News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (03-08-2022)

Published : 03 Aug 2022 20:25 IST
1/15
నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకొని పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. చుట్టూ వంపులు తిరిగిన ఎత్తైన కొండలు కనువిందు చేస్తున్నాయి. వాలు అంచులో కొండలు ఒకదానినొకటి ఆనుకొని సూర్య కిరణాలు పడిన చోట మెరుస్తూ.. పడని చోట నల్లని నీడ కన్పించడం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకొని పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. చుట్టూ వంపులు తిరిగిన ఎత్తైన కొండలు కనువిందు చేస్తున్నాయి. వాలు అంచులో కొండలు ఒకదానినొకటి ఆనుకొని సూర్య కిరణాలు పడిన చోట మెరుస్తూ.. పడని చోట నల్లని నీడ కన్పించడం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది.
2/15
73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలు సవరించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు మహా ప్రదర్శన చేపట్టారు. 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలు సవరించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు మహా ప్రదర్శన చేపట్టారు.
3/15
 నెల్లూరు కలెక్టరేట్‌ ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయం పక్కన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ సరికొత్త సెల్ఫీ బూత్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చక్రధర్‌ బాబు జాతీయ జెండా చేతబూని ఇక్కడ ఫొటో దిగి సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయం పక్కన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ సరికొత్త సెల్ఫీ బూత్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చక్రధర్‌ బాబు జాతీయ జెండా చేతబూని ఇక్కడ ఫొటో దిగి సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు.
4/15
5/15
కొవిడ్‌ మొదలు నుంచి ఇప్పటి దాకా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వచ్చే పేదల ఆకలి తీరుస్తోంది సర్వ్‌ నీడి అనే స్వచ్ఛంద సంస్థ. ప్రతి ఉదయం ఇడ్లీ, ఉప్మా, దోశ వంటి అల్పాహారంతోపాటు భోజనం కూడా అందిస్తున్నారు. ఇలా రోజుకు రెండు వేల మంది ఆకలి తీరుస్తున్నామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొవిడ్‌ మొదలు నుంచి ఇప్పటి దాకా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వచ్చే పేదల ఆకలి తీరుస్తోంది సర్వ్‌ నీడి అనే స్వచ్ఛంద సంస్థ. ప్రతి ఉదయం ఇడ్లీ, ఉప్మా, దోశ వంటి అల్పాహారంతోపాటు భోజనం కూడా అందిస్తున్నారు. ఇలా రోజుకు రెండు వేల మంది ఆకలి తీరుస్తున్నామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు.
6/15
7/15
తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏలూరు కొమడవోలు సమీపంలోని తూర్పు లాకుల వద్ద రెండు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్నాళ్లూ వెలవెలబోయిన తమ్మిలేరు జలకళ సంతరించుకోవడంతో చుట్టు పక్కలి గ్రామాల ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు. లాకుల వద్ద జల ప్రవాహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏలూరు కొమడవోలు సమీపంలోని తూర్పు లాకుల వద్ద రెండు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్నాళ్లూ వెలవెలబోయిన తమ్మిలేరు జలకళ సంతరించుకోవడంతో చుట్టు పక్కలి గ్రామాల ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు. లాకుల వద్ద జల ప్రవాహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
8/15
సింహాలే కాదు.. నేనూ జూలు విదిల్చగలనని ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్నట్లు ఉంది కదూ! పేరు ఫెయింటింగ్ గోట్‌. ఇవి శీతల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి సాగర్‌ దీనిని పెంచుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం దిల్లీ నుంచి చూలు మేకను తీసుకు రాగా.. దీనికి జన్మనిచ్చిన తరువాత అది చనిపోయిందని చెప్పారు. ఆడ మేకకు ఇలాంటి జూలు ఉండదని, మగ మేకలు మాత్రమే ఇలా కన్పిస్తాయని ఆయన దీని ప్రత్యేకతను వివరించారు. సింహాలే కాదు.. నేనూ జూలు విదిల్చగలనని ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్నట్లు ఉంది కదూ! పేరు ఫెయింటింగ్ గోట్‌. ఇవి శీతల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి సాగర్‌ దీనిని పెంచుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం దిల్లీ నుంచి చూలు మేకను తీసుకు రాగా.. దీనికి జన్మనిచ్చిన తరువాత అది చనిపోయిందని చెప్పారు. ఆడ మేకకు ఇలాంటి జూలు ఉండదని, మగ మేకలు మాత్రమే ఇలా కన్పిస్తాయని ఆయన దీని ప్రత్యేకతను వివరించారు.
9/15
కర్ణాటకలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చిత్రదుర్గ జిల్లాలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యా పీఠాన్ని సందర్శించారు. అక్కడ శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు. లింగాయత్‌ల ఆరాధ్య దైవం గురు బసవన్న బోధనలు శాశ్వతమైనవని, ఈ మఠం నుంచి ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని పేర్కొంటూ రాహుల్ ఈ చిత్రాలను ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చిత్రదుర్గ జిల్లాలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యా పీఠాన్ని సందర్శించారు. అక్కడ శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు. లింగాయత్‌ల ఆరాధ్య దైవం గురు బసవన్న బోధనలు శాశ్వతమైనవని, ఈ మఠం నుంచి ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని పేర్కొంటూ రాహుల్ ఈ చిత్రాలను ట్వీట్‌ చేశారు.
10/15
11/15
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. పరిహారం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. పరిహారం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
12/15
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. తన మిత్రుడు, జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘మంచి మనసు, విలువలతో నిజాయతీగా కష్టపడే వ్యక్తి. నేను నిజమైన స్నేహితుడిగా పిలుచుకొనే వ్యక్తి. అలాంటి స్నేహం మన మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నా. నీకు ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుకుంటా. నీవు ఓ సంవత్సరం చిన్నోడిగా మారుతున్న వేళ(సరదాగా) ఇవే నా శుభాకాంక్షలు. నీవు వెళ్లే మార్గంలో అన్నీ సానుకూలతలే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు ఛెత్రి’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. తన మిత్రుడు, జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘మంచి మనసు, విలువలతో నిజాయతీగా కష్టపడే వ్యక్తి. నేను నిజమైన స్నేహితుడిగా పిలుచుకొనే వ్యక్తి. అలాంటి స్నేహం మన మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నా. నీకు ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుకుంటా. నీవు ఓ సంవత్సరం చిన్నోడిగా మారుతున్న వేళ(సరదాగా) ఇవే నా శుభాకాంక్షలు. నీవు వెళ్లే మార్గంలో అన్నీ సానుకూలతలే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు ఛెత్రి’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
13/15
భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వారసులు దిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని ఉపరాష్ట్రపతి నివాసానికి నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పింగళి వారసులను ఉప రాష్ట్రపతి శాలువాతో సత్కరించారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన పింగళి జీవితం ఆదర్శనీయమని ఉప రాష్ట్రపతి తెలిపారు. పింగళి వారసులు సుశీల దశరథ రామన్, పింగళి వెంకయ్య దశరథ రామన్, ఘంటసాల గోపీకృష్ణ, ఘంటసాల వాసుదేవ నరసింహన్, ఘంటసాల కృష్ణ ప్రవీణ్ తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వారసులు దిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని ఉపరాష్ట్రపతి నివాసానికి నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పింగళి వారసులను ఉప రాష్ట్రపతి శాలువాతో సత్కరించారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన పింగళి జీవితం ఆదర్శనీయమని ఉప రాష్ట్రపతి తెలిపారు. పింగళి వారసులు సుశీల దశరథ రామన్, పింగళి వెంకయ్య దశరథ రామన్, ఘంటసాల గోపీకృష్ణ, ఘంటసాల వాసుదేవ నరసింహన్, ఘంటసాల కృష్ణ ప్రవీణ్ తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.
14/15
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్‌ అవతారమెత్తిన సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో టీ20లో చెలరేగాడు. 76 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడి 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఘనవిజయం అందించాడు. బస్సెటెర్రెలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం స్టేడియంలో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల వద్దకు వెళ్లాడు. ఆటో గ్రాఫ్‌లు, కరచాలనం ఇస్తూ.. సెల్ఫీలు దిగుతూ వారిని ఆనందింపజేశాడు. సూర్యకుమార్‌ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్‌ అవతారమెత్తిన సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో టీ20లో చెలరేగాడు. 76 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడి 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఘనవిజయం అందించాడు. బస్సెటెర్రెలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం స్టేడియంలో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల వద్దకు వెళ్లాడు. ఆటో గ్రాఫ్‌లు, కరచాలనం ఇస్తూ.. సెల్ఫీలు దిగుతూ వారిని ఆనందింపజేశాడు. సూర్యకుమార్‌ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అయ్యారు.
15/15

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని