News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (02-08-2022)

Updated : 03 Aug 2022 12:31 IST
1/18
1921వ సంవత్సరం ఏప్రిల్ 3న సాయంత్రం 4గంటలకు రాజమహేంద్రవరం నుంచి ఏలూరుకు రైలులో మహాత్మాగాంధీ దంపతులు విచ్చేశారు. నగర ప్రముఖులతో సహా 30వేల మంది వారికి ఘన స్వాగతం పలుకుతూ గుర్రాల బగ్గీపై ఊరేగించారు. స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ఏలూరులోని ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని స్థాపించారు. విద్యార్థులకు మహాత్ముడి సతీమణి కస్తూరి బా అక్షరాభ్యాసం చేయించారు. ఆనాడు గాంధీ నాటిన మేడి చెట్టు నేటికీ పచ్చగా కళకళలాడుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేళ నాటి జ్ఞాపకాలను నగర వాసులు గుర్తు చేసుకుంటున్నారు. 1921వ సంవత్సరం ఏప్రిల్ 3న సాయంత్రం 4గంటలకు రాజమహేంద్రవరం నుంచి ఏలూరుకు రైలులో మహాత్మాగాంధీ దంపతులు విచ్చేశారు. నగర ప్రముఖులతో సహా 30వేల మంది వారికి ఘన స్వాగతం పలుకుతూ గుర్రాల బగ్గీపై ఊరేగించారు. స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ఏలూరులోని ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని స్థాపించారు. విద్యార్థులకు మహాత్ముడి సతీమణి కస్తూరి బా అక్షరాభ్యాసం చేయించారు. ఆనాడు గాంధీ నాటిన మేడి చెట్టు నేటికీ పచ్చగా కళకళలాడుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేళ నాటి జ్ఞాపకాలను నగర వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
2/18
3/18
గరుడ పంచమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. గరుడ పంచమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
4/18
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.
5/18
నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మల్లయోధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజున నాగదేవతను ఆరాధించి కుస్తీలోకి దిగడం అక్కడి ఆనవాయితి. ఈ సందర్భంగా శీర్షాసనం వేస్తున్న ఓ వ్యక్తిని ఈ చిత్రంలో చూడొచ్చు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మల్లయోధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజున నాగదేవతను ఆరాధించి కుస్తీలోకి దిగడం అక్కడి ఆనవాయితి. ఈ సందర్భంగా శీర్షాసనం వేస్తున్న ఓ వ్యక్తిని ఈ చిత్రంలో చూడొచ్చు.
6/18
7/18
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
8/18
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంగపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు.  తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంగపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు.
9/18
10/18
నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌లోని సెవెన్‌ టెంపుల్స్‌ నాగులపుట్ట వద్ద పూజలు చేసి, పాలు పోస్తున్న భక్తులు
నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌లోని సెవెన్‌ టెంపుల్స్‌ నాగులపుట్ట వద్ద పూజలు చేసి, పాలు పోస్తున్న భక్తులు
11/18
‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు నిజమైన నివాళి అని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన పింగళి వెంకయ్య 146వ జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ నెల 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలని కోరారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు నిజమైన నివాళి అని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన పింగళి వెంకయ్య 146వ జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ నెల 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలని కోరారు.
12/18
ఫ్యాషన్‌ ప్రియుల కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరీ జైపుర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి నటి, బిగ్‌బాస్‌ ఫేం స్రవంతి చొక్కారపు, ఇతర మోడళ్లు హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఫ్యాషన్‌ ప్రియుల కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరీ జైపుర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి నటి, బిగ్‌బాస్‌ ఫేం స్రవంతి చొక్కారపు, ఇతర మోడళ్లు హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/18
14/18
 జాతీయ పతాక రూపకర్త  పింగళి వెంకయ్య 146వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా.. పింగళి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగాంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా.. పింగళి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగాంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
15/18
16/18
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలో కాలం చెల్లిన భవనాల పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఆ భవనాలను ఖాళీ చేయాలని వాటి యజమానులకు సూచించినా వారు లెక్క చేయడం లేదు. ముషీరాబాద్‌ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి పరిధి అచ్చయ్యనగర్‌లోని ఓ పాత భవనం ఇది. అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం కన్పించడం లేదిక్కడ! ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలో కాలం చెల్లిన భవనాల పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఆ భవనాలను ఖాళీ చేయాలని వాటి యజమానులకు సూచించినా వారు లెక్క చేయడం లేదు. ముషీరాబాద్‌ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి పరిధి అచ్చయ్యనగర్‌లోని ఓ పాత భవనం ఇది. అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం కన్పించడం లేదిక్కడ!
17/18
శ్రమదానం కార్యక్రమం ద్వారా తిరుమలను స్వచ్ఛ తిరుమలగా మార్చుకుందామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఆయన అధికారులు, సిబ్బంది, స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు. స్వయంగా పార పట్టి మురుగు తొలగించారు. వ్యర్థాలను ట్రాక్టర్‌లో తరలించారు. స్థానికులకు శ్రమదానంపై అవగాహన కల్పించారు. శ్రమదానం కార్యక్రమం ద్వారా తిరుమలను స్వచ్ఛ తిరుమలగా మార్చుకుందామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఆయన అధికారులు, సిబ్బంది, స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు. స్వయంగా పార పట్టి మురుగు తొలగించారు. వ్యర్థాలను ట్రాక్టర్‌లో తరలించారు. స్థానికులకు శ్రమదానంపై అవగాహన కల్పించారు.
18/18

మరిన్ని