News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 30 Jun 2022 07:41 IST
1/27
రంగంపేట మండలం జి.దొంతమూరు మార్కెట్‌లో పాము ఆకారంలో ఉన్న ఆరున్నర అడుగుల, మూడున్నర కిలోల చేప బుధవారం 

అందరినీ ఆకర్షించింది. బొమ్మిడం రకానికి చెందిన ఈ చేపను ముగ్గురు కలిసి రూ.3,500కు కొనుగోలు చేశారు. కాకినాడ సముద్రంలో 

వేటకు వెళ్లినప్పుడు దొరికిందని బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన చేపల వ్యాపారి రాము తెలిపారు. ఈ రకంలో ఇంత పొడవు 

చేపను చూడటం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు.	రంగంపేట మండలం జి.దొంతమూరు మార్కెట్‌లో పాము ఆకారంలో ఉన్న ఆరున్నర అడుగుల, మూడున్నర కిలోల చేప బుధవారం అందరినీ ఆకర్షించింది. బొమ్మిడం రకానికి చెందిన ఈ చేపను ముగ్గురు కలిసి రూ.3,500కు కొనుగోలు చేశారు. కాకినాడ సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు దొరికిందని బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన చేపల వ్యాపారి రాము తెలిపారు. ఈ రకంలో ఇంత పొడవు చేపను చూడటం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు.
2/27
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్‌పై కొండచరియలు ప్రమాదకరంగా మారాయి. కడప నగరం నుంచి వెళ్లే 

వాహనాలు ఘాట్‌లోని మూడో మలుపు వద్ద నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ శాశ్వత చర్యలు చేపట్టకపోగా, 

మట్టికుప్పలతో రక్షణ గోడ నిర్మించి చేతులు దులుపుకొన్నారు. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్‌పై కొండచరియలు ప్రమాదకరంగా మారాయి. కడప నగరం నుంచి వెళ్లే వాహనాలు ఘాట్‌లోని మూడో మలుపు వద్ద నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ శాశ్వత చర్యలు చేపట్టకపోగా, మట్టికుప్పలతో రక్షణ గోడ నిర్మించి చేతులు దులుపుకొన్నారు.
3/27
4/27
బొబ్బిలి మండలంలోని బోజరాజపురం వద్ద వేగావతి నదిని దాటేందుకు స్థానికులు కష్టాలు పడుతున్నారు. ఇక్కడ రెండేళ్ల కిందట వంతెన 

మంజూరైంది. రూ.15 కోట్లతో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ పనులు పూర్తికాలేదు. బిల్లులు అందకపోవడంతో 

పిల్లర్ల స్థాయిలో నిర్మాణం నిలిచిపోయింది. దీంతో వర్షాలు కురుస్తుండడంతో నది దాటడానికి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. 

వాహనాలను ఆవలి ఒడ్డుకు తరలించేందుకు ఎడ్లబళ్లు ఉపయోగిస్తున్నారు. గుత్తేదారునికి రూ.2 కోట్లు మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని, 

అందుకే పనులు పూర్తి చేయకుండా వదిలేశారని డీఈఈ శర్మ తెలిపారు. బిల్లులు విడుదల కాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. బొబ్బిలి మండలంలోని బోజరాజపురం వద్ద వేగావతి నదిని దాటేందుకు స్థానికులు కష్టాలు పడుతున్నారు. ఇక్కడ రెండేళ్ల కిందట వంతెన మంజూరైంది. రూ.15 కోట్లతో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ పనులు పూర్తికాలేదు. బిల్లులు అందకపోవడంతో పిల్లర్ల స్థాయిలో నిర్మాణం నిలిచిపోయింది. దీంతో వర్షాలు కురుస్తుండడంతో నది దాటడానికి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వాహనాలను ఆవలి ఒడ్డుకు తరలించేందుకు ఎడ్లబళ్లు ఉపయోగిస్తున్నారు. గుత్తేదారునికి రూ.2 కోట్లు మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని, అందుకే పనులు పూర్తి చేయకుండా వదిలేశారని డీఈఈ శర్మ తెలిపారు. బిల్లులు విడుదల కాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.
5/27
చిత్రం చూడగానే ఈ మొక్క ఆకులు రెండు వర్ణాల్లో ఉన్నాయెందుకనే అనుమానం వస్తోంది కదూ. పరాగసంపర్కం కోసం మొక్క ఇలా 

తనను తాను మార్చుకుంది. వింతగా ఉంది కదూ. దీని పుష్పాలు చిన్నవిగా ఉండటంతో చెట్టు ఆకుల్లో కలిసిపోయి సరిగా కనిపించవు. ఈ 

కారణంగానే పుష్పవిన్యాసం కింద ఉన్న పత్రాలు ఇలా తమ రంగును రూపాంతరం చెందించుకొని కీటకాలను ఆకర్షిస్తాయి. ఫలితంగా 

పరాగసంపర్కం జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈ మొక్క రూబియేసి కుటుంబానికి చెందినదని, 

శాస్త్రీయంగా ముస్సెండా ఎరిత్రోఫిల్లాగా పేర్కొంటారని భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.వెల్మల మధు 

తెలిపారు. నిర్మల్‌ పట్టణంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కిందిది.  చిత్రం చూడగానే ఈ మొక్క ఆకులు రెండు వర్ణాల్లో ఉన్నాయెందుకనే అనుమానం వస్తోంది కదూ. పరాగసంపర్కం కోసం మొక్క ఇలా తనను తాను మార్చుకుంది. వింతగా ఉంది కదూ. దీని పుష్పాలు చిన్నవిగా ఉండటంతో చెట్టు ఆకుల్లో కలిసిపోయి సరిగా కనిపించవు. ఈ కారణంగానే పుష్పవిన్యాసం కింద ఉన్న పత్రాలు ఇలా తమ రంగును రూపాంతరం చెందించుకొని కీటకాలను ఆకర్షిస్తాయి. ఫలితంగా పరాగసంపర్కం జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈ మొక్క రూబియేసి కుటుంబానికి చెందినదని, శాస్త్రీయంగా ముస్సెండా ఎరిత్రోఫిల్లాగా పేర్కొంటారని భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.వెల్మల మధు తెలిపారు. నిర్మల్‌ పట్టణంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కిందిది.
6/27
ఖమ్మంలోని వరంగల్‌ క్రాస్‌రోడ్డులో భాజపా ఆందోళన నేపథ్యంలో ముందస్తు బందోబస్తుకు వచ్చిన ముదిగొండ ఎస్‌ఐ వాహనం 

మొరాయించింది. దీంతో అక్కడే ఉన్న యువకులు వాహనాన్ని నెట్టడంతో స్టార్టు అయింది. ఖమ్మంలోని వరంగల్‌ క్రాస్‌రోడ్డులో భాజపా ఆందోళన నేపథ్యంలో ముందస్తు బందోబస్తుకు వచ్చిన ముదిగొండ ఎస్‌ఐ వాహనం మొరాయించింది. దీంతో అక్కడే ఉన్న యువకులు వాహనాన్ని నెట్టడంతో స్టార్టు అయింది.
7/27
వీధి వ్యాపారులు కొత్త ఆలోచనలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఖమ్మంలోని రోటరీనగర్‌లో ఓ వ్యాపారి పదుల సంఖ్యలో ఉన్న 

కుర్చీలను ఇలా రోడ్డు మీద గోడవలె కట్టారు. బుధవారం కన్పించిన దృశ్యమిది. వీధి వ్యాపారులు కొత్త ఆలోచనలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఖమ్మంలోని రోటరీనగర్‌లో ఓ వ్యాపారి పదుల సంఖ్యలో ఉన్న కుర్చీలను ఇలా రోడ్డు మీద గోడవలె కట్టారు. బుధవారం కన్పించిన దృశ్యమిది.
8/27
కరీంనగర్‌ నుంచి తిమ్మాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారి వెంట నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించిన 

రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఈ కూరగాయల నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కూరగాయల నారు త్వరగా పెరగడానికి 

 మళ్లకు రాత్రివేళ ఇలా ప్లాస్టిక్‌ కవర్లు కప్పుతున్నారు. దీనివల్ల వేడి ఉత్పత్తి అయి తేమ శాతం ఎక్కువగా ఉంటే నారు పెరుగుదల 

ఎక్కువగా ఉంటుంది. తెల్లవారాక ఆ కవర్లను తొలగించి నీరు కొడుతుంటారని ఇలా చేస్తే వర్షానికి కూడా నారు పాడుకాకుండా ఉంటుందని 

మానకొడూరు నియోజకవర్గ హార్టికల్చర్‌ అధికారిణి కందుకూరి స్వాతి తెలిపారు. కరీంనగర్‌ నుంచి తిమ్మాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారి వెంట నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించిన రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఈ కూరగాయల నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కూరగాయల నారు త్వరగా పెరగడానికి మళ్లకు రాత్రివేళ ఇలా ప్లాస్టిక్‌ కవర్లు కప్పుతున్నారు. దీనివల్ల వేడి ఉత్పత్తి అయి తేమ శాతం ఎక్కువగా ఉంటే నారు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. తెల్లవారాక ఆ కవర్లను తొలగించి నీరు కొడుతుంటారని ఇలా చేస్తే వర్షానికి కూడా నారు పాడుకాకుండా ఉంటుందని మానకొడూరు నియోజకవర్గ హార్టికల్చర్‌ అధికారిణి కందుకూరి స్వాతి తెలిపారు.
9/27
10/27
ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని 

ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌(యూటీఎస్‌) యాప్, దానికి అనుబంధంగా ఈ-పోస్‌ యంత్రాలను 

అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటియం పద్ధతుల్లో పేమెంట్‌ చేసి టికెట్‌ 

తీసుకోవచ్చు. బస్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు, చెల్లింపులు తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన 

కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రధాన సర్వర్‌కు కొత్త సాంకేతికతను అనుసంధానిస్తారు. ఇప్పటికే కొన్ని డిపోలకు చెందిన దూరప్రాంతాలకు 

వెళ్లే సర్వీసుల్లో ఈ-పోస్‌ ద్వారా టికెట్లు జారీచేస్తూ పరిశీలన చేస్తున్నారు.  ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌(యూటీఎస్‌) యాప్, దానికి అనుబంధంగా ఈ-పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటియం పద్ధతుల్లో పేమెంట్‌ చేసి టికెట్‌ తీసుకోవచ్చు. బస్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు, చెల్లింపులు తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రధాన సర్వర్‌కు కొత్త సాంకేతికతను అనుసంధానిస్తారు. ఇప్పటికే కొన్ని డిపోలకు చెందిన దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ఈ-పోస్‌ ద్వారా టికెట్లు జారీచేస్తూ పరిశీలన చేస్తున్నారు.
11/27
వాల్టా చట్టం నిబంధనల ప్రకారం రెండు బోర్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని 

ఉప్పలపాడు గ్రామం పక్కన వాగులో ఒకేచోట 10 బోర్లు ఉండటాన్ని చిత్రంలో చూడొచ్చు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయని 

కేంద్ర జల్‌శక్తి అభియాన్‌ నాలుగేళ్ల క్రితమే హెచ్చరించినా అవగాహన లేక పక్కపక్కనే బోర్లు వేస్తున్నారు.       వాల్టా చట్టం నిబంధనల ప్రకారం రెండు బోర్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామం పక్కన వాగులో ఒకేచోట 10 బోర్లు ఉండటాన్ని చిత్రంలో చూడొచ్చు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయని కేంద్ర జల్‌శక్తి అభియాన్‌ నాలుగేళ్ల క్రితమే హెచ్చరించినా అవగాహన లేక పక్కపక్కనే బోర్లు వేస్తున్నారు.
12/27
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని మండల పరిషత్తు ఆదర్శ పాఠశాల ఇది. ‘నాడు-నేడు’ రెండో దశకు దీన్ని ఎంపిక చేశారు. వేసవి సెలవుల్లో 

పనులు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం వారం కిందటే అనుమతులిచ్చారు. ఐదు రోజుల్లో బడి ప్రారంభం కానుంది. పనుల పేరుతో 

ఇప్పుడు హడావుడి మొదలైంది. వరండా, తరగతి గదుల్లో పాలిష్‌ బండలు వేయాలని పాత ఫ్లోరింగ్‌ తొలగించారు. ఆ వ్యర్థాలను 

ఆవరణలోనే పోశారు. ప్రభుత్వం నుంచి ఇసుక, కంకర సామగ్రి వస్తే పనులు చేయాలని చూస్తున్నారు. ఈలోగా బడులు తెరిస్తే.. పిల్లలు, 

టీచర్లు ఎక్కడ కూర్చుంటారు..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని మండల పరిషత్తు ఆదర్శ పాఠశాల ఇది. ‘నాడు-నేడు’ రెండో దశకు దీన్ని ఎంపిక చేశారు. వేసవి సెలవుల్లో పనులు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం వారం కిందటే అనుమతులిచ్చారు. ఐదు రోజుల్లో బడి ప్రారంభం కానుంది. పనుల పేరుతో ఇప్పుడు హడావుడి మొదలైంది. వరండా, తరగతి గదుల్లో పాలిష్‌ బండలు వేయాలని పాత ఫ్లోరింగ్‌ తొలగించారు. ఆ వ్యర్థాలను ఆవరణలోనే పోశారు. ప్రభుత్వం నుంచి ఇసుక, కంకర సామగ్రి వస్తే పనులు చేయాలని చూస్తున్నారు. ఈలోగా బడులు తెరిస్తే.. పిల్లలు, టీచర్లు ఎక్కడ కూర్చుంటారు..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
13/27
14/27
బహుళ అంతస్తుల భవనాలతో హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక ఆకర్శణగా కనిపిస్తున్న చిత్రమిది. బహుళ అంతస్తుల భవనాలతో హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక ఆకర్శణగా కనిపిస్తున్న చిత్రమిది.
15/27

అంబర్‌పేట సీసీఎల్‌లోని రాచకొండ పోలీసు కార్యాలయం ఆవరణలో కొన్ని రోజుల క్రితం మొక్కలు నాటారు. వాటికి ఇలా టైర్లను ఏర్పాటు చేశారు. వాటికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. అక్కడికి వచ్చే వారు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంబర్‌పేట సీసీఎల్‌లోని రాచకొండ పోలీసు కార్యాలయం ఆవరణలో కొన్ని రోజుల క్రితం మొక్కలు నాటారు. వాటికి ఇలా టైర్లను ఏర్పాటు చేశారు. వాటికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. అక్కడికి వచ్చే వారు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
16/27
కూడళ్లలో ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్‌ పోస్టులు తయారు చేయించారు. క్రమంగా యూ టర్న్‌ల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో వీటి అవసరం లేకుండాపోతోంది. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఓ మైదానంలో వృథాగా పడేశారు. కూడళ్లలో ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్‌ పోస్టులు తయారు చేయించారు. క్రమంగా యూ టర్న్‌ల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో వీటి అవసరం లేకుండాపోతోంది. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఓ మైదానంలో వృథాగా పడేశారు.
17/27
చేవెళ్ల పట్టణంలోని బీజాపూర్‌ రహదారిపై ఇంద్రారెడ్డి కూడలిలో ప్రమాదకరంగా మారిన గుంతలను చేవెళ్ల ట్రాఫిక్‌ పోలీసులు కంకర మిశ్రమం తెచ్చి పూడ్చి వాహనదారులకు ఉపశమనం కలిగించారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతిరావు, ఏఎస్సై చందర్‌ ట్రాలీ ఆటోతో కాంక్రీటు మిశ్రమాన్ని తెప్పించి వారే పార పట్టుకుని గుంతలను పూడ్చారు. పోలీసుల కృషిని స్థానికులు, వాహనదారులు అభినందించారు. చేవెళ్ల పట్టణంలోని బీజాపూర్‌ రహదారిపై ఇంద్రారెడ్డి కూడలిలో ప్రమాదకరంగా మారిన గుంతలను చేవెళ్ల ట్రాఫిక్‌ పోలీసులు కంకర మిశ్రమం తెచ్చి పూడ్చి వాహనదారులకు ఉపశమనం కలిగించారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతిరావు, ఏఎస్సై చందర్‌ ట్రాలీ ఆటోతో కాంక్రీటు మిశ్రమాన్ని తెప్పించి వారే పార పట్టుకుని గుంతలను పూడ్చారు. పోలీసుల కృషిని స్థానికులు, వాహనదారులు అభినందించారు.
18/27
యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళకళలాడుతోంది. సుమారు 1200 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో విద్యనభ్యసిస్తున్నారు. 36 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మెట్రో మార్గాన్ని పాఠశాల ఆవరణలో నుంచే నిర్మించారు. పైన మెట్రో పరుగు పెడుతుండగా కింద విద్యార్థులు ఆటపాటలతో ఆవరణ సందడిగా మారింది. యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళకళలాడుతోంది. సుమారు 1200 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో విద్యనభ్యసిస్తున్నారు. 36 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మెట్రో మార్గాన్ని పాఠశాల ఆవరణలో నుంచే నిర్మించారు. పైన మెట్రో పరుగు పెడుతుండగా కింద విద్యార్థులు ఆటపాటలతో ఆవరణ సందడిగా మారింది.
19/27
చిత్రాన్ని చూస్తుంటే శంకుస్థాపన శిలాఫలకాన్ని రోడ్డు మధ్యలో ఏర్పాటు చేశారేంటి అనుకుంటున్నారా.. అలా భావిస్తే పొరపాటే..! శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అలాగే ఉంచి రహదారి నిర్మించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది హైదరాబాద్‌ శివారు బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గ్రీన్‌హోమ్స్‌కాలనీలో ఉంది. పట్టణ ప్రగతి నిధులతో రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో రహదారి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకాన్ని అక్కడి నుంచి తొలగించి పక్కన ఏర్పాటు చేయకుండానే నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ రహదారిపై ప్రయాణించే వాహనాలు వేగంగా వచ్చి దాన్ని ఢీ కొని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించగా స్థానికులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో శిలాఫలకాన్ని అలాగే ఉంచి రహదారిని నిర్మించినట్లు చెప్పడం కొసమెరుపు. చిత్రాన్ని చూస్తుంటే శంకుస్థాపన శిలాఫలకాన్ని రోడ్డు మధ్యలో ఏర్పాటు చేశారేంటి అనుకుంటున్నారా.. అలా భావిస్తే పొరపాటే..! శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అలాగే ఉంచి రహదారి నిర్మించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది హైదరాబాద్‌ శివారు బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గ్రీన్‌హోమ్స్‌కాలనీలో ఉంది. పట్టణ ప్రగతి నిధులతో రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో రహదారి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకాన్ని అక్కడి నుంచి తొలగించి పక్కన ఏర్పాటు చేయకుండానే నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ రహదారిపై ప్రయాణించే వాహనాలు వేగంగా వచ్చి దాన్ని ఢీ కొని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించగా స్థానికులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో శిలాఫలకాన్ని అలాగే ఉంచి రహదారిని నిర్మించినట్లు చెప్పడం కొసమెరుపు.
20/27
కల్యాణవేదిక అనుకునేరు? ఇదొక వ్యవసాయ క్షేత్రం. తన పొలంలో పెంచిన పుష్పాలతో ఇలా అలంకరించి చిన్నపాటి శుభకార్యాలకు వేదికగా ఇస్తున్నారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌కు చెందిన రైతు నాగరత్నం నాయుడు. కల్యాణవేదిక అనుకునేరు? ఇదొక వ్యవసాయ క్షేత్రం. తన పొలంలో పెంచిన పుష్పాలతో ఇలా అలంకరించి చిన్నపాటి శుభకార్యాలకు వేదికగా ఇస్తున్నారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌కు చెందిన రైతు నాగరత్నం నాయుడు.
21/27
కూడళ్ల సుందరీకరణలో భాగంగా సంబంధిత అధికారులు పలు ఆకృతులను ఏర్పాటుచేస్తున్నారు. ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ వెళ్లే బాహ్యవలయ కూడలిలో ఇనుముతో తయారుచేసిన మనిషి ఆకృతిని ఏర్పాటుచేశారు. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. కూడళ్ల సుందరీకరణలో భాగంగా సంబంధిత అధికారులు పలు ఆకృతులను ఏర్పాటుచేస్తున్నారు. ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ వెళ్లే బాహ్యవలయ కూడలిలో ఇనుముతో తయారుచేసిన మనిషి ఆకృతిని ఏర్పాటుచేశారు. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు.
22/27
హైదరాబాద్‌ మహా నగర స్వరూపం మారిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాల నగరాలను మరపిస్తూ భారీ భవంతులు వెలుస్తున్నాయి. ఆకాశాన్ని అంటేలా ఐటీ కార్యాలయాలతో కనుచూపు మేర అందమైన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. బయోడైవర్సిటీ, నాలెడ్జి సిటీ తదితర ప్రాంతాల్లో అసలు ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోయేలా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గాల్లో వెళ్లే వారు వీటిని చూస్తూ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. హైదరాబాద్‌ మహా నగర స్వరూపం మారిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాల నగరాలను మరపిస్తూ భారీ భవంతులు వెలుస్తున్నాయి. ఆకాశాన్ని అంటేలా ఐటీ కార్యాలయాలతో కనుచూపు మేర అందమైన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. బయోడైవర్సిటీ, నాలెడ్జి సిటీ తదితర ప్రాంతాల్లో అసలు ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోయేలా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గాల్లో వెళ్లే వారు వీటిని చూస్తూ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు.
23/27
చిన్నపాటి వర్షం వచ్చినా మల్కాజ్‌గిరి రాజాశ్రీనివాసనగర్‌ ముంపునకు గురవుతోంది. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ ఇంటి యజమానికి వర్షపు నీరు ఇంటిలోకి చేరకుండా.. గేటును ఇనుప రేకులతో మూసేసి..వాటికి అడ్డుగా కంకర నింపిన బస్తాలను ఉంచారు. చిన్నపాటి వర్షం వచ్చినా మల్కాజ్‌గిరి రాజాశ్రీనివాసనగర్‌ ముంపునకు గురవుతోంది. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ ఇంటి యజమానికి వర్షపు నీరు ఇంటిలోకి చేరకుండా.. గేటును ఇనుప రేకులతో మూసేసి..వాటికి అడ్డుగా కంకర నింపిన బస్తాలను ఉంచారు.
24/27
మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి దాదాపు రెండు వారాలపాటు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న చేపలు పడితే.. వాటిని తాళ్లకు కట్టి పడవ పైభాగంలో ఎండబెడతారు. ఇలా చేస్తే నీడ తగిలే అవకాశమే లేకపోవడంతో త్వరగా ఎండుతాయి. ఒడ్డుకొచ్చాక వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. పడవలపై ఎండబెట్టిన వాటికి ఇసుక అంటదు. అందువల్ల వీటికి కాస్త ఎక్కువ గిరాకీ ఉంటుంది. చూడటానికి గుడిసెలపై కప్పిన చాపల్లా ఉన్న ఈ ఎండు చేపల వరుస విశాఖలోని జెట్టీల వద్ద ఆగిన బోట్లపై కనిపించింది. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి దాదాపు రెండు వారాలపాటు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న చేపలు పడితే.. వాటిని తాళ్లకు కట్టి పడవ పైభాగంలో ఎండబెడతారు. ఇలా చేస్తే నీడ తగిలే అవకాశమే లేకపోవడంతో త్వరగా ఎండుతాయి. ఒడ్డుకొచ్చాక వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. పడవలపై ఎండబెట్టిన వాటికి ఇసుక అంటదు. అందువల్ల వీటికి కాస్త ఎక్కువ గిరాకీ ఉంటుంది. చూడటానికి గుడిసెలపై కప్పిన చాపల్లా ఉన్న ఈ ఎండు చేపల వరుస విశాఖలోని జెట్టీల వద్ద ఆగిన బోట్లపై కనిపించింది.
25/27
వర్షాలు ప్రారంభమవడంతో యూరియా కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి 140 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో బుధవారం రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 గంటలకే కార్యాలయం వద్దకు చేరుకుని ఆరుబయట చెప్పులు, రాళ్లు, కల్లు సీసాలను వరుసలో పెట్టారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక వరుసలో వీటిని పెట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కాగా, కార్యాలయానికి వచ్చిన ఎనిమిది వందల మందికి యూరియా బస్తాలు అందించినట్లు, ఇంకా సరకు మిగిలి ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభమవడంతో యూరియా కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి 140 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో బుధవారం రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 గంటలకే కార్యాలయం వద్దకు చేరుకుని ఆరుబయట చెప్పులు, రాళ్లు, కల్లు సీసాలను వరుసలో పెట్టారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక వరుసలో వీటిని పెట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కాగా, కార్యాలయానికి వచ్చిన ఎనిమిది వందల మందికి యూరియా బస్తాలు అందించినట్లు, ఇంకా సరకు మిగిలి ఉందని అధికారులు పేర్కొన్నారు.
26/27
ఓ వైపు విద్యుదుత్పత్తి క్రమంలో పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. మరోవైపు ఏటా పెరుగుతున్న ఛార్జీలు వినియోగదారులను సౌర పలకలవైపు అడుగేసేలా చేస్తున్నాయి. గతంలో ఒకటి రెండు కుటుంబాలు, భవనాల్లోనే సౌర పలకలు ఉండగా ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలు, సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. కూకట్‌పల్లి మలేసియన్‌ టౌన్‌షిప్‌లో భవనాలపై ఏర్పాటు చేసుకున్న పలకలు ఇవి. ఓ వైపు విద్యుదుత్పత్తి క్రమంలో పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. మరోవైపు ఏటా పెరుగుతున్న ఛార్జీలు వినియోగదారులను సౌర పలకలవైపు అడుగేసేలా చేస్తున్నాయి. గతంలో ఒకటి రెండు కుటుంబాలు, భవనాల్లోనే సౌర పలకలు ఉండగా ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలు, సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. కూకట్‌పల్లి మలేసియన్‌ టౌన్‌షిప్‌లో భవనాలపై ఏర్పాటు చేసుకున్న పలకలు ఇవి.
27/27
మల్కాజిగిరి వసంతపురి కాలనీలో డ్రైనేజీ పైపులైను నిర్మాణానికి గుంతలు తవ్వారు. ఏ విధమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో వాహనదారులు ఆ మార్గంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. మల్కాజిగిరి వసంతపురి కాలనీలో డ్రైనేజీ పైపులైను నిర్మాణానికి గుంతలు తవ్వారు. ఏ విధమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో వాహనదారులు ఆ మార్గంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts