News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (03-08-2022)

Published : 03 Aug 2022 13:59 IST
1/31
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కొద్ది రోజులుగా రైతుల సాధకబాధకాలను తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి మండలంలోని తుమ్మెనాలలో మంగళవారం పర్యటించారు. పంచెకట్టుకుని పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేశారు. కాసేపు జంబుకొట్టారు. భోజన సమయం కావడంతో కూలీలతో కలిసి యోగ, క్షేమాలు మాట్లాడుతూ పొలం గట్టున భోజనం చేశారు. సాగుపై భరోసా కల్పించారు.  


రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కొద్ది రోజులుగా రైతుల సాధకబాధకాలను తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి మండలంలోని తుమ్మెనాలలో మంగళవారం పర్యటించారు. పంచెకట్టుకుని పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేశారు. కాసేపు జంబుకొట్టారు. భోజన సమయం కావడంతో కూలీలతో కలిసి యోగ, క్షేమాలు మాట్లాడుతూ పొలం గట్టున భోజనం చేశారు. సాగుపై భరోసా కల్పించారు.
2/31
ఈ చిత్రంలో కనిపిస్తున్న రంగురంగుల బంతులను చూశారా.. ఇవి వరిపొట్టు లేదా రంపం పొట్టును దుస్తుల్లో వేసి గుండ్రంగా మూట కడతారు. వీటిని కిరోసిన్, డీజిల్‌లో గాని, లేదంటే మడ్డి ఆయిల్‌లో 24గంటలు నానబెట్టిన తరువాత మురుగు నీటి గుంతల్లో వేస్తున్నారు. ఫలితంగా దోమల లార్వా నశిస్తుందని అధికారులంటున్నారు. జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూనె బంతులు తయారు చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.  


ఈ చిత్రంలో కనిపిస్తున్న రంగురంగుల బంతులను చూశారా.. ఇవి వరిపొట్టు లేదా రంపం పొట్టును దుస్తుల్లో వేసి గుండ్రంగా మూట కడతారు. వీటిని కిరోసిన్, డీజిల్‌లో గాని, లేదంటే మడ్డి ఆయిల్‌లో 24గంటలు నానబెట్టిన తరువాత మురుగు నీటి గుంతల్లో వేస్తున్నారు. ఫలితంగా దోమల లార్వా నశిస్తుందని అధికారులంటున్నారు. జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూనె బంతులు తయారు చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
3/31
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్‌ త్రివర్ణ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం రావి ఆకులపై ఆయన చిత్రాన్ని మలచడంతోపాటు రంగులతో త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్ది చిత్ర నివాళి అర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్‌ త్రివర్ణ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం రావి ఆకులపై ఆయన చిత్రాన్ని మలచడంతోపాటు రంగులతో త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్ది చిత్ర నివాళి అర్పించారు.
4/31
కంకోల్‌ టోల్‌ గేటు వద్ద జాతీయ రహదారి పక్కనే పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఈ గుట్టపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. అక్రమంగా మట్టి, మొరాన్ని తరలిస్తున్నారు.  కంకోల్‌ టోల్‌ గేటు వద్ద జాతీయ రహదారి పక్కనే పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఈ గుట్టపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. అక్రమంగా మట్టి, మొరాన్ని తరలిస్తున్నారు.
5/31
ఈ చిత్రాల్లో ఏపుగా పెరిగి.. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్ల పేరు కోనోకార్పస్‌. హరితహారంలో భాగంగా నాటారు. తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో హరితహారంలో.. డివైడర్లపై విరివిగా నాటుతున్నారు. ఇవి పర్యావరణానికి హానికరమని పలు అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు వీటి పెంపకాన్ని నిషేధించాయి. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా నాటుతూనే ఉన్నారు. ఈ మొక్క నుంచి వెలువడే పుప్పొడులు అలర్జీలు, ఆస్తమాకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. ఈ చిత్రాల్లో ఏపుగా పెరిగి.. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్ల పేరు కోనోకార్పస్‌. హరితహారంలో భాగంగా నాటారు. తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో హరితహారంలో.. డివైడర్లపై విరివిగా నాటుతున్నారు. ఇవి పర్యావరణానికి హానికరమని పలు అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు వీటి పెంపకాన్ని నిషేధించాయి. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా నాటుతూనే ఉన్నారు. ఈ మొక్క నుంచి వెలువడే పుప్పొడులు అలర్జీలు, ఆస్తమాకు కారణమవుతాయని పేర్కొంటున్నారు.
6/31
7/31
విశాఖపట్నం నగర పరిధి 89వ వార్డు చంద్రనగర్‌లో మంగళవారం ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమ వేదికపై, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు వచ్చే మార్గాల్లో ఎక్కడికక్కడ వైకాపా నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లెక్సీలోనూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనే ముద్రించడంతో... అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. అవన్నీ పాత ఫ్లెక్లీలని వైకాపా శ్రేణులు చెప్పే ప్రయత్నం చేసినా... ముత్తంశెట్టి ఫొటో పక్కన ఇటీవల పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆడారి ఆనంద్‌కుమార్‌ ఫొటో ఉండడం కొసమెరుపు. విశాఖపట్నం నగర పరిధి 89వ వార్డు చంద్రనగర్‌లో మంగళవారం ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమ వేదికపై, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు వచ్చే మార్గాల్లో ఎక్కడికక్కడ వైకాపా నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లెక్సీలోనూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనే ముద్రించడంతో... అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. అవన్నీ పాత ఫ్లెక్లీలని వైకాపా శ్రేణులు చెప్పే ప్రయత్నం చేసినా... ముత్తంశెట్టి ఫొటో పక్కన ఇటీవల పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆడారి ఆనంద్‌కుమార్‌ ఫొటో ఉండడం కొసమెరుపు.
8/31
విశాఖపట్నం రైల్వే ఆసుపత్రి ప్రాంగణ సమీపంలో ఓ మంచినీటి ట్యాంకుకు రంగులు వేసి కళాత్మకంగా తయారు చేశారు. ట్యాంకు చుట్టూ వేసిన డాల్ఫిన్‌ బొమ్మలు దూర ప్రాంతాల వారికీ కనువిందు చేస్తున్నాయి. 


విశాఖపట్నం రైల్వే ఆసుపత్రి ప్రాంగణ సమీపంలో ఓ మంచినీటి ట్యాంకుకు రంగులు వేసి కళాత్మకంగా తయారు చేశారు. ట్యాంకు చుట్టూ వేసిన డాల్ఫిన్‌ బొమ్మలు దూర ప్రాంతాల వారికీ కనువిందు చేస్తున్నాయి.
9/31
10/31
సిద్దవటంలోని చారిత్రాత్మకమైన మట్లిరాజుల కోట మంగళవారం త్రివర్ణ వెలుగులతో మెరిసింది. కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా కోటకు విద్యుద్దీపాలంకరణ చేశారు. జిల్లా పురావస్తుశాఖ అధికారి రాజాయోగేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లాలోని సిద్దవటం కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 

సిద్దవటంలోని చారిత్రాత్మకమైన మట్లిరాజుల కోట మంగళవారం త్రివర్ణ వెలుగులతో మెరిసింది. కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా కోటకు విద్యుద్దీపాలంకరణ చేశారు. జిల్లా పురావస్తుశాఖ అధికారి రాజాయోగేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లాలోని సిద్దవటం కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.
11/31
భారీ ట్రాలర్‌పై లారీలు వరుసకట్టాయేంటని అనుకుంటున్నారా...? వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న లారీల క్యాబిన్‌లను... ఓదాని వెనుక మరొకటి కట్టి ఇలా తీసుకువెళ్తున్నారు. పదహారో నంబరు జాతీయ రహదారిపై మద్దిపాడు వద్ద కనిపించిన దృశ్యమిది. భారీ ట్రాలర్‌పై లారీలు వరుసకట్టాయేంటని అనుకుంటున్నారా...? వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న లారీల క్యాబిన్‌లను... ఓదాని వెనుక మరొకటి కట్టి ఇలా తీసుకువెళ్తున్నారు. పదహారో నంబరు జాతీయ రహదారిపై మద్దిపాడు వద్ద కనిపించిన దృశ్యమిది.
12/31
శ్రావణమాసం సందర్భంగా విశాఖలోని తాటిచెట్లపాలెం ప్రాంతంలోని శ్రీపరదేశమ్మ ఆలయంలో మంగళవారం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష గాజులు, లక్ష పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు కమిటీ అధ్యక్షులు ఆళ్ళ శ్రీనివాసరావు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

శ్రావణమాసం సందర్భంగా విశాఖలోని తాటిచెట్లపాలెం ప్రాంతంలోని శ్రీపరదేశమ్మ ఆలయంలో మంగళవారం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష గాజులు, లక్ష పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు కమిటీ అధ్యక్షులు ఆళ్ళ శ్రీనివాసరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.
13/31
విద్యతో పాటు వ్యవసాయ రంగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పుట్టపర్తి సంస్కృతీ కశాశాలల ప్రిన్సిపల్‌ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సమీపంలో వరి పంట సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వరి నారు తీసి, నాట్లు వేశారు. విద్యతో పాటు వ్యవసాయ రంగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పుట్టపర్తి సంస్కృతీ కశాశాలల ప్రిన్సిపల్‌ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సమీపంలో వరి పంట సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వరి నారు తీసి, నాట్లు వేశారు.
14/31
సుందరీకరణతో పాటు విద్యుత్తును అందించడానికి గుంతకల్లు రైల్వే జంక్షన్‌ ముందు సౌరవిద్యుత్తు చెట్టును కొత్తగా ఏర్పాటు చేశారు. రైలు బోగీ హోటల్‌ ఆవరణలోని పార్కులో అధికారులు దీన్ని నిర్మించారు. చూడగానే ఆకట్టుకునేలా ఒక చెట్టులా తయారుచేసి దానిపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. దీని కోసం అధికారులు రూ.7 లక్షలు ఖర్చుచేశారు. దీని నుంచి ఐదు కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని సంబంధిత అధికారులు చెప్పారు. 

సుందరీకరణతో పాటు విద్యుత్తును అందించడానికి గుంతకల్లు రైల్వే జంక్షన్‌ ముందు సౌరవిద్యుత్తు చెట్టును కొత్తగా ఏర్పాటు చేశారు. రైలు బోగీ హోటల్‌ ఆవరణలోని పార్కులో అధికారులు దీన్ని నిర్మించారు. చూడగానే ఆకట్టుకునేలా ఒక చెట్టులా తయారుచేసి దానిపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. దీని కోసం అధికారులు రూ.7 లక్షలు ఖర్చుచేశారు. దీని నుంచి ఐదు కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని సంబంధిత అధికారులు చెప్పారు.
15/31
తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయం మంగళవారం జనసంద్రమైంది. నాగుల పంచమి సందర్భంగా నాగోబా దర్శనానికి 30 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తుల రావడంతో దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయం మంగళవారం జనసంద్రమైంది. నాగుల పంచమి సందర్భంగా నాగోబా దర్శనానికి 30 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తుల రావడంతో దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.
16/31
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులోంచి ఇసుకను తీస్తున్నారిలా. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు జిల్లా వ్యాప్తంగా వాగుల వద్ద ఇసుక కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులన్నీ నిండా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగ నదితోపాటు పలు వాగుల్లో నీటి ప్రవాహం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీంతో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. నది, వాగుల పరిసరాల్లో ఇసుక దొరక్క ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి ఇలా ఇసుకను బయటకు తీస్తున్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులోంచి ఇసుకను తీస్తున్నారిలా. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు జిల్లా వ్యాప్తంగా వాగుల వద్ద ఇసుక కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులన్నీ నిండా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగ నదితోపాటు పలు వాగుల్లో నీటి ప్రవాహం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీంతో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. నది, వాగుల పరిసరాల్లో ఇసుక దొరక్క ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి ఇలా ఇసుకను బయటకు తీస్తున్నారు.
17/31
18/31
ఇది.. విద్యార్థులు రూపొందించిన భారతం! 3,785 మంది పిల్లలు క్రమశిక్షణతో ఆవిష్కరించిన దేశ రూపం. అంత మంది విద్యార్థులు కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వర్ణ దుస్తులు ధరించి దేశ ఐక్యతను ఇలా చాటారు. మధ్యలో నీలి రంగు దుస్తుల్లో కొంత మంది అశోక చక్రం ఆకారాన్నిచ్చారు. కర్నూలు నగరం ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత మాతాకు జై, వందేమాతరం అంటూ నినదించారు. ఇది.. విద్యార్థులు రూపొందించిన భారతం! 3,785 మంది పిల్లలు క్రమశిక్షణతో ఆవిష్కరించిన దేశ రూపం. అంత మంది విద్యార్థులు కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వర్ణ దుస్తులు ధరించి దేశ ఐక్యతను ఇలా చాటారు. మధ్యలో నీలి రంగు దుస్తుల్లో కొంత మంది అశోక చక్రం ఆకారాన్నిచ్చారు. కర్నూలు నగరం ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత మాతాకు జై, వందేమాతరం అంటూ నినదించారు.
19/31
 కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని కె.పెదపూడి ఉన్నత పాఠశాలలో 87 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరిపడా తరగతి గదులున్నాయి. పాఠశాలల విలీనం పేరుతో ఇక్కడికి కె.పెదపూడి ప్రధాన, కడలివారిపాలెం ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు 61 మంది కొత్తగా వచ్చారు. గదుల కొరత తలెత్తి, 3, 4, 5 తరగతులకు ఒకే గదిలో బోధిస్తున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని కె.పెదపూడి ఉన్నత పాఠశాలలో 87 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరిపడా తరగతి గదులున్నాయి. పాఠశాలల విలీనం పేరుతో ఇక్కడికి కె.పెదపూడి ప్రధాన, కడలివారిపాలెం ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు 61 మంది కొత్తగా వచ్చారు. గదుల కొరత తలెత్తి, 3, 4, 5 తరగతులకు ఒకే గదిలో బోధిస్తున్నారు.
20/31
హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో మంగళవారం కుండపోత వాన కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో గంటపాటు కురిసిన వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 5.2 సెం.మీ. వర్షం పడింది. ఇక్కడ గుంతపల్లి మజీద్‌పూర్‌ గ్రామాల మధ్య రాకపోకలు నిల్చిపోయాయి. హయత్‌నగర్, అంబర్‌పేట, ఆదిభట్ల, ఉప్పల్, ఖైరతాబాద్‌లో వర్షం పడింది. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఓ యువకుడు రోడ్డుపై ఉన్న వర్షం నీటిని దాటుతూ ఇలా కెమెరాకు చిక్కాడు. హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో మంగళవారం కుండపోత వాన కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో గంటపాటు కురిసిన వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 5.2 సెం.మీ. వర్షం పడింది. ఇక్కడ గుంతపల్లి మజీద్‌పూర్‌ గ్రామాల మధ్య రాకపోకలు నిల్చిపోయాయి. హయత్‌నగర్, అంబర్‌పేట, ఆదిభట్ల, ఉప్పల్, ఖైరతాబాద్‌లో వర్షం పడింది. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఓ యువకుడు రోడ్డుపై ఉన్న వర్షం నీటిని దాటుతూ ఇలా కెమెరాకు చిక్కాడు.
21/31
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడు తిరుపతిరెడ్డి. వరంగల్‌కు చెందిన ఆయన బోడుప్పల్‌లో స్థిరపడ్డారు. వరంగల్‌కే చెందిన తన మిత్రుడు నడవలేడు. ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం అతనికి మంజూరు చేసింది. నగరం నుంచి దాన్ని స్నేహితుడికి ఇచ్చేందుకు త్రిచక్ర వాహనాన్ని తిరుపతిరెడ్డి తన స్కూటర్‌కు కట్టి తీసుకెళ్తూ ఘట్‌కేసర్‌ సమీపంలో కనిపించారు. చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడు తిరుపతిరెడ్డి. వరంగల్‌కు చెందిన ఆయన బోడుప్పల్‌లో స్థిరపడ్డారు. వరంగల్‌కే చెందిన తన మిత్రుడు నడవలేడు. ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం అతనికి మంజూరు చేసింది. నగరం నుంచి దాన్ని స్నేహితుడికి ఇచ్చేందుకు త్రిచక్ర వాహనాన్ని తిరుపతిరెడ్డి తన స్కూటర్‌కు కట్టి తీసుకెళ్తూ ఘట్‌కేసర్‌ సమీపంలో కనిపించారు.
22/31
తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వెళ్లే ప్రధాన రహదారిలో లాలాపేట వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రైవేటు వ్యాపారాలకు అడ్డగా మారింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌పై, బస్టాపు ఆవరణం వీరి వల్ల నిరుపయోగంగా మారింది. బస్సులు ప్రధాన రహదారిపైనే నిలపాల్సి వస్తుంది. బస్టాపులో బెంచీలు ఆకతాయిలకు, తాగుబోతులకు ఆవాసంగా మారుతున్నాయి. దీంతో ప్రధానంగా మహిళా ప్రయాణికులు బస్టాపు పరిసరాల్లో నిలవలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రతి మంగళవారం జరిగే సంతలో భాగంగా బస్టాపు ఉన్న విషయం కూడా తెలియకుండా దాని ఆవరణంలో తోపుడు బండ్లను నింపేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదు. తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వెళ్లే ప్రధాన రహదారిలో లాలాపేట వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రైవేటు వ్యాపారాలకు అడ్డగా మారింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌పై, బస్టాపు ఆవరణం వీరి వల్ల నిరుపయోగంగా మారింది. బస్సులు ప్రధాన రహదారిపైనే నిలపాల్సి వస్తుంది. బస్టాపులో బెంచీలు ఆకతాయిలకు, తాగుబోతులకు ఆవాసంగా మారుతున్నాయి. దీంతో ప్రధానంగా మహిళా ప్రయాణికులు బస్టాపు పరిసరాల్లో నిలవలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రతి మంగళవారం జరిగే సంతలో భాగంగా బస్టాపు ఉన్న విషయం కూడా తెలియకుండా దాని ఆవరణంలో తోపుడు బండ్లను నింపేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదు.
23/31
24/31
నాగుల పంచమిని పురస్కరించుకొని మంగళవారం ఖైరతాబాద్‌ ఏడుగుళ్ల ఆలయంలో మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకోగా.. సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ సమీపంలో ఉన్న నాగదేవత ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. నాగుల పంచమిని పురస్కరించుకొని మంగళవారం ఖైరతాబాద్‌ ఏడుగుళ్ల ఆలయంలో మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకోగా.. సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ సమీపంలో ఉన్న నాగదేవత ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు.
25/31
26/31
యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్న పశువులతో మల్కాజిగిరి వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మధ్యలో.. ఎక్కడ పడితే అక్కడ సేద తీరుతుండటంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మంగళవారం సాయినగర్‌ కూడలిలో ఆవులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో నిలవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్న పశువులతో మల్కాజిగిరి వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మధ్యలో.. ఎక్కడ పడితే అక్కడ సేద తీరుతుండటంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మంగళవారం సాయినగర్‌ కూడలిలో ఆవులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో నిలవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.
27/31
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్న జాతీయ చిహ్నం ఇది. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనం ‘సెంట్రల్‌ విస్టా’లో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చిహ్నం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మాత్రం జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా కాకుండా గంభీరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్న జాతీయ చిహ్నం ఇది. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనం ‘సెంట్రల్‌ విస్టా’లో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చిహ్నం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మాత్రం జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా కాకుండా గంభీరంగా ఉన్నాయి.
28/31
29/31
భారీ వర్షాలకు రోడ్డుకు వేసిన ప్యాచ్‌ వర్క్‌ కొట్టుకుపోవడంతో కూకట్‌పల్లి ప్రకాశ్‌నగర్‌లో గుంతలు తేలాయి. జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్‌ కాలనీ వాసుల వేలాది వాహనాలు నిత్యం ఈ రోడ్డుపై వెళ్తుంటాయి. భారీ వర్షాలకు రోడ్డుకు వేసిన ప్యాచ్‌ వర్క్‌ కొట్టుకుపోవడంతో కూకట్‌పల్లి ప్రకాశ్‌నగర్‌లో గుంతలు తేలాయి. జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్‌ కాలనీ వాసుల వేలాది వాహనాలు నిత్యం ఈ రోడ్డుపై వెళ్తుంటాయి.
30/31
కేరళలోని త్రిస్సూర్‌ చాలకుడి నదిలో ఏనుగు చిక్కుకుపోయింది. అనేక గంటలపాటు నదిలోనే వరద ప్రవాహంలో ఉండిపోయింది. ఆహారం కోసం వచ్చిన ఏనుగు.. తిరిగి అడవిలోకి వెళ్తుండగా నదిలో చిక్కుకుపోయింది. అతిరప్పిలి జలపాతం వద్ద నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువైంది. దీంతో ఏనుగు కొంత దూరం కొట్టుకుపోయింది. చివరకు ఓ చెట్టును పట్టుకుని నిల్చొంది. తర్వాత వరద ప్రవాహం తగ్గిందని చెప్పిన అటవీ అధికారులు.. ఏనుగు అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. కేరళలోని త్రిస్సూర్‌ చాలకుడి నదిలో ఏనుగు చిక్కుకుపోయింది. అనేక గంటలపాటు నదిలోనే వరద ప్రవాహంలో ఉండిపోయింది. ఆహారం కోసం వచ్చిన ఏనుగు.. తిరిగి అడవిలోకి వెళ్తుండగా నదిలో చిక్కుకుపోయింది. అతిరప్పిలి జలపాతం వద్ద నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువైంది. దీంతో ఏనుగు కొంత దూరం కొట్టుకుపోయింది. చివరకు ఓ చెట్టును పట్టుకుని నిల్చొంది. తర్వాత వరద ప్రవాహం తగ్గిందని చెప్పిన అటవీ అధికారులు.. ఏనుగు అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు.
31/31
అడుసు కనిపిస్తేనే అడుగు పక్కకు వేస్తాం. అలాంటిది మురుగు కాలువలోకి దిగి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడం కోసం దుర్వాసనను భరించి పని చేశారు. పాతబస్తీ హైకోర్టు సమీపంలో కనిపించిందీ దృశ్యం. అడుసు కనిపిస్తేనే అడుగు పక్కకు వేస్తాం. అలాంటిది మురుగు కాలువలోకి దిగి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడం కోసం దుర్వాసనను భరించి పని చేశారు. పాతబస్తీ హైకోర్టు సమీపంలో కనిపించిందీ దృశ్యం.

మరిన్ని

ap-districts
ts-districts