News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (01-08-2022)

Updated : 01 Aug 2022 11:48 IST
1/38
ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయి. మన కళ్లని మనమే నమ్మలేనంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అడ్డాకుల మండలం కాటవరం శివారులో జాతీయ రహదారి పక్కన వేపచెట్టు కాండంపై మర్రి మొక్క మొలిచింది. మర్రి మొక్క వేపచెట్టు కాండాన్ని ఆసరా చేసుకుని వేర్లను భూమి వరకు విస్తరించింది. మొక్క పైకి పాకుతూ వెళ్లి వేపచెట్టు ఆకుల్లో కలిసిపోయింది. వింతగా కనిపిస్తున్న ఈ చెట్లను రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయి. మన కళ్లని మనమే నమ్మలేనంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అడ్డాకుల మండలం కాటవరం శివారులో జాతీయ రహదారి పక్కన వేపచెట్టు కాండంపై మర్రి మొక్క మొలిచింది. మర్రి మొక్క వేపచెట్టు కాండాన్ని ఆసరా చేసుకుని వేర్లను భూమి వరకు విస్తరించింది. మొక్క పైకి పాకుతూ వెళ్లి వేపచెట్టు ఆకుల్లో కలిసిపోయింది. వింతగా కనిపిస్తున్న ఈ చెట్లను రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
2/38
అలీసాగర్‌ జలాశయం గేట్లు మూసివేయడంతో కింది భాగంలో నిలిచిన నిల్వ నీటిలో స్థానిక యువకులు ఆదివారం చేపల వేట కొనసాగించారు. ఠాణాకలాన్‌కు చెందిన పలువురు గ్రామస్థులకు 20 కిలోల బొచ్చ చేపలు చిక్కడంతో వారు మురిసిపోయారు. చేపలతో చరవాణిలో చిత్రాలు తీసుకొన్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున జలాశయం నుంచి భారీ చేపలు బయటకు వచ్చాయి. అలీసాగర్‌ జలాశయం గేట్లు మూసివేయడంతో కింది భాగంలో నిలిచిన నిల్వ నీటిలో స్థానిక యువకులు ఆదివారం చేపల వేట కొనసాగించారు. ఠాణాకలాన్‌కు చెందిన పలువురు గ్రామస్థులకు 20 కిలోల బొచ్చ చేపలు చిక్కడంతో వారు మురిసిపోయారు. చేపలతో చరవాణిలో చిత్రాలు తీసుకొన్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున జలాశయం నుంచి భారీ చేపలు బయటకు వచ్చాయి.
3/38
ఖండాంతరాలు దాటిన ప్రేమ ఓరుగల్లు వేదికగా వివాహంతో ఒక్కటైంది. కాజీపేటకు చెందిన పుట్ట మోహన్‌రెడ్డి-అనిత దంపతుల కుమారుడు అరవింద్‌రెడ్డి అమెరికాలోని అబాన్‌ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో వైద్యకోర్సు అభ్యసిస్తున్న అమెరికాకు చెందిన డా.జెన్నాబ్లోమర్‌ పరిచయమై ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించి భీమారంలోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో వివాహం జరిపించారు. ఖండాంతరాలు దాటిన ప్రేమ ఓరుగల్లు వేదికగా వివాహంతో ఒక్కటైంది. కాజీపేటకు చెందిన పుట్ట మోహన్‌రెడ్డి-అనిత దంపతుల కుమారుడు అరవింద్‌రెడ్డి అమెరికాలోని అబాన్‌ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో వైద్యకోర్సు అభ్యసిస్తున్న అమెరికాకు చెందిన డా.జెన్నాబ్లోమర్‌ పరిచయమై ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించి భీమారంలోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో వివాహం జరిపించారు.
4/38
పచ్చదనం కనులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ హరితం ప్రతిబింబమైతే కనులకు విందే. ఇటీవల కురిసిన వర్షాలతో మోడువారిన చెట్లన్నీ పచ్చగా మారాయి. ఎండిపోయిన నీటి కుంటలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. మంచిర్యాలలో గాంధారివనంలో ఉన్న కుంట సైతం నీటితో కళకళలాడుతోంది. చుట్టూ ఇలా చెట్లు ఉండటం, వాటి ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఉదయం వ్యాయామం చేసేందుకు వచ్చే సాధకులను ఈ దృశ్యం కట్టిపడేస్తోంది. పచ్చదనం కనులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ హరితం ప్రతిబింబమైతే కనులకు విందే. ఇటీవల కురిసిన వర్షాలతో మోడువారిన చెట్లన్నీ పచ్చగా మారాయి. ఎండిపోయిన నీటి కుంటలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. మంచిర్యాలలో గాంధారివనంలో ఉన్న కుంట సైతం నీటితో కళకళలాడుతోంది. చుట్టూ ఇలా చెట్లు ఉండటం, వాటి ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఉదయం వ్యాయామం చేసేందుకు వచ్చే సాధకులను ఈ దృశ్యం కట్టిపడేస్తోంది.
5/38
సింగరేణి కాలరీస్‌ కంపెనీలో ముఖ్య సంచాలకుల్లో ఒకరైన డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌ ప్రకృతి ప్రేమికుడు. సింగరేణి ఆధ్వర్యంలో జరిగే మొక్కల పెంపకం కార్యక్రమంలో తరచుగా పాల్గొంటుంటారు. గత మూడేళ్లుగా సుమారు 14 వేల మొక్కలను సంస్థకు సంబంధించిన వివిధ ప్రదేశాల్లో నాటి రికార్డు సృష్టించారు. తాజాగా ఆదివారం ఎస్టీపీపీలోని ఎకరం విస్తీర్ణంలో మరో డైరెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి 506 మొక్కలను తానే స్వయంగా నాటారు.   సింగరేణి కాలరీస్‌ కంపెనీలో ముఖ్య సంచాలకుల్లో ఒకరైన డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌ ప్రకృతి ప్రేమికుడు. సింగరేణి ఆధ్వర్యంలో జరిగే మొక్కల పెంపకం కార్యక్రమంలో తరచుగా పాల్గొంటుంటారు. గత మూడేళ్లుగా సుమారు 14 వేల మొక్కలను సంస్థకు సంబంధించిన వివిధ ప్రదేశాల్లో నాటి రికార్డు సృష్టించారు. తాజాగా ఆదివారం ఎస్టీపీపీలోని ఎకరం విస్తీర్ణంలో మరో డైరెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి 506 మొక్కలను తానే స్వయంగా నాటారు.
6/38
ఈ చిత్రంలో మత్స్యకారుడు తెప్పపై నుంచి చేపలు పడుతోంది.. చెరువులోనో లేదా కుంటలోనే అనుకుంటే పొరబడినట్లే. మొన్నటి వరకు ఏటా రెండు పంటలు పండిన కడెం నది ఒడ్డున ఉన్న పాండ్వాపూర్‌ రైతుల పొలాలు అవి. ఈ చిత్రంలో మత్స్యకారుడు తెప్పపై నుంచి చేపలు పడుతోంది.. చెరువులోనో లేదా కుంటలోనే అనుకుంటే పొరబడినట్లే. మొన్నటి వరకు ఏటా రెండు పంటలు పండిన కడెం నది ఒడ్డున ఉన్న పాండ్వాపూర్‌ రైతుల పొలాలు అవి.
7/38
వర్షం వస్తే ఖానాపూర్‌ చెరువు చుట్టూ ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. భారీ వర్షాలు వస్తే సమీపంలోని ప్రజలు భయపడుతూ ఎప్పుడు నీరొచ్చి ముంచుతుందోనని దిగులు చెందుతారు. చెరువు కట్టపై ఆక్రమణలు ఉన్నాయంటున్నా, వీటిలో చాలా వరకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. మొదట్లోనే ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపలేకపోయారు. ప్రస్తుతం భారీ వర్షాలు వస్తే ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే ఖానాపూర్‌ చెరువు చుట్టూ ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. భారీ వర్షాలు వస్తే సమీపంలోని ప్రజలు భయపడుతూ ఎప్పుడు నీరొచ్చి ముంచుతుందోనని దిగులు చెందుతారు. చెరువు కట్టపై ఆక్రమణలు ఉన్నాయంటున్నా, వీటిలో చాలా వరకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. మొదట్లోనే ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపలేకపోయారు. ప్రస్తుతం భారీ వర్షాలు వస్తే ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొంది.
8/38
మసక చీకటిలో.. సముద్ర తీరంలో కూర్చుని.. మంద్రమైన సంగీతం వింటూ.. ఇష్టమైన ఆహారం తింటూ ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభూతిని విశాఖ వాసులకు అందించేలా  మొబైల్‌ రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూరప్‌ దేశాలకు పరిమితమైన రెస్టారెంట్‌ను ఆర్కే బీచ్‌ రోడ్డు వై.ఎం.సి.ఎ. ఆవరణలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు నాగచంద్ర తెలిపారు.  మసక చీకటిలో.. సముద్ర తీరంలో కూర్చుని.. మంద్రమైన సంగీతం వింటూ.. ఇష్టమైన ఆహారం తింటూ ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభూతిని విశాఖ వాసులకు అందించేలా మొబైల్‌ రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూరప్‌ దేశాలకు పరిమితమైన రెస్టారెంట్‌ను ఆర్కే బీచ్‌ రోడ్డు వై.ఎం.సి.ఎ. ఆవరణలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు నాగచంద్ర తెలిపారు.
9/38
10/38
మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నగరంలోని మార్వాడీలంతా కాషాయ వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై యాత్ర సాగుతున్న దృశ్యం. మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నగరంలోని మార్వాడీలంతా కాషాయ వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై యాత్ర సాగుతున్న దృశ్యం.
11/38
సామర్లకోట - పిఠాపురం రోడ్డులో రెండేళ్లుగా ఏలేరు చిన్న వంతెన పనులు జరుగుతున్నాయి. ఈ పనులు సకాలంలో పూర్తికాక నిత్యం ప్రయాణికులకు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. తాత్కాలిక రోడ్డు వర్షాకాలంలో వరద నీటికి కొట్టుకుపోతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. సామర్లకోట - పిఠాపురం రోడ్డులో రెండేళ్లుగా ఏలేరు చిన్న వంతెన పనులు జరుగుతున్నాయి. ఈ పనులు సకాలంలో పూర్తికాక నిత్యం ప్రయాణికులకు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. తాత్కాలిక రోడ్డు వర్షాకాలంలో వరద నీటికి కొట్టుకుపోతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే హడలిపోతున్నారు.
12/38
ఇది కాలువ కాదు.. దివాన్‌చెరువు- శ్రీరాంపురం ప్రధాన రహదారి. ఈ గ్రామాల మధ్య రహదారి విస్తరణ పనులు నెలల కొద్దీ కొనసాగుతున్నాయి. రహదారి విస్తరణ నిమ్తితం గోడలు, అరుగులు తొలగించారు.  ఈ నేపథ్యంలో వర్షం కురిస్తే చాలు గోతులేవో, రోడ్డు ఏదో తెలియని పరిస్థితి. ఆదివారం ముంపునీటిలో వెళ్తున్న ఒక ఆటో గోతిలో పక్కకు ఒరిగి పోయింది. మరో ఆటోను రప్పించి ఇందులో సామగ్రిని అందులోకి మార్చి, ఎలాగో ముంపు నీటి నుంచి బయట పడ్డారు.  ఇది కాలువ కాదు.. దివాన్‌చెరువు- శ్రీరాంపురం ప్రధాన రహదారి. ఈ గ్రామాల మధ్య రహదారి విస్తరణ పనులు నెలల కొద్దీ కొనసాగుతున్నాయి. రహదారి విస్తరణ నిమ్తితం గోడలు, అరుగులు తొలగించారు. ఈ నేపథ్యంలో వర్షం కురిస్తే చాలు గోతులేవో, రోడ్డు ఏదో తెలియని పరిస్థితి. ఆదివారం ముంపునీటిలో వెళ్తున్న ఒక ఆటో గోతిలో పక్కకు ఒరిగి పోయింది. మరో ఆటోను రప్పించి ఇందులో సామగ్రిని అందులోకి మార్చి, ఎలాగో ముంపు నీటి నుంచి బయట పడ్డారు.
13/38
ఆత్రేయపురం మండలం ఉచ్చిలికి చెందిన భూపతిరాజు వెంకట సత్య సుబ్బరాజు తన చేలో వేసిన ‘ప్రేయింగ్‌ హేండ్స్‌’ అనే కొత్త రకం అరటి అందరినీ అబ్బురపరుస్తోంది. సాధారణంగా తెల్ల, ఎర్ర చక్రకేళీ, కర్పూర, కూర అరటి వంటి రకాలు మనకు తెలిసినవే. ప్రేయింగ్‌ హేండ్స్‌ రకం ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తోంది. దీని అత్తాలు అతుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈయన కడియపు లంక నర్సరీ నుంచి తెచ్చి చేలో నాటారు. ఈ రకం శుభకార్యాల్లో ఆకర్షణగా ఉంటుందని అలంకరణకు వినియోగిస్తారని రైతు తెలిపారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలికి చెందిన భూపతిరాజు వెంకట సత్య సుబ్బరాజు తన చేలో వేసిన ‘ప్రేయింగ్‌ హేండ్స్‌’ అనే కొత్త రకం అరటి అందరినీ అబ్బురపరుస్తోంది. సాధారణంగా తెల్ల, ఎర్ర చక్రకేళీ, కర్పూర, కూర అరటి వంటి రకాలు మనకు తెలిసినవే. ప్రేయింగ్‌ హేండ్స్‌ రకం ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తోంది. దీని అత్తాలు అతుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈయన కడియపు లంక నర్సరీ నుంచి తెచ్చి చేలో నాటారు. ఈ రకం శుభకార్యాల్లో ఆకర్షణగా ఉంటుందని అలంకరణకు వినియోగిస్తారని రైతు తెలిపారు.
14/38
ఎన్నో మధుర జ్ఞాపకాల కలబోత పెళ్లి. ఇటీవల ఫొటోషూట్‌లతో పెళ్లి పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే పేకముక్కలపై సైతం ఎవరి పెళ్లికి వచ్చామో గుర్తుండిపోయేలా ఇలా వధూవరుల చిత్రాలు ముద్రించి ఇస్తూ వినూత్న ఆలోచనకు తెరతీశారు. ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేసే లక్ష్యంతో విజయవాడలో ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఫొటోకార్నివాల్‌లో కనిపించిన చిత్రాలివి. ఎన్నో మధుర జ్ఞాపకాల కలబోత పెళ్లి. ఇటీవల ఫొటోషూట్‌లతో పెళ్లి పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే పేకముక్కలపై సైతం ఎవరి పెళ్లికి వచ్చామో గుర్తుండిపోయేలా ఇలా వధూవరుల చిత్రాలు ముద్రించి ఇస్తూ వినూత్న ఆలోచనకు తెరతీశారు. ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేసే లక్ష్యంతో విజయవాడలో ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఫొటోకార్నివాల్‌లో కనిపించిన చిత్రాలివి.
15/38
16/38
ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు, ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లల్లోకి వెళుతూ ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. పిల్లలు దుకాణాల్లో తిను బండారాలు కొని తీసుకెళ్తుండగా దాడి చేసి గాయపరుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు, ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లల్లోకి వెళుతూ ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. పిల్లలు దుకాణాల్లో తిను బండారాలు కొని తీసుకెళ్తుండగా దాడి చేసి గాయపరుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
17/38
విజయవాడ సమీపంలోని కృష్ణానది పరిసరాల అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కృష్ణానదిలో ద్వీపాలు, వారధులు తమ వంపులతో ఆకట్టుకుంటున్నాయి. రైలు, రోడ్డు మార్గాల కోసం వేసిన వంతెనలు తమ సొబగులతో ఆకర్షిస్తున్నాయి. నదిపై గుంటుపల్లి సమీపంలో మరో పైవంతెన నిర్మిస్తున్నారు. నది సమీపంలోని విజయకీలాద్రిపై రామానుజ విగ్రహం ఆకట్టుకుంటోంది.  విజయవాడ సమీపంలోని కృష్ణానది పరిసరాల అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కృష్ణానదిలో ద్వీపాలు, వారధులు తమ వంపులతో ఆకట్టుకుంటున్నాయి. రైలు, రోడ్డు మార్గాల కోసం వేసిన వంతెనలు తమ సొబగులతో ఆకర్షిస్తున్నాయి. నదిపై గుంటుపల్లి సమీపంలో మరో పైవంతెన నిర్మిస్తున్నారు. నది సమీపంలోని విజయకీలాద్రిపై రామానుజ విగ్రహం ఆకట్టుకుంటోంది.
18/38
19/38
20/38
‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై  త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో జాతీయ జెండాల తయారీ సంస్థలు వాటిని సరఫరా చేసే పనిలో నిమగ్నమయ్యాయి. వివిధ రకాల సైజుల్లో జాతీయ జెండాలను విజయవాడలో రూపొందిస్తున్నారు. ప్రింటింగ్‌ పూర్తయిన జెండాలను మిషన్ల మీద కుట్టాల్సి ఉండటంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో జాతీయ జెండాల తయారీ సంస్థలు వాటిని సరఫరా చేసే పనిలో నిమగ్నమయ్యాయి. వివిధ రకాల సైజుల్లో జాతీయ జెండాలను విజయవాడలో రూపొందిస్తున్నారు. ప్రింటింగ్‌ పూర్తయిన జెండాలను మిషన్ల మీద కుట్టాల్సి ఉండటంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది.
21/38
ఎంత చెప్పినా కొందరు ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. చాదర్‌ఘాట్‌ మెట్రో పిల్లర్‌ వద్ద సిగ్నల్‌ పడడంతో ఓ కారు ఆగింది. కారుకు పిల్లర్‌కు మధ్యలో ఉన్న చిన్న సందులోకి ఓ ద్విచక్రవాహన దారుడు దూరిపోయి ముందుకు వెళ్లాలని చూశాడు. కానీ, అందులో అతని కాలు ఇరుక్కోవడంతో ఆగక తప్పలేదు. ఎంత చెప్పినా కొందరు ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. చాదర్‌ఘాట్‌ మెట్రో పిల్లర్‌ వద్ద సిగ్నల్‌ పడడంతో ఓ కారు ఆగింది. కారుకు పిల్లర్‌కు మధ్యలో ఉన్న చిన్న సందులోకి ఓ ద్విచక్రవాహన దారుడు దూరిపోయి ముందుకు వెళ్లాలని చూశాడు. కానీ, అందులో అతని కాలు ఇరుక్కోవడంతో ఆగక తప్పలేదు.
22/38
వర్షాకాలంలో రోడ్లన్నీ గోతులు తేలాయి. వాహనంలో కూర్చొని ప్రయాణించడమే కష్టసాధ్యమవుతోంది.  ఈ పరిస్థితుల్లో మేడిపల్లి వద్ద ఓ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాడు. వర్షాకాలంలో రోడ్లన్నీ గోతులు తేలాయి. వాహనంలో కూర్చొని ప్రయాణించడమే కష్టసాధ్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో మేడిపల్లి వద్ద ఓ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాడు.
23/38
ఆదివారం ఐటీకారిడార్‌లో కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విధులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురియడంతో వంతెనలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల కింద తలదాచుకున్నారు. ఐటీ, ఇతర ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు నానాయాతన పడ్డారు. బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గం కనిపించిన దృశ్యాలివి. ఆదివారం ఐటీకారిడార్‌లో కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విధులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురియడంతో వంతెనలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల కింద తలదాచుకున్నారు. ఐటీ, ఇతర ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు నానాయాతన పడ్డారు. బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గం కనిపించిన దృశ్యాలివి.
24/38
25/38
సమృద్ధిగా వానలు.. సస్యశ్యామలంగా ఉండాల్సిన కాలం.. అయినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టేకు వనాలు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి అడవికి ఏమైందబ్బా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. సిరికొండ మండల కేంద్రానికి సమీపంలోని గుట్టలపై టేకు వనం అంతా దాదాపు ఇలా రంగు మారి కనిపిస్తుండగా మరికొన్నిచోట్ల ఈ పరిస్థితి ఇప్పుడే మొదలైంది. ఈ విషయంపై జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరెడ్డిని అడగగా.. ఆకును తినే గొంగళి పురుగులు జీవిత చక్రంలో సుమారు 36-42 రోజుల వరకు టేకుచెట్లపై ఆశ్రయం పొందుతున్నాయని, అప్పుడవి ఆకులన్నీ తినేస్తున్నాయని చెప్పారు. సమృద్ధిగా వానలు.. సస్యశ్యామలంగా ఉండాల్సిన కాలం.. అయినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టేకు వనాలు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి అడవికి ఏమైందబ్బా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. సిరికొండ మండల కేంద్రానికి సమీపంలోని గుట్టలపై టేకు వనం అంతా దాదాపు ఇలా రంగు మారి కనిపిస్తుండగా మరికొన్నిచోట్ల ఈ పరిస్థితి ఇప్పుడే మొదలైంది. ఈ విషయంపై జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరెడ్డిని అడగగా.. ఆకును తినే గొంగళి పురుగులు జీవిత చక్రంలో సుమారు 36-42 రోజుల వరకు టేకుచెట్లపై ఆశ్రయం పొందుతున్నాయని, అప్పుడవి ఆకులన్నీ తినేస్తున్నాయని చెప్పారు.
26/38
ఏపీ రాజధాని అమరావతిలో రోడ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా లింగాయపాలెం సమీపంలో రైతుల ప్లాట్లలోకి వెళ్లేందుకు వేసిన రహదారిని తవ్వి మట్టి, కంకరను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రోడ్డు తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయం ముందున్న దారిని తవ్వి మట్టి, కంకరను తరిలిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇంతకు ముందు లింగాయపాలెంతో పాటు ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామ పరిధిల్లోని రోడ్లను తవ్విన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో రోడ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా లింగాయపాలెం సమీపంలో రైతుల ప్లాట్లలోకి వెళ్లేందుకు వేసిన రహదారిని తవ్వి మట్టి, కంకరను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రోడ్డు తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయం ముందున్న దారిని తవ్వి మట్టి, కంకరను తరిలిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇంతకు ముందు లింగాయపాలెంతో పాటు ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామ పరిధిల్లోని రోడ్లను తవ్విన విషయం తెలిసిందే.
27/38
నేవీ దినోత్సవం సందర్భంగా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. నేవీ దినోత్సవం సందర్భంగా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.
28/38
వికారాబాద్‌ జిల్లా ఎర్రవల్లికి చెందిన గోపాల్‌రెడ్డి గతేడాది జులైలో రూ.3.20 లక్షల బ్యాంకు రుణం తీసుకొని ఒకటిన్నర ఎకరాల్లో బొప్పాయి వేశారు. మొక్కలు ఏపుగా పెరిగి, మంచి సైజులో కాయలు రావడంతో రూ.6 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆనందించారు. తీరా పంట చేతికొచ్చే వేళకు వరదతో తోటంతా నీట మునిగింది. జోరుగాలులకు పలు చెట్లు విరగడంతోపాటు కాయలు బూజు పడుతున్నాయి. పడిన కాయలను కోసి అమ్మజూపగా.. దళారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. ఇలాగైతే భారీ నష్టాలు తప్పవని ఆవేదన చెందిన గోపాల్ రెడ్డి.. కాయలను తామే విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఆయన సంగారెడ్డి సదాశివపేటలో, భార్య స్వప్న వికారాబాద్‌ జిల్లా మమ్‌దాన్‌పల్లిలో, తనయుడు వికారాబాద్‌ రైతు బజార్‌ వద్ద కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొచోట నిత్యం 15-20 కిలోల వరకు అమ్ముతున్నారు. ఇంకా 10 టన్నుల కాయలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రైతు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా ఎర్రవల్లికి చెందిన గోపాల్‌రెడ్డి గతేడాది జులైలో రూ.3.20 లక్షల బ్యాంకు రుణం తీసుకొని ఒకటిన్నర ఎకరాల్లో బొప్పాయి వేశారు. మొక్కలు ఏపుగా పెరిగి, మంచి సైజులో కాయలు రావడంతో రూ.6 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆనందించారు. తీరా పంట చేతికొచ్చే వేళకు వరదతో తోటంతా నీట మునిగింది. జోరుగాలులకు పలు చెట్లు విరగడంతోపాటు కాయలు బూజు పడుతున్నాయి. పడిన కాయలను కోసి అమ్మజూపగా.. దళారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. ఇలాగైతే భారీ నష్టాలు తప్పవని ఆవేదన చెందిన గోపాల్ రెడ్డి.. కాయలను తామే విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఆయన సంగారెడ్డి సదాశివపేటలో, భార్య స్వప్న వికారాబాద్‌ జిల్లా మమ్‌దాన్‌పల్లిలో, తనయుడు వికారాబాద్‌ రైతు బజార్‌ వద్ద కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొచోట నిత్యం 15-20 కిలోల వరకు అమ్ముతున్నారు. ఇంకా 10 టన్నుల కాయలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రైతు తెలిపారు.
29/38
30/38
పేదలైతేనేం.. సగౌరవంగా భోజనం చేసేలా వసతులు కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను ఈ చిత్రం గుర్తు చేస్తోంది. రూ.5కే పేదోడి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద కూర్చొనేందుకు కాస్తంత జాగా లేక ఇలా నేలపై విస్తరి పెట్టాల్సిన పరిస్థితి. ఎంజీబీఎస్‌ వద్ద కనిపించిందీ దృశ్యం. పేదలైతేనేం.. సగౌరవంగా భోజనం చేసేలా వసతులు కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను ఈ చిత్రం గుర్తు చేస్తోంది. రూ.5కే పేదోడి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద కూర్చొనేందుకు కాస్తంత జాగా లేక ఇలా నేలపై విస్తరి పెట్టాల్సిన పరిస్థితి. ఎంజీబీఎస్‌ వద్ద కనిపించిందీ దృశ్యం.
31/38
విధుల్లో స్వీయరక్షణ పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం. బెంగళూరు హైవేపై పహాడీషరీఫ్‌ వద్ద సీసీ కెమెరాల బిగింపు విధుల్లో ఉన్న వీరు వ్యానుపైనుంచి తీగకు నిచ్చెన వేసి పనులు చేయడం ఆందోళన రెకెత్తించింది. విధుల్లో స్వీయరక్షణ పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం. బెంగళూరు హైవేపై పహాడీషరీఫ్‌ వద్ద సీసీ కెమెరాల బిగింపు విధుల్లో ఉన్న వీరు వ్యానుపైనుంచి తీగకు నిచ్చెన వేసి పనులు చేయడం ఆందోళన రెకెత్తించింది.
32/38
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి.  ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి.
33/38
మయన్మార్‌లో భారీ వర్షాలతో సుందర దృశ్యాన్ని ఆవిష్కరించిన దట్‌ టావ్‌ గ్యాంట్‌ జలపాతం. మయన్మార్‌లో భారీ వర్షాలతో సుందర దృశ్యాన్ని ఆవిష్కరించిన దట్‌ టావ్‌ గ్యాంట్‌ జలపాతం.
34/38
హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ (హెచ్‌కేసీ)లో ఆదివారం డాగథాన్‌ ఉత్సాహంగా సాగింది. 12వ తరగతి చదువుతున్న ఏడుగురు యువకులు సామాజిక సేవకు రూ.10 లక్షలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది ఔత్సాహికులు తమ కుక్కలతో పాల్గొని పరుగు పెట్టారు. సైబరాబాద్‌ డీసీపీ టి.శ్రీనివాస్‌ రావు జెండా ఊపి డాగథాన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ (హెచ్‌కేసీ)లో ఆదివారం డాగథాన్‌ ఉత్సాహంగా సాగింది. 12వ తరగతి చదువుతున్న ఏడుగురు యువకులు సామాజిక సేవకు రూ.10 లక్షలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది ఔత్సాహికులు తమ కుక్కలతో పాల్గొని పరుగు పెట్టారు. సైబరాబాద్‌ డీసీపీ టి.శ్రీనివాస్‌ రావు జెండా ఊపి డాగథాన్‌ను ప్రారంభించారు.
35/38
షేక్‌పేట నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద 100 మీటర్ల నమూనా సైకిల్‌ ట్రాక్‌ను ఆకర్షణీయంగా నిర్మించారు. పక్కనే ప్రత్యేక టైల్స్‌తో కాలిబాట ఏర్పాటు చేశారు. ఎడమవైపు మొక్కలు పెంచుతున్నారు. మెఘా సంస్థ దీన్ని తీర్చిదిద్దింది. అధికారులు పరిశీలన అనంతరం షేక్‌పేట నాలా చౌరస్తా మీదుగా టోలిచౌకి పైవంతెన వరకు పొడిగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. షేక్‌పేట నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద 100 మీటర్ల నమూనా సైకిల్‌ ట్రాక్‌ను ఆకర్షణీయంగా నిర్మించారు. పక్కనే ప్రత్యేక టైల్స్‌తో కాలిబాట ఏర్పాటు చేశారు. ఎడమవైపు మొక్కలు పెంచుతున్నారు. మెఘా సంస్థ దీన్ని తీర్చిదిద్దింది. అధికారులు పరిశీలన అనంతరం షేక్‌పేట నాలా చౌరస్తా మీదుగా టోలిచౌకి పైవంతెన వరకు పొడిగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
36/38
హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మించిన చారిత్రాత్మక చార్మినార్‌ కట్టడానికి 444 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చార్మినార్‌ ఆవరణంలో ఆదివారం చార్మినార్‌ కట్టడం ప్రత్యేక ప్రదర్శనను ఇంటాక్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేసింది. ప్రదర్శనను హైదరాబాద్‌ ఇంటాక్‌ కన్వీనర్‌ అనురాధరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 7 వరకు కొనసాగుతుందని వివరించారు. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మించిన చారిత్రాత్మక చార్మినార్‌ కట్టడానికి 444 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చార్మినార్‌ ఆవరణంలో ఆదివారం చార్మినార్‌ కట్టడం ప్రత్యేక ప్రదర్శనను ఇంటాక్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేసింది. ప్రదర్శనను హైదరాబాద్‌ ఇంటాక్‌ కన్వీనర్‌ అనురాధరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 7 వరకు కొనసాగుతుందని వివరించారు.
37/38
38/38
శ్రావణ మాస ఆదివారం సందర్భంగా నగరంలో పలుచోట్ల బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాల వద్ద నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కొత్తపేట ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారికి సమర్పించేందుకు బోనంతో వచ్చిన యువతి. శ్రావణ మాస ఆదివారం సందర్భంగా నగరంలో పలుచోట్ల బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాల వద్ద నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కొత్తపేట ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారికి సమర్పించేందుకు బోనంతో వచ్చిన యువతి.

మరిన్ని