News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (30-07-2022)

Updated : 30 Jul 2022 20:26 IST
1/23
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందుకు అవసరమయ్యే జెండాల తయారీలో హైదరాబాద్‌లోని కొన్ని వ్యాపార సంస్థలు నిమగ్నమయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు రావడంతో కాచిగూడలోని ఓ దుకాణంలో కార్మికులు ఇలా నిరంతరాయంగా పనిచేస్తూ కనిపించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందుకు అవసరమయ్యే జెండాల తయారీలో హైదరాబాద్‌లోని కొన్ని వ్యాపార సంస్థలు నిమగ్నమయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు రావడంతో కాచిగూడలోని ఓ దుకాణంలో కార్మికులు ఇలా నిరంతరాయంగా పనిచేస్తూ కనిపించారు.
2/23
3/23
కర్నూలు నగరంలోని ధర్మపేట సమీపంలో కేసీకెనాల్ గట్టుపై బడుగు జీవులు ఇలా ప్రమాకరంగా విద్యుత్‌ స్తంభాలను గూడుగా మార్చుకొని జీవిస్తున్నారు. పైగా స్తంభాలకు తడి బట్టలను ఆరేస్తున్నారు. ఏ మాత్రం షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినా ప్రాణ నష్టం తప్పదు. కర్నూలు నగరంలోని ధర్మపేట సమీపంలో కేసీకెనాల్ గట్టుపై బడుగు జీవులు ఇలా ప్రమాకరంగా విద్యుత్‌ స్తంభాలను గూడుగా మార్చుకొని జీవిస్తున్నారు. పైగా స్తంభాలకు తడి బట్టలను ఆరేస్తున్నారు. ఏ మాత్రం షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినా ప్రాణ నష్టం తప్పదు.
4/23
 హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి బేగంపేట, రసూల్‌పుర, పాట్నీనగర్‌ కాలనీల్లో వరద నీరు ఇలా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి బేగంపేట, రసూల్‌పుర, పాట్నీనగర్‌ కాలనీల్లో వరద నీరు ఇలా నిలిచిపోయింది.
5/23
6/23
హైదరాబాద్‌ సోమాజిగూడలోని విల్లా మేరి కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో అలరిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని విల్లా మేరి కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో అలరిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చారు.
7/23
8/23
కామన్వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ సంకేత్‌ సర్గార్‌ 55 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. క్లీన్‌ అండ్ జెర్క్‌లో 135 కేజీలు, స్నాట్చ్‌లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్ సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ సంకేత్‌ సర్గార్‌ 55 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. క్లీన్‌ అండ్ జెర్క్‌లో 135 కేజీలు, స్నాట్చ్‌లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్ సొంతం చేసుకున్నాడు.
9/23
నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మర్యాదపూర్వకంగా కలిశారు. జయప్రద, ఆమె కుమారుడు సిద్ధార్థ, కోడలు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మర్యాదపూర్వకంగా కలిశారు. జయప్రద, ఆమె కుమారుడు సిద్ధార్థ, కోడలు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
10/23
హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ‘ద బ్రైడల్‌ స్టోరీ’ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి సినీ నటులు ఐశ్వర్య, స్రవంతి చొక్కారపు హాజరయ్యారు. ఎగ్జిబిషన్‌లోని విభిన్న రకాల దుస్తులు, నగలు ధరించారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ‘ద బ్రైడల్‌ స్టోరీ’ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి సినీ నటులు ఐశ్వర్య, స్రవంతి చొక్కారపు హాజరయ్యారు. ఎగ్జిబిషన్‌లోని విభిన్న రకాల దుస్తులు, నగలు ధరించారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
11/23
12/23
 కరీంనగర్‌లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధులు జలమయం అయ్యాయి. సిరిసిల్ల ప్రధాన రహదారి రాంనగర్‌ వద్ద వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్‌లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధులు జలమయం అయ్యాయి. సిరిసిల్ల ప్రధాన రహదారి రాంనగర్‌ వద్ద వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
13/23
14/23
15/23
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. గదులకు చేరుకునేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి.  తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. గదులకు చేరుకునేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి.
16/23
17/23
వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొనేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వద్దకు అత్యధిక మంది ఫొటో గ్రాఫర్లు తరలివచ్చి తమ కెమెరాలను క్లిక్‌మనిపించారు. పర్యాటకశాఖ మంత్రి రోజా ఈ కార్యక్రమానికి హాజరై వారిని ఉత్సాహపరిచారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొనేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వద్దకు అత్యధిక మంది ఫొటో గ్రాఫర్లు తరలివచ్చి తమ కెమెరాలను క్లిక్‌మనిపించారు. పర్యాటకశాఖ మంత్రి రోజా ఈ కార్యక్రమానికి హాజరై వారిని ఉత్సాహపరిచారు.
18/23
19/23
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉచితంగా కొవిడ్‌ బూస్టర్‌ డోసులు ఇస్తున్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీకాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి చేరామని ఆయన అన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉచితంగా కొవిడ్‌ బూస్టర్‌ డోసులు ఇస్తున్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీకాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి చేరామని ఆయన అన్నారు.
20/23
అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ఆ మాట తప్పారని తిరుపతిలోని గాంధీ కూడలి వద్ద తెదేపా మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ఆ మాట తప్పారని తిరుపతిలోని గాంధీ కూడలి వద్ద తెదేపా మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
21/23
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఈవీ&డీఎం విశ్వజిత్‌ కంపాటి కలిసి సైబరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(సీడీఆర్‌ఎఫ్‌)ను ప్రారంభించారు.  అనంతరం విపత్తు నిర్వహణ సామగ్రిని సిబ్బందికి అందజేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఈవీ&డీఎం విశ్వజిత్‌ కంపాటి కలిసి సైబరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(సీడీఆర్‌ఎఫ్‌)ను ప్రారంభించారు. అనంతరం విపత్తు నిర్వహణ సామగ్రిని సిబ్బందికి అందజేశారు.
22/23
శ్రావణ మాసం సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
23/23

మరిన్ని