News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 12 Jul 2022 15:08 IST
1/25
జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి    నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
2/25
వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 26 మీటర్లకు పెరిగింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం నీటిమట్టం మరింత పెరిగితే మిగిలిన 24 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని జల వనరులశాఖ అధికారులు తెలిపారు. గతేడాది జూన్‌ 25న క్రస్టుగేట్లను ఎత్తారు. వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 26 మీటర్లకు పెరిగింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం నీటిమట్టం మరింత పెరిగితే మిగిలిన 24 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని జల వనరులశాఖ అధికారులు తెలిపారు. గతేడాది జూన్‌ 25న క్రస్టుగేట్లను ఎత్తారు.
3/25
గుంటూరు నగరంలో గుంతలమయంగా ఉన్న ప్రధాన రహదారులు వర్షం వస్తే దారుణంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లే కుంటలను తలపిస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయి. కనీసం మరమ్మతులు కూడా లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.    గుంటూరు నగరంలో గుంతలమయంగా ఉన్న ప్రధాన రహదారులు వర్షం వస్తే దారుణంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లే కుంటలను తలపిస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయి. కనీసం మరమ్మతులు కూడా లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
4/25
5/25
పెదకాకాని మల్లేశ్వరాలయ నూతన సహాయ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి రెండో రోజే నైరుతి భాగంలో ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించే గేటును మూసివేస్తూ గోడ నిర్మింపచేశారు. దేవస్థానం పక్కనే ఉన్న చెరువు కట్టపై సీసీ రోడ్డు వేయడంతో ఈ గేటు ద్వారా భక్తుల రాకపోకలు తగ్గాయంటూ గత ఈవో ఈ గేటుకు తాళం వేయించారు. ప్రస్తుత సహాయ కమిషనర్‌ మరో అడుగు ముందుకేసి, ఏకంగా గోడనే నిర్మింపచేశారు. దీనిపై ఏసీ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ గేటు వాడుకలో లేకపోవడంతోనే గోడ కట్టించినట్లు చెప్పారు. పెదకాకాని మల్లేశ్వరాలయ నూతన సహాయ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి రెండో రోజే నైరుతి భాగంలో ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించే గేటును మూసివేస్తూ గోడ నిర్మింపచేశారు. దేవస్థానం పక్కనే ఉన్న చెరువు కట్టపై సీసీ రోడ్డు వేయడంతో ఈ గేటు ద్వారా భక్తుల రాకపోకలు తగ్గాయంటూ గత ఈవో ఈ గేటుకు తాళం వేయించారు. ప్రస్తుత సహాయ కమిషనర్‌ మరో అడుగు ముందుకేసి, ఏకంగా గోడనే నిర్మింపచేశారు. దీనిపై ఏసీ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ గేటు వాడుకలో లేకపోవడంతోనే గోడ కట్టించినట్లు చెప్పారు.
6/25
ఆలూరు పట్టణంలోని కాస్మో పాలిటిన్‌ క్లబ్‌కు వెనుక వైపున ఉన్న ప్రహరీపై చెట్టు పెరిగింది. గోడ మధ్యలో నుంచి పై వరకు చెట్టు ఉంది. అటు వైపు రాకపోకలు కొనసాగించే వారు ప్రహరీపై పెరిగిన చెట్టును ఆసక్తిగా చూస్తూ వెళ్తున్నారు. చెట్టును తొలగించకపోతే ప్రహరీకి ప్రమాదం తప్పదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఆలూరు పట్టణంలోని కాస్మో పాలిటిన్‌ క్లబ్‌కు వెనుక వైపున ఉన్న ప్రహరీపై చెట్టు పెరిగింది. గోడ మధ్యలో నుంచి పై వరకు చెట్టు ఉంది. అటు వైపు రాకపోకలు కొనసాగించే వారు ప్రహరీపై పెరిగిన చెట్టును ఆసక్తిగా చూస్తూ వెళ్తున్నారు. చెట్టును తొలగించకపోతే ప్రహరీకి ప్రమాదం తప్పదనే వాదనలూ వినిపిస్తున్నాయి.
7/25
ఇదేంటి ఇలా అడ్డుగా కర్రలు కట్టారు.. ఏదో పెద్ద ఎత్తున్న జనం వస్తుంటే అడ్డుగా పెట్టారని అనుకుంటున్నారా.. కాదండోయ్‌.. డోన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఇవి కనిపిస్తాయి. కరోనా పరిస్థితుల్లో కార్యాలయంలోకి జనం గుంపులుగా వెళ్లకుండా ఏర్పాటు చేసిన కర్రలు ఇవి. ప్రస్తుతం ఎక్కడా ఆ నిబంధనలు పాటించడం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఆ కర్రలు అలాగే ఉంచారు. దీనికి తోడు లోపలకు వెళ్లేందుకు వర్షం వచ్చినప్పుడల్లా రహదారిలోనే నీరు నిలుస్తుంది. ఈ అడ్డు కర్రలు, వర్షం నీటిని దాటుకుంటూ కార్యాలయంలోకి వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇదేంటి ఇలా అడ్డుగా కర్రలు కట్టారు.. ఏదో పెద్ద ఎత్తున్న జనం వస్తుంటే అడ్డుగా పెట్టారని అనుకుంటున్నారా.. కాదండోయ్‌.. డోన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఇవి కనిపిస్తాయి. కరోనా పరిస్థితుల్లో కార్యాలయంలోకి జనం గుంపులుగా వెళ్లకుండా ఏర్పాటు చేసిన కర్రలు ఇవి. ప్రస్తుతం ఎక్కడా ఆ నిబంధనలు పాటించడం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఆ కర్రలు అలాగే ఉంచారు. దీనికి తోడు లోపలకు వెళ్లేందుకు వర్షం వచ్చినప్పుడల్లా రహదారిలోనే నీరు నిలుస్తుంది. ఈ అడ్డు కర్రలు, వర్షం నీటిని దాటుకుంటూ కార్యాలయంలోకి వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
8/25
మల్బరీ మొక్కలంటే పట్టుపురుగుల ఆహారం కోసం పెంచేవిగానే ఎక్కువ మందికి తెలుసు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు మాత్రం వీటిలో పండ్లు కాసే రకాలను పెంచుతున్నారు. ఈ పండ్లు నలుపు, తెలుపు, ఎరుపు వర్ణంలో ఉన్నాయి. వీటిని విదేశాల్లో ఎక్కువగా వైన్‌ తయారీలో వినియోగిస్తారని, జ్యూస్‌గా, స్నాక్స్‌గా ఆరగిస్తారని ఇక్కడి రైతులు చెప్పారు. ఈ పండ్లలో ఔషధ గుణాలు ఉన్నాయని మండల ఉద్యానశాఖ అధికారి సుధీర్‌ తెలిపారు. వీటిని కడియపులంకలోని శ్రీసప్తగిరి నర్సరీలో రైతు కుప్పాల దుర్గారావు సాగు చేస్తున్నారు. ఈ మొక్కల ధర సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉందని ఆయన వివరించారు. 	 

మల్బరీ మొక్కలంటే పట్టుపురుగుల ఆహారం కోసం పెంచేవిగానే ఎక్కువ మందికి తెలుసు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు మాత్రం వీటిలో పండ్లు కాసే రకాలను పెంచుతున్నారు. ఈ పండ్లు నలుపు, తెలుపు, ఎరుపు వర్ణంలో ఉన్నాయి. వీటిని విదేశాల్లో ఎక్కువగా వైన్‌ తయారీలో వినియోగిస్తారని, జ్యూస్‌గా, స్నాక్స్‌గా ఆరగిస్తారని ఇక్కడి రైతులు చెప్పారు. ఈ పండ్లలో ఔషధ గుణాలు ఉన్నాయని మండల ఉద్యానశాఖ అధికారి సుధీర్‌ తెలిపారు. వీటిని కడియపులంకలోని శ్రీసప్తగిరి నర్సరీలో రైతు కుప్పాల దుర్గారావు సాగు చేస్తున్నారు. ఈ మొక్కల ధర సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉందని ఆయన వివరించారు.
9/25
10/25
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి నూతన దివ్య రథం ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. 2021లో స్వామివారికి రూ.కోటితో బర్మా టేకు కర్ర, చెక్కలతో దీనిని చేయించారు. రూ.లక్షలు వెచ్చించి కొత్తగా బ్రేకులు, కప్పిని ఏర్పాటు చేశారు. అయితే దీనికి పక్కా షెల్టర్‌ నిర్మించకపోవడంతో కొంతకాలం ఈ రథాన్ని రేకులతో కప్పారు. అవి గాలికి ఎగిరిపోయాయి. అప్పటి నుంచి బరకాలతో కప్పారు. అయితే ప్రస్తుతం వీస్తున్న గాలులు, వర్షాలకు బరకాలు తెగిపోవడంతో రథం వర్షాలకు తడుస్తూ, ఎండకు ఎండుతోంది. ఈ విషయం ఏసీ వి.సత్య నారాయణ వద్ద ప్రస్తావించగా.. నూతన భవనానికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.  


అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి నూతన దివ్య రథం ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. 2021లో స్వామివారికి రూ.కోటితో బర్మా టేకు కర్ర, చెక్కలతో దీనిని చేయించారు. రూ.లక్షలు వెచ్చించి కొత్తగా బ్రేకులు, కప్పిని ఏర్పాటు చేశారు. అయితే దీనికి పక్కా షెల్టర్‌ నిర్మించకపోవడంతో కొంతకాలం ఈ రథాన్ని రేకులతో కప్పారు. అవి గాలికి ఎగిరిపోయాయి. అప్పటి నుంచి బరకాలతో కప్పారు. అయితే ప్రస్తుతం వీస్తున్న గాలులు, వర్షాలకు బరకాలు తెగిపోవడంతో రథం వర్షాలకు తడుస్తూ, ఎండకు ఎండుతోంది. ఈ విషయం ఏసీ వి.సత్య నారాయణ వద్ద ప్రస్తావించగా.. నూతన భవనానికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
11/25
ఏబీ(అలికాం-బత్తిలి) రహదారిలోని ఓ గోతిలో భారీ లారీ దిగబడిపోయిన దృశ్యమిది. కొత్తూరులో బుధవారం చోటు చేసుకుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ సిబ్బంది, స్థానికులు క్రేన్‌ తీసుకొచ్చి లారీని బయటకు తీయడంతో ఇబ్బంది తప్పింది. మరమ్మతులు చేపట్టాలని ఎన్నోసార్లు విన్నవించినా ఆర్‌అండ్‌బీ అధికారులు తగు చర్యలు చేపట్టడం లేదని ఈ ప్రాంతీయులు వాపోతున్నారు.  ఏబీ(అలికాం-బత్తిలి) రహదారిలోని ఓ గోతిలో భారీ లారీ దిగబడిపోయిన దృశ్యమిది. కొత్తూరులో బుధవారం చోటు చేసుకుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ సిబ్బంది, స్థానికులు క్రేన్‌ తీసుకొచ్చి లారీని బయటకు తీయడంతో ఇబ్బంది తప్పింది. మరమ్మతులు చేపట్టాలని ఎన్నోసార్లు విన్నవించినా ఆర్‌అండ్‌బీ అధికారులు తగు చర్యలు చేపట్టడం లేదని ఈ ప్రాంతీయులు వాపోతున్నారు.
12/25
చూసేవారి హృదయం ద్రవించిపోతుంది. పశుసంపద అక్రమ రవాణాను పట్టించుకునేవారే లేరనడానికి ఈ చిత్రమే నిదర్శనం. మూగజీవాల రవాణాలో అక్రమార్కులు వ్యవహరిస్తున్న తీరు హృదయ విదారకం. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఒడిశా నుంచి వచ్చిన లారీ బుధవారం తామరాపల్లి శివార్లలో దాబా వద్ద నిలిపివేశారు. లారీలో ఉన్నవి కనిపించకుండా చుట్టూ టార్పాలిన్‌తో మూసివేశారు. ఒకదానిపై ఒకటి నిలిచి కాలు కదపలేని విధంగా ఉన్న పశువుల్లో ఐదు అందులోనే ప్రాణాలు విడిచాయి. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, లారీని అక్కడి నుంచి తరలించారు. చూసేవారి హృదయం ద్రవించిపోతుంది. పశుసంపద అక్రమ రవాణాను పట్టించుకునేవారే లేరనడానికి ఈ చిత్రమే నిదర్శనం. మూగజీవాల రవాణాలో అక్రమార్కులు వ్యవహరిస్తున్న తీరు హృదయ విదారకం. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఒడిశా నుంచి వచ్చిన లారీ బుధవారం తామరాపల్లి శివార్లలో దాబా వద్ద నిలిపివేశారు. లారీలో ఉన్నవి కనిపించకుండా చుట్టూ టార్పాలిన్‌తో మూసివేశారు. ఒకదానిపై ఒకటి నిలిచి కాలు కదపలేని విధంగా ఉన్న పశువుల్లో ఐదు అందులోనే ప్రాణాలు విడిచాయి. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, లారీని అక్కడి నుంచి తరలించారు.
13/25
నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన గర్భిణి బూర పైడిరాజు ఒకే కాన్పులో ఒక మగ, ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చారు. ఈమె బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా కోల్‌కత్తాలో సేవలందిస్తుండగా, భర్త లక్ష్మునాయుడు విశాఖలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. మొదటి కాన్పులో పాప పుట్టింది. పైడిరాజు ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడంతో జూన్‌ 30న విజయనగరం ఘోష ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన గర్భిణి బూర పైడిరాజు ఒకే కాన్పులో ఒక మగ, ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చారు. ఈమె బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా కోల్‌కత్తాలో సేవలందిస్తుండగా, భర్త లక్ష్మునాయుడు విశాఖలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. మొదటి కాన్పులో పాప పుట్టింది. పైడిరాజు ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడంతో జూన్‌ 30న విజయనగరం ఘోష ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
14/25
వర్షాకాలంలో ఎక్కడ చూసినా పచ్చదనం కళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. గుట్టల వద్ద రాళ్ల అందాన్ని ద్విగుణీకృతం చేసేలా చుట్టుముట్టిన హరితం.. చూపరుల మనసుల్ని పరవశింప చేస్తోంది. ఈ ప్రకృతి చిత్రం ఏడుపాయల-మెదక్‌ రోడ్డు సమీపంలో ఉంది. రాళ్లు ఒకదానిపై మరొకటి ఎవరో అమర్చి పెట్టినట్టుగా సుందరంగా కనిపించడంతో ఇటువైపుగా వచ్చిన వారు ప్రకృతితో ఫొటోలు దిగుతున్నారు.  వర్షాకాలంలో ఎక్కడ చూసినా పచ్చదనం కళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. గుట్టల వద్ద రాళ్ల అందాన్ని ద్విగుణీకృతం చేసేలా చుట్టుముట్టిన హరితం.. చూపరుల మనసుల్ని పరవశింప చేస్తోంది. ఈ ప్రకృతి చిత్రం ఏడుపాయల-మెదక్‌ రోడ్డు సమీపంలో ఉంది. రాళ్లు ఒకదానిపై మరొకటి ఎవరో అమర్చి పెట్టినట్టుగా సుందరంగా కనిపించడంతో ఇటువైపుగా వచ్చిన వారు ప్రకృతితో ఫొటోలు దిగుతున్నారు.
15/25
ఈ చిత్రం చూసి సముద్రంలో వెళుతున్న నావలా భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం కారు మబ్బుల్లో ఈ విధంగా కనిపించింది. ఈ చిత్రం చూసి సముద్రంలో వెళుతున్న నావలా భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం కారు మబ్బుల్లో ఈ విధంగా కనిపించింది.
16/25
అసలే విజయవాడ హైవే.. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గం. అందులోనూ హయత్‌నగర్‌ వద్ద ఇరుకైన ప్రదేశంలోనే ఒకవైపు బస్‌స్టేషన్‌.. ఆ ముందే ఆటోస్టాండ్‌.. అక్కడ రహదారి దాటాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. అసలే విజయవాడ హైవే.. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గం. అందులోనూ హయత్‌నగర్‌ వద్ద ఇరుకైన ప్రదేశంలోనే ఒకవైపు బస్‌స్టేషన్‌.. ఆ ముందే ఆటోస్టాండ్‌.. అక్కడ రహదారి దాటాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు.
17/25
నాదర్‌గుల్‌లోని పాఠశాల, గ్రంథాలయాలకు వచ్చే వారికి స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన చిత్రాలివి. క్రీడలు, ఆధ్యాత్మికం, రాజకీయ, సామాజిక రంగాల్లో సేవలందించి.. రాణించిన వారి చిత్రాలను ఇలా ఏర్పాటుచేశారు. నాదర్‌గుల్‌లోని పాఠశాల, గ్రంథాలయాలకు వచ్చే వారికి స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన చిత్రాలివి. క్రీడలు, ఆధ్యాత్మికం, రాజకీయ, సామాజిక రంగాల్లో సేవలందించి.. రాణించిన వారి చిత్రాలను ఇలా ఏర్పాటుచేశారు.
18/25
రైతుల సంక్షేమం.. వినియోగదారుల శ్రేయస్సు అన్న నినాదంతో రైతుల ఉత్పత్తులను ఆదరిద్దామంటూ ఖైరతాబాద్‌ నారాయణగూడ మెల్కొటే పార్కు సమీపంలో ఏర్పాటుచేసిన మన కూరగాయల సూపర్‌మార్కెట్‌ పరిస్థితి ఇది. నామమాత్రంగా నడవడంతో కొన్నాళ్లకే మూసివేశారు. దీంతో నిరుపయోగంగా మారాయి. రైతుల సంక్షేమం.. వినియోగదారుల శ్రేయస్సు అన్న నినాదంతో రైతుల ఉత్పత్తులను ఆదరిద్దామంటూ ఖైరతాబాద్‌ నారాయణగూడ మెల్కొటే పార్కు సమీపంలో ఏర్పాటుచేసిన మన కూరగాయల సూపర్‌మార్కెట్‌ పరిస్థితి ఇది. నామమాత్రంగా నడవడంతో కొన్నాళ్లకే మూసివేశారు. దీంతో నిరుపయోగంగా మారాయి.
19/25
చిత్రంలో పచ్చగడ్డితో క్రికెట్‌ మైదానంలా కనిపిస్తున్న ఆటస్థలం కాదు. చందానగర్‌ భక్షికుంట చెరువు గుర్రపుడెక్కకు చెందిన ఫిస్టియా నీటిమొక్కలతో నిండింది. చెరువు మొత్తం ఆవరించడంతో నీరు కనపడక పచ్చటి మైదానాన్ని తలపిస్తోంది. చందానగర్‌ సర్కిల్‌ అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌ గణేష్‌ను వివరణ అడగ్గా.. ఫిస్టియా ఆకు తీసివేసే విషయాన్ని జోన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిత్రంలో పచ్చగడ్డితో క్రికెట్‌ మైదానంలా కనిపిస్తున్న ఆటస్థలం కాదు. చందానగర్‌ భక్షికుంట చెరువు గుర్రపుడెక్కకు చెందిన ఫిస్టియా నీటిమొక్కలతో నిండింది. చెరువు మొత్తం ఆవరించడంతో నీరు కనపడక పచ్చటి మైదానాన్ని తలపిస్తోంది. చందానగర్‌ సర్కిల్‌ అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌ గణేష్‌ను వివరణ అడగ్గా.. ఫిస్టియా ఆకు తీసివేసే విషయాన్ని జోన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
20/25
ఆసక్తి ఉండాలే గాని.. అభిరుచులకు సృజన జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌ వద్ద ఓ ప్రవేశ ద్వారానికి అలంకరణంగా ఇలా సైకిల్‌ను ఏర్పాటు చేయడం ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది. ఆసక్తి ఉండాలే గాని.. అభిరుచులకు సృజన జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌ వద్ద ఓ ప్రవేశ ద్వారానికి అలంకరణంగా ఇలా సైకిల్‌ను ఏర్పాటు చేయడం ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.
21/25
పెంపుడు జంతువుల నుంచి పెంపకందారులకు ఆపద కలగకుండా ఏటా జులై 6న(జూనోసిస్‌ డే) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని పశు వైద్యశాలలో వాటికి టీకాలు వేశారు. పెంపుడు జంతువుల నుంచి పెంపకందారులకు ఆపద కలగకుండా ఏటా జులై 6న(జూనోసిస్‌ డే) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని పశు వైద్యశాలలో వాటికి టీకాలు వేశారు.
22/25
టమాటా చేనులో పనిచేస్తున్న ఈ రైతు మహబూబ్‌నగర్‌కు చెందిన గుడిసె కృష్ణయ్య. సహకరిస్తున్నది ఆయన మనవడు మణికంఠ. కృష్ణయ్యకు ఏడుగురు కుమార్తెలు, నాలుగున్నర ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవించేవారు. ఇప్పటికి అయిదుగురు బిడ్డల పెళ్లిళ్ల కోసం ఒకటిన్నర ఎకరం అమ్మేశారు. మిగతా మూడెకరాల భూమిని కుమార్తెలకు రాసిచ్చారు. ఇప్పుడు అదే పొలంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్నారు. నాలుగేళ్ల కిందట కరవు వల్ల తన ఎడ్లను రూ.60వేలకే తెగనమ్మినట్లు కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ ఖర్చులు భరించలేక కుటుంబసభ్యుల సాయంతో సాగు చేస్తున్నట్లు చెప్పారు. రూ.2800తో పరికరం తయారు చేయించుకుని దాంతో కలుపు తొలగిస్తూ కనిపించారు. టమాటా చేనులో పనిచేస్తున్న ఈ రైతు మహబూబ్‌నగర్‌కు చెందిన గుడిసె కృష్ణయ్య. సహకరిస్తున్నది ఆయన మనవడు మణికంఠ. కృష్ణయ్యకు ఏడుగురు కుమార్తెలు, నాలుగున్నర ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవించేవారు. ఇప్పటికి అయిదుగురు బిడ్డల పెళ్లిళ్ల కోసం ఒకటిన్నర ఎకరం అమ్మేశారు. మిగతా మూడెకరాల భూమిని కుమార్తెలకు రాసిచ్చారు. ఇప్పుడు అదే పొలంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్నారు. నాలుగేళ్ల కిందట కరవు వల్ల తన ఎడ్లను రూ.60వేలకే తెగనమ్మినట్లు కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ ఖర్చులు భరించలేక కుటుంబసభ్యుల సాయంతో సాగు చేస్తున్నట్లు చెప్పారు. రూ.2800తో పరికరం తయారు చేయించుకుని దాంతో కలుపు తొలగిస్తూ కనిపించారు.
23/25
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్‌ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంలో అమ్మవారు ఆశీనులు కాగా వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్‌ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంలో అమ్మవారు ఆశీనులు కాగా వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
24/25
వర్షాకాలం.. వరద పోటుతో పాటు జలాశయాల కట్టలకు రావి మొక్కలతో ప్రమాదం పొంచి ఉంది. ఇవి వేళ్లూనుకుంటే ఎంత గొప్ప నిర్మాణాలైనా బీటలు వారడం ఖాయం. హుస్సేన్‌సాగర్‌ కట్టకు ఏపుగా పెరుగుతున్న వీటిని తొలగించకుంటే ప్రమాదమే. వర్షాకాలం.. వరద పోటుతో పాటు జలాశయాల కట్టలకు రావి మొక్కలతో ప్రమాదం పొంచి ఉంది. ఇవి వేళ్లూనుకుంటే ఎంత గొప్ప నిర్మాణాలైనా బీటలు వారడం ఖాయం. హుస్సేన్‌సాగర్‌ కట్టకు ఏపుగా పెరుగుతున్న వీటిని తొలగించకుంటే ప్రమాదమే.
25/25
అంబర్‌పేట నియోజకవర్గం బతుకమ్మకుంటకు చెందిన పలువురు మహిళలు వీధుల్లో తిరుగుతూ గృహోపకరణాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. శివం రోడ్డులో ఇలా సేదతీరుతున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం బతుకమ్మకుంటకు చెందిన పలువురు మహిళలు వీధుల్లో తిరుగుతూ గృహోపకరణాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. శివం రోడ్డులో ఇలా సేదతీరుతున్నారు.

మరిన్ని