News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 01 Jul 2022 21:57 IST
1/24
కూకట్‌పల్లిలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రలో విదేశీయులు న్యత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ సందడి చేశారు. కూకట్‌పల్లిలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రలో విదేశీయులు న్యత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ సందడి చేశారు.
2/24
3/24
4/24
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం  హైదరాబాద్‌ రానున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయన కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ రానున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయన కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.
5/24
6/24
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో వివిధ అంశాలతో చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిలో నిజాం కాలంనాటి ఫొటోలతో పాటు తెలంగాణ ఉద్యమ సమయం నాటి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో వివిధ అంశాలతో చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిలో నిజాం కాలంనాటి ఫొటోలతో పాటు తెలంగాణ ఉద్యమ సమయం నాటి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
7/24
8/24
9/24
ఒడిశాలో శుక్రవారం జగన్నాథుడి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ రథాన్ని లాగారు. అందరికీ మంచి జరగాలని జగన్నాథుడిని ప్రార్థించారు. ఒడిశాలో శుక్రవారం జగన్నాథుడి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ రథాన్ని లాగారు. అందరికీ మంచి జరగాలని జగన్నాథుడిని ప్రార్థించారు.
10/24
థామస్‌ కప్‌ గెలుపొందడంలో కీలక పాత్ర వహించిన కిదాంబి శ్రీకాంత్‌, జి.కృష్ణప్రసాద్‌ను, డెఫిలింపిక్స్‌లో కాంస్యం సాధించిన జఫ్రీన్‌ షైక్‌, ఆసియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన ఎస్‌.చంద్రకళను ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో సన్మానించారు. థామస్‌ కప్‌ గెలుపొందడంలో కీలక పాత్ర వహించిన కిదాంబి శ్రీకాంత్‌, జి.కృష్ణప్రసాద్‌ను, డెఫిలింపిక్స్‌లో కాంస్యం సాధించిన జఫ్రీన్‌ షైక్‌, ఆసియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన ఎస్‌.చంద్రకళను ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో సన్మానించారు.
11/24
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో  జులై 2,3 తేదీల్లో నిర్వహించనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో జులై 2,3 తేదీల్లో నిర్వహించనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.
12/24
13/24
కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేసి వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె తెలంగాణకు వచ్చారు. కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేసి వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె తెలంగాణకు వచ్చారు.
14/24
15/24
స్విట్జర్లాండ్‌లోని రిజిస్టర్‌ కార్యాలయం వద్ద అన్నెట్‌ బేబిన్‌స్కీ, లారా సువరేజ్‌ అనే మహిళలు వివాహం చేసుకొని సంబరాల్లో మునిగి తేలారు. స్వలింగ వివాహాలకు ఆ దేశంలో చట్టబద్ధత కల్పించడంతో శుక్రవారం మొదటిసారి అక్కడ స్వలింగ వివాహాలు జరిగాయి. స్విట్జర్లాండ్‌లోని రిజిస్టర్‌ కార్యాలయం వద్ద అన్నెట్‌ బేబిన్‌స్కీ, లారా సువరేజ్‌ అనే మహిళలు వివాహం చేసుకొని సంబరాల్లో మునిగి తేలారు. స్వలింగ వివాహాలకు ఆ దేశంలో చట్టబద్ధత కల్పించడంతో శుక్రవారం మొదటిసారి అక్కడ స్వలింగ వివాహాలు జరిగాయి.
16/24
డాక్టర్స్‌ డే సందర్భంగా చిక్కడ్‌పల్లిలోని ఓ పాఠశాలలోవిద్యార్థులు వైద్యుల వేషధారణలతో ప్రదర్శన ఇచ్చి సందడి చేశారు. డాక్టర్స్‌ డే సందర్భంగా చిక్కడ్‌పల్లిలోని ఓ పాఠశాలలోవిద్యార్థులు వైద్యుల వేషధారణలతో ప్రదర్శన ఇచ్చి సందడి చేశారు.
17/24
ఒడిశాలోని జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. ఒడిశాలోని జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు.
18/24
ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ టెస్టు మ్యాచ్‌ల్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సిల్వర్‌ బ్యాట్‌ను బహూకరించారు. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ టెస్టు మ్యాచ్‌ల్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సిల్వర్‌ బ్యాట్‌ను బహూకరించారు.
19/24
హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ తెరాస, భాజపా పోటాపోటీగా బ్యానర్లు కట్టాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ భాజపా బ్యానర్లు ఏర్పాటు చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను ఆహ్వానిస్తూ తెరాస బ్యానర్లు కట్టింది. ఈ ఇద్దరూ శనివారమే హైదరాబాద్‌కు వస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ తెరాస, భాజపా పోటాపోటీగా బ్యానర్లు కట్టాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ భాజపా బ్యానర్లు ఏర్పాటు చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను ఆహ్వానిస్తూ తెరాస బ్యానర్లు కట్టింది. ఈ ఇద్దరూ శనివారమే హైదరాబాద్‌కు వస్తుండటం విశేషం.
20/24
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాథ నామస్మరణతో పూరీ వీధులు మార్మోగుతున్నాయి. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాథ నామస్మరణతో పూరీ వీధులు మార్మోగుతున్నాయి.
21/24
22/24
నెల్లూరు నగరంలో ఆర్‌.ఎస్‌ బ్రదర్స్‌ నూతన వస్త్ర దుకాణాన్ని యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా 

ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు నగరంలో ఆర్‌.ఎస్‌ బ్రదర్స్‌ నూతన వస్త్ర దుకాణాన్ని యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
23/24
24/24
గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దీనిపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం 

చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మిఠాయి తినిపించి సంబరాలు జరుపుకొన్నారు. గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దీనిపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మిఠాయి తినిపించి సంబరాలు జరుపుకొన్నారు.

మరిన్ని