడంతో.. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగోలు తట్టిఅన్నారం కూడలిలో కల్వర్టు నిర్మాణం ఒకవైపు పూర్తయి ఏడాది దాటింది. మరోవైపు ఉన్న ఇనుప చువ్వలు తుప్పుపడుతున్నా కల్వర్టు గోడ నిర్మాణం మాత్రం జరగడం లేదు. ప్రమాదం పొంచి ఉండడంతో.. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
19/26
నాగోలు-గౌరెల్లి మార్గంలో ఓ ద్విచక్ర వాహనదారుడు శనివారం మధ్యాహ్నం ఇలా ప్రయాణించాడు. ఇంటికి సంబంధించిన తలుపును తన వాహనంపై ప్రమాదకరంగా తీసుకెళ్లడంతో.. ఇతర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాగోలు-గౌరెల్లి మార్గంలో ఓ ద్విచక్ర వాహనదారుడు శనివారం మధ్యాహ్నం ఇలా ప్రయాణించాడు. ఇంటికి సంబంధించిన తలుపును తన వాహనంపై ప్రమాదకరంగా తీసుకెళ్లడంతో.. ఇతర వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
20/26
ఉప్పల్‌ శిల్పారామంలో చైతన్య కుసుమప్రియ శిష్య బృందం శనివారం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు నీతిక, తనూజ సహస్ర, రీతూపర్ణ, శాన్వి, తేజస్విని చక్కగా నృత్య ప్రదర్శనలు చేసి సందర్శకులను అలరింపజేశారు. ఉప్పల్‌ శిల్పారామంలో చైతన్య కుసుమప్రియ శిష్య బృందం శనివారం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు నీతిక, తనూజ సహస్ర, రీతూపర్ణ, శాన్వి, తేజస్విని చక్కగా నృత్య ప్రదర్శనలు చేసి సందర్శకులను అలరింపజేశారు.
21/26
హైదరాబాద్‌ రహదారులపై ప్రయాణమంటే ఎంత జాగ్రత్తగా వెళ్లాలి. నిజాంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి కనీసం హెల్మెట్‌ ధరించకుండా వెనక ఓ బాలుడిని ఎక్కించుకొని ప్రమాదకరంగా సైకిల్‌ను తీసుకెళ్తూ కన్పించాడు. హైదరాబాద్‌ రహదారులపై ప్రయాణమంటే ఎంత జాగ్రత్తగా వెళ్లాలి. నిజాంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి కనీసం హెల్మెట్‌ ధరించకుండా వెనక ఓ బాలుడిని ఎక్కించుకొని ప్రమాదకరంగా సైకిల్‌ను తీసుకెళ్తూ కన్పించాడు.
22/26
వర్షాకాలంలో దిల్‌సుఖ్‌నగర్‌ బస్టేషన్‌కు వెళ్లాల్సిన పని పడిందా? అయితే మీకు తప్పకుండా హైజంప్‌ చేయడం రావాలి. లేదంటే చెప్పులు చేతపట్టుకొని నడవాల్సి ఉంటుంది. కారణం బస్‌స్టేషన్‌ గుంతలమయంగా మారడం, వాటిల్లో నీరు నిలవడమే. ఇక్కడి నుంచి నల్గొండ, ఖమ్మంతోపాటు ఏపీలోని కోస్తా ప్రాంతాలకు బస్సులు వెళుతుంటాయి. రిజర్వేషన్, బస్‌పాస్‌ కౌంటర్లూ ఉన్నాయి. ప్రయాణికులతోపాటు, విద్యార్థులు నానాఅగచాట్లు పడుతున్నారు. వర్షాకాలంలో దిల్‌సుఖ్‌నగర్‌ బస్టేషన్‌కు వెళ్లాల్సిన పని పడిందా? అయితే మీకు తప్పకుండా హైజంప్‌ చేయడం రావాలి. లేదంటే చెప్పులు చేతపట్టుకొని నడవాల్సి ఉంటుంది. కారణం బస్‌స్టేషన్‌ గుంతలమయంగా మారడం, వాటిల్లో నీరు నిలవడమే. ఇక్కడి నుంచి నల్గొండ, ఖమ్మంతోపాటు ఏపీలోని కోస్తా ప్రాంతాలకు బస్సులు వెళుతుంటాయి. రిజర్వేషన్, బస్‌పాస్‌ కౌంటర్లూ ఉన్నాయి. ప్రయాణికులతోపాటు, విద్యార్థులు నానాఅగచాట్లు పడుతున్నారు.
23/26
24/26
సంతోష్‌నగర్‌ నుంచి మాదన్నపేట రోడ్డులో ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. ఆ రోడ్డులో కూలేందుకు సిద్ధంగా ప్రమాదకరంగా ఉన్న ఓ ఎండిన వృక్షం, సమీప సిగ్నల్స్‌ వద్ద తొలగించిన చెట్టు మొదలు తీయకపోవడంతో ట్రాఫిక్‌కి ఇబ్బందిగా ఉంది. రాత్రి వేళ మరీ ప్రమాదంగా మారింది. సంతోష్‌నగర్‌ నుంచి మాదన్నపేట రోడ్డులో ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. ఆ రోడ్డులో కూలేందుకు సిద్ధంగా ప్రమాదకరంగా ఉన్న ఓ ఎండిన వృక్షం, సమీప సిగ్నల్స్‌ వద్ద తొలగించిన చెట్టు మొదలు తీయకపోవడంతో ట్రాఫిక్‌కి ఇబ్బందిగా ఉంది. రాత్రి వేళ మరీ ప్రమాదంగా మారింది.
25/26
పచ్చటి చెట్లతో ఆహ్లాదంగా కన్పిస్తోందని ఈ ప్రాంతం వద్దకు వెళ్లేరు. హుస్సేన్‌సాగర్‌ పక్కన అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద ఉన్న ఈ నాలాలో భారీగా వ్యర్థాలు పేరుకుపోవడంతోనే భరించలేని దుర్వాసన వస్తోంది.  సిగ్నల్‌ పడినప్పుడు పక్కనే ఉన్న రోడ్డుపై ఆగుతున్న వాహనదారులు కంపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పచ్చటి చెట్లతో ఆహ్లాదంగా కన్పిస్తోందని ఈ ప్రాంతం వద్దకు వెళ్లేరు. హుస్సేన్‌సాగర్‌ పక్కన అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద ఉన్న ఈ నాలాలో భారీగా వ్యర్థాలు పేరుకుపోవడంతోనే భరించలేని దుర్వాసన వస్తోంది. సిగ్నల్‌ పడినప్పుడు పక్కనే ఉన్న రోడ్డుపై ఆగుతున్న వాహనదారులు కంపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
26/26
మేడ్చల్‌ పట్టణం నుంచి గిర్మాపూర్, రాయిలాపూర్, బండమాదారం, శ్రీరంగవరం వెళ్లేందుకు ఈ దారి మాత్రమే దిక్కు. రెండేళ్లుగా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఈ మార్గం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భారీ వాహనాలు రెండు కిమీల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తోంది. మేడ్చల్‌ పట్టణం నుంచి గిర్మాపూర్, రాయిలాపూర్, బండమాదారం, శ్రీరంగవరం వెళ్లేందుకు ఈ దారి మాత్రమే దిక్కు. రెండేళ్లుగా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఈ మార్గం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భారీ వాహనాలు రెండు కిమీల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని