News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (02-08-2022)

Published : 02 Aug 2022 13:48 IST
1/15
పచ్చని చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని చూసి అటవీ ప్రాంతం అనుకునేరు.. ఇది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రహదారి. 5 వేల ఎకరాల్లో సగానికిపైగా సహజమైన పర్యావరణంతో నిండి ఉంది. విమానాశ్రయం ఏర్పాటు అనంతరం నాటిన 69 వేల మొక్కలు పెరిగి పెద్దవై హరిత శోభ సంతరించుకుంది.  పచ్చని చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని చూసి అటవీ ప్రాంతం అనుకునేరు.. ఇది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రహదారి. 5 వేల ఎకరాల్లో సగానికిపైగా సహజమైన పర్యావరణంతో నిండి ఉంది. విమానాశ్రయం ఏర్పాటు అనంతరం నాటిన 69 వేల మొక్కలు పెరిగి పెద్దవై హరిత శోభ సంతరించుకుంది.
2/15
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, రక్షక దళం హైదరాబాద్‌ నుంచి దిల్లీకి చేపట్టిన ‘మోటార్‌ సైకిల్‌ ర్యాలీ’ని సోమవారం నెక్లెస్‌ రోడ్డు ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌ వద్ద దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌ఛార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు. 40 మంది రైడర్లు 20 బుల్లెట్‌ మోటారు సైకిళ్లపై దిల్లీకి బయలుదేరారు. వీరిలో ఇద్దరు మహిళా రైడర్లూ ఉన్నారు.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, రక్షక దళం హైదరాబాద్‌ నుంచి దిల్లీకి చేపట్టిన ‘మోటార్‌ సైకిల్‌ ర్యాలీ’ని సోమవారం నెక్లెస్‌ రోడ్డు ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌ వద్ద దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌ఛార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు. 40 మంది రైడర్లు 20 బుల్లెట్‌ మోటారు సైకిళ్లపై దిల్లీకి బయలుదేరారు. వీరిలో ఇద్దరు మహిళా రైడర్లూ ఉన్నారు.
3/15
మూసారంబాగ్‌ వంతెన సమీపంలో కొందరు యువకులు ఒంటెలను సాకుతూ ఉపాధి పొందుతున్నారు. ఇటీవల వర్షాలకు తడిసి కొన్ని అనారోగ్యం బారిన పడగా మిగిలిన వాటికి ఇబ్బంది కలగడకుండా ప్లాస్టిక్‌ సంచులను కప్పి ఉంచారు. మూసారంబాగ్‌ వంతెన సమీపంలో కొందరు యువకులు ఒంటెలను సాకుతూ ఉపాధి పొందుతున్నారు. ఇటీవల వర్షాలకు తడిసి కొన్ని అనారోగ్యం బారిన పడగా మిగిలిన వాటికి ఇబ్బంది కలగడకుండా ప్లాస్టిక్‌ సంచులను కప్పి ఉంచారు.
4/15
సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు సమీపంలో ఇమ్మారెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గతంలో తాటిచెట్టును నరికేశారు. రెండేళ్ల క్రితం చెత్తాచెదారంతో దాని మొదళ్లను కాల్చివేశారు. తాటిచెట్టు మొదలులో మర్రి మొక్క పుట్టుకొచ్చి ఏపుగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ను వీక్షించేందుకు వచ్చినవారిని మర్రి మొక్క ఆకర్షిస్తోంది. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు సమీపంలో ఇమ్మారెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గతంలో తాటిచెట్టును నరికేశారు. రెండేళ్ల క్రితం చెత్తాచెదారంతో దాని మొదళ్లను కాల్చివేశారు. తాటిచెట్టు మొదలులో మర్రి మొక్క పుట్టుకొచ్చి ఏపుగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ను వీక్షించేందుకు వచ్చినవారిని మర్రి మొక్క ఆకర్షిస్తోంది.
5/15
అక్కయ్యపాలెం నందగిరి నగర్‌ రోడ్డులో ఇటీవల భూగర్భ డ్రైనేజీ పైపులైను మరమ్మతుల నిమిత్తం తవ్వారు. పనులు పూర్తయిన తరువాత మట్టితో కప్పినా..పూర్తిస్థాయిలో  పూడ్చలేదు. సోమవారం ఇంటింటికి బియ్యం ఇచ్చేందుకు వస్తున్న వాహనం మట్టిలో కూరుకుపోయింది. మరో వాహనాన్ని జత చేసి శ్రమిస్తేగానీ అది బయటకు రాలేదు. స్థానికులు కూడా రాత్రి వేళల్లో ఇక్కడ నానా పాట్లు పడాల్సి వస్తోంది.   అక్కయ్యపాలెం నందగిరి నగర్‌ రోడ్డులో ఇటీవల భూగర్భ డ్రైనేజీ పైపులైను మరమ్మతుల నిమిత్తం తవ్వారు. పనులు పూర్తయిన తరువాత మట్టితో కప్పినా..పూర్తిస్థాయిలో పూడ్చలేదు. సోమవారం ఇంటింటికి బియ్యం ఇచ్చేందుకు వస్తున్న వాహనం మట్టిలో కూరుకుపోయింది. మరో వాహనాన్ని జత చేసి శ్రమిస్తేగానీ అది బయటకు రాలేదు. స్థానికులు కూడా రాత్రి వేళల్లో ఇక్కడ నానా పాట్లు పడాల్సి వస్తోంది.
6/15
టి.నరసాపురం మండలం బొర్రంపాలేనికి చెందిన మురళీకృష్ణ తన మోటారు సైకిల్‌కు ‘‘మా గ్రామంలో ఆస్పత్రి నిర్మించాలి’’ అనే బోర్డు కట్టుకుని సోమవారం కలెక్టరేట్లో  జరిగిన ‘స్పందన’ కార్యక్రమానికొచ్చారు. ‘మా అన్నయ్య పాము కాటుకు గురై సకాలంలో వైద్యం అందక మృతి చెందారు. గ్రామంలో ఆసుపత్రి ఉంటే ప్రథమ చికిత్స చేసేందుకు అవకాశం ఉండేది. ఈ విధంగా మరెవరికీ జరగకూడదనే భావనతో గతేడాది నుంచి  మోటారు సైకిల్‌కు బోర్డు కట్టుకుని తిరుగుతున్నా.’ అని వివరించారు. టి.నరసాపురం మండలం బొర్రంపాలేనికి చెందిన మురళీకృష్ణ తన మోటారు సైకిల్‌కు ‘‘మా గ్రామంలో ఆస్పత్రి నిర్మించాలి’’ అనే బోర్డు కట్టుకుని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘స్పందన’ కార్యక్రమానికొచ్చారు. ‘మా అన్నయ్య పాము కాటుకు గురై సకాలంలో వైద్యం అందక మృతి చెందారు. గ్రామంలో ఆసుపత్రి ఉంటే ప్రథమ చికిత్స చేసేందుకు అవకాశం ఉండేది. ఈ విధంగా మరెవరికీ జరగకూడదనే భావనతో గతేడాది నుంచి మోటారు సైకిల్‌కు బోర్డు కట్టుకుని తిరుగుతున్నా.’ అని వివరించారు.
7/15
రాజధాని అమరావతిలోని రాయపూడి గ్రామంలో చిన్నస్థలంలో మూడంతస్తుల భవనం నిర్మించిన చిత్రమిది. వెడల్పు తక్కువ.. పొడవు ఎక్కువ ఉన్న స్థలంలో అందంగా నిర్మించిన ఈ గృహం సీడ్‌యాక్సిస్‌ రహదారిలో వచ్చిపోయేవారిని కనువిందు చేస్తోంది. రాజధాని అమరావతిలోని రాయపూడి గ్రామంలో చిన్నస్థలంలో మూడంతస్తుల భవనం నిర్మించిన చిత్రమిది. వెడల్పు తక్కువ.. పొడవు ఎక్కువ ఉన్న స్థలంలో అందంగా నిర్మించిన ఈ గృహం సీడ్‌యాక్సిస్‌ రహదారిలో వచ్చిపోయేవారిని కనువిందు చేస్తోంది.
8/15
అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార శాఖ ఆధ్వర్యంలో జెండా పండగను నిర్వహిస్తున్నారు. విజయవాడ గాంధీ కొండపై గాంధీ స్తూపం వద్ద 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో జాతీయ జెండాను సచివాలయ ఉద్యోగులచే ప్రదర్శిస్తూ, స్తూపం చుట్టూ తిరుగుతూ, నృత్యాలు చేస్తూ కెమెరాలు, డ్రోన్‌లతో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంది. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార శాఖ ఆధ్వర్యంలో జెండా పండగను నిర్వహిస్తున్నారు. విజయవాడ గాంధీ కొండపై గాంధీ స్తూపం వద్ద 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో జాతీయ జెండాను సచివాలయ ఉద్యోగులచే ప్రదర్శిస్తూ, స్తూపం చుట్టూ తిరుగుతూ, నృత్యాలు చేస్తూ కెమెరాలు, డ్రోన్‌లతో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంది.
9/15
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో అవిభక్త కవలలు బెర్నార్డ్, ఆర్థర్‌ లీమాలకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి వేరు చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో అవిభక్త కవలలు బెర్నార్డ్, ఆర్థర్‌ లీమాలకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి వేరు చేశారు.
10/15
11/15
యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా యాదర్శి అతిథిగృహం తుదిరూపు దిద్దుకుంటోంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండ కింద పెద్దగుట్టపై యాదాద్రి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా ఈ క్షేత్ర విశిష్టతను మరింత పెంచేలా నాలుగు పడక గదులు, విశాలమైన సమావేశం హాల్‌తో రూపొందుతోంది. దీన్ని ఆలయ సందర్శనకు వచ్చే వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వీఐపీల విడిది కోసం కేటాయించేందుకు యాడా యంత్రాంగం యోచిస్తోంది. 
యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా యాదర్శి అతిథిగృహం తుదిరూపు దిద్దుకుంటోంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండ కింద పెద్దగుట్టపై యాదాద్రి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా ఈ క్షేత్ర విశిష్టతను మరింత పెంచేలా నాలుగు పడక గదులు, విశాలమైన సమావేశం హాల్‌తో రూపొందుతోంది. దీన్ని ఆలయ సందర్శనకు వచ్చే వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వీఐపీల విడిది కోసం కేటాయించేందుకు యాడా యంత్రాంగం యోచిస్తోంది.
12/15
జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించిన ప్రదర్శనలో బ్యాటరీతో నడిచే ఫ్యాన్‌ దుస్తులతో శునకం. పెంపుడు జంతువుల కోసం జపాన్‌కు చెందిన మెటర్నిటీ వస్త్రాల తయారీ సంస్థ ‘స్వీట్‌ మమ్మీ’ వీటిని తయారు చేసింది. 
జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించిన ప్రదర్శనలో బ్యాటరీతో నడిచే ఫ్యాన్‌ దుస్తులతో శునకం. పెంపుడు జంతువుల కోసం జపాన్‌కు చెందిన మెటర్నిటీ వస్త్రాల తయారీ సంస్థ ‘స్వీట్‌ మమ్మీ’ వీటిని తయారు చేసింది.
13/15
శ్రావణ మాసం పురస్కరించుకొని వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి జలాభిషేకం చేసేందుకు తరలివచ్చిన కన్వారీ భక్తుల రద్దీ శ్రావణ మాసం పురస్కరించుకొని వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి జలాభిషేకం చేసేందుకు తరలివచ్చిన కన్వారీ భక్తుల రద్దీ
14/15
పచ్చి కోడి మాంసాన్ని ఆరగిస్తున్న ఈ యువకుడి పేరు సంతోశ్‌కుమార్‌. వయసు 25 ఏళ్లు. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌ జిల్లాలోని జురియాపట్నా ఇతడి స్వగ్రామం. రాళ్లపై శిల్పాలు తీర్చిదిద్దుతూ ఉపాధి పొందే సంతోశ్‌ భోజనంలో అతి తక్కువగా అన్నం తీసుకుంటాడు. రోజుకు రెండు కోళ్లను వండకుండానే ఆరగిస్తాడు. పొలాలు, కాలువల వద్ద పీతలు, చేపలను పట్టుకొని అమాంతం మింగేస్తాడు. బాల్యం నుంచి ఇలా తింటున్నట్లు సంతోశ్‌ తెలిపాడు. పచ్చి కోడి మాంసాన్ని ఆరగిస్తున్న ఈ యువకుడి పేరు సంతోశ్‌కుమార్‌. వయసు 25 ఏళ్లు. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌ జిల్లాలోని జురియాపట్నా ఇతడి స్వగ్రామం. రాళ్లపై శిల్పాలు తీర్చిదిద్దుతూ ఉపాధి పొందే సంతోశ్‌ భోజనంలో అతి తక్కువగా అన్నం తీసుకుంటాడు. రోజుకు రెండు కోళ్లను వండకుండానే ఆరగిస్తాడు. పొలాలు, కాలువల వద్ద పీతలు, చేపలను పట్టుకొని అమాంతం మింగేస్తాడు. బాల్యం నుంచి ఇలా తింటున్నట్లు సంతోశ్‌ తెలిపాడు.
15/15
‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 3 రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కానీ, ఆ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహం మాత్రం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కళతప్పి కనిపిస్తోంది. నిర్వహణలోపాలతో వెలవెలబోతోంది. విగ్రహం దిమ్మె వెనక వైపునకు వంగిపోగా.. దానికి మరోవైపు మొక్కలు మొలిచాయి. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 3 రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కానీ, ఆ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహం మాత్రం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కళతప్పి కనిపిస్తోంది. నిర్వహణలోపాలతో వెలవెలబోతోంది. విగ్రహం దిమ్మె వెనక వైపునకు వంగిపోగా.. దానికి మరోవైపు మొక్కలు మొలిచాయి.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని