News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 29 Jun 2022 07:09 IST
1/17
విశాఖలోని మల్కాపురంలో ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ రావాలన్నా...వృద్ధులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాలన్నా ఎన్ని ఇక్కట్లో దాటాలి. మెట్లు 

నాచుపట్టి అధ్వానంగా మారినా... శిథిలమైపోయినా... పట్టుకుని నడిచేందుకు ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ దెబ్బతిన్నా సత్వరం సరిదిద్దే 

వారు కానరాక కష్టాలను భరిస్తున్నారు. విశాఖలోని మల్కాపురంలో ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ రావాలన్నా...వృద్ధులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాలన్నా ఎన్ని ఇక్కట్లో దాటాలి. మెట్లు నాచుపట్టి అధ్వానంగా మారినా... శిథిలమైపోయినా... పట్టుకుని నడిచేందుకు ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ దెబ్బతిన్నా సత్వరం సరిదిద్దే వారు కానరాక కష్టాలను భరిస్తున్నారు.
2/17
పాఠశాలల పునఃప్రారంభానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత మంగళవారం ప్రభుత్వ పాఠశాలల తలుపులు 

తెరిచారు. నాడు-నేడు కింద  మరమ్మతు జరుగుతున్నా.. ఇంకా సమస్యలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి 

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని రేబాల సుందరరామిరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండి చెరువును తలపిస్తోంది. 


పాఠశాలల పునఃప్రారంభానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత మంగళవారం ప్రభుత్వ పాఠశాలల తలుపులు తెరిచారు. నాడు-నేడు కింద మరమ్మతు జరుగుతున్నా.. ఇంకా సమస్యలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని రేబాల సుందరరామిరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండి చెరువును తలపిస్తోంది.
3/17
ఈ చిత్రం చూశారా? ఇదేమిటీ పంజరంలో కోతులు ఉన్నాయనుకుంటున్నారు కదూ! కొద్దిరోజులుగా కావలి పట్టణంలో కోతుల పట్టివేత 

చేస్తున్నారు. వీటిని ఇలా బంధిస్తున్నారు. పురపాలక సిబ్బందే ఆహారం అందచేస్తున్నారు. మంగళవారం ఆ పంజరం వద్దకు వెలుపల 

సంచరించే కోతులు చేరాయి. వాటిని పరామర్శిస్తున్నట్లుగా సందడిగా చేశాయి. ఈ చిత్రం చూశారా? ఇదేమిటీ పంజరంలో కోతులు ఉన్నాయనుకుంటున్నారు కదూ! కొద్దిరోజులుగా కావలి పట్టణంలో కోతుల పట్టివేత చేస్తున్నారు. వీటిని ఇలా బంధిస్తున్నారు. పురపాలక సిబ్బందే ఆహారం అందచేస్తున్నారు. మంగళవారం ఆ పంజరం వద్దకు వెలుపల సంచరించే కోతులు చేరాయి. వాటిని పరామర్శిస్తున్నట్లుగా సందడిగా చేశాయి.
4/17
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు రోడ్డు దాటాలంటే భయపడే పరిస్థితి. తలనీలాలు సమర్పించుకున్న తర్వాత  కృష్ణానదిలో 

స్నానమాచరించాలంటే రోడ్డు దాటాల్సిందే.. చిన్నపిల్లలు, వృద్ధులతో లగేజీ పట్టుకుని రోడ్డు దాటుతుంటే ఏ వాహనం ఢీ కొడుతుందో 

తెలియక భయంగా వెళ్లాల్సి వస్తోంది. రోడ్డు మధ్యలో డివైడర్‌గా సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయడంతో భక్తులు వాటి మధ్యలోంచి 

దూరి వెళ్తున్నారు.కేశఖండనశాల నుంచి దుర్గాఘాట్‌లోకి వెళ్లడానికి సబ్‌వే ఉన్నప్పటికీ¨ అది పూర్తిస్థాయిలోకి వినియోగంలోకి రాకపోవడం, 

భక్తులను అటుగా పంపించే వ్యవస్థ అక్కడ లేకపోవడంతో రోడ్డు దాటుతూ భక్తులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు రోడ్డు దాటాలంటే భయపడే పరిస్థితి. తలనీలాలు సమర్పించుకున్న తర్వాత కృష్ణానదిలో స్నానమాచరించాలంటే రోడ్డు దాటాల్సిందే.. చిన్నపిల్లలు, వృద్ధులతో లగేజీ పట్టుకుని రోడ్డు దాటుతుంటే ఏ వాహనం ఢీ కొడుతుందో తెలియక భయంగా వెళ్లాల్సి వస్తోంది. రోడ్డు మధ్యలో డివైడర్‌గా సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయడంతో భక్తులు వాటి మధ్యలోంచి దూరి వెళ్తున్నారు.కేశఖండనశాల నుంచి దుర్గాఘాట్‌లోకి వెళ్లడానికి సబ్‌వే ఉన్నప్పటికీ¨ అది పూర్తిస్థాయిలోకి వినియోగంలోకి రాకపోవడం, భక్తులను అటుగా పంపించే వ్యవస్థ అక్కడ లేకపోవడంతో రోడ్డు దాటుతూ భక్తులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
5/17
విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోకి మంత్రి వచ్చారంటే చాలు ఆ భవనం ఎదుట రహదారిపై మూడు వరుసల్లో 

కార్లు బారులు తీరుతుంటాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, 

ఎన్టీఆర్‌ జిల్లాలకు ఏకైక మంత్రి అయిన మంత్రి జోగి రమేష్‌ తరచూ ఇక్కడికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఆయన్ను కలిసేందుకు 

అభిమానులు, వైకాపా నేతలూ వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను అతిథి గృహం ఎదుట ఉన్న రోడ్డుపైనే నిలుపుతున్నారు. 

మంగళవారం మంత్రి రావడంతో భవనం ఎదుట పార్కింగ్‌ చేసిన కార్లను చిత్రంలో చూడొచ్చు.   విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోకి మంత్రి వచ్చారంటే చాలు ఆ భవనం ఎదుట రహదారిపై మూడు వరుసల్లో కార్లు బారులు తీరుతుంటాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఏకైక మంత్రి అయిన మంత్రి జోగి రమేష్‌ తరచూ ఇక్కడికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఆయన్ను కలిసేందుకు అభిమానులు, వైకాపా నేతలూ వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను అతిథి గృహం ఎదుట ఉన్న రోడ్డుపైనే నిలుపుతున్నారు. మంగళవారం మంత్రి రావడంతో భవనం ఎదుట పార్కింగ్‌ చేసిన కార్లను చిత్రంలో చూడొచ్చు.
6/17
హైదరాబాద్‌లోని చాలాప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి భవనాలే నివాసాలుగానూ ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో గోడలు తడిచి కూలుతున్న ఘటనల్లో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పురాతన కట్టడాలపై వెంటనే తగినచర్యలు చేపట్టాల్సిన అవసరముంది. హైదరాబాద్‌లోని చాలాప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి భవనాలే నివాసాలుగానూ ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో గోడలు తడిచి కూలుతున్న ఘటనల్లో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పురాతన కట్టడాలపై వెంటనే తగినచర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
7/17
8/17
9/17
హైదరాబాద్‌లో పలు చోట్ల అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకని పోలీసులు ఇలా ఏర్పాట్లు చేశారు. నొక్కి మాట్లాడండి అని రాసి ఉంచారు. ఇక్కడ ఫోన్‌ మాత్రం ఏర్పాటుచేయలేదు. ఏడాదిన్నర గడిచినా ఈ విషయంపై దృష్టి సారించలేదు. హైదరాబాద్‌లో పలు చోట్ల అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకని పోలీసులు ఇలా ఏర్పాట్లు చేశారు. నొక్కి మాట్లాడండి అని రాసి ఉంచారు. ఇక్కడ ఫోన్‌ మాత్రం ఏర్పాటుచేయలేదు. ఏడాదిన్నర గడిచినా ఈ విషయంపై దృష్టి సారించలేదు.
10/17
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతమైన కాచిగూడ చౌరస్తాలోని వీర్‌ సావర్కర్‌ విగ్రహం కూడలిలో కొన్ని నెలలుగా నిత్యం ఉదయం మురుగు ప్రవహిస్తోంది. దుర్వాసన వెలువడుతుండడంతో వాహనదారులు, పాదచారుల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.	హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతమైన కాచిగూడ చౌరస్తాలోని వీర్‌ సావర్కర్‌ విగ్రహం కూడలిలో కొన్ని నెలలుగా నిత్యం ఉదయం మురుగు ప్రవహిస్తోంది. దుర్వాసన వెలువడుతుండడంతో వాహనదారులు, పాదచారుల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
11/17
ఉప్పల్, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. విద్యార్థులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద గుంతలు తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. విద్యార్థులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద గుంతలు తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
12/17
13/17
రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో నిర్మించిన టీ హబ్‌ ప్రారంభం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. అంకురసంస్థల నిర్వాహకులు, యువత ప్రాంగణంలో స్వీయచిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో నిర్మించిన టీ హబ్‌ ప్రారంభం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. అంకురసంస్థల నిర్వాహకులు, యువత ప్రాంగణంలో స్వీయచిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.
14/17
15/17
లాలాగూడ రైల్వే ఆసుపత్రి చౌరస్తా ట్రాఫిక్‌ ఐలాండ్‌ పార్కులో నాలుగు వైపులా సన్నాయి ఊదుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇవి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. లాలాగూడ రైల్వే ఆసుపత్రి చౌరస్తా ట్రాఫిక్‌ ఐలాండ్‌ పార్కులో నాలుగు వైపులా సన్నాయి ఊదుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇవి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
16/17
నాలా నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో వర్షం పడితే ఎల్‌.బీ.నగర్‌ రెడ్డికాలనీలోని రోడ్లన్నీ వరద, మురుగుతో తటాకాలను తలపిస్తున్నాయి. కనీసం కాలి నడకన వెళ్లే పరిస్థితి లేదు.	నాలా నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో వర్షం పడితే ఎల్‌.బీ.నగర్‌ రెడ్డికాలనీలోని రోడ్లన్నీ వరద, మురుగుతో తటాకాలను తలపిస్తున్నాయి. కనీసం కాలి నడకన వెళ్లే పరిస్థితి లేదు.
17/17

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని