News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 26 Jun 2022 20:56 IST
1/19
చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలకు సంబంధించిన టార్చ్‌ రిలే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌తో సరదాగా చెస్‌ ఆడారు. చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలకు సంబంధించిన టార్చ్‌ రిలే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌తో సరదాగా చెస్‌ ఆడారు.
2/19
సినీ నటుడు రోషన్‌, ఆయన తల్లి ఊహ, కుటుంబ సభ్యులు శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రోషన్‌ నటించిన ‘పెళ్లి సందD’ గతేడాది థియేటర్లలో విడుదల కాగా.. ఇటీవల ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. సినీ నటుడు రోషన్‌, ఆయన తల్లి ఊహ, కుటుంబ సభ్యులు శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రోషన్‌ నటించిన ‘పెళ్లి సందD’ గతేడాది థియేటర్లలో విడుదల కాగా.. ఇటీవల ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది.
3/19
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన కైతలాపూర్‌ ఆర్‌వోబీ వంతెనపై యువకులు ప్రమాదకరంగా ఫొటోలు దిగుతూ కనిపించారు. మరోవైపు పిల్లలు వంతెనపై వాహనాల మధ్య పరుగులు పెడుతున్నారు.  పిల్లలు వంతెన పైకి రాకుండా, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన కైతలాపూర్‌ ఆర్‌వోబీ వంతెనపై యువకులు ప్రమాదకరంగా ఫొటోలు దిగుతూ కనిపించారు. మరోవైపు పిల్లలు వంతెనపై వాహనాల మధ్య పరుగులు పెడుతున్నారు. పిల్లలు వంతెన పైకి రాకుండా, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
4/19
5/19
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మానేపల్లి జ్యువెల్లర్స్‌ నూతన డైమండ్‌ జ్యువెల్లరీ కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ వివిధ డిజైన్ల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మానేపల్లి జ్యువెల్లర్స్‌ నూతన డైమండ్‌ జ్యువెల్లరీ కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ వివిధ డిజైన్ల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
6/19
7/19
8/19
తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో విజయేంద్ర తీర్థ స్వామిజీ ఆరాధన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తితిదే ఈవో ధర్మారెడ్డి అక్కడికి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో విజయేంద్ర తీర్థ స్వామిజీ ఆరాధన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తితిదే ఈవో ధర్మారెడ్డి అక్కడికి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
9/19
10/19
ఉక్రెయిన్‌ దేశం కీవ్‌లోని మైడాన్‌ స్వ్కేర్ వద్ద వివిధ దేశాల సాయాన్ని కోరుతూ ఇసుక సంచులతో ‘హెల్ప్‌’ అని ఆంగ్ల వర్ణమాలలో రాసి ఉంచారు. దీంతో పాటు అక్కడ వివిధ దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు. ఉక్రెయిన్‌ దేశం కీవ్‌లోని మైడాన్‌ స్వ్కేర్ వద్ద వివిధ దేశాల సాయాన్ని కోరుతూ ఇసుక సంచులతో ‘హెల్ప్‌’ అని ఆంగ్ల వర్ణమాలలో రాసి ఉంచారు. దీంతో పాటు అక్కడ వివిధ దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు.
11/19
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా మయన్మార్‌లోని యాంగోన్‌ శివారులో అధికారులు నార్కోటిక్‌ డ్రగ్స్‌ను దగ్ధం చేశారు. ఆ దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే సుమారు 642మిలియన్‌ డాలర్ల విలువైన మాదక ద్రవ్యాలను భస్మం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా మయన్మార్‌లోని యాంగోన్‌ శివారులో అధికారులు నార్కోటిక్‌ డ్రగ్స్‌ను దగ్ధం చేశారు. ఆ దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే సుమారు 642మిలియన్‌ డాలర్ల విలువైన మాదక ద్రవ్యాలను భస్మం చేశారు.
12/19
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని అన్నమయ్య కూడలి నుంచి ఎమ్మార్‌ పల్లి కూడలి వరకు పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్‌ పల్లి వద్ద నిర్వహించిన మానవ హారంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే అనర్థాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని అన్నమయ్య కూడలి నుంచి ఎమ్మార్‌ పల్లి కూడలి వరకు పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్‌ పల్లి వద్ద నిర్వహించిన మానవ హారంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే అనర్థాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.
13/19
కేతరీనా లిత్వెన్కో అనే యువతి ఇహోర్‌ జక్వత్‌స్కీని ఉక్రెయిన్‌లోని కీవ్‌లో వివాహామాడింది. రష్యా యుద్ధం ప్రారంభించిన రోజునే ఇహోర్‌ తన ప్రేమ గురించి కేతరీనాకు చెప్పాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఉక్రెయిన్‌ ప్రేమ జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు సైనికులు వివాహం చేసుకున్న తర్వాతే కదన రంగంలోకి అడుగిడుతున్నారు. యుద్ధం కారణంగా మున్ముందు ఏదైనా జరగకముందే నచ్చిన భాగస్వామిని పరిణయమాడేందుకు అక్కడి యువత ఆసక్తి చూపుతోంది. కేతరీనా లిత్వెన్కో అనే యువతి ఇహోర్‌ జక్వత్‌స్కీని ఉక్రెయిన్‌లోని కీవ్‌లో వివాహామాడింది. రష్యా యుద్ధం ప్రారంభించిన రోజునే ఇహోర్‌ తన ప్రేమ గురించి కేతరీనాకు చెప్పాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఉక్రెయిన్‌ ప్రేమ జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు సైనికులు వివాహం చేసుకున్న తర్వాతే కదన రంగంలోకి అడుగిడుతున్నారు. యుద్ధం కారణంగా మున్ముందు ఏదైనా జరగకముందే నచ్చిన భాగస్వామిని పరిణయమాడేందుకు అక్కడి యువత ఆసక్తి చూపుతోంది.
14/19
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం 500వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం 500వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
15/19
ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచిన వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్, ఎన్నికల పరిశీలకులు సురేశ్‌ కుమార్. ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచిన వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్, ఎన్నికల పరిశీలకులు సురేశ్‌ కుమార్.
16/19
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తాలో గత సంవత్సరం సుమారు రూ.2కోట్ల ఖర్చుతో నిర్మించిన స్మార్ట్ పార్క్‌ ఇది. ఇందులో పిల్లల కోసం కోసం అందమైన ఆటవస్తువులతో పాటు పెద్దలు సేదతీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడి పచ్చికలో ఏర్పాటు చేసిన పడవ, చెట్టు ఆకారంలోని వాటర్‌ ఫౌంటేన్‌ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తాలో గత సంవత్సరం సుమారు రూ.2కోట్ల ఖర్చుతో నిర్మించిన స్మార్ట్ పార్క్‌ ఇది. ఇందులో పిల్లల కోసం కోసం అందమైన ఆటవస్తువులతో పాటు పెద్దలు సేదతీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడి పచ్చికలో ఏర్పాటు చేసిన పడవ, చెట్టు ఆకారంలోని వాటర్‌ ఫౌంటేన్‌ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
17/19
18/19
విశాఖ బీచ్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు ఇలా రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలకు 

విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనదారుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ శ్రీకాంత్‌ 

ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ బీచ్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు ఇలా రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనదారుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
19/19
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ 

మ్యూనిచ్‌ చేరుకున్నారు. నేడు, రేపు జరిగే సదస్సులో మోదీ 

పాల్గొంటారు. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ మ్యూనిచ్‌ చేరుకున్నారు. నేడు, రేపు జరిగే సదస్సులో మోదీ పాల్గొంటారు.

మరిన్ని