News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (05-08-2022)

Published : 05 Aug 2022 08:15 IST
1/34
హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరాలయంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర పురావస్తుశాఖ ఇంజినీర్‌ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ తివర్ణ పతాకం రంగులతో కూడిన విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆలయం మూడు రంగులతో జిగేల్‌ మంటూ కనిపించింది. నగరవాసులకు కనువిందు చేసింది. కొందరు భక్తులు ఆలయం వద్ద సెల్ఫీలు తీసుకున్నారు.  


హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరాలయంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర పురావస్తుశాఖ ఇంజినీర్‌ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ తివర్ణ పతాకం రంగులతో కూడిన విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆలయం మూడు రంగులతో జిగేల్‌ మంటూ కనిపించింది. నగరవాసులకు కనువిందు చేసింది. కొందరు భక్తులు ఆలయం వద్ద సెల్ఫీలు తీసుకున్నారు.
2/34
డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల నడుమ వంట చేసుకుంటున్న మహిళ పేరు తోట అంజలి. కడప జిల్లా అల్మాస్‌పేటకు చెందిన వీరి కుటుంబం గత ఇరవై ఏళ్లుగా ఉమ్మడి పాలమూరులోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కర్రబొగ్గు తయారీ కేంద్రాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామ శివారులో కర్రబొగ్గు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లతో వేసుకున్న గుడిసె ఇటీవల కురుస్తున్న గాలి వానలకు పూర్తిగా దెబ్బతినడంతో సమీపంలోని డంపింగ్‌ యార్డులోకి వచ్చి చేరారు. తనతోపాటు భర్త అయ్యన్న, మరిది కుటుంబం మొత్తం అయిదుగురం కొన్ని రోజులుగా ఇక్కడే తలదాచుకుంటున్నట్లు అంజలి ‘ఈనాడు’కు తెలిపింది. ప్రతిరోజు దోమలతో సహజీవనం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని, వర్షాల కారణంగా ఉపాధి కూడా సరిగా ఉండటం లేదని విచారం వ్యక్తం చేసింది. డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల నడుమ వంట చేసుకుంటున్న మహిళ పేరు తోట అంజలి. కడప జిల్లా అల్మాస్‌పేటకు చెందిన వీరి కుటుంబం గత ఇరవై ఏళ్లుగా ఉమ్మడి పాలమూరులోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కర్రబొగ్గు తయారీ కేంద్రాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామ శివారులో కర్రబొగ్గు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లతో వేసుకున్న గుడిసె ఇటీవల కురుస్తున్న గాలి వానలకు పూర్తిగా దెబ్బతినడంతో సమీపంలోని డంపింగ్‌ యార్డులోకి వచ్చి చేరారు. తనతోపాటు భర్త అయ్యన్న, మరిది కుటుంబం మొత్తం అయిదుగురం కొన్ని రోజులుగా ఇక్కడే తలదాచుకుంటున్నట్లు అంజలి ‘ఈనాడు’కు తెలిపింది. ప్రతిరోజు దోమలతో సహజీవనం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని, వర్షాల కారణంగా ఉపాధి కూడా సరిగా ఉండటం లేదని విచారం వ్యక్తం చేసింది.
3/34
4/34
పరిగి, వికారాబాద్‌ రెండు నియోజకవర్గాల ప్రజలకు వర ప్రదాయినిగా ఉన్న లఖ్నాపూర్‌ రిజర్వాయర్‌ గురువారం పరవళ్లు తొక్కింది. 20 అడుగుల ఎత్తుగా ఉన్న అలుగు మీదుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. రెండు కిలోమీటర్ల దూరం వరకు వరద నీటి చప్పుడు వస్తోంది. ప్రాజెక్టు దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆయకట్టుదారుల్లో మాత్రం ఆనందం తొంగిచూస్తోంది. క్రమేపి పర్యాటకుల సంఖ్య పెరగనుంది.  పరిగి, వికారాబాద్‌ రెండు నియోజకవర్గాల ప్రజలకు వర ప్రదాయినిగా ఉన్న లఖ్నాపూర్‌ రిజర్వాయర్‌ గురువారం పరవళ్లు తొక్కింది. 20 అడుగుల ఎత్తుగా ఉన్న అలుగు మీదుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. రెండు కిలోమీటర్ల దూరం వరకు వరద నీటి చప్పుడు వస్తోంది. ప్రాజెక్టు దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆయకట్టుదారుల్లో మాత్రం ఆనందం తొంగిచూస్తోంది. క్రమేపి పర్యాటకుల సంఖ్య పెరగనుంది.
5/34
నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ శివారులో గురువారం పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. చల్లటి వాతావరణం.. పచ్చటి పొలాల మధ్య ఇలా పురివిప్పి నాట్యం చేసింది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ శివారులో గురువారం పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. చల్లటి వాతావరణం.. పచ్చటి పొలాల మధ్య ఇలా పురివిప్పి నాట్యం చేసింది.
6/34
చేగుంటలోని బీసీ బాలుర వసతిగృహం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి వసతిగృహం చుట్టూ నీరు చేరింది. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. గురువారం ఉదయం వసతిగృహం వెనుక వైపు జలాన్ని బయటకు పంపించేసినా, ముందు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థులు నీటిలో నుంచే వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు వర్షం కురిసినా నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. చేగుంటలోని బీసీ బాలుర వసతిగృహం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి వసతిగృహం చుట్టూ నీరు చేరింది. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. గురువారం ఉదయం వసతిగృహం వెనుక వైపు జలాన్ని బయటకు పంపించేసినా, ముందు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థులు నీటిలో నుంచే వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు వర్షం కురిసినా నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు.
7/34
ఇటీవల ఎడతెరిపి లేని వాన కురవడంతో మెదక్‌ మండల పరిధి కోంటూర్‌ చెరువు అలుగు పారింది. బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో అలుగు పారింది. ఈ నీరంతా కోంటూర్‌ - వెంకటాపూర్‌ దారిలో ప్రవహించడంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరిని ఒకరు పట్టుకుని రోడ్డు దాటారు. ఏటా వానా కాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని అయినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.  ఇటీవల ఎడతెరిపి లేని వాన కురవడంతో మెదక్‌ మండల పరిధి కోంటూర్‌ చెరువు అలుగు పారింది. బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో అలుగు పారింది. ఈ నీరంతా కోంటూర్‌ - వెంకటాపూర్‌ దారిలో ప్రవహించడంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరిని ఒకరు పట్టుకుని రోడ్డు దాటారు. ఏటా వానా కాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని అయినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
8/34
పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ఏలూరు గ్రామీణ మండలం శ్రీపర్రులో సుమారు 500 మంది లబ్ధిదారులకు అందజేసేందుకు కేటాయించిన స్థలం చెరువును తలపిస్తోంది. లేఅవుట్‌ను మట్టితో నింపి ఎత్తు చేయాల్సి ఉంది. పనులు పూర్తి కాకపోవడంతో ఇలా గేదెలకు ఆవాసంగా మారింది. దీనిపై ఎంపీడీవో విజయరాజు మాట్లాడుతూ ఇళ్లస్థలాలను మెరక చేసేందుకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపామని ఆమోదించిన తరువాత పనులు ప్రారంభిస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ఏలూరు గ్రామీణ మండలం శ్రీపర్రులో సుమారు 500 మంది లబ్ధిదారులకు అందజేసేందుకు కేటాయించిన స్థలం చెరువును తలపిస్తోంది. లేఅవుట్‌ను మట్టితో నింపి ఎత్తు చేయాల్సి ఉంది. పనులు పూర్తి కాకపోవడంతో ఇలా గేదెలకు ఆవాసంగా మారింది. దీనిపై ఎంపీడీవో విజయరాజు మాట్లాడుతూ ఇళ్లస్థలాలను మెరక చేసేందుకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపామని ఆమోదించిన తరువాత పనులు ప్రారంభిస్తామన్నారు.
9/34
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. దాని వద్ద కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్, జేసీ ఎం.విజయసునీత గురువారం జాతీయ పతాకాలు చేత పట్టుకుని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ జెండాతో ఫొటో దిగడం ఎంతో ఆనందాన్ని పంచిందని చెప్పారు. కార్యక్రమంలో డీపీవో రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. దాని వద్ద కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్, జేసీ ఎం.విజయసునీత గురువారం జాతీయ పతాకాలు చేత పట్టుకుని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ జెండాతో ఫొటో దిగడం ఎంతో ఆనందాన్ని పంచిందని చెప్పారు. కార్యక్రమంలో డీపీవో రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
10/34
ఉలవపాడు మండలం తెట్టు నుంచి రామాయపట్నం వెళ్లే మార్గంలో ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి) ఉంది. సాధారణంగా బ్రిడ్జిని ఏ భారీ వాహనం తాకని విధంగా ముందు కమ్మెను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని పట్టించుకోకుండా ఇసుక లారీలు ఇలా బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలాగ బ్రిడ్జికి తగిలే విధంగా లారీలు రాకుండా అధికారులు నియంత్రించాలి. రైలు రాకపోకలకు కీలకమైన ఆర్‌యూబి వద్ద ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉలవపాడు మండలం తెట్టు నుంచి రామాయపట్నం వెళ్లే మార్గంలో ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి) ఉంది. సాధారణంగా బ్రిడ్జిని ఏ భారీ వాహనం తాకని విధంగా ముందు కమ్మెను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని పట్టించుకోకుండా ఇసుక లారీలు ఇలా బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలాగ బ్రిడ్జికి తగిలే విధంగా లారీలు రాకుండా అధికారులు నియంత్రించాలి. రైలు రాకపోకలకు కీలకమైన ఆర్‌యూబి వద్ద ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
11/34
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆస్థాన మండపంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆస్థాన మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చే ప్రదేశాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వ్రతం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆస్థాన మండపంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆస్థాన మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చే ప్రదేశాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వ్రతం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు.
12/34
యాడికి మండలంలోని కోన జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. మూడు రోజులుగా పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకృతి అందాల నడుమ కొండల నుంచి జాలు వారుతున్న సెలయేరు అందాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి కోనఉప్పలపాడు గ్రామానికి సమీపంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఎత్తయిన కొండల నుంచి దూకుతున్న జలపాతం విహారయాత్ర ప్రదేశంగా మారింది. యాడికి మండలంలోని కోన జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. మూడు రోజులుగా పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకృతి అందాల నడుమ కొండల నుంచి జాలు వారుతున్న సెలయేరు అందాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి కోనఉప్పలపాడు గ్రామానికి సమీపంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఎత్తయిన కొండల నుంచి దూకుతున్న జలపాతం విహారయాత్ర ప్రదేశంగా మారింది.
13/34
ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో కొన్ని విభాగాలకు ఇసుకకొండపైన సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నుంచి వెళ్లాలి. ఇక్కడి దారంతా గుబురుగా పెరిగిన మొక్కలతో ఉండటంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపై ఉండేవారు, ఆలయానికి వచ్చే వారు ఈ దారినే ఉపయోగిస్తున్నారు. మరో వైపు కొందరు చెత్తంతా పారబోయడంతో ఈ మార్గం అధ్వానంగా మారిందని చెబుతున్నారు.    ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో కొన్ని విభాగాలకు ఇసుకకొండపైన సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నుంచి వెళ్లాలి. ఇక్కడి దారంతా గుబురుగా పెరిగిన మొక్కలతో ఉండటంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపై ఉండేవారు, ఆలయానికి వచ్చే వారు ఈ దారినే ఉపయోగిస్తున్నారు. మరో వైపు కొందరు చెత్తంతా పారబోయడంతో ఈ మార్గం అధ్వానంగా మారిందని చెబుతున్నారు.
14/34
మిస్‌ ఇండియా-2021 మానస వారణాసి గురువారం నగరంలో సందడి చేశారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మిస్‌ ఇండియా-2021 మానస వారణాసి గురువారం నగరంలో సందడి చేశారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
15/34
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో గురువారం కొండచరియలు విరిగి పట్టాలపై పడిపోవడంతో నిలిచిపోయిన రైలు హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో గురువారం కొండచరియలు విరిగి పట్టాలపై పడిపోవడంతో నిలిచిపోయిన రైలు
16/34
విజయవాడ పటమటలోని జీడీఈటీ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఇది. ఐదోతగరతి వరకు ఇక్కడ  విద్యాబోధన జరుగుతోంది. పాఠశాలలో తరగతికి 70 నుంచి 95 మంది విద్యార్థులు ఉన్నారు. తగినన్ని వసతుల్లేక ఒకేగదిలో రెండు సెక్షన్లకు చెందిన విద్యార్థులు కిక్కిరిసి ఇబ్బందిగా కూర్చోవాల్సి వస్తోంది. ఒకగదిలో అటు ఇటుగా ఇద్దరు టీచర్లు రెండు సెక్షన్ల తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఇంకా ప్రవేశాలు జరుగుతున్నందున.. తరగతికి విద్యార్థుల సంఖ్య 100 వరకూ పెరిగే అవకాశాలున్నాయి. విజయవాడ పటమటలోని జీడీఈటీ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఇది. ఐదోతగరతి వరకు ఇక్కడ విద్యాబోధన జరుగుతోంది. పాఠశాలలో తరగతికి 70 నుంచి 95 మంది విద్యార్థులు ఉన్నారు. తగినన్ని వసతుల్లేక ఒకేగదిలో రెండు సెక్షన్లకు చెందిన విద్యార్థులు కిక్కిరిసి ఇబ్బందిగా కూర్చోవాల్సి వస్తోంది. ఒకగదిలో అటు ఇటుగా ఇద్దరు టీచర్లు రెండు సెక్షన్ల తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఇంకా ప్రవేశాలు జరుగుతున్నందున.. తరగతికి విద్యార్థుల సంఖ్య 100 వరకూ పెరిగే అవకాశాలున్నాయి.
17/34
రోడ్డుపై వెళ్లాల్సిన ద్విచక్రవాహన దారులు ఫుట్‌పాత్‌పై వెళ్తూ.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హస్తినాపురం వద్ద కనిపించిందీ దృశ్యం. ఇక్కడి సిగ్నల్‌ వద్ద ముందు ఆగిన బస్సులను దాటుకొని తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో కొందరు ద్విచక్రవాహన దారులు ఇలా కాలిబాటపై వెళ్తూ.. పాదచారులను అడ్డు తప్పుకోవాలంటూ హారన్లు కొడుతున్నారు. రోడ్డుపై వెళ్లాల్సిన ద్విచక్రవాహన దారులు ఫుట్‌పాత్‌పై వెళ్తూ.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హస్తినాపురం వద్ద కనిపించిందీ దృశ్యం. ఇక్కడి సిగ్నల్‌ వద్ద ముందు ఆగిన బస్సులను దాటుకొని తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో కొందరు ద్విచక్రవాహన దారులు ఇలా కాలిబాటపై వెళ్తూ.. పాదచారులను అడ్డు తప్పుకోవాలంటూ హారన్లు కొడుతున్నారు.
18/34
గురువారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం రావడంతో కొత్తపేటలో మెట్రో స్టేషన్‌ కింద ఆగిన వాహనదారులు. గురువారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం రావడంతో కొత్తపేటలో మెట్రో స్టేషన్‌ కింద ఆగిన వాహనదారులు.
19/34
బంజారాహిల్స్‌లో గురువారం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి భోజనం పంపిణీ చేసే వాహనం రావడంతో ఇలా చుట్టుముట్టారు. మరోవైపు ప్రత్యేక విభాగం పోలీసులు వందన సమర్పణకు సిద్ధంగా ఉన్నారు. బంజారాహిల్స్‌లో గురువారం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి భోజనం పంపిణీ చేసే వాహనం రావడంతో ఇలా చుట్టుముట్టారు. మరోవైపు ప్రత్యేక విభాగం పోలీసులు వందన సమర్పణకు సిద్ధంగా ఉన్నారు.
20/34
21/34
కొన్ని రోజులుగా వర్షాలతో తడిసిముద్దయి పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పాత భవనమిది. ఈ ఆవరణ నుంచే రోగుల బంధువులు, ఆసుపత్రి సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలతో తడిసిముద్దయి పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పాత భవనమిది. ఈ ఆవరణ నుంచే రోగుల బంధువులు, ఆసుపత్రి సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు.
22/34
శ్రావణ కళ.. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో కొనుగోలుదారుల రద్దీ, స్తంభించిన ట్రాఫిక్‌. శ్రావణ కళ.. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో కొనుగోలుదారుల రద్దీ, స్తంభించిన ట్రాఫిక్‌.
23/34
ఐస్‌ల్యాండ్‌ రాజధాని రెక్జానిక్‌ సమీపంలో ఉన్న ఫాగ్రాడల్స్‌ఫ్జల్‌ అగ్నిపర్వతం పేలడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న లావా. దాదాపు 8 నెలల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని అధికారులు తెలిపారు. ఐస్‌ల్యాండ్‌ రాజధాని రెక్జానిక్‌ సమీపంలో ఉన్న ఫాగ్రాడల్స్‌ఫ్జల్‌ అగ్నిపర్వతం పేలడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న లావా. దాదాపు 8 నెలల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని అధికారులు తెలిపారు.
24/34
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, హర్‌ ఘర్‌ తిరంగా ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెర. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, హర్‌ ఘర్‌ తిరంగా ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెర.
25/34
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, హర్‌ ఘర్‌ తిరంగా ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌ తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ విత్‌ తిరంగా వద్ద యువత సందడి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, హర్‌ ఘర్‌ తిరంగా ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌ తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ విత్‌ తిరంగా వద్ద యువత సందడి.
26/34
శునకాల స్వైర విహారంతో ప్రయాణికులు జంకుతున్నారు. ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని బస్టాండ్‌ వద్ద పదుల సంఖ్యలో వీధి శునకాలు తిష్ఠ వేస్తున్నాయి. ప్రయాణికుల చుట్టూ గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శునకాల స్వైర విహారంతో ప్రయాణికులు జంకుతున్నారు. ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని బస్టాండ్‌ వద్ద పదుల సంఖ్యలో వీధి శునకాలు తిష్ఠ వేస్తున్నాయి. ప్రయాణికుల చుట్టూ గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
27/34
అనంతపురం జిల్లా దానిమ్మ రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలకు తెగుళ్లు సోకడంతో ఎర్రగా మారాల్సిన కాయ కాస్త నల్ల మచ్చలతో చెట్టు మీదే పగిలిపోతోంది. దిక్కుతోచని రైతులు కాయలను తెంపి, తోటలకు దూరంగా పూడ్చేస్తున్నారు. ఇప్పటివరకు 30 టన్నుల కాయలను పూడ్చేశారు. దెబ్బతిన్న కాయలను కోయకుంటే తెగులు చెట్లకూ సోకి.. చివరికి తోటంతా ఎండిపోతుందని ముందే తెంపేస్తున్నట్లు రైతులు తెలిపారు. అనంతపురం జిల్లా దానిమ్మ రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలకు తెగుళ్లు సోకడంతో ఎర్రగా మారాల్సిన కాయ కాస్త నల్ల మచ్చలతో చెట్టు మీదే పగిలిపోతోంది. దిక్కుతోచని రైతులు కాయలను తెంపి, తోటలకు దూరంగా పూడ్చేస్తున్నారు. ఇప్పటివరకు 30 టన్నుల కాయలను పూడ్చేశారు. దెబ్బతిన్న కాయలను కోయకుంటే తెగులు చెట్లకూ సోకి.. చివరికి తోటంతా ఎండిపోతుందని ముందే తెంపేస్తున్నట్లు రైతులు తెలిపారు.
28/34
29/34
నేరాల నియంత్రణలో, నిందితులను పట్టుకోవడంలో నిఘా నేత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సంక్షేమ సంఘాలు విశేష కృషి చేస్తున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ కొరవడడంతో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా ఉంటుంది. మెహిదీపట్నం టోలిచౌకి మార్గంలో ప్రధాన కూడలి రేతిబౌలి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నేలను చూస్తూ..నిరుపయోగంగా మారింది. నేరాల నియంత్రణలో, నిందితులను పట్టుకోవడంలో నిఘా నేత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సంక్షేమ సంఘాలు విశేష కృషి చేస్తున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ కొరవడడంతో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా ఉంటుంది. మెహిదీపట్నం టోలిచౌకి మార్గంలో ప్రధాన కూడలి రేతిబౌలి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నేలను చూస్తూ..నిరుపయోగంగా మారింది.
30/34
సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే బ్రహ్మకమలాలు కనువిందు చేశాయి. ఉత్తమ్‌నగర్‌లో నివసించే విజయలక్ష్మీ-రమేశ్‌ దంపతుల నివాసంలో, రాజాశ్రీనివాసనగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటి ఆవరణలో గురువారం ఈ పుష్పాలు ఆకట్టుకున్నాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే బ్రహ్మకమలాలు కనువిందు చేశాయి. ఉత్తమ్‌నగర్‌లో నివసించే విజయలక్ష్మీ-రమేశ్‌ దంపతుల నివాసంలో, రాజాశ్రీనివాసనగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటి ఆవరణలో గురువారం ఈ పుష్పాలు ఆకట్టుకున్నాయి.
31/34
32/34
ఓ వైపు చిరుజల్లులు, మరోవైపు లేత జొన్నకంకులు.. దుండిగల్‌లోని ఓ జొన్న తోటలో చిన్న పక్షి వర్షంలోనే లేత కంకుల్లోని గింజలు తింటూ ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. ఓ వైపు చిరుజల్లులు, మరోవైపు లేత జొన్నకంకులు.. దుండిగల్‌లోని ఓ జొన్న తోటలో చిన్న పక్షి వర్షంలోనే లేత కంకుల్లోని గింజలు తింటూ ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
33/34
రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌కు వివిధ రకాల పూలు పోటెత్తాయి. సాయంత్రం వరకు విక్రయించగా మిగిలిపోయిన పూలను కొందరు వ్యాపారులు, రైతులు అక్కడే పడేసి వెళ్లిపోయారు. కొందరు వాటిలో కొంచెం బాగున్నవి ఏరుకొని తక్కువ ధరకు విక్రయించడం కన్పించింది. రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌కు వివిధ రకాల పూలు పోటెత్తాయి. సాయంత్రం వరకు విక్రయించగా మిగిలిపోయిన పూలను కొందరు వ్యాపారులు, రైతులు అక్కడే పడేసి వెళ్లిపోయారు. కొందరు వాటిలో కొంచెం బాగున్నవి ఏరుకొని తక్కువ ధరకు విక్రయించడం కన్పించింది.
34/34
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా  ఇంటింటా జాతీయ జెండాలను ఎగరేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఆమేరకు కావాల్సిన త్రివర్ణ పతాకాలను నగరంలోని కాచిగూడ సహా పలు ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా ఇంటింటా జాతీయ జెండాలను ఎగరేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఆమేరకు కావాల్సిన త్రివర్ణ పతాకాలను నగరంలోని కాచిగూడ సహా పలు ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున తయారు చేస్తున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని