News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (31-07-2022)

Published : 31 Jul 2022 11:15 IST
1/31
ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో శ్రావణమాసంలో వెదురు కర్రలపై నడుస్తూ చిన్నారులు సందడి చేస్తుంటారు. గోండి భాషలో ‘ఖోడంగ్‌’ గా పిలిచే వీటిపై నడవడం గూడేల్లో సంప్రదాయంగా వస్తోంది. ఇలా నడవడం వల్ల అంటు రోగాలు రావని గిరిజనుల నమ్మకం. ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో శ్రావణమాసంలో వెదురు కర్రలపై నడుస్తూ చిన్నారులు సందడి చేస్తుంటారు. గోండి భాషలో ‘ఖోడంగ్‌’ గా పిలిచే వీటిపై నడవడం గూడేల్లో సంప్రదాయంగా వస్తోంది. ఇలా నడవడం వల్ల అంటు రోగాలు రావని గిరిజనుల నమ్మకం.
2/31
ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.. రెండు వారాల కిందట భారీవర్షాలతో పాటు అప్పుడప్పుడు జల్లులు పడుతున్నాయి.. దీంతో చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామం చెరువు ఇలా పొంగి పొర్లుతోంది. ఈ దృశ్యం జలపాతం మాదిరిగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.. రెండు వారాల కిందట భారీవర్షాలతో పాటు అప్పుడప్పుడు జల్లులు పడుతున్నాయి.. దీంతో చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామం చెరువు ఇలా పొంగి పొర్లుతోంది. ఈ దృశ్యం జలపాతం మాదిరిగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
3/31
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం ధర్మారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఆయన వాహనం దిగి అక్కడికి వెళ్లారు. స్వయంగా జంబు కొట్టారు. కొద్దిసేపు కూలీలతో పాటు వరి నాటు వేశారు. ఎరువులు చల్లారు. 

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం ధర్మారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఆయన వాహనం దిగి అక్కడికి వెళ్లారు. స్వయంగా జంబు కొట్టారు. కొద్దిసేపు కూలీలతో పాటు వరి నాటు వేశారు. ఎరువులు చల్లారు.
4/31
మహబూబ్‌నగర్‌ పురపాలికలో విలీనమైన ఎదిరలోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం పైకప్పు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వైద్య సిబ్బంది, చికిత్స కోసం వచ్చే రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు చేపట్టాలని ఎంపీపీ సుధాశ్రీ కోరారు. మహబూబ్‌నగర్‌ పురపాలికలో విలీనమైన ఎదిరలోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం పైకప్పు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వైద్య సిబ్బంది, చికిత్స కోసం వచ్చే రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు చేపట్టాలని ఎంపీపీ సుధాశ్రీ కోరారు.
5/31
6/31
చిత్రం చూడండి.. ఇది చెరువులా కనిపిస్తోంది కదూ. కానీ ఇవన్నీ పంట పొలాలే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు నిండింది. పూర్తిస్థాయిలో నిండి మిగులు జలాలు గుండారెడ్డిపల్లి సాగు భూముల్లోకి చేరాయి. దీంతో పొలాలన్నీ చెరువులా కనిపిస్తోంది. భారీ వర్షాలు పడుతుండటంతో గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి 30 ఎకరాలలో సాగు చేయలేక రైతులు అవస్థలు పడ్డారు. చిత్రం చూడండి.. ఇది చెరువులా కనిపిస్తోంది కదూ. కానీ ఇవన్నీ పంట పొలాలే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు నిండింది. పూర్తిస్థాయిలో నిండి మిగులు జలాలు గుండారెడ్డిపల్లి సాగు భూముల్లోకి చేరాయి. దీంతో పొలాలన్నీ చెరువులా కనిపిస్తోంది. భారీ వర్షాలు పడుతుండటంతో గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి 30 ఎకరాలలో సాగు చేయలేక రైతులు అవస్థలు పడ్డారు.
7/31
ఒక్క కొత్త వరి వంగడం రూపొందించాలంటే సుమారు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. సఫలం కావొచ్చు.. విఫలం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. విత్తు నుంచి మొదలు కోత, నూర్పిడి వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రెండు రకాలతో సంకర పరిచిన మూడు, నాలుగు రకాల కొత్త వరి వంగడాలను తయారు చేసి పంట పొలంలో ఇలా నాటారు. నాటిన కొత్త రకాల వంగడాలను గుర్తించేందుకు పంట మధ్యలో ఇలా కర్రలు నాటి వాటికి నెంబర్లను అతికించి ఇలా గుర్తింపు చిహ్నాలు పెట్టారు. పంట ఎదిగాక ఒక్క గింజ కూడా అటు ఇటు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మూడు నాలుగేళ్లు పరిశోధనలు చేస్తేనే ఒక వంగడాన్ని సృష్టించగలమని చెప్పారు. ఒక్క కొత్త వరి వంగడం రూపొందించాలంటే సుమారు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. సఫలం కావొచ్చు.. విఫలం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. విత్తు నుంచి మొదలు కోత, నూర్పిడి వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రెండు రకాలతో సంకర పరిచిన మూడు, నాలుగు రకాల కొత్త వరి వంగడాలను తయారు చేసి పంట పొలంలో ఇలా నాటారు. నాటిన కొత్త రకాల వంగడాలను గుర్తించేందుకు పంట మధ్యలో ఇలా కర్రలు నాటి వాటికి నెంబర్లను అతికించి ఇలా గుర్తింపు చిహ్నాలు పెట్టారు. పంట ఎదిగాక ఒక్క గింజ కూడా అటు ఇటు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మూడు నాలుగేళ్లు పరిశోధనలు చేస్తేనే ఒక వంగడాన్ని సృష్టించగలమని చెప్పారు.
8/31
9/31
కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడిని తీర్చిదిద్దామంటున్న పాలకుల ప్రగల్భాలకు గట్టి సవాలు విసురుతోంది జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె ప్రాథమిక పాఠశాల. గత మూడేళ్లుగా సొంత భవనం లేక రాజీవ్‌నగర్‌ కాలనీలోని ఓ అద్దె ఇంటిలో నడుస్తున్న ఈ పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. 


కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడిని తీర్చిదిద్దామంటున్న పాలకుల ప్రగల్భాలకు గట్టి సవాలు విసురుతోంది జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె ప్రాథమిక పాఠశాల. గత మూడేళ్లుగా సొంత భవనం లేక రాజీవ్‌నగర్‌ కాలనీలోని ఓ అద్దె ఇంటిలో నడుస్తున్న ఈ పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు.
10/31
11/31
12/31
ఇదేంటి దిమ్మెలకు ఇనుప సంకెళ్లతో ఇలా కట్టి పడేశారు అనుకుంటున్నారా.. నిజమే దీనికో కారణం ఉంది. ఒంగోలు నుంచి మద్దిపాడు వెళ్లే జాతీయ రహదారిపై దొడ్డవరప్పాడు గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాలు అన్నీ ఈ దిమ్మెలు వేసిన ప్రదేశం నుంచి యూ టర్న్‌ తీసుకుని వెళ్లేవి. ఈ మధ్య ప్రమాదాలు జరిగి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో రహదారి భద్రత అధికారులు దొడ్డవరప్పాడు నుంచి వాహనాలు జాతీయరహదారి పైకి రాకుండా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.  ఇదేంటి దిమ్మెలకు ఇనుప సంకెళ్లతో ఇలా కట్టి పడేశారు అనుకుంటున్నారా.. నిజమే దీనికో కారణం ఉంది. ఒంగోలు నుంచి మద్దిపాడు వెళ్లే జాతీయ రహదారిపై దొడ్డవరప్పాడు గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాలు అన్నీ ఈ దిమ్మెలు వేసిన ప్రదేశం నుంచి యూ టర్న్‌ తీసుకుని వెళ్లేవి. ఈ మధ్య ప్రమాదాలు జరిగి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో రహదారి భద్రత అధికారులు దొడ్డవరప్పాడు నుంచి వాహనాలు జాతీయరహదారి పైకి రాకుండా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
13/31
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి కల్లూరి రామకృష్ణపరమహంస జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. వర్షం వస్తే ఆ ప్రాంగణం అంతా బురదగా మారుతోంది. బురదలో ఇటుకలు పేర్చుకుని కాలిబాటతో వారంతా తరగతి గదుల్లోకి వెళ్లాల్సిన దుస్థితి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి కల్లూరి రామకృష్ణపరమహంస జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. వర్షం వస్తే ఆ ప్రాంగణం అంతా బురదగా మారుతోంది. బురదలో ఇటుకలు పేర్చుకుని కాలిబాటతో వారంతా తరగతి గదుల్లోకి వెళ్లాల్సిన దుస్థితి.
14/31
అమరావతి రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మూడేళ్లుగా సామగ్రి ముళ్లకంపల మధ్య, మట్టి కొట్టుకుపోతున్నాయి. కొన్నిచోట్ల పైపులు భారీ ఎత్తున నిల్వలు ఉంచారు. అవి పక్కనే ఉన్న కాలువలో జారి పాడవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కోసం ఉంచిన భారీ తూములపై ఉన్న పెయింటింగు పొరలు పొరలుగా ఊడిపోతోంది. తుప్పుపట్టే అవకాశం ఉంది. ఇంకొన్నిచోట్ల ముళ్లకంపల మధ్య పాడయిపోతున్నాయి. రోడ్లు కనిపించనంతగా కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. ఇది చూసిన వారు అయ్యో అనకుండా ఉండలేరు. అమరావతి రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మూడేళ్లుగా సామగ్రి ముళ్లకంపల మధ్య, మట్టి కొట్టుకుపోతున్నాయి. కొన్నిచోట్ల పైపులు భారీ ఎత్తున నిల్వలు ఉంచారు. అవి పక్కనే ఉన్న కాలువలో జారి పాడవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కోసం ఉంచిన భారీ తూములపై ఉన్న పెయింటింగు పొరలు పొరలుగా ఊడిపోతోంది. తుప్పుపట్టే అవకాశం ఉంది. ఇంకొన్నిచోట్ల ముళ్లకంపల మధ్య పాడయిపోతున్నాయి. రోడ్లు కనిపించనంతగా కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. ఇది చూసిన వారు అయ్యో అనకుండా ఉండలేరు.
15/31
రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన కర్నూలు నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాల నేడు పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఇక్కడ చదువుకున్న శరత్‌చంద్రారెడ్డి, ఐఆర్‌ కృష్ణారావు, సత్యనారాయణ వంటివారు ఐఏఎస్‌లు అయ్యారు. పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలకు గుర్తుగా వసతిగృహ మార్గానికి 3 స్టార్‌ బ్లాక్‌ అని నామకరణం చేశారు. ఇంతటి ఘనత ఉన్న కళాశాల నిర్వహణ కరవవడంతో అధ్వానంగా మారుతోంది. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన కర్నూలు నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాల నేడు పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఇక్కడ చదువుకున్న శరత్‌చంద్రారెడ్డి, ఐఆర్‌ కృష్ణారావు, సత్యనారాయణ వంటివారు ఐఏఎస్‌లు అయ్యారు. పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలకు గుర్తుగా వసతిగృహ మార్గానికి 3 స్టార్‌ బ్లాక్‌ అని నామకరణం చేశారు. ఇంతటి ఘనత ఉన్న కళాశాల నిర్వహణ కరవవడంతో అధ్వానంగా మారుతోంది.
16/31
17/31
18/31
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దువ్వూరు మండలం, ఏకోపల్లి సమీపంలో రాయలసీయ ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు రాగానే వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకొస్తామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దువ్వూరు మండలం, ఏకోపల్లి సమీపంలో రాయలసీయ ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు రాగానే వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకొస్తామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు.
19/31
20/31
21/31
రహదారిపై ప్రయాణిస్తుంటే పక్కన రైలు వెళ్తున్నట్లుంది కదూ..! నిజానికి ఇవి ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన కంటెయినర్‌ ఇళ్లు, కార్యాలయాలు. అడిగిన కొలతలతో ఐరన్‌ షీట్స్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌తో తయారు చేసి ఇచ్చే ఓ కంపెనీ కొన్ని నమూనా ఇళ్లను సిద్ధం చేసింది. వరంగల్‌ వెళ్లే మార్గంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత ఇలా కనిపించాయి. రహదారిపై ప్రయాణిస్తుంటే పక్కన రైలు వెళ్తున్నట్లుంది కదూ..! నిజానికి ఇవి ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన కంటెయినర్‌ ఇళ్లు, కార్యాలయాలు. అడిగిన కొలతలతో ఐరన్‌ షీట్స్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌తో తయారు చేసి ఇచ్చే ఓ కంపెనీ కొన్ని నమూనా ఇళ్లను సిద్ధం చేసింది. వరంగల్‌ వెళ్లే మార్గంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత ఇలా కనిపించాయి.
22/31
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించిన తాగునీటి పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఇత్తడి బిందె అదృశ్యమైంది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ప్రతిరోజు తాగునీటి సరఫరాను అందించే కార్యక్రమానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఈ ఏడాది మార్చి 17న కేటీఆర్‌ ఆవిష్కరించారు. రెండు అరచేతుల నుంచి నీరు కిందకు వదిలేలా ఉన్న ఎత్తైన ప్రతిమ దిగువన నీటి చుక్కలు పడేందుకు వీలుగా పెద్ద ఇత్తడి బిందెను పెట్టారు. దీన్ని బోల్టులతో బిగించారు. ఇది రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయమై కార్పొరేషన్‌ ఏఈ వాణిని సంప్రదించగా.. బిందె మాయమైన విషయమై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించిన తాగునీటి పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఇత్తడి బిందె అదృశ్యమైంది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ప్రతిరోజు తాగునీటి సరఫరాను అందించే కార్యక్రమానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఈ ఏడాది మార్చి 17న కేటీఆర్‌ ఆవిష్కరించారు. రెండు అరచేతుల నుంచి నీరు కిందకు వదిలేలా ఉన్న ఎత్తైన ప్రతిమ దిగువన నీటి చుక్కలు పడేందుకు వీలుగా పెద్ద ఇత్తడి బిందెను పెట్టారు. దీన్ని బోల్టులతో బిగించారు. ఇది రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయమై కార్పొరేషన్‌ ఏఈ వాణిని సంప్రదించగా.. బిందె మాయమైన విషయమై విచారణ జరిపిస్తామన్నారు.
23/31
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
24/31
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధన కొరత ఏర్పడటం, సొంత వాహనాల్లోనే వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడి ప్రజలు రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శనివారం కొలంబోలోని ఓ రైల్వేస్టేషన్ ఇలా కిక్కిరిసిపోయింది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధన కొరత ఏర్పడటం, సొంత వాహనాల్లోనే వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడి ప్రజలు రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శనివారం కొలంబోలోని ఓ రైల్వేస్టేషన్ ఇలా కిక్కిరిసిపోయింది.
25/31
ఖర్కివ్‌ ప్రాంతంలో యుద్ధ కవరేజీకి వెళ్లి.. శుక్రవారం రష్యా దళాలు జరిపిన బాంబు దాడితో గోధుమ పొలంలో నుంచి పరుగు తీస్తున్న ఫొటో జర్నలిస్టు ఎవ్‌గెనియ్‌ మలొలెట్కా
ఖర్కివ్‌ ప్రాంతంలో యుద్ధ కవరేజీకి వెళ్లి.. శుక్రవారం రష్యా దళాలు జరిపిన బాంబు దాడితో గోధుమ పొలంలో నుంచి పరుగు తీస్తున్న ఫొటో జర్నలిస్టు ఎవ్‌గెనియ్‌ మలొలెట్కా
26/31
రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్ల నిర్వహణ, పర్యవేక్షణ లేక ధ్వంసమైపోతున్నాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రహదారులు పాడైపోతున్నాయి. నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపే రోడ్డు భారీగా బీటలు వారి డ్రైనేజీ కాలువలోకి ఒరిగిపోతోంది. పట్టించుకునేవారే కరవయ్యారు. రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్ల నిర్వహణ, పర్యవేక్షణ లేక ధ్వంసమైపోతున్నాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రహదారులు పాడైపోతున్నాయి. నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపే రోడ్డు భారీగా బీటలు వారి డ్రైనేజీ కాలువలోకి ఒరిగిపోతోంది. పట్టించుకునేవారే కరవయ్యారు.
27/31
28/31
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణం మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశారు. 1.50 క్వింటాళ్లను అనంతపురంలో విక్రయించేందుకు గురువారం వాహనంలో తరలించారు. మంచి ధర పలుకుతుందని రెండు రోజుల పాటు ఎదురు చూశారు. ఒక్కో ట్రే (15 కిలోల బాక్సు) రూ.40లోపే పలికింది. రవాణా ఖర్చులు సైతం దక్కక పోవడంతో శుక్రవారం అక్కంపల్లి సమీపంలో రోడ్డు పక్కన పారబోశారు. చుట్టుపక్కల పని చేసే కూలీలు, స్థానికులు వాటిని తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణం మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశారు. 1.50 క్వింటాళ్లను అనంతపురంలో విక్రయించేందుకు గురువారం వాహనంలో తరలించారు. మంచి ధర పలుకుతుందని రెండు రోజుల పాటు ఎదురు చూశారు. ఒక్కో ట్రే (15 కిలోల బాక్సు) రూ.40లోపే పలికింది. రవాణా ఖర్చులు సైతం దక్కక పోవడంతో శుక్రవారం అక్కంపల్లి సమీపంలో రోడ్డు పక్కన పారబోశారు. చుట్టుపక్కల పని చేసే కూలీలు, స్థానికులు వాటిని తీసుకెళ్లారు.
29/31
చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రచారం నిమిత్తం ఓ హోటల్‌ నిర్వాహకుడు ఇనియవన్‌ 44 కిలోల ‘తంబి’ ఇడ్లీని తయారు చేశారు. శనివారం సాయంత్రం బీచ్‌లో దీనిని ప్రదర్శించారు. తర్వాత మెరీనాలోని ‘నమ్మ సెల్ఫీ’ స్పాట్లో ఉంచారు. దీని గురించి ఇనియవన్‌ మాట్ల్లాడుతూ.. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన పెంచేలా చెస్‌ క్రీడా చిహ్నమైన అశ్వం ఆకారంలో 44 కిలోల తంబి ఇడ్లీని తయారుచేసినట్లు చెప్పారు. ఇడ్లీ పిండితో చిరుధాన్యాలను కలిపినట్లు తెలిపారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రచారం నిమిత్తం ఓ హోటల్‌ నిర్వాహకుడు ఇనియవన్‌ 44 కిలోల ‘తంబి’ ఇడ్లీని తయారు చేశారు. శనివారం సాయంత్రం బీచ్‌లో దీనిని ప్రదర్శించారు. తర్వాత మెరీనాలోని ‘నమ్మ సెల్ఫీ’ స్పాట్లో ఉంచారు. దీని గురించి ఇనియవన్‌ మాట్ల్లాడుతూ.. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన పెంచేలా చెస్‌ క్రీడా చిహ్నమైన అశ్వం ఆకారంలో 44 కిలోల తంబి ఇడ్లీని తయారుచేసినట్లు చెప్పారు. ఇడ్లీ పిండితో చిరుధాన్యాలను కలిపినట్లు తెలిపారు.
30/31
పెళ్లంటేనే ఇల్లంతా సందడి. వధువు, వరుడి ఇళ్లను రంగులు వేసి, తోరణాలు కట్టి సిద్ధం చేస్తారు. ముహూర్తానికి వారం ముందుగానే ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి వరద వీటన్నింటినీ దూరం చేసింది. ఘనంగా తన కుమార్తెకు వివాహం చేయాలని ఆశించిన ఆ తండ్రికి వేదనే మిగిలింది. కూనవరం మండల కేంద్రానికి చెందిన కాలేపు చిన్నా చిరువ్యాపారి. ఏలూరుకు చెందిన యువకుడితో పెద్ద కుమార్తెకు ఆగస్టు 3న తన ఇంటి వద్ద వివాహం జరపాలని నెల క్రితం నిశ్చయించారు. ఇంతలో గోదావరి వరదతో ఆయన ఇల్లు మునిగిపోయింది. కట్టుబట్టలతో చిన్నా కుటుంబసభ్యులు పునరావాస కేంద్రానికి వెళ్లారు. ప్రస్తుతం వరద తగ్గినా ఇల్లంతా బురదమయమైంది. దాన్ని శుభ్రం చేసేందుకూ సమయం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఏలూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆగస్టు 3న అక్కడి నుంచి వరుడి ఇంటికి వెళ్లి వివాహం జరపనున్నారు. పెళ్లంటేనే ఇల్లంతా సందడి. వధువు, వరుడి ఇళ్లను రంగులు వేసి, తోరణాలు కట్టి సిద్ధం చేస్తారు. ముహూర్తానికి వారం ముందుగానే ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి వరద వీటన్నింటినీ దూరం చేసింది. ఘనంగా తన కుమార్తెకు వివాహం చేయాలని ఆశించిన ఆ తండ్రికి వేదనే మిగిలింది. కూనవరం మండల కేంద్రానికి చెందిన కాలేపు చిన్నా చిరువ్యాపారి. ఏలూరుకు చెందిన యువకుడితో పెద్ద కుమార్తెకు ఆగస్టు 3న తన ఇంటి వద్ద వివాహం జరపాలని నెల క్రితం నిశ్చయించారు. ఇంతలో గోదావరి వరదతో ఆయన ఇల్లు మునిగిపోయింది. కట్టుబట్టలతో చిన్నా కుటుంబసభ్యులు పునరావాస కేంద్రానికి వెళ్లారు. ప్రస్తుతం వరద తగ్గినా ఇల్లంతా బురదమయమైంది. దాన్ని శుభ్రం చేసేందుకూ సమయం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఏలూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆగస్టు 3న అక్కడి నుంచి వరుడి ఇంటికి వెళ్లి వివాహం జరపనున్నారు.
31/31

మరిన్ని

ap-districts
ts-districts