News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 07 Jul 2022 12:08 IST
1/28
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో థయిస్ నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో సినీ నటుడు ఉత్తేజ్‌ దుర్యోధనుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో థయిస్ నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో సినీ నటుడు ఉత్తేజ్‌ దుర్యోధనుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
2/28
3/28
4/28
సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చేపట్టిన ‘సేవ్‌ సాయిల్(మట్టిని రక్షించు)’ కార్యక్రమానికి సంబంధించిన నినాదాన్ని యూఏఈలోని బుర్జ్‌ ఖలీఫాపై లేజర్‌షో ద్వారా ప్రదర్శించారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చేపట్టిన ‘సేవ్‌ సాయిల్(మట్టిని రక్షించు)’ కార్యక్రమానికి సంబంధించిన నినాదాన్ని యూఏఈలోని బుర్జ్‌ ఖలీఫాపై లేజర్‌షో ద్వారా ప్రదర్శించారు.
5/28
6/28
7/28
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాశీలో నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సమాగంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. చిన్నారులు పాడిన పద్యాలు, స్తోత్రాలు, పాటలు, డోలు వాయించిన తీరుకు ఆయన ఫిదా అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాశీలో నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సమాగంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. చిన్నారులు పాడిన పద్యాలు, స్తోత్రాలు, పాటలు, డోలు వాయించిన తీరుకు ఆయన ఫిదా అయ్యారు.
8/28
9/28
ఫొటోల్లో కనిపిస్తున్నవి మక్కాలో ముస్లిం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10లక్షల మంది హజ్‌ యాత్ర కోసం ఇక్కడికి వస్తున్నారు. ఫొటోల్లో కనిపిస్తున్నవి మక్కాలో ముస్లిం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10లక్షల మంది హజ్‌ యాత్ర కోసం ఇక్కడికి వస్తున్నారు.
10/28
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకను శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన కుమార్తె, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విమానాశ్రయంలో పలువురు నాయకులు షర్మిలకు స్వాగతం పలికారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకను శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన కుమార్తె, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విమానాశ్రయంలో పలువురు నాయకులు షర్మిలకు స్వాగతం పలికారు.
11/28
స్పెయిన్‌లోని పాంప్‌లోనాలో ‘బుల్స్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు ఎద్దులతో పోటీ పడుతూ, వాటి నుంచి తప్పించుకుంటూ పరుగెత్తారు. ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. స్పెయిన్‌లోని పాంప్‌లోనాలో ‘బుల్స్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు ఎద్దులతో పోటీ పడుతూ, వాటి నుంచి తప్పించుకుంటూ పరుగెత్తారు. ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
12/28
13/28
14/28
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే గురువారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలోని తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే గురువారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలోని తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
15/28
16/28
నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌లో ఉక్రెయిన్‌ సైనికులు తిరిగి తమ జెండాను పాతారు. ఈ ఐలాండ్‌ గత కొంత కాలంగా రష్యన్‌ బలగాల ఆధీనంలో ఉండటం విశేషం. నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌లో ఉక్రెయిన్‌ సైనికులు తిరిగి తమ జెండాను పాతారు. ఈ ఐలాండ్‌ గత కొంత కాలంగా రష్యన్‌ బలగాల ఆధీనంలో ఉండటం విశేషం.
17/28
తిరుమల అవుటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తాపడింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తిరుమల అవుటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తాపడింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
18/28
బుధవారం జరిగిన వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్‌లో సానియా మీర్జా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుత సీజనే తనకు చివరిదని ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా ‘క్రీడలు శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమతో కూడుకున్నవి. గెలుపోటముల వెనక ఎన్నో నిద్ర లేని రాత్రులుంటాయి. గంటలు, రోజుల కొద్ది కఠోర శ్రమ ఉంటుంది. కానీ మిగతా ఏ ఉద్యోగంలో లేని తృప్తి, సంతోషం ఇందులో లభిస్తుంది. గత 20ఏళ్లుగా ఇక్కడ ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా.. నేను మున్ముందు ఆటను ఎంతో మిస్‌ అవుతా’ అని పోస్టు పెట్టారు. బుధవారం జరిగిన వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్‌లో సానియా మీర్జా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుత సీజనే తనకు చివరిదని ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా ‘క్రీడలు శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమతో కూడుకున్నవి. గెలుపోటముల వెనక ఎన్నో నిద్ర లేని రాత్రులుంటాయి. గంటలు, రోజుల కొద్ది కఠోర శ్రమ ఉంటుంది. కానీ మిగతా ఏ ఉద్యోగంలో లేని తృప్తి, సంతోషం ఇందులో లభిస్తుంది. గత 20ఏళ్లుగా ఇక్కడ ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా.. నేను మున్ముందు ఆటను ఎంతో మిస్‌ అవుతా’ అని పోస్టు పెట్టారు.
19/28
20/28
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. ఛండీగఢ్‌లోని సెక్టార్‌2లో గల సీఎం నివాసంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. ఛండీగఢ్‌లోని సెక్టార్‌2లో గల సీఎం నివాసంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.
21/28
సరూర్‌నగర్‌ చెరువులో చిత్రమిది. కొన్ని సంవత్సరాల క్రితం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు. అధికారులు తూతూ మంత్రంగా ఇంటి కిటికీలు, తలుపులు తొలగించారు. ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది. సరూర్‌నగర్‌ చెరువులో చిత్రమిది. కొన్ని సంవత్సరాల క్రితం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు. అధికారులు తూతూ మంత్రంగా ఇంటి కిటికీలు, తలుపులు తొలగించారు. ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది.
22/28
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లను తయారు చేసే ‘శాఫ్రాన్‌’ సంస్థకు సంబంధించిన ఏరో స్పేస్‌ ఫ్యాక్టరీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లను తయారు చేసే ‘శాఫ్రాన్‌’ సంస్థకు సంబంధించిన ఏరో స్పేస్‌ ఫ్యాక్టరీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
23/28
ఇవాళ టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న బర్త్‌డే బాయ్‌ ధోనీతో ఆయన సతీమణి సాక్షి కేక్‌ కట్‌ చేయించింది.  ఇవాళ టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న బర్త్‌డే బాయ్‌ ధోనీతో ఆయన సతీమణి సాక్షి కేక్‌ కట్‌ చేయించింది.
24/28
రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పీలేరు నియోజకవర్గంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. 
రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పీలేరు నియోజకవర్గంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.
25/28
26/28
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వివాహం చండీగఢ్‌లో జరుగుతోంది. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను ఆయన పెళ్లాడనున్నారు. అత్యంత నిరాడంబరంగా, అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా హాజరయ్యారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సీఎం ఫొటోలను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వివాహం చండీగఢ్‌లో జరుగుతోంది. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను ఆయన పెళ్లాడనున్నారు. అత్యంత నిరాడంబరంగా, అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా హాజరయ్యారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సీఎం ఫొటోలను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.
27/28
28/28
తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.  తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని